ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు హాట్ హాట్ గా న‌డుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును టార్గెట్ గా రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు జాతీయ స్థాయిలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌గా, ఇటు స్థానికి పార్టీలు కూడా బీజేపీకి తోడయ్యాయి. ముఖ్యంగా చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టి ప్ర‌జాధ‌ర‌ణ త‌గ్గించేందుకు బీజేపి జాతీయ నాయ‌కులే రంగంలోకి దిగారు. ఐతే చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త ముందు చ‌తికిలబ‌డిపోతున్నారు ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు. ఏపీలో వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాల రాజ‌కీయ క‌ద‌లిక‌లను వేగవంతం చేయ‌డ‌మే కాకుండా టిడిపిని టార్గెట్‌ చేసుకొని ఎన్నికల బరిలో దిగిన‌ విష‌యం తెలిసిందే.

cbn 06092018 2

ఈ నేపధ్యంలో సీఎం చంద్ర‌బాబు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృధ్ధి పధకాలపై ప్రచారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలోనే దళిత తేజం పేరిట నెల్లూరులో, మైనార్టీలకు దగ్గర కావడానికి నారా హమారా టిడిపి హమారా పేరిట గుంటూరులో భారీ బహిరంగం సభ నిర్వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో నిల‌బెట్టేందుకు బాబు క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే నెలలో రాజమండ్రిలో బిసీ మహాగర్జన సభకు సన్నాహాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికితోడు జ్ఞానభేరి పేరిట యువతను ఆకర్షించడానికి విశ్వవిద్యాలయాల వారీగా సభలు నిర్వహించి విద్యాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, నైపుణ్యం, నిరుద్యోగ భృతిపై ప్రచారం నిర్వ‌హించాల‌ని టీడీపీ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జన్మభూమి- మావూరు, నీరు-ప్రగతి, నీరు-మీరు, మీఇంటికి మీభూమి, ఇంటింటికీ తెలుగుదేశం పేరిట తెలుగు తమ్ముళ్లకు కార్యక్రమాలను అప్ప‌జెబుతున్నారు టీడిపి ముఖ్య‌నేత‌లు.

cbn 06092018 3

దీనికి తోడు విభజన చట్టంలో పొందుప‌రిచిన‌ హామీలను కేంద్రం అమలు చేయకుండా, ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వక పోవడంపై బాబు కేంద్రంపై తిరుగుబావుటా ఎగరవేశారు. ఈ నేప‌ధ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడకట్టి కేంద్రంపై చేస్తున్న ధర్మపోరాటం ఉద్యమంలో బాబు సఫలీకృతులైయ్యార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఫ‌లితంగా ఇప్పుడు కేంద్రం ఒకమెట్టు దిగినా, రాష్ట్రంలో బిజేపిపై ప్రజల ఆగ్ర‌హ జ్వాల‌లు మాత్రం చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబును ఇరకాటంలో పెట్టడానికి రాష్ట్ర బిజేపి నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ నేప‌ధ్యంలోనే బిజేపి జాతీయ నేతలు మురళీధర్‌,రాంమాధవ్‌,రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహరావులను రాష్ట్రానికిపంపి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణలను చేయిస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటిని తిప్పికొట్టేందుకు బాబు ప్రజల్లోనికి వెళ్ళి అన్ని వర్గాల మద్దతు కూడ‌గ‌ట్టడంతోపాటు గ్రామదర్శిని, గ్రామవికాస్‌, నగరదర్శిని, నగరవికాస్‌ పేరిట ఊరు-వాడ అదికారులతో పాటు, టిడిపి శ్రేణులను పంపి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్రజలతోనే, వీరి కుట్రలు భగ్నం చేసేలా, చంద్రబాబు సమాయత్తం చేస్తున్నారు... ప్రజల చేతే వారికి బుద్ధి చెప్పే, సరి కొత్త రాజకీయం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఎంతో కీలకమైన స్థానం. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల ఓటర్లు ఇక్కడ అధికంగా ఉన్నారు. గతంలో ఈ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వుడు కాగా, 2009లో జనరల్ కేటగిరీగా మారింది. అవడానికి జనరల్ కేటగిరీ సీట్ అయినా, ప్రధాన పార్టీలు బీసీలకే టిక్కెట్ ఇవ్వడానికి మొగ్గుచూపుతాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి పితాని సత్యనారాయణ కూడా బీసీ కేటగిరీకి చెందిన నాయకుడే. అటువంటి ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మూడు నెలల క్రితం కొత్తగా నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పరిణామానికి కారకులని వైసీపీ శ్రేణులు వేలెత్తిచూపుతున్నాయి.

