వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు...7 కోట్ల భారీ ప్రైజ్ మనీతో జరగనున్న వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి వెబ్ సైట్ ని ప్రారంభించి,కర పత్రికను ఆవిష్కరించారు.అక్టోబర్ 22 నుండి 26వ తారీఖు వరకూ ఈ కార్యక్రమం జరగనుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 75 స్పీకర్లు,2000 కు పైగా వివిధ కంపెనీల సిఈఓలు,ప్రతినిధులు పాల్గొననున్నారు అని మంత్రి తెలిపారు.అగ్రిటెక్,ఎమర్జ్ టెక్నాలజిస్,ఫింటెక్ రంగాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహించనున్నారు.ప్రతి రంగంలో ఉత్తమ టెక్నాలజీ,ఉత్తమ ఐడియా ఉన్న వారిని ఎంపిక చేయనున్నారు.మూడు రంగాల్లోనూ మొదటి ప్రైజ్ మనీ కోటి రూపాయిలు, రెండోవ ప్రైజ్ మనీ 70 లక్షలు,అలాగే మూడు రంగాల్లో 25 మందికి థర్డ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం.థర్డ్ ప్రైజ్ గా 25 మందికి 7 లక్షలు ఇవ్వబోతున్నాం అని లోకేష్ అన్నారు.
దీని వలన పెద్ద ఎత్తున స్టార్ట్ అప్ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమం కోసం ఏపీ ఫింటెక్ వ్యాలీ తరపున 8 దేశాల్లో రోడ్డు షోలు నిర్వహించబోతున్నాం అని లోకేష్ అన్నారు.పాత కాలం టెక్నాలజీలకు కాలం చెల్లింది.ఇప్పుడు ఫింటెక్, బ్లాక్ చైన్,బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీల్లో గ్లోబల్ లీడర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది అని లోకేష్ అన్నారు.రాష్ట్ర విభజన జరిగినప్పుడు 99 శాతం ఐటీ కంపెనీలు తెలంగాణలో ఉండి పోయాయి.కానీ అధునాతన టెక్నాలజీ టార్గెట్ గా ఇప్పుడు రాష్ట్రంలో విశాఖపట్నం,విజయవాడ,విశాఖపట్నం లో ఐటీ అభివృద్ధి వేగం పెంచుకుంది.ఇప్పటికే 36 వేల ఉద్యోగాలు ఇచ్చాం.2019 లోపు ఐటీ లో లక్ష ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నా అని మంత్రి లోకేష్ తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఫింటెక్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.గ్లోబల్ ఫింటెక్ డెస్టినేషన్ రేటింగ్స్ లో విశాఖపట్నం ఐదో స్థానంలో ఉంది.ఇప్పటికే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి పెద్ద కంపెనీ విశాఖకు వచ్చింది అని ఆయన అన్నారు.త్వరలోనే ఫెడరల్ బ్యాంక్ కూడా రాబోతుంది అని అన్నారు.
ఒక్క ఫింటెక్ లోనే 600 ఉద్యోగాలు వచ్చాయి.మరో 1000 ఉద్యోగాలు వచ్చే రెండు నెలల్లో రాబోతున్నాయి.స్టార్ట్ అప్ కంపెనీలు అందరూ ఈ ఫింటెక్ ఛాలెంజ్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం.స్టార్ట్ అప్ కంపెనీల్లో ఉత్తమ ఆలోచనలు,ఉత్తమ టెక్నాలజీ ఉన్న వారిని ఎంపిక చేసి వారికి ప్రైజ్ మనీ ఇస్తాం అని తెలిపారు... ఈ కంపెనీల్లో కొన్ని కంపెనీలు విశాఖపట్నంలో అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది అని తెలిపారు.అలాగే ఈ ఫెస్టివల్ లో వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు,ఏంజెల్ ఇన్వెస్టర్లు పాల్గొననున్నారు అని తెలిపారు...ఈ ఫెస్టివల్ లో వివిధ కాలేజిల్లో చదువుకునే విద్యార్థులు కూడా పాల్గొనే విధంగా హ్యాకథాన్ కూడా నిర్వహించబోతున్నాం అని లోకేష్ తెలిపారు.ఫింటెక్ అభివృద్ధి లో భాగంగా వీసా తో కలిసి విశాఖపట్నం లో నిర్వహించిన లెస్ క్యాష్ వైజాగ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చెయ్యడానికి సంప్రదింపులు చేస్తుంది అని మంత్రి లోకేష్ అన్నారు.వైజాగ్ ఫింటెక్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా ప్రపంచంలో ఉన్న ఉత్తమ ఫింటెక్ కంపెనీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది అని లోకేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీ సలహాదారు జేఏ చౌదరి,సెక్రెటరీ విజయానంద్ పాల్గొన్నారు.