ఈ దేశంలోనే కాదు,బహుసా ఈ ప్రపంచంలోనే ఇలాంటి ప్రతిపక్షం ఉండదేమో. రెండేళ్ళ నుంచి అసెంబ్లీ మొఖం చూడలేదు, ఆరు నెలల నుంచి పార్లమెంట్ కు వెళ్ళలేదు. వీళ్ళు మన ప్రతిపక్షం. వీళ్ళు ప్రజల సమస్యల తరుపున పోరాడేది. ఏది అడిగినా, నేను ముఖ్యమంత్రి అయిన తరువాతే అని చెప్పే వాడు, మన ప్రతిపక్ష నాయకుడు. ఇవన్నీ జరుగుతూ ఉండాగానే, ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

cbn 22082018 2

ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ హాజరుకావాలని స్పీకర్, జగన్‌ను కోరే అవకాశం ఉంది. అయితే సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జగన్ మాత్రం ఈ సారి కూడా ససేమీరా అంటున్నట్టు సమాచారం. జగన్ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి, ఎవరూ అసెంబ్లీకి వెళ్ళద్దు అంటూ, వైసీపీ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మల్యేలకు ఆదేశాలు జారీ చేసేంది... కీలకమైన ఎన్నికల సంవత్సరంలో జరిగే సమావేశాలు అయినా వెళ్ళద్దు అని చెప్పేశారు... అయితే, పజ్రల తరుపున పోరాడాల్సిన ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటే విమర్శలు వస్తున్న తరుణంలో, వైసీపీ ఎమ్మల్యేలు ప్రజా వ్యతిరేకత వస్తుంది అనే భయంలో ఉన్నారు...

cbn 22082018 3

అయితే కొంత మంది ఎమ్మల్యేలు, విజయసాయి రెడ్డి దగ్గరకు వెళ్లి, జగన్ నిర్ణయం మార్చుకోమని వేడుకున్నారు... అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని వారు విజయసాయిని ప్రశ్నించారు...దానికి విజయసాయి వారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు... జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, అది శాసనం అని మీకు తెలియదా ? కొత్తగా ఇలా వచ్చి నన్ను అడుగుతారేంటి ? అయినా ఇలాంటి వాటితో మనకి పని లేదు... అసెంబ్లీకి వెళ్ళినా, మిమ్మల్ని చంద్రబాబు ఆడుకుంటారు... అయినా ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు.. మనం అధికారంలోకి వస్తున్నాం.. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం... అన్నీ అనుకూలిస్తే, నేను కేంద్ర మంత్రిని అవుతాను... మీలో కూడా మంత్రులు అవ్వచ్చు... భయాలు పెట్టుకోవద్దు.... జగన్ ను నమ్ముకోంది, అని వారిని తిప్పి పంపించి వేసారు...

"విజయమ్మను ఓడించిన వైజాగ్"... ఇది కరెక్ట్ మాట... ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి తల్లిగా, ఆమె చిత్తు చిత్తుగా ఓడిపోయారు. 2014లో జగన్ వైపు ఉన్న సెంటిమెంట్ కి కూడా లొంగకుండా, వైజాగ్ అంతా కలిసి, విజయమ్మను ఓడించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ఒక నెల ముందు, కడప నుంచి ఒక బ్యాచ్ ని దింపాడు జగన్. అక్కడ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసారు. మాకు ఓటు వెయ్యకపోతే, మిమ్మల్ని చంపేస్తాం అన్నంతగా బెదిరించారు. దీని ఫలితమే, ఈ ఫ్యాక్షన్ మూక మాకు వద్దు అంటూ, వైజాగ్, విజయమ్మను తిరస్కరించింది. అంతకు ముందు, రాజశేఖర్ రెడ్డి హయంలో, వైజాగ్ లో చేసిన కుంభకోణాలు కూడా ప్రజలకు గుర్తు ఉన్నాయి.

jagan 22082018 2

అయితే, ఇప్పుడు ఈ సీన్ మార్చేయటానికి, జగన్ రంగంలోకి దిగారు. 2019లో ఎలా అయినా వైజాగ్ అంతా గెలిచి, ఉత్తరంద్రలో బలం పెంచుకోవటానికి చూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 35 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఒక్కో జిల్లాలో మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గత ఎన్నికల్లో తీవ్రంగా నిరాశపర్చిన ఉత్తరాంధ్రలో సత్తాచాటాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే పాదయాత్ర విశాఖలోకి ప్రవేశించగానే చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని, జిల్లాపై మూడేళ్లుగా విజయ్‌సాయిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

jagan 22082018 3

పాదయాత్రలు, ప్రత్యేక హోదా ఆందోళనలు, జోనల్ పోరాటాలంటూ హాడావిడి చేస్తున్నారు. అటు విజయనగరంలోనూ బొత్స సత్యనారాయణ కుటుంబం పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. జనసేన ఎలాంటి ప్రభావం చూపుతోందా అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. అయితే ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్న ఉత్తారాంధ్ర తిరిగి టీడీపీ సత్తాచాటడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. లాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గేర్ మార్చి సత్తాచాటాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబుపై మాటలతో విరుచుకుపడుతున్నారు. ఆయన మైనింగ్ డాన్ అంటూ ఐదు పెళ్లిళ్లు అంటూ జగన్ హడావిడి చేస్తున్నారు.

వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మూడు లారీల్లో 51 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) పంపించారు. మంగళవారం రాత్రి సచివాలయం బ్లాక్ వన్ ముందు లారీలకు పచ్చజెండా ఊపి లారీలను పంపించారు. ఇవి కాకుండా మరో 8 లారీల్లో 204 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాత్రికే కేరళకు బయలుదేరుతున్నాయి. రూ.6 కోట్ల విలువైన 255 మెట్రిక్ టన్నుల బియ్యం పంపించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తరఫున ఈ బియ్యం కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించారు. కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి బియ్యం రవాణా చేసి అక్కడ దిగుమతి చేసి ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, డిఎస్ఓ జె.నాగేశ్వరరావు తెలిపారు.

kerala 21082018 2

ప్రకృతి వైపరీత్యం కారణంగా దెబ్బతిన్న కేరళకు రాష్ట్రం నుంచి 50 కోట్ల రూపాయల సహాయం అందనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇప్పటికే 10 కోట్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటిచండం జరిగిందనీ, మరో 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీఎన్జీవోస్‌, పెన్షనర్లు నుంచి ఒక్క రోజు జీతం కింద 24 కోట్లు, పోలీసు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 7 కోట్లు ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకొచ్చాయన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి నెల బేసిక్‌ వేతనం సుమారు 38 లక్షలు, ఎంపీ లాడ్స్‌ కింద 2.10 కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం వివరించారు.

kerala 21082018 3

రాష్ట్రం నుంచి 6 కోట్ల విలువచేసే బియ్యాన్ని కేరళకు పంపనున్నట్లు తెలిపారు. కేరళలో జరిగిన నష్టం జాతీయ విపత్తు లాంటిదని, ఎవరికి తోచిన విధంగా వారు మానవత్వంతో సహాయాన్ని అందించాలన్నారు. చేసిన సహాయం చెప్పడం సరికాకపోయినా పదిమందికి స్పూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే చెబుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా కేరళకు హితోదిక సాయాన్ని అందజేస్తున్నారన్నారు. చిత్తూరు, కృష్ణా, ప్రకారం, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి బియ్యం, దుప్పట్లు, నిత్యావసర సరుకులను ఇప్పటికే కేరళ రాష్ట్రానికి ఆయా జిల్లాల్లోని స్వచ్ఛంధ సేవా సంస్థలు, అసోసియేషన్లు పంపడం జరిగిందన్నారు. కేరళలో వర్ష బీభత్స కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సేవలందించేందు కు రాష్ట్రం నుంచి విద్యుత్‌, అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లాయన్నారు.

తెలుగు ప్రజలందరికీ సుపరచితమైన టీవీ9 న్యూస్ ఛానల్, బడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్తుంది అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ రోజు అన్ని పత్రికల్లో ఈ వార్త రావటంతో, ఇది నిజమే అని తేలిపోయింది. మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు, టీవీ9 ని కొనుగులు చేసింది అంటూ వార్తలు వచ్చయి. మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కాంట్రాక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ లు, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్న సంస్థ. ప్రస్తుతం టీవీ9 శ్రీని రాజు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు టీవీ9 ని,మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు కొనుగోలు చేసిందని, 500 కోట్లకు డీల్ జరిగినట్టు, ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి.

megha 22082018 2

దీనిపై గత కొంతకాలంగా సాగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయంగా తెలిసింది. టీవీ9 కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ ఛానళ్లు ఉన్నాయి. ఈ ఛానల్‌ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీలో పారిశ్రామికవేత్త, వెంచర్‌ కేపిటలిస్ట్‌ అయిన శ్రీనిరాజుకు చెందిన వివిధ సంస్థలకు మెజార్టీ వాటా ఉంది. దీన్ని కొనుగోలు చేయటానికి గత కొంతకాలంగా పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు, వాటితో చర్చలు సాగినట్లు సమాచారం. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.

megha 22082018 3

ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపుతో విక్రయ ఒప్పందం ఖరారు కానుందని అంటున్నారు. ఈ లావాదేవీ విలువ, ఇతర వివరాలు వెల్లడి కావటం లేదు. 2004లో టీవీ 9 ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి, తెలుగులో, అధిక టీఆర్పీ రేటింగ్స్ తో ముందు ఉంటుంది. ఈ మధ్య మరీ వివాదాస్పద ప్రోగ్రాంలు వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పవన్ కళ్యాణ్ అయితే, డైరెక్ట్ గా టీవీ9 యాజమాన్యం పై ట్వీట్లు వేసారు. ఇలా అనేక వివాదాలు నడుమ, ఇప్పుడు టీవీ9 చేతులు మారుతుంది. మరో విశేషం ఏమి అంటే, మేఘ గ్రూప్ లో, కెసిఆర్ సన్నిహితుడు, మై హోం గ్రూప్ అధినేత, జూపల్లి రామేశ్వర రావు కూడా భాగస్వామ్యుడు. అంటే, ఇప్పుడు చేతులు మారినా, మన ఆంధ్రా వైపు మొగ్గే అవకాసం లేదు. ఇప్ప్పటి లాగే, తెలంగాణా భజన చేస్తూ, ఆంధ్రా పై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తారేమో మరి. చూద్దాం...

Advertisements

Latest Articles

Most Read