ఆపరేషన్ గరుడ... ఈ ప్లాన్ మొట్టమొదట బయట పెట్టింది, సినీ హీరో శివాజీ.. అన్నీ కాకపోయినా, ఆయన చెప్పిన దాంట్లో, 90 శాతం నిజం అయింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీద దాడి మినహా, శివాజీ చెప్పిన ప్రతి పాయింట్ నిజం అయింది. గవర్నర్ జోక్యం చేసుకోవటం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరగటం, కులాల మధ్య గొడవలకి ప్లాన్ చెయ్యటం, ఇవన్నీ గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, ఢిల్లీ పై యుద్ధం మొదులు పెట్టిన దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, బీజేపీ, జనసేన, జగన్, కెసిఆర్ కుమ్మక్కు కళ్ళారా చూస్తున్నాం.
ఒక పక్క చంద్రబాబు మోడీ, అమిత్ షా లను, దేశమంతా చూసేలా ఉతికి ఆరేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంలో, మోడీ గాలి తీసి పడేసారు తెలుగుదేశం ఎంపీలు. అప్పటి నుంచి,మోడీ, షా పగతో రగిలిపోతున్నారు. చంద్రబాబుని అన్ని విధలుగా ఇబ్బంది పెట్టటానికి రెడీ అయ్యారు. అయితే ఈ రోజు హీరో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి మరో బాంబ్ పేల్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆపరేషన్లో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబుకు కేంద్రం నోటీసులు జారీ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. ఇదే అంశంపై శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీ.. ప్రస్తుతం విషయం బయటపడింది కాబట్టి.. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని... ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన కేంద్రం మరోటి లేదన్నారు. సీఎంను ఇబ్బంది పెట్టడమంటే భావితరాలకు నష్టం చేయడమేనని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో... ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని మండిపడ్డారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని శిక్షించేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశించారు. సమయం చూసి, దెబ్బతీసేందుకు యత్నించడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.