ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. విభజన వలన ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా, అవినీతి లేకుండా, అర్హులకి మాత్రమే రుణమాఫీ జరిగిన తీరు మాకు ఆదర్శం అంటుంది కర్ణాటక. రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి కర్ణాటక నుంచి రాష్ట్రానికి ఇద్దరు అధికారుల బృందం రానుంది. ఈనెల 11, 12 తేదీల్లో ఇక్కడి అధికారులతో వారు సమావేశమవుతారు. క్షేత్రస్థాయి పర్యటనలూ చేస్తారు. 16 అంశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఇదివరకే ఉత్తరప్రదేశ్‌ నుంచి మహారాష్ నుంచి అధికార బృందం, మన రాష్ట్రానికి వచ్చి రుణమాఫీ ప్రక్రియను స్టడీ చేసి వెళ్లారు.

cbn 10092018

దీనిని బట్టే అర్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో. స్వయానా మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి సుదీర్ ముంగన్తివార్, ఆంధ్రప్రదేశ్‌ రుణమాఫీ ప్రక్రియ చాలా బాగుంది అని, అక్కడ జరిగిన రుణమాఫీ ప్రక్రియ స్టడీ చేసి, మహారాష్ట్రలో ఇంప్లెమెంట్ చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు కర్ణాటక బృందం రుణమాఫీకి బడ్జెట్‌ పరిధిలో నిధులు సమకూర్చిన విధానం, పథకం అమలుకు రైతు సాధికార సంస్థ ఏర్పాటు, అది చేపట్టిన చర్యలపై సమాచారం కోసం మన రాష్ట్రానికి రానుంది.

cbn 10092018

ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే అంశంపై రాష్ట్ర అధికారులతో ఈ కర్ణాటక బృందం చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతంలో పర్యటించి, కొన్ని బ్యాంకులను సందర్శించి క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలు తీరును పరిశీలిస్తారు. నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంక్ రుణ మాఫీ సరికాదని సలహా ఇచినా, కేంద్రం తనకు సంబంధం లేదని తేల్చిచెప్పినా, 54లక్షల బ్యాంకు ఖాతాలకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. ప్రతిపక్ష నేత జగన్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని హేళన చేసినప్పటికీ, చంద్రబాబు తన పరిపాలన ప్రతిభతో చేసి చూపించింది.

అధికారంలో ఉండే ఎవరైనా అనే మాట, మరో 20 ఏళ్ళు, మరో 30 ఏళ్ళు ప్రజల ఆశీస్సులతో మాదే అధికారం అని అంటూ ఉంటారు.. మన రాష్ట్రంలో చంద్రబాబు కూడా ఈ మాట తరుచూ అంటూ ఉంటారు. కాని ఢిల్లీలో ఉన్న అహంకారులు మాత్రం, మీము యాభైఏళ్లు అధికారంలో ఉంటాం అంటున్నారు. యాభైఏళ్ల వరకు తమను ఓడించే నాథుడే ఉండడని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఇక మోడీ గారు అయితే, మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదు అంటున్నారు. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గం రెండో రోజు సమావేశంలో, మోడీ , షా ద్వయం, ఎంతో అహంకారంతో మాట్లాడిన మాటలు ఇవి. ఎవరైనా ప్రజా మద్దతుతో గెలుస్తారు. తమను ఓడించే నాథుడే లేడు అనే అహంకారులు, మిమ్మల్ని ఓడించేది రాహుల్ గాంధినో, మమతో, చంద్రబాబో కాదు.. మిమ్మల్ని ఓడించేది అయినా, గెలిపించేది అయినా ప్రజలు..

modi 10092018 2

ఆ ప్రజలు అంటే మీకు ఎంత చులకనో, మమ్మల్ని ఓడించే వాడే లేడు, మరో యాభైఏళ్లు మాదే అధికారం అనే అధికార అహం, తొందరోనే దిగుతుంది. ఇలా విర్రవీగి, ఎంతో మంది అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు. ఇందిరా గాంధీ లాంటి నేతే అడ్రస్ కోల్పోయింది. ఇంతే కాదు, ప్రధాని మోడీ గారు మరో మాట కూడా చెప్పారు, బీజేపీవద్ద పటిష్టమైన నాయకత్వం, విధానాలు, దేశాన్ని అభివృద్ధి చేయాలనే నిజాయితీ ఉన్నాయి అంట.. నోట్లు రద్దు, జీఎస్టీ లాంటి విదానులు, రాఫెల్ స్కాం లాంటి నిజాయతీ, ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకత్వం చేస్తే, మేమే గొప్ప అని మోడీ గారు చెప్పుకుంటున్నారు.

