అమరావతి బాండ్ల మీద అసూయాపరుల, అభాండాలు ఇది పూర్తిగా చదవండి. అమరావతి బాండ్ల పై వైసీపీ, జనసేన దుష్ప్రచారం... వాటికి సమాధానాలు ఇచ్చిన సోషల్ మీడియా పోస్ట్...
ఆరోపణ: బాండ్ల పేరుతో భారీ దోపిడీ - శాశ్వతంగా అప్పుల ఊబిలోకి రాష్ట్రం !దయచేసి పూర్తిగా చదివి కుటుంబరావు మాయాజాలాన్ని అర్థం చేసుకొని పది మందికి తెలియచేయండి బాండ్లు జారీ చేసి డబ్బు సేకరించటం అంటే ఏమిటి ? ఇది అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే మనకున్నది ఏదైనా తాకట్టు పెట్టి అధిక వడ్డీకి అప్పులు తేవటం.
వాస్తవం: ఏమంటున్నారంటే... 'బాండ్లు జారీ చేయడం అంటే ఏదైనా తాకట్టు పెట్టి అధిక వడ్డీకి అప్పులు తేవటం' అని అంటున్నారు. బాండ్లు జారీ చేసి ప్రభుత్వం ఏం తాకట్టు పెట్టిందో వీళ్ళు చెప్పాలి. నిజానికి ఒక్క ఎకరం కూడా ఎవరికీ తాకట్టు పెట్టలేదు ప్రభుత్వం.
ఆరోపణ: రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయటం సాధారణ విషయమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాహతకి మించి అప్పులు చేయటం వలన కొత్త అప్పులు చేసే స్థాయిని దాటిపోయింది . కేంద్రం దగ్గర గ్రాంట్లు , రుణాలు రూపంలో అప్పు చేస్తే దానికి వడ్డీ ఉండదు . కానీ చంద్రబాబు ఇప్పటికే ఇచ్చినవాటికి లెక్కచెప్పని మూలంగా మరియు ఒకదాని కోసమని చెప్పి మరొకదానికి ఖర్చుపెట్టటం మూలాన నిధులు విడుదల కఠినతరం చేసింది .
వాస్తవం: ఇప్పటికే ఇచ్చినవాటికి లెక్కచెప్పని మూలంగా కేంద్రం నిధులు విడుదల కఠినతరం చేసింది అంటున్నారు. కేంద్రం కావాలని కుట్రలు చేస్తుంటే అడిగే దమ్ములేని దద్దమ్మలు సృష్టించిన అవాస్తవ ప్రచారం ఇది. కేంద్రం ఇచ్చిన వాటికి లెక్కలన్నీ పక్కాగా ఉన్నా, యూఎల్సీలు కూడా చూపించినా వీళ్ళకు అర్థం కానట్టు నటిస్తారు
ఆరోపణ: రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మరొక అవకాశం బ్యాంకులు . ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు . ప్రపంచ బ్యాంకు సాధారణంగా 3 నుండి 4 శాతం వడ్డీ రేటుతో అప్పు ఇస్తుంది ( ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయాయి ) . ఈ నాలుగేళ్లలో చంద్రబాబు భారీగా అప్పులు చేయటం , రాష్ట్ర ఆదాయంలో 25 వేల కోట్లు నుండి 30 వేల కోట్లు వరకు సవంత్సరానికి వడ్డీలకే కట్టాల్సి రావటం , తెచ్చిన వడ్డీలకి అభివృద్ధి లేకపోవటంతో తీర్చే మార్గం ప్రభుత్వం చూపెట్టకపోవటంతో ప్రపంచ బ్యాంకు కూడా వెనకడుగు వేసింది. ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీకే ఇస్తుంది కదా.
