‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , బెస్ట్ సీఎం ర్యాంకింగ్స్ ప్రకటించారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు 10 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 5 శాతంతో ఇద్దరు ఐదో స్థానంలో ఉన్నారు.

indiatoday 200082018 2

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 4 శాతంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 4శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ కూడా ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రం ఒడిశాలో ఆయన పాపులారిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి 3 శాతం, అసోం సీఎం శరబానంద సోనోవాల్ 3 శాతం, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 2 శాతం, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ 2 శాతం, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ 2 శాతం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2 శాతం, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ 2 శాతంతో ఉన్నారు.

indiatoday 200082018 3

‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో , లోక్‌సభలో కమలం పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేలింది. మిత్రులపై ఆధారపడితే... అది కూడా అరకొర మెజారిటీతో మాత్రమే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెబుతోంది. దీని ప్రకారం... బీజేపీ సొంతంగా 245 స్థానాలు మాత్రం గెలిచే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న ఇతర పార్టీలన్నీ కలిసి 36 స్థానాల్లో గెలవొచ్చు. వెరసి... 281 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు లభిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 281కి పడిపోవడం గమనార్హం. అదే సమయంలో... యూపీఏ, ఇతరుల బలం పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించడం ఆనవాయితీ. ఏటా విద్యాశాఖ విషయ నిపుణులతో చర్చించి పలు మార్పులను తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆధునిక విద్యావిధానానికి అనుగుణంగా ఉండేలా పాఠ్యపుస్తకాలను ఎంతో సుందరంగా, చిత్రాలతో వివరణలు అందించడమే కాకుండా ప్రస్తుతం ఆయా అంశాలకు సంబంధించిన లోతైన విశ్లేషణను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పాఠ్యపుస్తకాలలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలకు 'క్యూఆర్‌ కోడ్‌'ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల సంబంధిత పుస్తకాలను చిన్నారులకు పంపిణీ చేశారు. దీనిలోభాగంగా పుసక్తం ప్రతి పేజీలోనూ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారు.

diksha 20082018 2

పాఠ్యపుస్తకాలపై, పాఠ్యాంశాల స్థానంలో దీనిని ప్రవేశపెట్టడంతో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో సాధారణ విద్యార్థులు సైతం సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ఒకమంచి అవకాశాన్ని కల్పించడం హర్షణీయం. ఆరు నుంచి పదో తరగతి వరకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో ప్రయోగాత్మకంగా క్యూఆర్‌కోడ్‌ను ముద్రించింది. యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల బరువును తగ్గించడానికి అనువైన రీతిలో ఆయా అంశాల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించడంతో ఆ విషయానికి సంబంధించి సమగ్రమైన సమాచారం అంతర్జాలంలో వీక్షించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

diksha 20082018 3

ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా ప్లేస్టోర్‌ ద్వారా దీక్షా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆయా అంశం వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని వీడియో, మొబైల్, ప్రొజెక్టర్ల ద్వారా వీక్షించడానికి దోహదపడుతుంది. దీక్ష యాప్‌ను పొందుపర్చిన మొబైల్‌ ఫోనుతో ఆ కోడ్‌ను స్కాన్‌ చేసినప్పుడు.. నేరుగా యూట్యూబ్‌కు అనుసంధానమవుతుంది. అనంతరం విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో విషయ నిపుణులు విశ్లేషణాత్మకంగా బోధిస్తూ రూపొందించిన పాఠాలు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కంప్యూటర్ల రూపకల్పన, వర్చువల్‌ తరగతులు, డిజిటల్‌ తరగతులను నిర్వహించడానికి కావలసిన సదుపాయాలను కల్పించడం, అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలు వంటి అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఈ తరుణంలో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఇక్కడి విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం.