modi 10092018 3

తమకు అధికార అహంకారం లేదు.. ప్రజల అభివృద్ధికోసం పని చేసేందుకు అవకాశం కల్పించే ఆయుధమని ప్రధాని సెలవిచ్చారు. ఒక పక్క పెట్రోల్, డీజీల్ ధరలు వందకు చేరువలో ఉన్నాయి... ఇది అభివృద్ధా ? మరో పక్క రూపాయి పతనం భారీగా ఉంది... ఇది అభివృద్ధా ? ఇప్పటికీ ATMలలో డబ్బులు సరిగ్గా లేవు... ఇది అభివృద్ధా ? గుజరాత, మహారాష్ట్రా రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాల నిధులు దోచిపెడుతూ, ఆ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసి, ఇదే మా అభివృద్ధి అని ప్రధాని చెప్పటం హాస్యాస్పదం. మరొకసారి ఈ ఢిల్లీ అహంకారులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మిమ్మల్ని ఓడించే నాధుడు రాహుల్ గాంధీనో మరొకరో కాదు, మిమ్మల్ని ఓడించే నాధుడు సాధారణ ప్రజలు... అహం వీడండి మోడీ - షా గారు..

"గుంటూరు -2 సీటు ఇస్తామని చంద్రబాబు ప్రత్తిపాటి పుల్లారావుతో కబురు పెట్టారు. మా వాడు నో అన్నాడు. జగన్ విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయమంటే వద్దన్నాడు. ఆ దేవినేని ఉమా గాడిని ఓడించడమే లక్ష్యంగా మైలవరం రాజకీయాల్లోకి దిగాడు. తాడో పేడో తేల్చుకుంటానంటున్నాడు. నేనైతే పద్దతిగా వ్యవహారం చేస్తా. కృష్ణప్రసాద్ మొండి యవ్వారం చేస్తాడు జాగ్రత్త. అసలు మా వాడికే కాదు జగన్ మోహన్ రెడ్డే ఉమాపై గుర్రుగా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నావ్.. పిల్లలు ఏం చదువుతున్నారు. జాగ్రత్త.. జాగ్రత్త" ఈ మాటలు అన్నది ఎవరో కాదు మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్వీ నరసింహారావును ఓ రేంజ్లో బెదరేశారు.

kadapa 09092018 1

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో టీడీపీ, వైసీపీ బ్యానర్లును తొలగించే ప్రక్రియ చేపట్టారు. తామ బ్యానర్లను తామే తీసుకుంటామని చెప్పిన వైసీపీ నాయకులు ఆపని చేయలేదు. దీంతో పంచాయితీ సిబ్బంది తొలగించారు. ఈక్రమంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి తనను బెదిరించారని ఈఓ నరసింహారావు విలేకర్ల వద్ద వాపోయారు. తనను బెదిరిస్తూ వసంత మాట్లాడిన మాటల ఆడియో టేపుల్ని సీడీల రూపంలో విలేకర్లకుక అందజేశారు. పంచాయితీ కార్యదర్శికి నేరుగా వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి బెదరేయడంపై రాష్ట్ర పంచాయితీ కార్యదర్శలు, ఉద్యోగుల సంఘం భగ్గుమంది. మా పని మమ్మల్ని చేసుకోనీయకుండా బెదిరించడం సబబు కాదన్నారు. ఇలాంటి పరిణామాలను ఐక్యంగా ప్రతిఘటిస్తామని అల్టిమేటం ఇచ్చారు.

kadapa 09092018 1

ఇదీ సంభాషణ.. మనవాళ్ళతో జాగ్రత్తగా ఉండు.... అందుకే చెపుతున్నా ఈ సారి గుంటుపల్లి ఏలా ఉంటది... నేను ఐజీ intilgence తో మాట్లాడాను.. ఈ సారి కేపి లాగుతాడు లే అన్నాడు ఇదే continue చేస్తే 15 వేలు మెజార్టీ వస్తుంది అన్నాడు.... బాగానే ఉందని అందరూ అంటున్నారు అంతే ఈ టెంపో చివరి వరకు maintain చేయాలి.. తాడో పేడో తేల్చుకోవలనే లెక్కల్లో కేపి ఉన్నాడు... అన్నిటికి తెగించే వున్నాడు... అవసరం అయితే డబ్బుకు, మర్డర్ లకు తెగించే ఉన్నాడు...అవసరమైతే ఒకరుద్దరిని వాళ్ళను అటాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు... ఉమా అటాక్ ఇవ్వలేడు అనే ఫీలింగ్ వాళ్ళ వాళ్లకు ఉంది.. అన్ని ప్రిపేర్ అయ్యాడు"

kadapa 09092018 1

"మనము ఒక్కళ్ళమే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది... అతను అసెంబ్లీలో లో అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని... అవసరమైతే కడప నుండి కూడా బాగానే దించుతారు జనాలను చివరి రోజు.. నువ్వు నా శిష్యుడివి కాబట్టి చెబుతున్నా... నువ్వు టిడిపి ఏజెంట్ అనుకుంటున్నారు... ఒక ఉద్యోగస్తుడిలా లేవు.. పంచాయితీ రాజ్ సెక్రెటరీ రామాంజనేయులు నా పర్సనల్ ఫ్రెండ్ అతనుతో చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని చెప్పారు... ఒక్క కేపి కే కాదు జగన్మోహన్ రెడ్డికి ఉంది వీడి (ఉమా) మీద ఉంది కక్ష.. నువ్వు వెనకాడొద్దు డబ్బుల విషయంలో అవసరమైతే మెన్ పవర్ నేను కడప నుండి పంపిస్తాను వీడిని (ఉమా)మటుకు శాసనసభ లో చూడటానికి వీలు లేదు అని జగన్ కు ఉంది... As a బ్రదర్ గా నేను నీకు చెబుతున్నా"

