ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో తొమ్మిదేళ్లు సీఎం పని చేసిన సమయంలోనే దీనికి బీజం వేశారు. సిరిపురం జంక్షన్ లో గల హెచ్ఎస్బీసీని ఆయనే తీసుకువచ్చారు. ప్రస్తుతం వేయి మందికి పైగా అందులో పనిచేస్తున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఐటీ పార్కులో ఫిన్ టెక్ వ్యాలీని ఏర్పాటు చేశారు. వీసా మాస్టర్ కార్డు, పేటీఎం వంటి సంస్థల్ని రప్పించారు. విశాఖను నగదు రహిత లావాదేవీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

fed 26082018 2

తాజాగా విశాఖకు ఫెడరల్ బ్యాంక్ ను తీసుకువస్తున్నారు. ఈ బ్యాంకు విశాఖలో బ్యాక్ ఆఫీసు ఏర్పాటుచేసి 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఇటీవల విజయవాడలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫెడరల్ బ్యాంకుకు విశాఖపట్నంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు(డీటీపీ) పాలసీ కింద ఓ భవనం కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఫెడరల్ బ్యాంకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) కార్యదర్శి కొసరాజు శ్రీధర్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఇందులో ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నారు. నెలకు రూ.20 వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. రెండు నెలల్లో దీనికి సంబంధించిన పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

fed 26082018 3

వివిధ కార్యకలాపాల కోసం బ్యాంకులు ఐటీ రంగ పరిజ్ఞానాన్ని భారీగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసు కుంటుంటాయి. ఇవి 24 గంటలూ పని చేస్తాయి. ఇలాంటి కేంద్రాన్నే విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. తొలుత ఒక ప్రైవేటు భవనంలో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా ఆ సంస్థ శాశ్వత భవనాన్ని సమకూర్చుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు, ఐటీ కార్యకలాపాల కోసం బయట సంస్థల సేవలను వినియోగించుకుంటుండేవి. ఇటీవల కాలంలో సొంతంగానే ఐటీ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిని 'బ్యాక్ ఆఫీస్'గా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఫెడరల్ బ్యాంకు కూడా బ్యాక్ ఆఫీసను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంకు 1250కు పైగా బ్రాంచీలతో 81 లక్షల మందికి పైగా ఖాతాదారులతో రూ. వేల కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది.

ఉత్తరాంధ్రలో తెలుగుదేశం బలహీనంగా ఉందని, అందుకే పవన్, జగన్, ఉత్తరాంధ్ర పై ఎక్కువుగా ఫోకస్ చేసి, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరి పర్యటనలు, ప్రణాలికలు కూడా ఇలాగే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, దాదాపు 45 రోజులు (సెలవులతో కలుపుకుని) ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. అయితే గ్రౌండ్ జీరోలో మాత్రం, పరిస్థితి తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉంది. పవన్ అన్ని ప్రయత్నాలు చేసినా, విజయసాయి వైజాగ్ లో తిష్ట వేసి, ఉత్తరాంధ్ర జిల్లాల పై స్పెషల్ ఫోకస్ పెట్టినా, చెప్పుకోదగ్గ ఒక్క నాయకుడు కూడా, ఆ పార్టీల్లో చేరలేదు. అయితే, కాంగ్రెస్ హయంలో మంత్రిగా పని చేసిన, కోండ్రు మురళీమోహన్‌, తెలుగుదేశం పార్టీలో చేరటంతో, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం బలహీనం అనే మాటలు తిప్పికొట్టినట్టు అయ్యింది.

tdp 26082018 2

మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ తెదేపా తీర్థం పుచ్చుకునే అంశంపై గత కొద్ది రోజులుగా గుంభనంగా సాగుతున్న వ్యవహారాలు బయటకొచ్చాయి. రాజాం రాజకీయాలు వేడెక్కాయి. రాజాం తెదేపా ముఖ చిత్రం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోండ్రు మురళీమోహన్‌ తెదేపా తీర్థం పుచ్చుకోవటానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 31న ఉదయం తొమ్మిది గంటలకు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు కోండ్రు మురళీమోహన్‌ ఆ పార్టీని వీడి సైకిల్‌ ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు..

tdp 26082018 3

పార్టీలో ఆయన్ను చేర్చుకొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీంతో కోండ్రు అభిమానులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు, శ్రేణులతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ను వీడి తెదేపాలో ఎందుకు చేరాల్సి వస్తోందో ఈ సమావేశంలో వీరికి కోండ్రు స్వయంగా వివరించారు. తెదేపాలోకి తనతోపాటే అందరూ నడవాలని కోరారు. అమరావతిలో ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చేరాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు. 10 ఏసీ బస్సులు, 50 కార్లలో నాయకులు, శ్రేణులు అమరావతికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో, ఈ మధ్య కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్య స్వేఛ్చ ఎక్కువైపోయింది... ఇది వరకు చంద్రబాబు వైఖరితో, మాట మాట్లాడాలి అంటే హడలి పోయే తెలుగుదేశం నేతలు, ఈ మధ్య మారిన చంద్రబాబు వైఖరి చూసి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, పార్టీ పొత్తుల గురించి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడే దాకా వెళ్ళింది. గత వారం రోజులుగా, తెలంగాణా రాష్ట్రంలో, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి వార్తలు వస్తున్నాయి. దీని పై, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. అయితే, చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలను అర్థం చేసుకోకుండా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ఎలాగో, ఇప్పుడు మోడీ అలగాని, మోడీని దించాలి అంటే కొన్ని తప్పవని అంటున్నారు.

