మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా సర్వేపల్లి MLA,ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, అలాగే వేంకటగిరి MLA ఆనం రామనారాయణ రెడ్డి తో మొదటి నుంచి కూడా సఖ్యత లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఏ రోజూ కూడా అనిల్ కుమార్ యాదవ్ సర్వేపల్లిని కాని, అలాగే వెంకటగిరి వెళ్ళలేదు. అలాగే కాకాణి గోవర్ధన రెడ్డి కాని, రామనారాయణ రెడ్డి కాని తమ నియోజకవర్గంలో పర్యటించమని అనిల్ ను మంత్రిగా ఆహ్వానించిన సందర్భాలే లేవు. ఈ క్రమంలో కాకాణి గోవర్ధన రెడ్డికి మంత్రి పదవి వచ్చిన తరువాత కనీసం రమ్మని తనని ఆహ్వానించిలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. కాకాణి నుంచి ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని అనిల్ వాపోయారు. దీని పై అనిల్ వెటకారంగా కౌంటర్ ఇస్తూ కాకాణి తనకు ఇచ్చిన గౌరవం కంటే రెట్టింపు గౌరవం తానూ ఇస్తానని ఈ రోజు ప్రెస్ మీట్ లో అన్నారు. అంటే తనను ఎంతగా అవమానించారో దానికి రెండింతలు అవమానిస్తాను అన్నట్లుగా మాజీ మంత్రి అనిల్ హెచ్చరించారు . ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైసిపి శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లలో వైసిపి పార్టీ విభేదాలు , అసంతృప్తులు భగ్గుమంటున్నాయి.
ఒకవైపు కాకాణి ,నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇలా బహిరంగంగా ఒకరి పై ఒకరు ప్రకటన చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే దాదాపు రెండు వర్గాలుగా చీలిపోయినటు వంటి పరిస్థితి కనిపిస్తుంది . రోజురోజుకి ఈ విభేదాలు సద్దుమణగాలని పార్టీ శ్రేణులు చూస్తుంటే , కాని ఇంకా హెచ్చు మీరే పరిస్థితే కనిపిస్తుంది. అయితే రాత్రి అనిలకుమార్ యాదవ్ , MLA కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి వీరిద్దరూ కూడా చాలాసేపు చర్చ జరిపారని తెలుస్తుంది. వీరు చాలా మంది MLA లతో కూడా మాట్లాడటం జరిగింది. వీళ్ళంతా ఇక పై కాకాణి గోవర్దన రెడ్డిని తమ నియోజక వర్గంలోకి ఆహ్వానించ కూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద నెల్లూరు జిల్లా వైసిపి లో పెద్ద ఎత్తున విభేదాలు రాజ్యమేలుతున్నాయనే చెప్పొచ్చు. ఇక రాబోయే రోజుల్లో కొత్త వ్యవసాయ శాఖా మంత్రిగా వచ్చిన కాకాణి గోవర్ధన రెడ్డి వెళ్ళని కలుపుకొని పోతారా లేదాఈ విభేదాలూ ఇంక్రా తీవ్ర స్థాయికి చేరుకుంటాయో చూడాలి. వైసీపీ అధిష్టానం ఈ వ్యహరాన్ని ఎలా సెటిల్ చేస్తుందో మరి.