kadapa 09092018 1

"ఎంతదూరమైనా వెనకాడేది లేదు పట్టుదలతో ఉన్నారు... ఇది చూసి ఊళ్ళో వాళ్ళు exploid చేయడానికి చూస్తున్నారు...గుంటుపల్లి లో నరసింహయ్యకు wait ఉందంట... వాళ్ళ అబ్బాయి కూడా ఐతవరం నిన్న వచ్చాడు మనకు చేస్తా అని.... చూద్దాం... ఇంక ఇప్పుడిప్పుడే మొదలవుతుంది... అబ్బాయి ఏమో ఇప్పుడే పునాది గట్టిగా వేస్తున్నాడు... వీడేమో నా పునాది గట్టిగా ఉందో లేదో అని చూసుకుంటున్నాడు.. అనేక ఇబ్బందులు వస్తాయి... ఇక కేపి కి ఇది చివరి ఎన్నిక ఎందుకంటే వసంత ఫ్యామిలి ఓడిపోయారు అనే స్థాయికి ఇంకా దిగజారాలేదు.. సీఎం గుంటూరు 2 టికెట్ ఇస్తాను, పత్తిపాటి వాళ్ళను పంపాడు... ఐనా ఇవేమీ కాదు వీడిని ఓడించాలన్న ధ్యేయం... తాడో పేడో తేల్చుకోవాలి.. జగన్మోహన్ రెడ్డి vja పార్లమెంట్ ఇస్తాను అన్నాడు అయినా ఒప్పుకోలేదు వీడిని ఓడించాలి అన్నదే ధ్యేయం గా కేపీ ఉన్నాడు.. నేనైతే ఒక పద్ధతి కలిగిన వ్యవహారం గా చేస్తా కానీ కేపి అలాకాదు... మొండి వ్యవహారం చేస్తాడు... అందుకే నీకు ఫోన్ చేశా oneside గా చేస్తున్నావు అని... సరే జాగ్రత్త... నువ్వు ఎక్కడ ఉంటున్నాడు... పిల్లలు ఎక్కడుంటాన్నారు.... కలుద్దాం... జాగ్రత్త" https://youtu.be/FtFF4N7fDVs

సిపిఐ, సిపిఎం పార్టీలు గత నాలుగు ఐదు నెలలుగా, పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నాయి. ఆంధ్రాలో ఎక్కువగా టచ్ లో ఉన్నాయి. తెలంగాణాలో కూడా మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, మోడీ పై ప్రేమ చూపిస్తూ, సీరియస్-నెస్ లేని రాజకీయం చేస్తూ ఉండటంతో, సిపిఐ పార్టీ తెలంగాణాలో నమస్కారం చెప్పేసింది. తెలుగుదేశం పై వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, కెసిఆర్, మోడీకి అనుకూలంగా ఉండటంతో, ఈ నిర్ణయం తీసుకుంది. మరో పక్క సిపిఎం మాత్రం, ప్రస్తుతానికి పవన్ తోనే వెళ్ళటానికి డిసైడ్ అయ్యింది. అయితే, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడనుంది. ఇక్కడ కూడా సిపిఐ, పవన్ కు దూరంగా జరిగే అవకాసం ఉంది.

cpi 0902018 2

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ కు గుడ్ బై చెప్పి, తెలుగుదేశంతో ఎన్నికలకు వెళ్లి, కెసిఆర్ కి బుద్ధి చెప్పటానికి సిపిఐ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చించారు. అనంతరం, మీడియాతో రమణ మాట్లాడుతూ, రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడనున్నామని అన్నారు. మంచి వాతావరణంలో తాము చర్చించుకున్నామని, రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

cpi 0902018 3

ఏఏ పార్టీలైతే తమతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నాయో వాళ్లతో చర్చలు పెడుతున్నామని, భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ తాము ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయ, నైతిక విలువలు లేవని, అన్ని పార్టీలకు చెందిన నిస్సిగ్గుగా కలుపుకొన్నారని, ఇది కేసీఆర్ మార్క్ రాజకీయమని విమర్శించారు. తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్పిన కేసీఆర్, అలాంటి పాలన అందించలేదని.. పేదల గొంతు నొక్కుతున్న పరిపాలన కేసీఆర్ దని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. తెలంగాణ జన సమితితో కూడా చర్చలు జరుపుతామని, ఇప్పటికే ఆ పార్టీ సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మిగిలిన పక్షాలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read