రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఎన్నికల సమరశంఖం పూరించడానికి 5వ తేదీన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.గుంటూరులో ఇటీవల నిర్వహించిన ముస్లింల సభ విజయవంతం కావడంతో రాజమండ్రిలో త్వరలో బీసీ గర్జన సభ నిర్వహించేందుకు ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెదేపా సభలకు భంగం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్న ప్రతిపక్ష పార్టీ వైకాపా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా చంద్రబాబు నేతలకు హెచ్చరించారు.

cbn 02092018 2

పార్టీ ఆధ్వర్యంలో సదస్సులు, సభలు నిర్వహించేది ఆయా వర్గాలకు చేరువ కావడానికేనని, ఇస్తున్న సందేశం వారికి చేరినప్పుడే ఈ సదస్సులకు సార్ధకత చేకూరుతుందన్నారు. గుంటూరులో నిర్వహించిన నారా హమారా-టీడీపీ హమారా సదస్సు సందేశాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్ళాలని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించి చైతన్యం తీసుకురావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరులో నిర్వహించిన దళిత తేజం సదస్సుకూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ కాలనీలకు చేరాలన్నారు. దళితులు, గిరిజనులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఎన్టీఆర్‌ విదేశీ విద్యా, సబ్‌ప్లాన్‌లకు నిధులు, కార్పొరేషన్‌ ద్వారా చేకూరుతున్న లబ్ధిని వివరించాలన్నారు. త్వరలో బీసీల సదస్సును పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. రాజమండ్రిలో బీసీ గర్జన సభను నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేయగా దానికి అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపారు.

బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వెనుముకగా నిలిచారని, ఈ గర్జనసభకు ముందు అన్ని బీసీ కులాల వారితో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, ఫలాలను సమగ్రంగా చర్చించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల గురించి ఇప్పటివరకు 5 సదస్సులు నిర్వహించామని, ఇంకా మరో 7 సదస్సులు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో ధర్మ పోరాట సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలను అధినేత చంద్రబాబు ఆదేశించారు. జనవరి నాటికల్లా మిగిలిన ధర్మ పోరాట సభలను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కుల పరిరక్షణకు టీడీపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే విధంగా బీజేపీ, వైకాపాల లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని స్పష్టం చేశారు. వీటితో పాటు గిరిజన గర్జన సభను విజయనగరంలో నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ సభలన్నింటిని నిర్వహించే తేదీలను త్వరలో తాను ప్రకటిస్తానని అధినేత చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో జ్ఞానభేరీ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, గత కొన్ని రోజులుగా, ఆంధ్రప్రదేశ్ పై, చంద్రబాబు పై, లోకేష్ పై, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం. జీవీఎల్ నరసింహారావు వారినికి ఒకసారి వచ్చి, ఎదో ఆరోపణ చేసి వెళ్ళిపోతారు. సోము వీర్రాజు అయితే, నెలకు ఒకసారి వచ్చి, ఎదో ఒక రాయ వేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇలా విమర్శ చేసారో లేదో, కొన్ని హైదరాబాద్ మీడియా ఛానల్స్ హడావిడి చేస్తాయి. ఎదో అయిపోతుంది అనే హంగామా చేస్తాయి. అలాంటి ఆరోపణల్లో ఒకటి నరేగాలో అవినీతి అనే ఆరోపణ. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, మాట్లాడుతూ, లోకేష్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని, 3 వేల కోట్ల అవినీతి జరిగింది అంటూ, హడావిడి చేసారు.

gvl02092018 2

కట్ చేస్తే, దేశం మొత్తం మీద, నరేగాలో అత్యంత పారదర్శకంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇది స్వయానా చెప్పింది కేంద్రమే. మరి ఇంత పారదర్శకంగా ఉంటే, అవినీతి ఎలా జరిగిందో సోము, జీవీఎల్ చెప్పాలి. కేంద్రంలో ఉన్న వారి పార్టీనే, ఆహా, ఓహో అంటూ రాష్ట్రాన్ని పొగుడుతుంటే, ఇంకా అవినీతి అంటారు ఏంటి ? పారదర్శకత, జవాబుదారీతనంలో మొదటి స్థానం, ఉపాధి హామీ అనుసంధానం, గ్రామాల్లో మెరుగైన వసతుల కల్పనలో రెండు, సుపరిపాలనలో నాలుగు, ఎక్కువ పనులు పూర్తిచేయడంలో మూడు, వంద రోజుల పనులు పూర్తిచేసిన కుటుంబాల్లో అర్హులైన పిల్లలకు శిక్షణ ఇచ్చి సాంకేతిక సిబ్బందికి సహాయకులుగా నియమించడంలో మూడో స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది.

gvl02092018 3

ఉపాధి హామీ పనుల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన దేశంలోని 18 జిల్లాల్లో విశాఖ, ప్రకాశం జిల్లాలు ఎంపికై రెండు అవార్డులు సాధించాయి. గ్రామస్థాయిలో నరేగా అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారి అవార్డుల్లో కర్నూలు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగి డి.రాంబాబు ఎంపికయ్యారు. పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో చిత్తూరు జిల్లా కోటబైలు ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. వీరందరికీ ఈనెల 11న దిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున అవార్డులు అందజేయనున్నారు. మరి ఆ సమయంలో, జీవీఎల్, సోము, తలకాయి ఎక్కడ పెట్టుకుంటారో.