ttdp 26082018 2

అయితే, ఈ మంత్రుల వ్యాఖ్యల పై, తెలంగాణ టీడీపీ నేతలకు మనస్తాపం కలిగించాయి. తెలంగాణలో టిడిపి పార్టీ ఉనికి, పార్టీ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి వాక్‌ స్వాతంత్య్రం తమను ఇబ్బందికి గురి చేస్తోందని తెలంగాణా టీడీపీ నేతలు వాపోతున్నారు. ఈ అంశం పై పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తుల పై ఏపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు టీడీపీ-టీఎస్‌ నేతలను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తుకు అవకాశం లేదన్న కోణంలో వారు ప్రకటనలు చేశారు.

ttdp 26082018 3

దీంతో తెలంగాణా టీడీపీ నేతలు అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని, కినుకను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఎక్కడి రాజకీయ పరిస్ధితులు అక్కడ ఉన్నాయి. అక్కడ టీఆర్‌ఎస్‌ లేదు. ఇక్కడ వైసీపీ లేదు. బీజేపీకి టీడీపీ దూరమైంది. తెలంగాణలో మా అభిప్రాయాలకు అనుగుణంగా వ్యూహరచన ఉండాలని మేం కోరుకొంటున్నాం అని తెలంగాణా టీడీపీ నేత ఒకరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చిందని, ఆంధ్రాకు అన్యాయం చేసిందనే భావన ఉందని, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, తెలంగాణాలో మాత్రం, ఆ పార్టీ తెలంగాణా ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉందని, ఇప్పటికే 15 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి, పోరాడుతున్న పార్టీ, నిలదొక్కుకోవాలి అంటే, పొత్తులు తప్పవనే సంగతి, ఆంధ్రా నాయకులు అర్ధం చేసుకోవాలని అంటున్నారు. కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రాలో జీరో కాబట్టి, ఇక్కడ పొత్తు పెట్టుకున్నా, అక్కడ రాజకీయంగా ఏమి ఇబ్బంది ఉండదనే భావన, తెలంగాణా తెలుగుదేశం నాయకుల్లో ఉంది.

హైదరాబాద్ మీద మోజో, లేక కెసిఆర్ అంటే భయమో, కాని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సినిమా వాళ్ళు, ఏపి మీద కక్ష కట్టినట్టు ఉన్నారు. తెలంగాణాలో చీమ చిటుక్కు మంటే, పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి, బుడ్డ బుడ్డ హీరోల దాకా, కెసిఆర్ ని ఎత్తేస్తూ, ట్విట్టర్ లో కేటీఆర్ కు చేసిన భజన చూడలేము. మరీ అలాంటి బానిస బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నారో వారికే తెలియాలి. అయితే, సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ప్రదమైన సమస్య, చిన్న సినిమా మనుగడ కష్టమైపోతుందని, నలుగురి చేతిలో సినీ ఇండస్ట్రీని ఉంచుకుని, చిన్న సినిమాని తోక్కేస్తున్నారు అంటూ, చాలా రోజుల నుంచి మన వింటున్నాం. పెద్ద హీరోలు కూడా, ఇలాంటి ఉద్యమాలకి సపోర్ట్ చేసారు.

cinema 26082018 2

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న సినిమాలు తీసే వారికి అనేక రాయతీలు ప్రకటించింది. అటు చిన్న సినిమా బ్రతకటానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ నిలదొక్కుకోవటానికి, ఈ చర్య ఉపయోగపడుతుందని చంద్రబాబు భావన. అందుకే, రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.4 కోట్లు అంతకంటే తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18 శాతంలో రాష్ట్ర జీఎస్టీ 9 శాతం తొలగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా ఒక్కో సినిమాకు రూ. 10 లక్షల వరకు సబ్సిడీ దక్కనుంది. దీనికి, చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేయాలనే నిబంధన పెట్టారు.

cinema 26082018 3

ఈ నిర్ణయం ప్రకటించి దాదాపు వారం రోజులు అయ్యింది. నిజానికి, ఇది చిన్న సినిమాకు, ఇచ్చే పెద్ద ఊరట. అయితే, ఇన్ని రోజులు అయినా, ఒక్కరంటే ఒక్కరు, సినిమా ఇండస్ట్రీ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఈ విషయంలో కృతజ్ఞత చెప్పలేదు. నంది అవార్డులు ఇవ్వలేదు అంటూ, ఒకడి తరువాత ఒకరు వచ్చి, మన రాష్ట్రం పై ఎలా విషం చిమ్మరో చూసాం. తమ్మారెడ్డి అనే అతను కూడా, నేను ఓ పెద్ద పుడింగి అంటూ బిల్డ్ అప్ ఇస్తూ మన రాష్ట్రానికి నీతులు చెప్పే ఆయన కూడా అడ్రస్ లేదు. ట్విట్టర్ లో కేటీఆర్ కు భజన చేసే భజన బృందం కూడా అడ్రస్ లేదు. అంటే వీరికి, వారి సొంత సంస్థకు మేలు చేసే వార్తా అయినా, కేసీఆర్ అంటే భయంతో, కనీసం చంద్రబాబుకు కృతజ్ఞత చెప్పటానికి, ముందుకు రాలేక పోతున్నారు. ఈ ధోరణి ఎప్పటికి మారుతుందో, ఏంటో..

Advertisements

Latest Articles

Most Read