ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖపట్టణంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)లో పడకల కొరత ఉన్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘అధ్యక్షా.. ఇంతకు ముందు వైద్యశాఖను మా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావుగారు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ శాఖను సీఎంగారే నిర్వహిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మార్పు రావాలి. ఇప్పుడున్న జనాభాకు వెయ్యి పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది."

vishnu 06092018 2

"నేను నాలుగేళ్ల నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రిగారు తరచూ విశాఖపట్టణం వస్తున్నారు. అది మంచిదే. ఒకసారి ఆయన కేజీహెచ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వరకు మా మంత్రిగారు కేజీహెచ్‌లో రాత్రి బస చేశారు. నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు. తర్వాత ఆయన పోస్టు పోయింది. అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగారు పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు(నవ్వుతూ). ఆయన కనుక విజిట్ చేస్తే కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయనే నమ్మకం ఉంది. తప్పకుండా కేజీహెచ్ బాగుపడుతుంది.’’ అంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు.

vishnu 06092018 3

దీనికి చంద్రబాబు స్పందించారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాథమిక వైద్యకేంద్రాలపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారని.. కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు. భవనాలు సరిగ్గా లేవన్న విషయంలో వాళ్లతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. అన్ని సబ్ సెంటర్లను, పంచాయతీ, అంగన్ వాడీ, స్కూళ్లు, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించే విషయంలో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించారు. ఉభయసభల్లో దాదాపు 160మంది ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈరోజు అన్నగారికి వెంకటపాలెంలో సీఎం నివాళులు అర్పించేటప్పుడు పట్టుమని 15మంది కూడా లేరు. హైదరాబాద్‌లో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి నివాళులు అర్పించి తర్వాతే సభకు వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.

cbn 06092018 2

అసెంబ్లీ అమరావతికి మారాక వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలిరోజు నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం ఆనవాయితీగా పెట్టుకోవడంతో ప్రజాప్రతినిధులూ ఆయన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో నేతల హాజరు తక్కువగా ఉంది. దీంతో నేతలు పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నాయనే గుసగుసలు గ్రామస్థుల నుంచి వినిపించాయి. కాగా, ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ప్రజాప్రతినిధులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

cbn 06092018 3

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు లోకేశ్‌, దేవినేని, జవహర్‌, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యామినీబాల, రాధాకృష్ణ, చాంద్‌బాషా, మాధవనాయుడు, శ్రవణ్‌కుమార్‌, గణబాబు, పీలా గోవింద్‌, మాధవవాయుడు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, గౌరుగాని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు పోతుల సునీత, టీడీ జనార్దన్‌ మాత్రమే సీఎం వెంట వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు గైర్హాజరవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు.

అమరావతిలో ఏర్పాటు చేసిన తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలలో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతాని చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని, అహాన్ని వీడకుంటే ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.

tdp 05092018 2

మరో పక్క, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, వారు చేసిన అభివృద్ధి పనులపై పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓ నివేదికను రూపొందించింది. ఎమ్మెల్యే జాతకాల చిట్టా కవర్లను వారికే అందజేసింది. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఎమ్మెల్యేల పనితీరును నివేదికలో పొందుపర్చారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, అంతర్గత విబేధాలు, సర్ధుబాటు చేసుకోవాల్సిన అంశాలపై ఈ రిపోర్టులో సవివరంగా పొందుపర్చారు. మండలాల వారీగా పార్టీ పరిస్థితిపై నివేదికలిచ్చారు. నియోజకవర్గాల్లో పనితీరుపై తమ జాతకాల కవర్లు చూసుకున్న ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు.

tdp 05092018 3

నివేదికలో తమ పని తీరును కళ్లకు కట్టినట్టు వివరించారని చెబుతున్నారు. పనితీరు మార్చుకోవాలని కొందరు ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఎమ్మెల్యేల నివేదికలు చూసిన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల జాతకాలు తన దగ్గర ఉన్నాయని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసే గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపర్చుకోవాలని ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతాని చెప్పారు. పార్టీ ఉంటేనే మనం ఉంటామని గుర్తుంచుకోవాలని, అహాన్ని వీడకుంటే ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు జగన మోహన్ రెడ్డికి ఒక పెద్ద నమస్కారం పెట్టి బయటకు వచ్చామని, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు అన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు కలిసి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. పదే పదే మమ్మల్ని అమ్ముడు పోయారు అంటున్న జగన్ కు లేఖ రాస్తూ, పలు విషయాలు ప్రస్తావించారు. జగన్ వ్యవహార శైలి నచ్చకనే వైసీపీ నుంచి బయటకి వచ్చామని వారు తెలిపారు. ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి జగన్‌కు లేదని, ఆయనపై అసంతృప్తితోనే వైసీపీకి రాజీనామా చేశామని లేఖలో ఎమ్మెల్యేలు వివరించారు. మేము నీకు దండం పెట్టి బయటకు వచ్చినా, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అంటూ, వాపోయారు.

jagan 05092018 2

వైసీపీ నుంచి ఇప్పటివరకు టీడీపీలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 22కు చేరింది. వీరిలో రాయలసీమకు చెందిన ముగ్గురికి మంత్రిపదవులు లభించాయి. వీరిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డిలకి మంత్రి పదవులిచ్చారు. వీరికి మంత్రి పదువులివ్వడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

jagan 05092018 3

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ శాసనసభాపక్ష నేతకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం సమావేశాలను బహిష్కరించడంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై జనసేన అధనేత పవన్‌కల్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకున్నా ఎందుకు జీతాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. వీరి దాడి తట్టుకోలేక, జగన్ ఎదురు దాడి ప్రారంభించటంతో, ఈ 22 మంది జగన్ కు లేఖ రసారు.

Advertisements

Latest Articles

Most Read