రైళ్ళు తగలబెట్టటం, పైపులు కొయ్యటం, పంటలు నాశనం చెయ్యటం చూసాం. మొన్నటికి మొన్న, వీరు చేసే అక్రమాలు పోలీస్ లకు చెప్పటానికి వెళ్తుంటే, కార్ తో గుద్ది, ముగ్గురిని చంపేసారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో రౌడీ పార్టీ తీరు. ఐఏఎస్ , ఐపిఎస్ లకు వార్నింగ్లు చూసాం, సియం అయిన గంటలో చంపేస్తా అని చెప్పింది చూసాం, మీడియాని బెదిరించటం చూసాం. ఇప్పుడు ఏకంగా, గ్రామంలో ప్రజలను చంపటానికి, ఏకంగా వాటర్ ట్యాంక్ లోనే విషం కలిపాడు వైసిపీ నాయకుడు. పైగా అతడు మాజీ సర్పంచ్. ఈ రౌడీ పార్టీ నాయకులు కక్ష కడితే, ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఉదాహరణ.. వీరి క్రూరత్వం ఇలా ఉంటుంది మరి. వివరాలు ఇలా ఉన్నాయి.

ycp 23082018 2

నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో కలకలం రేగింది. గ్రామ వాటర్ ట్యాంక్‌లో మాజీ సర్పంచ్ శ్రీను విషం కలిపాడు. అయితే విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు హుటాహుటిన నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నిందుతుడు శ్రీను పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన నలుగురు యువకులు వాటర్ ట్యాంకుపై కూర్చుండటాన్ని సహిoచక ఆగ్రహంతో శ్రీను విషం కలిపాడని యువకులు చెబుతున్నారు. నిందుతుడు శ్రీను వైసీపీకి చెందిన నాయకుడని అంటున్నారు.

ycp 23082018 3

ఈ ఘటన తెలియటంతో, హుటాహుటిన నీటి సరఫరాను గ్రామస్తులు నిలిపివేశారు. అయితే, శ్రీను విషం పోస్తూ ఉండగా, అక్కడ యువకులు కొంత మంది, అది వీడియో తీసారు. ఇది కూడా పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తుంది. పారారైన నిందుతుడు శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయ విద్వేషాలు చెలరేగాయి. ఎన్ని కక్షలు ఉన్నా, ఇలా చెయ్యటం ఏంటి అంటూ, అందరూ ఆశ్చర్య పోయారు. ఒకవేళ ఎవరూ గమనించ కుండా ఉంటే, కొన్ని వందల మంది చనిపోయేవారని, రాజకీయం చెయ్యటం కోసం, ఇలాంటి పనులు చెయ్యటం దారుణం అని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల గవర్నరు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి విజయవాడలోని ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు.. అదీ ఎన్‌డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక తొలిసారి వీరిద్దరి మధ్య ఈ భేటీ జరగడం గమనార్హం. చాలా రోజుల తర్వాత జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పాలనా వ్యవహారాలు, వర్షాల ప్రభావం తదితర పలు అంశాలు చర్చకు వచ్చాయి. గవర్నరు రాష్ట్ర పర్యటనకు వచ్చి విజయవాడలోని హోటల్‌లో బస చేశారు.

cbn 23082018

దీంతో ముఖ్యమంత్రి వెళ్లి ఆయనను కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ ముఖాముఖి సమావేశమయ్యారు. సమావేశం తరువాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్లా. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై వివరించా. కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందీ తెలియజేశా. వరదలవల్ల గోదావరి జిల్లాలకు జరిగిన నష్టాన్ని, విహంగ వీక్షణంలో నేను పరిశీలించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలవల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని, పంట నష్టంపై త్వరలో కేంద్రానికి నివేదిక పంపిస్తామని చెప్పా. కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరా. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం చర్చకు రాలేదు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

cbn 23082018

వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, మైనారిటీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో... ఆ విషయమూ గవర్నరుతో జరిగిన సమావేశంలో కచ్చితంగా చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం పంచాయితీలపైనా గవర్నర్ నరసింహాన్‌తో చంద్రబాబు చర్చించారు. మరో పక్క, బీజేపీతో జరుగుతున్న పోరాటం పై కూడా, గవర్నర్ కు స్పష్టం చేసారు. తమ రాజకీయ వ్యూహాలు, వైఖరిలో ఎలాంటి రహస్యం ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ నరసింహన్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా కేంద్రంపైనా, బీజేపీపైనా తమ పోరాటం ఆగదని చెప్పినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో నరసింహన్‌తో చంద్రబాబు ఇంతసేపు ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలోని 45 గ్రామాలకు వరద తాకిడి ఎక్కువగా ఉందని, బాధితుల కోసం 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ వల్ల ఎక్కువ నష్టం జరిగింది. కాజ్‌వేల పునర్నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నాం. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రెండు జిల్లాల్లో కలిపి రూ.600 కోట్ల నష్టం జరిగింది. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తాం. హెక్టారుకు రూ.25వేలు చొప్పున నష్టపరిహారం అందిస్తాం.

cbn 22082018 4

ఎర్రకాలువ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఆర్‌.అండ్‌.బి రహదారులకు రూ.35 కోట్లు కేటాయిస్తాం. రాయలసీమలో కరవు ఉంది… కోస్తాలో వరదలు వచ్చాయి. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో కరవు ఉంది. గోదావరి నుంచి 1500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. పోలవరం పనులు 57.5శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పోలవరం కోసం కేంద్రం నుంచి రూ.2,600 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నా అభ్యంతరం లేదు. రాష్ట్రంలో 57 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టాం.. 16 పూర్తయ్యాయి’’ అని చంద్రబాబు వెల్లడించారు.

ఓ మంచి నాయకుడైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకు వెళుతోందని యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. అమరావతిలో యోగా గురువుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అభిమానులు, తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు బయట మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు మంచి మిత్రుడని, ఆయనతో ప్రేమ పూర్వక సంబంధాలున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యమూ శ్రమించే చంద్రబాబంటే తనకెంతో ఇష్టమని పొగడ్తల వర్షం కురిపించారు.

ram 22082018 2

చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, కొత్త రాష్ట్రమైన ఏఫీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీకి ప్రత్యేకహోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చాలని కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అంటూ, మోడీకి చురకలు అంటించారు. పతంజలి సంస్థ తరపున కేరళ వరద బాధితుల కోసం రూ.2 కోట్ల విలువ చేసే సరుకులు పంపినట్టు చెప్పారు. రాజకీయాల గురించి బాబా మాట్లాడుతూ, తాను క్రియాశీల రాజకీయాల్లో లేనని, 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని అన్నారు.

ram 22082018 3

యోగా గురువులకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. పతంజలి సంస్థ తరఫున, వచ్చే రెండు నెలల కాలంలో దేశంలో 20 వేల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపనున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఏపీలో 1000 ఉద్యోగాలు ఉంటాయని రాందేవ్ బాబా చెప్పారు. నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని దేశం నుంచి పారద్రోలాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. కింభో యాప్, వాట్స్ యాప్ ను అధిగమిస్తుందని, త్వరలో పతంజలి సిమ్ కార్డులనూ విడుదల చేస్తామని అన్నారు. మరో పక్క పతంజలి గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read