దేశంలో ఏ అవార్డు ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ కు ఫస్ట్ ర్యాంక్ రావటం, చాలా సాధారణం అయిపొయింది. తాజాగా మరో టాప్ ర్యాంక్ కొట్టేసింది ఏపి. ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రాలకు అవార్డులను కేంద్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 10 అవార్డులు కొల్లగొట్టింది. 7 అవార్డులతో పశ్చిమ బెంగాల్, రెండోవ స్థానం దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మొత్తం 9 క్యాటగిరిల్లో అవార్డులు వచ్చాయి. పాదర్శకత, జవాబుదారీతనంలో ఏపీకి మొదటి స్థానం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ఏపీకి రెండో స్థానం, గుడ్‌గవర్నెన్స్‌ అమలులో నాలుగో స్థానం దక్కింది. ఎక్కువ పనులు పూర్తి చేయడంలో మూడో స్థానం లభించింది. ఉత్తమ గ్రామంగా చిత్తూరు జిల్లాలోని కోటబైలు గ్రామం ఎంపికైంది.

ap first 01092018 2

ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కర్నూలు జిల్లాకు చెందిన రాంబాబుకు అవార్డు దక్కింది. 7 అవార్డులతో బంగాల్‌ రెండో స్థానంలో నిలించింది. సెప్టెంబర్‌ 11న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో సత్తా చాటిన నగరాలు, మున్సిపాలిటీలకు కేంద్రం ప్రభుత్వం అవార్డులు అందజేసింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. తొలి 300 ర్యాంకుల్లో 31 ర్యాంకులు సాధించిన విషయం తెలిసిందే. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో లక్షకు పైబడిన జనాభా విభాగంలోని తొలి 100స్థానాల్లో ఐదు పురస్కారాలు లభించాయి.

రాష్ట్రంలో కొన్ని చోట్ల అదుపులేకుండా ప్రబలుతున్న అంటువ్యాధులు మలేరియా, డెంగీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. "చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండడం లేదు. గతంలో వ్యాధులు వచ్చిన చోట మళ్లి వ్యాధులు ప్రబలుతున్నాయంటే మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరు ఇలాగె వ్యవహరిస్తే ఎలా.. సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టలేను.. " అని ముఖ్యమంత్రి ఈ రోజు ఉండవల్లి ప్రజావేదిక లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసారు. సాంకేతిక పరిజ్ఞానం ఉంది.. కావలసిన సౌకర్యాలు సమకూర్చాము. హాట్ స్పాట్ లు ఏమిటో తెలుసు, డ్రోన్ లను విస్తృతంగా వినియోగించి ఎక్కడ వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఉందొ తెలుసుకొని వెంటనే తగు చర్యలు చేపట్టవచ్చు... కానీ ఆలా జరగడం లేదు"అని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు.

ప్రజలు మంచాన పడడానికి మూల కారణాలు గుర్తించండి. సోమవారానికల్లా పూర్తి వివరాలు సమర్పించండి. అప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాక పోతే నేనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాను.. చర్యలు తప్పవు... అని గట్టిగ ముఖ్యమంత్రి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు హెచ్చరించారు. మలేరియా కేసులు గత ఏడాది తో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ డెంగీ మాత్రం అత్యధిక కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఎక్కడ పరిస్థితి బాగాలేదో అక్కడ ఇంటింటికి వెళ్తున్నామని అధికారులు చెప్పారు. అలా జరిగితే పరిస్థితి అదుపులో ఉండేదని.. ఇంకా నియంత్రణ చర్యలు చాల చోట్ల సమర్థవంతంగా లేవని ముఖ్యమంత్రి అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ కూడా అప్రమత్తంగా ఉండీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ తగు చర్యాలకు ఉపక్రమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పారిశుధ్యం, పరిశుభ్రత, నీటి నిల్వ వంటి కారణాలతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఇంకా చర్యలు పెద్ద స్థాయిలో చేపడితే కానీ పరిస్థితి అదుపులోకి రాదనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది తో పోలిస్తే డెంగీ కేసులు 17 శాతం తగ్గినప్పటికే విశాఖపట్నం లో మాత్రం 424 శాతం డెంగీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని వివరించారు. 86 శాతం కేసులు ఈ 5 జిల్లాల్లోనే నమోదయ్యాయి. పరిస్థితి వెంటనే అదుపులోకి తీసుకు రావాలని, ఇదొక అత్యవసర పరిస్థితిగా భావించి సమస్య తమదనుకుని అధికారులు విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో తిరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read