విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉన్న ఆయన పేరు చెప్తే, ముందుగా గుర్తుకు వచ్చేవి సర్వే ఫలితాలు... ఆయన ఏదన్నా సర్వే చేసారు అంటే, అది నిజం అయ్యి తీరుతుంది అని అనేక సార్లు రుజువు అయ్యింది. లగడపాటి, అంత పర్ఫెక్ట్ గా సర్వే చేస్తారు... అందుకే సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు, లగడపాటి సర్వే అంటూ, రాస్తూ ఉంటారు. అయితే వీటిని అనేకసార్లు ఖండించారు లగడపాటి. నేను ఏదైనా సర్వే చేస్తే, మీడియా ముందుకు వచ్చి చెప్తా అని, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు తెలంగాణా ఎన్నికలు వస్తూ ఉండటంతో మరోసారి, ఆయన పై ఫోకస్ పడింది.

lagadapati 11092018 2

సరిగ్గా ఇదే టైంలో లగడపాటి రాజగోపాల్ తిరుమల వచ్చారు. స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి, తన కుటుంబంతో కలిసి వెంకన్న దగ్గరకు వచ్చారు. అయితే, ఇక్కడ కూడా మన మీడియా వాళ్ళు వదలరు కదా. దర్శనం అనంతరం బయటకు రాగానే, ఆయన ముందు మీడియా గొట్టాలు పెట్టి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటూ హడావిడి చేసారు. ఆయన మొహమాటంగా, ఇక్కడ వద్దు వద్దు అంటున్నా, ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఈ సమయంలో అందరూ కలిసి, ఆయన పై ఒత్తిడి తెస్తూ, మీరు సర్వేలు బాగా చేస్తారు కదా, తెలంగాణా ఎన్నికలు మరో రెండు నెలల్లో వచ్చేస్తాయి, రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగారు.

lagadapati 11092018 3

పొత్తులు ఉంటే ఎలా ఉంటుంది, పోత్తులు లేకపోతే ఎలా ఉంటుంది అనే అంశం పై ప్రశ్నలు అడిగారు. దీనికి లగడపాటి సమాధానం చెప్తూ, మొదటి సారి కెసిఆర్ ని ఇక్కడే కలిసాను, తిరుమలలోనే మా మొదటి పరిచయం అయ్యింది, అలాంటిది, ఆయన గెలుస్తాడా గెలవడా అనేది ఇక్కడ చెప్తే బాగోదు, ఇక్కడ చెప్పను అంటూ వెళ్ళిపోయారు. త్వరలోనే ఆయన తెలంగాణా ఎన్నికల పై పూర్తి సమాచారం ఇస్తారని, ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే, మరోసారి, తిరుమల కొండ పైనే, ఇలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు అని, ఆయన మాట్లాడను అని చెప్పినా, మీడియా అత్యుత్సాహం పై విమర్శలు వస్తున్నాయి. గతంలో రోజా బూతులు ఎలా మాట్లాడిందో గుర్తు చేస్తూ, టిటిడి మీడియాను కొండ పై రాజకీయ ప్రశ్నలు అడగకుండా నిలువరించాలని కోరుతున్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు.. https://youtu.be/CIo-lqx6yYY

ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి కేంద్రం సహాయం చేస్తోందని, కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని నేతలు ఏకరవు పెడుతున్నారు. చంద్రబాబుపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమవుతుంటే.. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, బాబుపై ప్రశంసలు గుప్పించారు. సీఎం నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. అసెంబ్లీలో ప్రధానంగా పెట్రో ధరల పెంపుపై వాడివేడిగా చర్చ జరిగింది.