2009 ఎన్నికల్లో ఆమె ఒక సంచలనంగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవిలకు వచ్చినంత పేరు అప్పట్లో ఈమెకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా, ఆమె చిరంజీవి లాంటి నేతను ఓడించింది. అప్పట్లో పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిని ఓడించి ముఖ్యమంత్రి అయిపోతారా అనేంత, హైప్ ఉండేది. చివరకు అది గాలి బుడగ అని తేలిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే, చిరంజీవి లాంటి నేతను, గోదావరి జిల్లాల్లో ఓడించటం అనేది, మామూలు విషయం కాదు. ఆమె పేరే, బంగారు ఉషారాణి... 2009 ఎన్నికల్లో, పాలకొల్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, చిరంజీవి పై గెలిచారు.

usha 20082018 2

అప్పట్లో జెయింట్ కిల్లర్ అంటూ కూడా ఈమెను అభివర్ణించారు కొందరు. 2014లో ఓడిపోయిన తర్వాత ఈమె మళ్ళి రాజకీయాల్లో కనపడలేదు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఉషారాణి ఏ పార్టీలో చేరతారు అనేది కూడా ఎవరికి స్పష్టత లేదు. ఆమె కూడా ఈ విషయంలో తటస్థంగానే ఉన్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉషారాణి భావిస్తున్నారట. ఈ విషయంపై కొందరు తెలుగుదేశం నాయకులు కూడా ఆమెను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

usha 20082018 3

పవన్ కళ్యాణ్ కనుక, గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తే, ఈమెను పవన్ కళ్యాణ్ పై పోటీకి నిలిపే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. టిడిపి నుంచి ప్రపోజల్ వచ్చిందో లేక...తనంతట తానుగా ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారో తెలియదు కానీ ఆమె అయితే తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అక్కడి నేతలు గట్టిగా చెబుతున్నారు. పవన్ పై పోటీకి దింపితే, చిరంజీవిని ఓడించిన మహిళగా, పవన్ పై ఒత్తిడి పెంచే అవకాసం ఉంటుందని భావిస్తున్నారు. సహజంగా, పెద్ద స్థాయి నాయకులు, ఒకే స్థానం నుంచి పోటీ చేస్తారు. కాని చిరంజీవి మాత్రం, రెండు స్థానాల నుంచి పోటీ చేసి, ఒకదాంట్లో ఓడిపోయారు. మరి పవన్ కళ్యాణ్ కూడా, రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి, ఈమె రీ ఎంట్ర్రీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఎవరైనా ఈ రోజుల్లో డబ్బుతో రాజకీయం చెయ్యటం సహజం. ఇంకా చెప్పాలి అంటే డబ్బు ఉన్నాడికే టికెట్లు ఇచ్చే పరిస్థితి. ఇందులో ప్రజల దగ్గర నుంచి రాజకీయ పార్టీల దాకా అందరికీ బాధ్యత ఉంది. అయితే, నేను డబ్బు ఇచ్చాను అంటూ, ఏకంగా ఆ పార్టీనే బ్లాకు మెయిల్ చెయ్యటం ఎప్పుడూ చూడలేదు. అదీ జగన్ లాంటి నేతలను బెదిరించటం అంటే, ఆశ్చర్యం కలగక మానదు. వైసీపీ అధినేత జగన్‌ విశాఖ జిల్లాలో పర్యటిస్తుండగానే... అదే జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ‘సోషల్‌ మీడియా’ వేదికగా రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

jagan 200082108 2ఇందులో భాగంగా ఆదివారం ఎలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గం మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత మైకు తీసుకున్న కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్‌ను జగన్‌కు ఇచ్చాను. ఇక్కడ ఎవరు ఎటువంటివారో నాకు తెలుసు. ఎవ్వరి మాటా లెక్కచేయను. ఎవరెన్ని చెప్పినా నా స్టైల్‌ మారదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.

jagan 200082108 3రెండు రోజుల క్రితం విజయసాయి సమక్షంలో ఇలాంటి గొడవే జరిగింది. విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో సీనియారిటీపై తంగేడు రాజులకు, మండల పార్టీ అధ్యక్షుడికి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సభలో జరిగిన గొడవను విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయగా...విజయసాయిరెడ్డి వెనుక ఉన్న కొంతమంది సభ్యులు సెల్‌ను లాక్కొని ఫొటోలను దౌర్జన్యంగా తొలగించారు. దీని పై విలేకరులు భగ్గు మంటున్నారు. విజయసాయిరెడ్డి ఉండగానే, ఇంత జరిగినా, ఆయన ఏమాత్రం వాళ్ళని ఆపలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సమక్షంలో , మీడియా పై దాడి చేసి, ఫూటేజ్ ధ్వంసం చేస్తే, కనీసం విజయసాయి వాళ్ళని ఆపలేదని విలేకరులు బాధపడుతున్నారు. దీని పై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read