ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. పోలవరం నిర్మాణంలో కీలకమైన గ్యాలరీ వాక్‌ను నేటి ఉదయం 10 గంటలకు ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం గ్యాలరీ వాక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గ్యాలరీ వాక్‌తో చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఇందిరాగాంధీ హయాంలో సాగర్ గ్యాలరీ పనులు పూర్తయ్యాయి.

cbn 12092018

ప్రధాని హోదాలో ఇందిర గ్యాలరీ వాక్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకే ఆ అదృష్టం దక్కింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ పోలవరం నిర్మాణంలో గ్యాలరీ వాక్‌ను చూశామన్న తృప్తి తమకు మిగులుతుందని పేర్కొన్నారు. కాగా, స్పిల్‌వే, స్పిల్ చానల్ నిర్మాణాల్లో వేగం పుంజుకుంటే గ్యాలరీ వాక్‌కు సందర్శకులను అనుమతించే అవకాశం ఉండదు. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి పోలవరం పనులు పూర్తి చేస్తామని.. సమాంతరంగా కాఫర్‌ డ్యామ్‌లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తిచేసి.. గోదావరి నదిని మళ్లిస్తామనే ధీమాను జల వనరుల శాఖ వ్యక్తం చేసింది. ఈ ధీమా బుధవారం ఒక రూపం తీసుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్యాలరీ వాక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

cbn 12092018

బుధవారం ఉదయం 10.05 గంటలకు గ్యాలరీ వాక్‌కు ముహూర్తం నిర్ణయించారు. 20 నిమిషాలు ముందుగా, 9.45 గంటలకల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం ప్రాం తానికి చేరుకోవాలని సీఎంవో మంగళవారంఆహ్వానాలు పంపింది. 48వ బ్లాక్‌లో సీఎం గ్యాలరీలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి 36వ బ్లాక్‌ వరకు నడుస్తారు. అక్కడనుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటుచేశారు. అటునుంచి ఆయన వెలుపలకు వచ్చి, నేరుగా బహిరంగసభా స్థలికి చేరుకొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించిన 5 వేల మందికిపైగా సందర్శకులతో ఆయన సమావేశమవుతారు. గ్యాలరీ లోపలి భాగాన స్టాండింగ్‌ ఏసీలను అమర్చా రు. ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేశారు. ఈ వాక్‌లో ఆయన వెంట మంత్రి నారా లోకేశ్‌, ఇతర కుటుంబసభ్యులు, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

ప్రార్థించే పెద‌వుల‌క‌న్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు, ఉద్యోగులు నిజం చేసి చూపించారు. ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వ‌ర్షాల‌తో జీవ‌నం చిధ్ర‌మై, బ్ర‌తుకు భార‌మై క‌న్నీటి క‌డ‌లిలో దేవుడా నీవే దిక్కు అంటూ స‌ర్వం కోల్పోయి రోడ్డున ప‌డ్డ కేర‌ళ వ‌ర‌ద బాధితుల ద‌య‌నీయ దుస్తితి చూసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు, ఉద్యోగులు చ‌లించిపోయారు. త‌మ‌వంతుగా కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌ని త‌లంచారు. ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా పెద్ద మ‌న‌సుతో త‌మ సేవా త‌త్ప‌ర‌త‌ను చాటుకున్నారు.

kerala 11092018

వ‌ర‌ద‌ల‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్న కేర‌ళ రాష్ట్రానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.51 కోట్ల‌కుపైగా సాయం అంద‌జేయ‌నుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.51.018 కోట్ల న‌గ‌దు, స‌హాయ సామ‌గ్రిని మంగళవారం కేర‌ళ‌కు పంపింది. ఇందులో రూ.35 కోట్ల విరాళం కాగా, మిగిలినవి సహాయ సామ‌గ్రి. ఏపీ ఉపముఖ్య‌మంత్రి చిన రాజ‌ప్ప‌, ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు ఈ సహాయాన్ని బుధ‌వారం ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌యన్‌కి అంద‌జేస్తారు.

kerala 11092018

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన రూ.10 కోట్లు, ఏపీ ఎన్జీఓలు త‌మ ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన .20 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.కోటి, పీఐఐసీ నుంచి రూ.17 ల‌క్ష‌ల విరాళం, ఆర్టీజీఎస్ ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళంతో ఇచ్చిన రూ.8.09 ల‌క్ష‌లు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ పంపిన రూ.6 కోట్ల విలువైన 2,014 మెట్రిక్ ట‌న్నుల బియ్యం, కృష్ణా జిల్లా నుంచి పంపిన రూ.కోటి విలువైన సామ‌గ్రి, విశాఖ‌ప‌ట్నం నుంచి పంపిన రూ.10వేల దుప్ప‌ట్లు ఇత‌రత్రా స‌హాయ సామ‌గ్రి ఇందులో ఉన్నాయి.

కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు చనిపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ కొండగట్టు ఘాట్ రోడ్‌లో తీవ్రమైన రోడ్డుప్రమాదం జరిగిందన్నారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడి.. పెద్ద సంఖ్యలో భక్తులు చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

kondagatu 11902018 2

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 52 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, 32 మంది మహిళలు ఉన్నారు. మరో 36 మంది క్షతగాత్రలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సమయంలో ప్రమాదమైన మూల మలువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.

kondagatu 11902018 3

ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు లోయలో పడటంతో ఊపిరాడక అధిక సంఖ్యలో మృతి చెందారు. మరో నిమిషంలో ప్రధానరహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర అదుపు తప్పగా, ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరగడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పర్చూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీనియర్‌ రాజకీయ నాయకులు డా. దగ్గుబాటి వెం కటేశ్వరరావు ఆత్మీయులతో సమావేశం కాబోతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఆయన నివాసంలో చేపట్టిన మరమ్మతులపై రాజకీయ అంచనాలు ప్రారంభమయ్యాయి. జగన్ పార్టీలో చేరే విషయం పై నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ, ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి, వైసీపీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో ఆయనను కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

daggubati 11092018 2

ఇంకొల్లులోని తన కుటుంబానికి చెందిన కళాశాలలో సోమవారం సమావేశం ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి సమావేశం జరగలేదు. అయితే సోమవారం సాయంత్రానికి సమావేశం బుధవారానికి వాయిదా పడినట్లు ప్రచారం ప్రారంభమైంది. ఇంకొక వైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చెందిన కారంచేడులోని నివాసగృహంలో స్వల్ఫ మరమ్మతులకు శ్రీకారం పలికారు. తనకిష్టమైన రీతిలో ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన కుటీరాన్ని నిర్మించుకున్నారు. దానికి ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆయన లేక ఆయన కుమారుడు ఎన్నికల సమయంలో రావటానికే ఇవన్నీ చేస్తున్నారంటూ ఊహాగానాలకు తెరలేపారు.

daggubati 11092018 3

ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటు దగ్గుబాటి వ్యవహారంపై పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఏలూరి సమావేశం నిర్వహించటం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఆత్మీయులతో సమావేశం జరగకపోయినా సోమవారం ఆయన స్వగ్రామమైన కారంచేడు రావటం, ఏలూరి సమావేశానికి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యులు హడావుడికి వెళ్లటం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.

Advertisements

Latest Articles

Most Read