జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలో కొంత మంది వీర విధేయులను తయారు చేసుకున్నారు. ఏ పార్టీలో అయినా వీర విధేయులు ఉండటం సహజం. కానీ ఇక్కడ వీర విధేయుల కంటే, వీరిని ఉన్మాదులు అనొచ్చు. వీరికి ఉచ్చం, నీచం తెలియదు. పెద్దా, చిన్నా తేడా ఉండదు. నోట్లో నుంచి ఏమి మాట్లాడుతున్నామో తెలియదు. కేవలం తమ అధినేత వినసొంపుగా తమ బూతులు విన్నాడా లేదా ? ఇదే వారికి కావలసింది. అలనాటి వారే కొడాలి నాని, పేర్ని నాని. కొడాలి నానితో పోల్చుకుంటే, పేర్ని నాని కొంచెం నయం అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి వీరిని అంతలా వాడటానికి, వీరేమీ పెద్ద పుడింగులు కాదు. వీరికి చదువు కూడా లేదు. అతిగా వాగటమే కానీ, వీరి వల్ల పైసా ఉపయోగం ఉండదు. కానీ వీరిని సామాజిక కోణంలో జగన్ వాడుకున్నారు. కమ్మ వాళ్ళ మీదకు కొడాలి నాని వదిలేవారు. కాపుల మీదకు పేర్ని నానిని వదిలేవారు. ఇద్దరికీ ఇచ్చిన శాఖలు కంటే, వీరికి మిగతా పనులే ఎక్కువ. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ ఇచ్చారు. అసలు అందులో ఏమి జరుగుతుంది అని చెప్పటానికి, ఒక్కసారి కూడా కొడాలి నని మాట్లాడిన పాపాన పోలేదు. ఇక పేర్ని నాని రవాణా శాఖ. రవాణా రంగం నాశనం అయినా, దాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్దాం అనే ఆలోచన ఆయన ఎప్పుడూ చేయలేదు.
కానీ బూతులు తిట్టటానికి మాత్రం వీళ్ళని జగన్ ఫుల్ గా వాడారు. చంద్రబాబుని, కొడాలి నాని ఏ రకంగా బూతులు తిట్టారో అందరూ చూసారు. కొడాలి నానికి, బూతులు మంత్రి అనే పేరు వచ్చేలా బూతులు తిడుతూ, అదే గొప్ప అనే విధంగా రెచ్చిపోయాడు. ఇక పేర్ని నానిని, పవన్ కళ్యాణ్ మీద వదలటానికి ఉపయోగించారు. రెచ్చగొట్టే భాషలో రెచ్చిపోవటం, అదే వ్యంగ్యం అనుకోవటం పేర్ని నాని స్టైల్. జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయులుగా ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. అయితే తాజా మంత్రి వర్గ విస్తరణలో, 11 మంది పాత వారిని ఉంచినా, ఈ ఇద్దరు నానిలను మాత్రం, జగన్ పీకి పడేసారు. ఎన్ని బూతులు తిట్టినా, అందరిలో చులకన అయినా, అందరూ అసహ్యించుకున్నా, జగన్ కోసం ఎన్ని బూతులు తిట్టినా, చివరకు వీళ్ళని పీకి పక్కన పెట్టారు. మంత్రి పదవిలో ఉంటేనే ఎవరైనా విలువ ఇచ్చేది. ఇప్పుడు వచ్చి ఎంత మొరిగినా, వీళ్ళను మీడియా వాళ్ళు, ప్రజలు కూడా అసలు పట్టించుకోరు. మొత్తానికి జగన్ వాడకం, ఇలా ఉంటుంది అనేది మరోసారి స్పష్టం అయ్యింది. కుల కోణంలో ఇద్దరినీ వాడుకుని, ఇప్పుడు ఫుట్ బాల్ తన్నినట్టు, గ్రౌండ్ బయట పడేసారు. వీళ్ళు ఇప్పుడు మీడియా ముందు బిల్డ్ అప్ ఇస్తున్నా, వారికి తెలుసు ఏమి జరిగిందో, ఏమి జరగబోతుందో.