దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నిన్న, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో సీఆర్డీఏ బాండ్ల లిస్టింగ్ కార్యక్రమం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయేవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా చేసిన గర్జన సౌండ్ కి, ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది. తర తరాలుగా దేశ గర్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూన్న టాటాల వారసులు, అయిన రతన్ టాటా, చంద్రబాబును ఆప్యాయంగా చేయి పట్టుకొని స్వయంగా తీసుకువెళ్తు, గౌరవంగా బాబు నమస్కరిస్తూ వస్తున్న ఫోటో చూసి, ఢిల్లీలో చాలా మందికి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఈ మధ్య మోడీ గారిని ఎవరూ అడగకపోయినా, తడుముకొంటూ, “కార్పోరేట్ అధినేతల ప్రక్కన నిలుచోడానికి మాకు భయంలేదు, చీకట్లో కలిసి వాళ్లకు కావాల్సింది చేసి, భయపడము” అని అన్నారు.

cbn 28082018 2

ఆ మాటలు ప్రధాని ఎందుకు అన్నారో కాని, అమరావతి బాండ్ లు బాంబే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసే సమయంలో, బాబు ఆ బుల్ కొమ్ములను వంచుతున్నట్టు సరదాగా దిగిన ఫోటో చూసి, మనకి ఏమన్నా సంకేతాలు ఇస్తున్నాడా అనేలా ఢిల్లీ వర్గాలు కంగారు పడేలా సాగింది చంద్రబాబు పర్యటన. చంద్రబాబు సింహ గర్జన చూస్తే, హిట్ సినిమాల్లో హీరో ఫ్లాష్ బ్యాగ్ లు గుర్తుకువస్తున్నాయి. ఆయన ముంబైలో అడుగు పెట్టిన దగ్గర నుంచి, కార్పొరేట్ ప్రపంచం ఆయనకు ఇచ్చిన మర్యాద చూస్తుంటే, ఇది జస్ట్ ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు దగ్గర ఆగేలా లేదు, ఇంకా వేరే సంకేతాలు కూడా ఢిల్లీ వర్గాలకు వెళ్ళాయి. ఆ రీసౌండ్ మాములుగా లేదు అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.

cbn 280820183

బంతిని వేసి నేలకేసి కొట్టాం అనుకుంటారు. కాని ఆ బంతి, తిరిగి ఎంత వేగంగా పైకి వెళ్తుందో తరువాత తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు ప్రాక్టికల్ గా కనపడుతుంది. అమరావతి అని, అభివృద్ధి అని, ఆయన పిచ్చలో ఆయన ఉన్నారు. ఆయనకు సహకరిస్తే, అయిపోయే దానికి, ఎదురు తిరిగి, ఇంత వరకు తెచ్చుకున్నారు. 85 మంది అగ్ర పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ పెట్టారు. అదీ ఒక్క రోజులోనే. రిలయన్స్ గ్రూప్ అధినేత, టాటా గ్రూప్ చైర్మన్, గోద్రేజ్ గ్రూప్ చైర్మన్, మహేంద్ర గ్రూప్, ఆదిత్య గ్రూప్ చైర్మన్, రహేజా గ్రూప్ అధ్యక్షుడు, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, ఇలా అనేక మంది దిగ్గజాలను కలిసారు. ఇలా కార్పొరేట్ ప్రపంచం మొత్తం, ఒక సియం ముందు వాలింది అంటే, ఇది ఆషామాషీగా, సాదాసీదాగా జరిగిన వ్యవహారం కాదు. ఢిల్లీ వర్గాలకు, నిన్న జరిగింది ఏంటో బాగా తెలుసు.

cbn 28082018 4

ముంబైలో పర్యటిస్తున్న చంద్రబాబు, రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి సింగపూర్ కి అంతర్జాతీయ విమాన సర్వీసులు అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానున్నదని ముఖ్యమంత్రి వెల్లడించారు. ముంబైలోని పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైలో టాటా ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. టాటా గ్రూప్ సామజిక పరంగా చేపట్టిన మహిళా సాధికారత వంటి కార్యక్రమాల పై ప్రాజెక్టులను టాటా అధికారులు వివరించారు.

mumbai 27082018 2

ఆంధ్రప్రదేశ్ లో హోటల్, పర్యాటక శాఖ, ఎలక్ట్రికల్ బస్సు రవాణా వంటి రంగాల్లో భాగస్వామ్యం కావలసిందిగా ముఖ్యమంత్రి టాటా గ్రూప్ ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో మంచి అవకాశాలున్నాయని ఆ దిశగా తాము ప్రతిపాదనలతో ముందుకు వస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డబ్ల్యూ.ఈ.ఎల్.ఎస్.పి.యూ.ఎన్ గ్రూపు చైర్మన్ బాలకృష్ణ గోయెంకా తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సేంద్రియ పత్తి సాగు లో ఆంధ్రప్రదేశ్ తో ఉమ్మడి గా పని చేయడానికి ఆయన ముఖ్యమంత్రి కి తన ఆసక్తి ని వ్యక్తం చేసారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా 33 శాతం అధిక ఆదాయం పొందేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గోయెంకా వివరించారు. దీనిపై ప్రతిపాదనలతో రావలసిందిగా ముఖ్యమంత్రి సూచించారు.

mumbai 27082018 3

"ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ కేంద్రాంనొకదానిని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ఈ అధికారులను కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్ అని దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రియల్ టైం గవెర్నెన్స్ రాష్ట్ర పాలన లో ఒక కీలక భూమిక పోషిస్తోందని, సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ-ఆఫిస్, కంటెంట్ కార్పొరేషన్ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.

