మంత్రి పదవులు దాదాపుగా ఖరారైన నేపధ్యంలో, ఎవరు అయితే మంత్రి పదవులు దక్కవు అని అనుకున్నారో వారు తీవ్ర సంతృప్తిలో ఉన్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, ఇది తలకు మించిన భారం అయ్యింది. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన విడదల రజినీకి మంత్రి పదవి ఇస్తే, తాము అంతా కూడా, పార్టీకి ఎదురు తిరుగుతాం అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలిగారు అని తెలియటంతో, సియం ఆఫీస్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వెళ్ళింది. సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసారు. బుజ్జగించే ప్రయత్నం చేసారు. అయితే ఆ ఫోన్ కాల్ పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, మీరు, ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్ అని ఫోన్ పెట్టేసారు. వెంటనే ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసారు. దీంతో ప్రభుత్వ అధికారులు, పార్టీ పెద్దలు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయలన్నా దొరకటం లేదు. ఇక మరో పక్క, మంత్రి బాలినేని శ్రీనివాస్‍రెడ్డి కూడా తమ నిరసన వ్యక్తం చేసారు. తీస్తే అందరినీ తీయాలి కానీ, కొందరిని తీసి కొందరిని పెట్టటం పై, ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లాలో తన పరువు ఏమి కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మంత్రి బాలినేని శ్రీనివాస్‍రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

kotarmreddy 10042022 2

ఏకంగా బాలినేని శ్రీనివాస్‍రెడ్డి ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళారు. బాలినేని బుజ్జగించాలని జగన్ ఆదేశించటంతో, సజ్జల బాలినేని వద్దకు వెళ్లారు. అయితే బాలినేని మాత్రం, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే సజ్జల మాట కూడా బాలినేని వినలేదు. దీంతో బాలినేని ఇంటికి సామినేని ఉదయబాను కూడా వచ్చి బుజ్జగిస్తున్నారు. జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఆలోచించాలని చెప్పగా, జిల్లాలో తన పరువు గురించి కూడా జగన్ ఆలోచించాలి అంటూ, బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక నెల్లూరులో, తన పేరును కనీసం పరిశీలించకపోవడంపై కోటంరెడ్డి శ్రీధర్‍రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాకాణిని వైసీపీలోకి తెచ్చిందే నేనని, అలాంటిది, తనను కనీసం పట్టించుకోక పోవటం పై, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మిగతా చోట్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు. వారి వారి సమావేశాలు ముగిసిన తరువాత, పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తుది జాబితా ప్రకటించిన తరువాత, ఈ అసంతృప్తులు తీవ్ర స్థాయిలో ఉండే అవకాసం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పు దాదపుగా తుది దశకు వచ్చేసింది. అయితే ముందు చెప్పినట్టుగా, మొత్తం మంత్రులు అందరినీ తొలగిస్తారని ప్రాచారం జరిగినా, వైసీపీ సీనియర్ మంత్రుల నుంచి వచ్చిన బెదిరింపులతో జగన్ మోహన్ రెడ్డి వెనక్కుతగ్గారు. దాదాపుగా ఆరు నుంచి పది మంది వరకు, పాత మంత్రులే కొనసాగుతారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ మంత్రులు, వైసీపీని చీల్చే పనిలో ఉన్నారని సమాచారం అందటం, ఒక మంత్రి ఏకంగా ఢిల్లీ వెళ్లి రావటంతో, ఒక్కసారిగా జగన్ ఉలిక్కిపడ్డారు. అయితే, పాత మంత్రుల కొనసాగింపుతో, ఇప్పుడు ఆశావాహులు తమకు మంత్రి పదవి రావటం లేదు అనే అసంతృప్తిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, విడదల రజినీకి మంత్రి పదవి రావటంతో, అక్కడ ఆమె వ్యతిరేకత వర్గం సమావేశం అయ్యింది. ఆమెకు మంత్రి పదవి ఇస్తే, తాము వైసీపీకి రాజీనామా చేస్తామని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయలు కూడా ఆందోళనకు దిగారు, పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే చూస్తూ ఉండటం అంటూ బెదిరిస్తున్నారు. మరో పక్క తాజా మాజీ మంత్రి బాలినేనికి హైబీపీ వచ్చినట్టు తెలుస్తుంది. బాలినేని తనను మంత్రిగా కొనసాగనిస్తారని భావించినా, ఆయనకు పదవి ఇవ్వలేదని తెలుస్తుంది.

jagan 10042022 2

ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, పది మంది పాత మంత్రులను కొనసాగిస్తారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్థన్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం, జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారయణ. ఈ మంత్రులు ఉన్నారు. వైసీపీలో చెలరేగిన ఈ అసంతృప్తులు ఎంత వరకు వెళ్తాయో చూడాలి. మాచర్ల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల భేటీ అయ్యి, పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామన్న ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం అయ్యారు. మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచుల సమావేశం అయ్యారు.

విభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులు తడకలు, బిల్లులో పెట్టిన అసంపూర్తి అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రశ్నిస్తూ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గతంలోనే సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. చాలా రోజులు అనే కంటే, చాల ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక సవరణ పిటీషన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ ఇందులో దాఖలు చేయటంతో, ఇప్పుడు ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన అంశానికి సంబంధించి, తప్పులు జరిగాయని, విభజన జరిగిన ప్రక్రియ సరైంది కాదని, అలాగే భవిష్యత్తులో రాష్ట్రాల విభజన జరిగేప్పుడు, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రానికి సూచనలు ఇవ్వాలని, తప్పులు తడకగా చేయకూడదని, కేంద్రం ఇష్టానుసారం, ఏ రాష్ట్రాన్ని కూడా విభజన చేయకూడదని, దానికి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలని, తన సవరణ పిటీషన్ లో ఉండవల్లి కోరారు. ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ నిన్న, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ అంశాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జస్టిస్ ఎన్వీ రమణ ముందు ప్రస్తావించారు.

sc 09042022 2

పిటీషన్ దాఖలు చేసి, చాలా కాలం అయ్యిందని, అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ విభజన పై ప్రాధాన మంత్రి, లోకసభలో, రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల పై కూడా ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ప్రశాంత్ భూషణ్ వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు. ఈ పిటీషన్ ను త్వరతిగతిన విచారణ చేయటానికి ధర్మాసనం అంగీకరిస్తుందని తెలిపారు. ఉండవల్లి దాఖలు చేసిన పిటీషన్ లో ప్రధానంగా, రాష్ట్రాల విభజన పై తగిన నియమ నిబంధనలు ఉండేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలి అంటూ, వేసిన పిటీషన్ ను వచ్చే వారం, లిస్టు లో పొందుపరచాలి అంటూ, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీని ఆదేశించారు. మొత్తానికి అయితే, ఈ అంశం పైన త్వరలోనే విచారణ జరగబోతుంది. విభజన అంశం పై పూర్తి స్థాయిలో, విచారణ జరిగే అవకాసం ఉంది. ఈ అంశం పై మొదటి నుంచి, ఉండవల్లి అరుణ్ కుమార్, పోరాడుతున్నారు. ఎట్టకేలకు ఈ అంశం, కోర్టు ముందుకు రాబోతుంది. ఏమి జరుగుతుందో చూడాలి.

దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టుల పట్ల, న్యాయమూర్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఓ కేసు విషయంలో, కొన్ని ప్రభుత్వాల పై, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మన దేశంలో కోర్టులు తీర్పులు ఇస్తున్నప్పుడు, అవి తమకు అనుకూలంగా లేకపోతే, తీర్పు వ్యతిరేకంగా వస్తే కొన్ని ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయని, న్యాయమూర్తులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ, వారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ వ్యాఖ్యలు చేసారు. మన దేశంలో ఈ కొత్త పోకడ మొదలైందని, ఇది దారుణమైన పరిణామం అంటూ, ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఏదైనా కేసు విషయంలో వ్యతిరేక తీర్పు వస్తే, ప్రైవేట్ పార్టీలు కోర్టులను నిందించటం చూసే వారమని, ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రభుత్వాలే ఈ విషయంలో కలుగుచేసుకుని, కోర్ట్ లను నిందిస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఛత్తీస్​గఢ్​ కు సంబంధించిన ఒక కేసు విషయంలో, సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అంటూ, మాజీ ఐఏఎస్ అధికారి పై కేసు పెట్టింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. అయితే ఈ కేసుని ఛత్తీస్​గఢ్​ హైకోర్టు కొట్టిసింది.

nvr 09042022 2

అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ, ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు నిన్న, జస్టిస్ ఎన్​వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిల బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. అయితే అప్పటికే ఈ కేసు పైన ఏకంగా ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం, కోర్టుల పైన వ్యాఖ్యలు చేసాయి. కేసు విచారణకు వచ్చిన వెంటనే , ఇదే అంశం లేవనెత్తారు, జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వమే కోర్టులను దూషిస్తుంది అని, ఈ కొత్త పోకడ గురించి కోర్టు కంటే, న్యాయవాదులకే ఎక్కువ తెలుసు అని, దేశంలో ఈ పరిణామం రావటం చాలా దురదృష్టకరం అని అన్నారు. అయితే దీనికి మూలం మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే పడిందని చెప్పాలి. ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే, జడ్జిలను టార్గెట్ చేయటం, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి జడ్జిలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయటం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇదే అంశం ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం కూడా మొదలు పెట్టింది. దీని పైన సుప్రీం సీరియస్ అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read