jagana 06092018 2

అసెంబ్లీ టిక్కెట్ కూడా దాదాపు ఆయనకే ఖరారు కావడంతో.. మిగిలిన నాయకుల్లో కూసింత జెలసీ ఏర్పడిందట. ఎప్పటినుంచో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న తమకు కోకుండా.. మధ్యలో వచ్చి సీటు ఎగరేసుకుపోతున్నారని ఆయనపట్ల మిగిలిన వారిలో కొంత అసూయ ఏర్పడిందట. ఈ సంగతులే ఇప్పుడు ఆచంటలో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. రాజకీయంగా తటస్థంగా ఉన్న రంగనాథరాజు తనకు టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తేనే పార్టీలోకి వస్తానని తెగేసిచెప్పడంతో పార్టీ అధినేత జగన్ తలూపారట. అలా ఆయన ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులయ్యారట.

jagana 06092018 3

శ్రీరంగనాథరాజుకి కన్వీనర్‌ పదవి కట్టబెట్టిన అనంతరం ఆచంట వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయట. నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న ఎస్సీ నాయకుల ప్రయోజనాలను ఆయన పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు, కొంతమంది ఎస్సీ నేతలు ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు శ్రీరంగనాథరాజు గైర్హాజరయ్యారట. దాంతో ఆ సామాజికవర్గ నేతలు ఆయనపై ఒకింత గుర్రుగా ఉన్నారట. మరోపక్క ఇతర వర్గాల నాయకులు కూడా ఆయనపై కొంత అక్కసును వెళ్లగక్కుతున్నారట. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉద్దేశపూర్వకంగానే కొందరు నేతలు శ్రీరంగనాథరాజుకు ఎడమొహం- పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది. మరి ఈ పరిణామాల పట్ల వైకాపా పెద్దలు ఎలా స్పందిస్తారో, స్థానిక రాజకీయాన్ని ఎలా చక్కబెడతారో వేచిచూడాలి.

ఎన్నికల సన్నాహక చర్యల్లో మిగతా పార్టీల కంటే ముందున్న అధికార పార్టీ టిడిపి ఇక ఇప్పుడు గల్లంతు అయిన ఓట్ల పై దృష్తి పెట్టింది. గత కొన్ని రోజులుగా, పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అవుతున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టిడిపి, ఓటర్ల నమోదు ప్రక్రియ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని బూత్‌ కన్వీనర్లకు పార్టీ అధిష్టానం సూచనలు చేసినట్లు తెలిసింది. ఓటర్ల నమోదు పై కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రతి ఒక్కరినీ యాక్టివేట్‌ చేయాలని బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేసిన టిడిపి అధిష్టానం ఈ ప్రకియ పై పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ద వహించాలని మార్గనిర్దేశం చేసింది. అలాగే బూత్‌ల వారీగా పార్టీ పురోగతిపై ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం.

tdp 06092018 2

అంతేకాకుండా ఆయా ప్రాంతాలకు చెందిన బూత్‌ కన్వీనర్లను పార్టీ ఏ మేరకు పుంజుకుందనే అంశం పై వారంలో ఒక రోజు తప్పనిసరిగా మానిటరింగ్‌ చేసి అధిష్టానానికి నివేదిక పంపాల్సి ఉంటుందని తమకు ఆదేశాలు అందినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఎన్నికలలో ప్రతి ఓటు కీలకమే కాబట్టి ఒక్క ఓటు విషయంలోనైనా అలసత్వం పనికిరాదని టిడిపి అధిష్టానం పార్టీ శ్రేణులను అప్రమప్తం చేస్తోంది. అలాగే వలస ఓటర్లు వారి ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంటుందని అధికారపార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల మంది బూత్‌ కన్వీనర్లు ఉండగా ఇందులో ఇప్పటి వరకు 18,800 మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

tdp 06092018 3

తాజా రాజకీయ పరిణామాలపై గ్రామాల్లో జరిగే చర్చల్లో బూత్‌ కన్వీనర్లు పార్టీ వాణిని గట్టిగా వినిపించాలని సీనియర్‌ పార్టీ నేతలు దిగువ స్థాయి క్యాడర్‌కు సలహాలు సూచనలు చేసినట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అలాగే టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు బూత్‌ కన్వీనర్లు, సేవా మిత్రలు కృషి చేయాలని సిఎం చంద్రబాబు తరచుగా నిర్వహిస్తున్న పార్టీ అంతర్గత సమావేశాల్లో శ్రేణులను పదే పదే హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్షాల కుట్రల్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, కన్వీనర్లు తిప్పి కొట్టాలని, అవసరమైతే జిల్లా పార్టీ నేతల సహకారం తీసుకోవాలని టిడిపి అధిష్టానం పార్టీ క్యాడర్‌కు సూచనలు చేసింది. వైసిపి, బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాయనే విషయాన్ని, గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయి, ఒక్క కెసిఆర్ తప్ప... మోడీ/అమిత్ షా, ప్రాంతీయ పార్టీలను కబళిస్తున్నారు అంటూ, అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం అయితే కెసిఆర్ మాత్రం వారానికి ఒకసారి వెళ్లి మోడీని కలుస్తాడు... దక్షణాది రాష్ట్రాలకు, మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ, అన్ని దక్షణాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, రాష్ట్రపతి దాకా వెళ్లి ఫిర్యాదు చేసినా, కెసిఆర్ మాత్రం, మోడీకి సన్మానం చేస్తారు.. అన్ని ప్రతిపక్ష పార్టీలు, అవిశ్వాస తీర్మానం పెడితే, కెసిఆర్ ఎంపీలు, ఆ అవిశ్వాస తీర్మానం చర్చ రాకుండా అడ్డుపడి, మోడీకి సాయం చేస్తారు.. ఏపికి దారుణంగా కేంద్రం మోసం చేస్తున్నా, ఒక్క మాట మాట్లాడడు.. ఇవన్నీ మోడీని ప్రసన్నం చేసుకోవాటానికి...