వాస్తవం: వీళ్ళకు తెలిసింది ప్రపంచబ్యాంకు 4 శాతం వడ్డీ గురించే. కానీ దానికి గ్యారంటీ ఇచ్చేందుకు కేంద్రానికి 2% ఫీజు కట్టాలి. అదీకాకుండా ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులు రూపాయల్లోనే ఉండవు. వివిధ కరెన్సీలు అంటే, యెన్ లు, డాలర్స్ ... ఇలా ఉంటాయి. వీటి మారకపు విలువను బట్టి అదనపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని లెక్కలోకి తీసుకుంటే తక్కువలో తక్కువ 8. 2 నుండి 11.5% వరకు వడ్డీ పడుతుంది. పోనీ అంత వడ్డీకి తెద్దామన్నా వాళ్ళ ఋణం మంజూరు కావాలంటే కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. మరి అప్పటివరకు పనులు ఆపాలా? ఇదే మీ కుట్ర అని ప్రజలకు అర్దం అయ్యింది.
ఆరోపణ: ఏ బ్యాంకు వడ్డీకి ఇచ్చినా ఏ పనికోసం ఇచ్చారో అదే పనికోసం ఖర్చుపెట్టాలనే నిబంధన కూడా పెడతాయి . మన బాబుగారు రాజధానికోసం అంటాడు , కానీ వాటిని సొంత అవసరాల కోసం దోచుకొంటాడు . అందుకే ఎవ్వరూ అప్పు ఇవ్వటానికి ముందుకి రావటం లేదు .
వాస్తవం: ఒకదాని కోసమని చెప్పి మరొకదానికి ఖర్చుపెట్టటం మూలాన అని అంటున్నారు. పోలవరం కానీ, ఉపాధిహామీ కానీ మరేదయినా కానీ ముందుగా రాష్ట్రం తన ఖాతాలోంచి ఖర్చుపెట్టాక... ఒక్కోదానికి ఎన్నో కొర్రీలు పెట్టి, ప్రశ్నలు అడిగి చివరికి ఏదో కాస్త విదిలిస్తున్నారు. మరి అప్పటివరకు పోలవరం ఆపేయాలా? పల్లెల్లో రోడ్లు వేయడం ఆపేయాలా? సంక్షేమ పథకాలు ఆపేయాలా? లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ చేయాలంటే నిధుల సర్దుబాటు తప్పదు. దీన్ని రాజకీయం చేయడం అంటే అభివృద్ధికి అడ్డుపడటము మాత్రమే నీ లక్ష్యం అని అర్థం అవుతుంది.
ఆరోపణ: మనం ఏదైనా బ్యాంక్లో డబ్బు దాచుకొంటే మనకి బ్యాంకులు ఇచ్చే వడ్డీ 5 నుండి 6 శాతం . మనం దాచుకున్న డబ్బునే అదే బ్యాంకులు తీసుకెళ్లి అమరావతి పేరుతొ చంద్రబాబుకి అప్పు ఇస్తే వాళ్లకి వచ్చే వడ్డీ 10.5 శాతం . అంటే మధ్యలో బ్యాంకులుకి వచ్చే లాభం 6 శాతం ఐదు ఏళ్ళకు రూ.1040 కోట్లు అవుతుంది. అక్కడనుంచి ఏడాదికి 20 శాతం చొప్పున మరో ఐదేళ్ళలో అసలును తిరిగిచ్చేస్తున్నాం. దాన్ని బట్టి అయ్యే వడ్డీ రూ.1573కోట్లు. ఇప్పుడు అమరావతి బాండ్లు పేరుతొ చంద్రబాబు సేకరించిన 2000 కోట్లకి వడ్డీలు ఎంత కట్టాలో చూద్దాం . 2000 కోట్లకి 10.5 శాతం వడ్డీ అంటే నెలకి 21 కోట్లు .అంటే సవంత్సరానికి 12 *21 = 252 కోట్లు . 2000 కోట్లకి సవంత్సరానికి వడ్డీ 252 కోట్లు బ్యాంకులుకి కట్టాలి . అనగా పది సంవత్సరాలకి కేవలం వడ్డీనే 2500 కోట్లు ( బాండ్లు కాలపరిమితి 10 సంవత్సరాలు పెట్టారు ).ప్రభుత్వం దీనిని పది సవంత్సరాలకి తీసుకొంది . సింపుల్ గా లెక్క చూసినా వడ్డీని 2500 కోట్లు పైనే అవుతుంది . దానికితోడు ఈ మొత్తం వ్యహారం స్టాక్ మార్కెట్ ద్వారా జరిగింది కాబట్టి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి మనం కమిషన్ కట్టాలి . అంతే కాకుండా 5 సవంత్సరాల తరువాత 20 % ఇన్సెంటివ్స్ అన్నారు . అంటే దానికో 400 కోట్లు అదనం . ఈ మొత్తం లెక్క చూసుకొంటే చేసిన 2000 వేల కోట్ల అప్పుకి మనం కట్టాల్సిన వడ్డీనే 3000 వేల కోట్లు పైమాటే . అనగా అసలుతో కలుపుకొని మొత్తం 5 వేల కోట్లు అవుతుంది .
