ఐవైఆర్ కృష్ణారావు... రమణ దీక్షితులు.. ముద్రగడ... మోత్కుపల్లి.. వీరు అంతా, ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మిన వారే.. వీరు అంతా ఒకరి తరువాత ఒకరు వెళ్లి జగన్ ను కలుస్తున్నారు అంటే, ఎవరు వీళ్ళని ఎలా నడిపిస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు... వీళ్ళందరి కంటే ముందు చెప్పుకోవాల్సింది, ఐవైఆర్ గురించి. మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావుకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నవ్యాంధ్ర మొదటి చీఫ్ సెక్రటరీగా చేసారు, రిటైర్డ్ అయిన తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పచెప్పారు. అయినా, ఈయన తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని గ్రహించించ లేక పోయారు. ఒకానొక రోజు,ఐవైఆర్ కృష్ణా రావు పాపం పండి, చంద్రబాబు ఇచ్చిన పదివి అనుభవిస్తూ, చంద్రబాబు పైనే విషం కక్కుతూ, దొరికిపోయాడు.

jagan 11092018 2

నిజం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే దూరం పెట్టారు. అప్పటికి కాని, అర్ధం కాలేదు, ఈయన బీజేపీ పంపించిన పావు అని. అయితే, ఈయన మాత్రం తెలివిగా, ఒక పెద్ద ఐఏఎస్ లాగా, మేధావి లాగా ఫోజ్ కొడుతూ, హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్ముతున్నాడు. తాజాగా ఐవైఆర్ వెళ్లి జగన్ ను కలిసాడు.. ప్రస్తుతం వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్త్ర విశాఖ జిల్లాలో సాగుతోంది. జగన్ తన యాత్రలో భాగంగా బ్రాహ్మణ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సైతం హాజరయ్యారు. అంతే కాదు, జగన్ తో ఎంతో అన్యోన్యతతో కనిపించారు..

jagan 11092018 3

ఇక చంద్రబాబు పై ఆరోపణలకు అంతే లేదు. ఒక పక్క చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి, ఎన్నో పధకాలు పెట్టి చరిత్రలో లేని విధంగా ఆదుకున్నారు. కాని, ఐవైఆర్ లాంటి వాళ్ళు మాత్రం, జగన్ తో కలిసి నిన్న చంద్రబాబు ఎన్నో తిట్టారు. అంతే కాదు, తాను రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని జగన్‌కు ఐవైఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు వేదికపైనే మాట్లాడుకున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్ముతూ, అమరావతి నాశనం కోరుకుంటూ, కుట్రలు పన్నుతున్నారు.

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షహోదాలో ఉన్న వైకాపా వాళ్ళకు సమయం దొరికినప్పుడల్లా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పైనా, ప్రభుత్వ పధకాల అమలు పైనా విమర్శలు కురిపించడం అలవాటుగా మారిపోయింది. ఇకఆ పార్టీ నాయకుడు జగన్ అయితే ఆయన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ లిస్టులో ఇటీవలే మొదలుపెట్టిన అన్నా కాంటీన్లు కూడా ఉన్నాయి. ఈ అన్నా కాంటీన్లలో కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవాడి కడుపునింపటంతో , రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశ మొత్తం ప్రశంసలు అందుకుంటోంది.

anna 11092018 2

కాని జగన్మోహన్ రెడ్డి మాత్రం పేదల ఆకలి తీర్చే ఈ పధకం గురించి కూడా విమర్శించటం ఆయనకే సాద్యం అయింది. అయితే తాజాగా అవే అన్నా కాంటీన్ల సాక్షిగా ప్రతిపక్షం పరువు పోయింది. అన్నాకాంటీన్ల లో భోజనం చేస్తున్న జగన్ కార్యకర్తల ఫోటోలు, ఇప్పుడు వైరల్ అయ్యాయి. విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న సందర్బంలో ఆ పాదయాత్రలోఉన్న కొందరు యువకులు తమ దగ్గరలో ఉన్న అన్నా కాంటీన్ కు వెళ్లి తమ ఆకలి తీర్చుకుని, చంద్రబాబుకి జై కొట్టారనే చెప్పాలి.

anna 11092018 3

ఆకలితో ఉన్న ఎవరినైనా, అది వైకాపా కానీ మరెవరైనా కానీ అన్నా కాంటీన్ అక్కున చేర్చుకుంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలలో నెలకొల్పిన అన్నా కాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం పెడుతుండటంతో వాటికి విశేష ఆదరణ వస్తుంది. ఆకలికి పార్టీ అనే తేడా ఉండదు, ఇలాంటి మంచి కార్యక్రమం పై విమర్శలు మానుకుంటే మనకే మంచిది.