vishnu 11092018

‘‘కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించే మనస్సు లేదా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రానికి కనిపించడం లేదా? పెట్రోల్ ధర పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మీరు ఆనందంగా ఉన్నారు. కేంద్రం ప్రజలను మభ్యపెడుతోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును లీటర్‌కు రూ.2 తగ్గిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం నుంచి తగ్గింపు ధరలు అమలులోకి రానున్నాయి. పన్నులు తగ్గించడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1120 కోట్ల ఆర్ధిక భారం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

vishnu 11092018

అయితే చంద్రబాబు నిర్ణయాన్ని విష్ణుకుమార్‌రాజు స్వాగతించారు. పన్ను తగ్గింపుపై నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని విష్ణుకుమార్‌రాజు కోరారు. అంతకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో తమకు ఏ సంబంధంలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసంబ్లీలో మాట్లాడుతూ జగన్ కేసులను కేంద్రం బలహీనపరుస్తుందని, ఇందుకు సాక్ష్యాలు చూపితే రాజీనామా చేస్తారా? అంటూ విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మోదీ చేసే రాజకీయం ఇదేనా? అంటూ సీఎం మండిపడ్డారు.

 

జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంటో, మరేదైనా కారణమో కాని, ఇన్నాళ్ళ నుంచి తాను రాజకీయ వ్యుహకర్తగా చేసిన ఉద్యోగం నుంచి గుడ్ బై చెప్తున్నట్టు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని తేల్చి చెప్పారు. తాను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన కొన్ని ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు.

prasanth 10092018 2

యూపీ ఎన్నికల తర్వాత తన సంస్థ వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందేనని, తమ సంస్థ పెద్ద మొత్తంలో జగన్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు వచ్చిన పుకార్లలో నిజం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మీడియాలో తనను జగన్ 300 నుంచి 400కోట్లు ఇచ్చి రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరిగిందని.. అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. తమకే వనరులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రశాంత్ కిషోర్ చెప్పడం కొసమెరుపు. అయితే ప్రస్తుతం జగన్ తో ఇప్పటికే ఒప్పందం ఉండటం వల్ల, పని చేస్తున్నా అని, లేకపోతే ఇప్పటికే వదిలి వెళ్ళిపోయే వాడిని అని ప్రశాంత్ కిశోర్ అన్నారు..

prasanth 10092018 3

ఒక పక్క మోడీ పిలిచినా వెళ్ళని ప్రశాంత్ కిషోర్, జగన్ కోసమే ఇంకా ఉన్నారు అంటే, జగన్ ఎంత డబ్బు ఇచ్చారో ఇట్టే అర్ధమైపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేందుకు 2014 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్... తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెలువడుతున్న వార్తలను సైతం తోసిపుచ్చారు. మొత్తానికి, జగన్ తో ఒప్పందం ఉంది కాబట్టే ఇక్కడ ఉన్నాను అని చెప్పటం, ఇంకా ఈ ఉద్యోగం చెయ్యను అని చెప్పటం చూస్తుంటే, ఏమి జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు..

ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ రెట్లు పెంచేస్తూ, ప్రజల నడ్డి విరుస్తుంటే, ఆర్ధిక కష్టాలు ఉండి, ఆదాయం వచ్చే పెట్రోల్, డీజీల్ రేట్లను చంద్రబాబు తగ్గించి, మధ్యతరగతి ప్రజలకు ఎంతో కొంత ఊరట ఇచ్చారు. ఈ రోజు వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది.

cbn 10092018 2

కాగా పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ... ఇవాళ కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన మొత్తం 21 పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ... పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.80.73, రూ. 72.83కి చేరాయి. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ ధరలు రూ.88.12, రూ.77.32గా ఉన్నాయి.

cbn 10092018 3

ప్రస్తుతం కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని వడ్డిస్తోంది. అదనంగా రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను వసూలు చేస్తున్నాయి. అత్యధికంగా పెట్రోల్‌ పై మహారాష్ట్ర 39.12%.. డీజిల్‌పై తెలంగాణ 26% వ్యాట్‌ను వర్తింపజేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్య వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.85 మేర, డీజిల్‌ ధర రూ.3.30 మేర పెరిగింది. అయితే చంద్రబాబు కొంత తగ్గించటంతో, ఎంతో కొంత ఊరట లభిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read