వాస్తవం: బాండ్లకు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాం అంటున్నారు. 3000 కోట్లు వడ్డీకే అవుతుంది అంటున్నారు. వీళ్ళసలు ఆరోపణలు చేసే ముందు, కనీసం ప్రభుత్వం CRDA వెబ్ సైట్లో ఏ వివరాలు పెట్టిందో కూడా చూసుకోరు. మనమిస్తున్న వడ్డీ 10.32 % అన్నది ప్రతి మూడు నెలలకు అంటే 52 కోట్లు వడ్డీ అవుతుంది. ఏడాదికి 208 కోట్లు. బ్యాంకు ఋణం. బ్యాంకుల కనీస వడ్డీ 8-8.5 శాతం. అదికూడా 20 శాతం మార్జిన్ మీదే ఇస్తారు. గ్యారంటీ కింద ఎకరం ఖరీదు రూ.2కోట్లు అనుకుంటే కనీసం 1250 ఎకరాలను తాకట్టు పెట్టాలి.ఇలా మాట్లాడితే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మిమ్ములను అసహ్యించుకున్నారు.ఇపుడు బాండ్లు కొనే వారి పట్ల మీ వ్యవహారశైలి చూస్తే అర్ధం అవుతుంది.మీ నీచపు ఆలోచనలు.
ఆరోపణ: చంద్రబాబు ఉండేది కేవలం ఇంకో 6 నెలలు . ఇప్పుడు తెచ్చిన రెండు వేలకోట్లు మొత్తం సొంతానికి దోచుకొంటాడు . బాండ్లు ద్వారా ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీతో వచ్చిన డబ్బు కాబట్టి మనం ఎక్కడ ఎందుకు ఖర్చుపెడుతున్నామో బ్యాంకులు కూడా పట్టించుకోవు.
వాస్తవం: చంద్రబాబు ఉండేది కేవలం ఇంకో 6 నెలలు అంటున్నారు. ఈ ఒక్క వాక్యం చెబుతోంది ఈ అబద్దపు ప్రచారం వెనుక ఎవరున్నారో. ఎంత కుట్ర పన్నుతున్నారో. ఈ భారమంతా వచ్చే ప్రభుత్వాలు మోయాలంట. సందేహమే లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబే గెలుస్తాడు. కాబట్టి మోయాల్సిన భారం గురించి ఆయనకే ఎక్కువ బాధ ఉంటుంది.
ఆరోపణ: ఇదంతా ప్రజలకి విడమర్చి చెప్పాల్సిన పత్రికలేమో ' అధిక వడ్డీలకి అప్పులు తెచ్చి ఎవ్వరికీ దొరకకుండా దోచుకోవటమే వీరుని లక్షణం' అన్నట్లు తెగ పొగుడుతూ ప్రజల కళ్ళకి గంతలు కడుతున్నాయి '.
వాస్తవం:కళ్ళకు గంతలు కడుతుంది చంద్రబాబు కాదు, మీరు. ప్రజల ముందు తెరచిన పుస్తకంలా ఉంది చంద్రబాబు పాలన. ప్రజల సొమ్మును జేబులో వేసుకోవడం అంత తేలిక కాదు. అలా వేసుకోవాలంటే జైలన్నలాగా క్విడ్ ప్రో కో లాంటివేవో చేయాలి. కుట్రదారులూ! మీరేం దిగులు పడకండి. అసూయగా అనిపిస్తే ఆ గంతలేవో మీ కళ్ళకు కట్టుకోండి.