 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంతలా పెంచినా, అన్ని పార్టీలు ఏకమై ఆందోళన చేస్తున్నా విపక్ష వైసీపీ మాత్రం నోరెత్తడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పెట్రో ధరలపై అసెంబ్లీలో తీర్మానంపై ప్రసంగిస్తూ బీజేపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు. ‘‘ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి వెళ్లడమే విపక్ష నేతకు తెలుసు. కేసుల మాఫీయే ఏకైక అజెండాగా బీజేపీ దర్శకత్వంలో పని చేస్తున్నారు. వైసీపీ రిమోట్‌ బీజేపీ చేతుల్లో ఉంది’’ అని తెలిపారు. దీనిపై విష్ణు స్పందిస్తూ... బీజేపీ, వైసీపీలు వేరువేరని, తమ మధ్య లాలూచీ ఏమీలేదని తెలిపారు. కానీ.. బీజేపీ, వైసీపీలిద్దరిదీ మోదీ ముసుగే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

kumar 11092018 2

గత కొంతకాలం నుంచి విపక్ష నేతపై ఉన్న అవినీతి కేసులన్నీ నీరుకారుస్తున్నారు. సీబీఐ, ఇతర సంస్థలను ప్రభావితం చేస్తున్నారు. 2014ఎన్నికలకు ముందు మోదీ ఏం చెప్పారో గుర్తుంచుకోండి. అవినీతిపరుల ఆటకట్టిస్తానని, కేసులను త్వరగా తేల్చేసి అక్రమాస్తులను జప్తు చేస్తామని చెప్పారు. కానీ... ఈ నాలుగేళ్ల కాలంలో ఇక్కడ విపక్షనేతపై కేసులు నీరుకారిపోయాయి’’ అని తెలిపారు. దీనిని నిరూపిస్తామని, రాజీనామాకు సిద్ధమా అని విష్ణుకు సవాల్‌ విసిరారు. అక్రమార్కులకు మద్దతుగా సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను ప్రభావితం చేయడం దుర్మార్గమన్నారు. ‘‘ముసుగు వీరుల ఆటలు ఏపీలో సాగవు’’ అని ఉద్ఘాటించారు.

 

kumar 11092018 3

జగన్ కేసులను కేంద్రం బలహీనపరుస్తుందని, ఇందుకు సాక్ష్యాలు చూపితే రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మోదీ చేసే రాజకీయం ఇదేనా? అంటూ సీఎం మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల అవినీతిపరులను బోనెక్కిస్తానని, నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని చెప్పారని అ డబ్బును ప్రజల అకౌంట్లలో వేస్తానని మోదీ చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాగే అన్ని కేసులను ఏడాదిలోపల క్లియిర్ చేయిస్తానని చెప్పిన మోదీ తప్పుడు కేసులు వేరేవాళ్లపై పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఏపి లో పెట్టుబడులు వచ్చే దిశగా చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి వివరిస్తారు. 4 రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ 27 న రాష్ట్రానికి చంద్రబాబు రానున్నారు.

cbnusa 11092018

‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు వచ్చే నెల 24న యూఎన్ఓ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సదస్సులో సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కాగా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అనుసురిస్తున్న విధానాలను యూఎన్ఓ ప్రశంసించింది.

cbnusa 11092018

024లోపు 60 లక్షల మంది రైతులను సేంద్రీయ సాగు బాట పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి యూఎన్ఓ సాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్నవారికి చంద్రబాబు తన గళం వినిపించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్నారు. సుభాష్‌ పాలేకర్‌ సూచనలతో జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రైతు సాధికార సమితిల సాయంతో రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించారు. తక్కువ కాలంలోనే ఏపీలోని రైతులు జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ వైపు మొగ్గు చూపారు. ఏపీ రైతులను ప్రకృతి సిద్ధమైన సాగు వైపు నడిపించిన చంద్రబాబు కృషిని సర్వత్రా కొనియాడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read