modikcr 06092018 2

బయటకు మాత్రం, ఫెడరల్ ఫ్రంట్ అంటాడు, నేను ఈ దేశానికి ప్రత్యామ్న్యాయం అంటారు... మోడీ పై ఇంత ప్రేమ ఉన్న కెసిఆర్, ఈ రోజు అసెంబ్లీ రద్దు సందర్భంలో కూడా, ఆ ప్రేమ చూపించారు. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 119 స్థానాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన పద్నాలుగులో నాలుగు సీట్లు బీజేపీ సిట్టింగ్ ఎమ్మల్యే లవి. బీజేపీ సిట్టింగ్ ఎమ్మల్యేలు ఉన్న చోటు మాత్రం, అభ్యర్ధులు ప్రకటించలేదు. ఇదంతా మోడీతో అవగహనలో భాగంగా జరిగింది అనే ప్రచారం జరుగుతంది. మోడీ నుంచి పర్మిషన్ రాగానే, అక్కడ చాలా వీక్ కాండిడేట్ లు పెట్టి, బీజేపీ గెలిచేలా కెసిఆర్ వ్యూహం పన్నారు.

modikcr 06092018 3

నిజానికి, కెసిఆర్ ముందస్తుకు వెళ్ళటానికి మోడీ పూర్తిగా సహకారం అందించారు. దీని వెనుక చంద్రబాబుని ఇబ్బంది పెట్టే భారీ వ్యూహం కనిపిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయితే, మోడీ మీద వ్యతిరేకత తన మీద వస్తుంది అని, అందుకే అసెంబ్లీ గెలిస్తే చాలని, ఎంపీ సీట్లు మెజారిటీ బీజేపీకి ఇచ్చేలా కెసిఆర్ ఒప్పందమని తెలుస్తుంది. అదే విధంగా, అటు మోడీ కాని, ఇటు కెసిఆర్ కాని, ఆంధ్రాలో మళ్ళీ చంద్రబాబు రాకుండా చెయ్యటానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

modikcr 06092018 4

ఏపిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తాయి కాబట్టి, ఆ సమయంలో మన రాష్ట్రం మీదే, అమిత్ షా, మోడీకి ఫోకస్ పెట్టటం సాధ్యం కాదు కాబట్టి, ఆ బాధ్యతలు కెసిఆర్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి పూర్తి సహకారం ఇస్తూ, కెసిఆర్ ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసేలా ప్లాన్ వేసినట్టు సమాచారం.. ప్రస్తుతం, దక్షిణాదిలో బీజేపీ గట్టిగా 4-5 ఎంపీ సీట్లు వచ్చే సూచనలు కనిపించటం లేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళాలో సున్నా సీట్లు వస్తాయి... కర్ణాటకాలో ఒక 4-5 వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు కెసిఆర్ తో ఒప్పందం చేసుకుని, కనీసం ఒక 10-12 స్థానలు తెలంగాణాలో గెలిచేలా ప్లాన్ చేసారు. అలాగే, ఆంధ్రాలో జగన్ తరుపున కూడా, ఒక 10-12 స్థానలు గెలిచేలా, ఆ వ్యుహలలో కెసిఆర్ ఆక్టివ్ గా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో కెసిఆర్ కి అన్నీ లాభాలే అంట.. తెలంగాణా అసెంబ్లీ, కేంద్ర సహయంతో, కెసిఆర్ సునాయాసంగా గెలవచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు, ఏపిలో చంద్రబాబుని దింపి, జగన్ ను ఎక్కించేలా ప్రయత్నాలు చెయ్యవచ్చు అని కెసిఆర్ - మోడీ-షా ల ప్లాన్ గా తెలుస్తుంది. అయితే, వీళ్ళు ప్లాన్ లు వేస్తేనే అన్నీ అయిపోవు కదా... అన్నీ డిసైడ్ చేసేది ప్రజలు...

Advertisements

Latest Articles

Most Read