ఢిల్లీలో ఆధర్ కార్డు, యూపిలో ఓటర్ కార్డు ఉంటూ, ఆంధ్రా పై విషం చిమ్మే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మళ్ళీ పెలాడు. నిజానికి రెండు రోజుల క్రితమే ఈయన ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉన్నా, మొన్న శుక్రవారం నాడు కార్ తో, ఇద్దరిని గుద్ది, ఒకరిని చంపేసిన సంగతి తెలిసిందే. గాయాలు పాలైన మహిళను హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లకుండా, అక్కడ నుంచి పారిపోవటంతో, పెద్ద ఎత్తన విమర్శలు వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా, ఈ విషయం రచ్చ అవటంతో, రెండు రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన జీవీఎల్ , ఈ రోజు బయటకు వచ్చారు. వస్తూ వస్తూనే, చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు జీవీఎల్.

gvl 27082018 2

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో లాస్ట్‌లో ఉందన్నారు. అవినీతిలో మాత్రం నెంబర్ వన్‌లో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేదని దుయ్యబట్టారు. టీడీపీ ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని వెక్కిరిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తేవడం తప్పుకాదన్నారు. కానీ ఏపీలో అలా జరగడం లేదని వ్యాఖ్యానించారు. నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు.

gvl 27082018 3

ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం లెక్కలు చెప్పేందుకు‌ భయపడుతున్నారని విమర్శించారు. అమరావతిలో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా నిధులను పార్టీ ఫండ్‌లోకి మళ్లిస్తున్నారనే అనుమానం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. అయితే వీటి అన్నిటి పై, ఎప్పటికప్పుడు కుటుంబరావు లెఫ్ట్ అండ్ రైట్ వాయించినా, ఈ జీవీఎల్ మాత్రం తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబరావు గారు వాయించాగానే, ఆ టాపిక్ వదిలేసి, మళ్ళీ వేరే టాపిక్ తో వచ్చి, ఆరోపణలు చేసి పారిపోతారు. మొన్న ఆక్సిడెంట్ చేసి ఎలా హిట్ అండ్ రన్ చేసారో, ఇక్కడ కూడా ఆరోపణలు చెయ్యటం, పారిపోవటం, ఈయనకు బాగా అలవాటు.

‘మీరు పెట్రోల్‌ బంకుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందే. కేంద్ర పథకాలను ప్రచారం చేయాల్సిందే. లేదంటే మీకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా ఉండదు’ అంటూ చమురు సంస్థలు చేస్తున్న హెచ్చరికలపై పెట్రోల్‌ డీలర్ల అసోసియేషన్లు మండిపడుతున్నాయి. అధికారులు బెదిరిస్తున్నారని భారత పెట్రోల్‌ డీలర్ల కన్సార్టియం అధ్యక్షుడు ఎస్‌.ఎ్‌స.గోగి వాపోయారు. ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలు ప్రతి డీలర్‌కు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాయని వివరించారు. అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని ఐఓసీఎల్‌ అధికారి తెలిపారు. ‘ప్రధాని ఫొటో పెట్టాలని అడగలేదు. కేవలం చమురు సంస్థలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ప్రచార ప్రకటనలను బంకుల్లో పెట్టాలని సూచించాం. వాటిలో ప్రధాని ఫొటో ఉండడం సాధారణమే’ అని వివరించారు.

petrol 27082018 2

మరో పక్క, ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు, పెట్రోల్ డీలర్లకు మధ్య మరో వివాదం తలెత్తింది. తమ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కులం, మతం, నియోజకవర్గం వివరాలను వెంటనే సమర్పించాలని ఆయిల్ సంస్థలు ఆదేశించిడమే దీనికి కారణం. అయితే ఉద్యోగుల వివరాలు వెల్లడించడం వ్యక్తిగత గోప్యతకు భంగమని చెప్పిన డీలర్ల యూనియన్.. ఏఒక్కరి వివరాలను ఇవ్వబోమని ప్రకటించింది. పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని జూన్ 11నే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) , పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కు లేఖ రాశాయి. దీనిపై మండిపడ్డ డీలర్లు తమ ఉద్యోగుల వివరాలను ఇవ్వబోమని ప్రకటించారు.

petrol 27082018 3

దీంతో హరియాణాలో కొందరు డీలర్లకు పెట్రోల్, డీజిల్ సరఫరాను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పెట్రోల్ డీలర్లు మండిపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల వివరణ మాత్రం ఇంకోరకంగా ఉంది. పెట్రోల్ ఔట్ లెట్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ పథకం కింద ట్రైనింగ్ ఇచ్చేందుకే 24 అంశాల్లో సమాచారం కోరామని కంపెనీలు తెలిపాయి. కానీ డీలర్ల సంఘాలు మాత్రం తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించలేదని వ్యాఖ్యానించాయి.

Advertisements

Latest Articles

Most Read