ఇది భారత రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజపేయి మూర్తి పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం సందేశం... "అటల్ బిహారీ వాజపేయి మృతితో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఆయన మృతి భారత దేశానికి తీరనిలోటు..వాజ్ పేయి ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారు.. తాను నమ్మిన ఆదర్శాలను నిజజీవితంలో ఆచరించి చూపించారు. ఎంపిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా, బహుముఖ పాత్ర పోషించారు. అత్యత్తమ పార్లమెంటేరియన్. పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగాలతో సమకాలీకులకు మార్గదర్శకం చేశారు. పార్లమెంటేరియన్ గా 4దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది.

atal 1602018 2

10సార్లు లోక్ సభకు,రెండుసార్లు రాజ్యసభకుఎన్నికైనారు. జనసంఘ్ అధ్యక్షుడిగా,జనతా పార్టీ నాయకుడిగా,తరువాత బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానిగా విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో తన ప్రభుత్వం ఓడిపోయినా ఏమాత్రం చలించని మేరునగ ధీరుడు. 13రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినా,13నెలలు ఉన్నా,పట్టుదలతో పనిచేసి 5ఏళ్లు ప్రధానిగా దేశ ప్రజలపై చిరకాల ముద్రవేశారు. అన్ని తరాల వారితో కలిసి పని చేసిన ఘనత వాజ్ పేయికే దక్కుతుంది, ఐదు తరాలకు వారధి... 1984లో కేవలం 2సీట్లకే పరిమితం అయిన భారతీయ జనతాపార్టీని ఈ రోజు 270 సీట్లకు బిజెపి ఎదిగేలా చేయడంలో అటల్ బిహారీ వాజ్ పేయిదే ప్రధాన పాత్ర.

atal 1602018 3

వాజ్ పేయి మంత్రివర్గంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బైటనుంచి ఎన్డీఏ-1ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చామే తప్ప మంత్రి పదవులు తీసుకోలేదు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించడంలో కూడా నేనే స్వయంగా చొరవ తీసుకుని అటు వాజ్ పేయితో మాట్లాడటం,ఇటు అబ్దుల్ కలామ్ ను ఒప్పించడంలో క్రియాశీలంగా వ్యవహరించాను. ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలలో పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారు. గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే . నదుల అనుసందానానికి,స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణానికి విశేష కృషి చేశారు.

cbn atal 16082018 3

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్ పేయి తోడ్పాటు: తడ నుంచి ఇచ్చాపురం వరకు నేషనల్ హైవే నెం.5 అభివృద్దికి,వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు రావడంలో,ఫుడ్ ఫర్ వర్క్ కింద 50వేల టన్నుల బియ్యం కేటాయింపులో, మైక్రో ఇరిగేషన్(బిందు,తుంపర సేద్యం) అభివృద్ధిలో, హైదరాబాద్ లో ఐటి రంగం అభివృద్ధికి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వాజ్ పేయి సహకారం మరువలేనిది. మైక్రో ఇరిగేషన్ పై టాస్క్ ఫోర్స్ కు ఛైర్మన్ గా నన్ను నియమించినప్పుడు దేశంలో 3మిలియన్ హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ (డ్రిప్ ఇరిగేషన్ 2మిలియన్ హెక్టార్లు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ 1 మి.హెక్టార్లు) చేపట్టాలని అప్పట్లో ఇచ్చిన టాస్క్ ఫోర్స్ నివేదికలో పేర్కొన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఇరిగేషన్ ను 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని సంకల్పంగా పెట్టుకున్నాం. వ్యక్తిగతంగా,పార్టీపరంగా నాకు వాజ్ పేయితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన పరిపాలన,రాజకీయ అనుభవాలు ‘‘వాజ్ పేయి శకం’’గా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది... (నారా చంద్రబాబు నాయుడు), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఇక లేరు. ఈ రోజు సాయంత్రం 5:05కు తుది శ్వాస విడిచారు. గత రెండు రోజులుగా, ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో ఉన్న 93 ఏళ్ల వాజపేయి.. తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. అయితే అయన కోలుకువాలని చేసిన ప్రార్ధనలు, ఫలించలేదు.

atal 1602018 2

బుధవారం ఉదయమే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో.. కశ్మీర్‌ సమస్య పరిష్కారం విషయంలో వాజపేయి మార్గాన్ని అనుసరిస్తానని చెప్పడం, ఆయన చెప్పిన మాటల్ని ఉటంకించడం గమనార్హం.
వాజపేయిడిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన ముందే చెప్పారు. అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన లఖ్‌నవ్‌ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన లాల్‌జీ టాండన్‌ను బలపరుస్తూ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి కూడా రాలేకపోతున్నానని పేర్కొన్నారు.

atal 1602018 3

అనంతరం 2009 ఫిబ్రవరి 6న వాజపేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి.. కొంతకాలానికి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన గుండెపోటు, పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆపై జ్ఞాపకశక్తి కోల్పోయారు. క్రమంగా మధుమేహం తీవ్రతరమైంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒకదానిని గతంలోనే తొలగించారు. కాగా మూత్రపిండాలు దెబ్బతినడం వల్లనే జూన్‌ 11న ఆయన మళ్లీ ఎయిమ్స్‌లో చేరారు. వాజపేయి కోలుకుంటున్నారని, డిశ్చార్జి చేస్తామని ఎయిమ్స్‌ ప్రకటించినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి కుదుట పడలేదు. చివరకు మృత్యువుతో పోరాడి, ఈ రోజు మరణించారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద "మన అమరావతి సెల్ఫీ పాయింట్‌ను" ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదు, పదేళ్లలో అమరావతిని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. సెల్ఫీలకు చిరునామాగా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి బాండ్లకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. రైతులు కూడా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలోనే శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్‌ నాటికి అమరావతి రూపురేఖలు మారిపోతాయన్నారు. అయితే, ఇంతటితో చంద్రబాబు వెనుతిరగలేదు.

selfie 16082018 2

ఆ సెల్ఫీ పాయింట్ వెనుకే ఉన్న దుర్గా ఘాట్ చూసారు. వెంటనే అక్కడ ఉన్న అధికారులని పిలిపించారు. అదేమిటి, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా అనేక ప్రశ్నలు వేసారు. ఇంత మంచి స్పాట్ ని పర్యాటకంగా ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అంటూ, అక్కడ అధికారులని అడిగారు. దీంతో ఈయన ఇంకా ఏమి ప్రశ్నలు అడుగుతారో, ఎటు వైపు తనిఖీలు అని వెళ్తారో అని అధికారులు కంగారు పడ్డారు. చంద్రబాబు మాత్రం కొన్ని ఆదేశాలు ఇచ్చారు. దుర్గాఘాట్ ప్రాంత రూపు రేఖలు మార్చాలని, చక్కటి విహార, యాత్రా స్థలంగా రూపుదిద్దాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మన అమరావతి సెల్ఫీ పాయింట్ నిర్మాణంతో పాటు భారీ జాతీయపతాకం ఏర్పాటు చేయాలని అధికారులని కోరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం వివరాలను కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

selfie 16082018 3

రాబోయే రోజుల్లో ప్రకాశం బ్యారేజీ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందాలని, దానికి తగ్గ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు అన్నారు. కవైపు ప్రకాశం బ్యారేజీ, మరోవైపు కనకదుర్గమ్మ ఆలయం, మరో వైపు బస్టాండ్, ఇంకొకవైపు రైల్వేస్టేషన్ ఉండటంతో మోస్ట్ అట్రాక్టివ్ ప్రాంతంగా తయారు చెయ్యాలన్నారు. రాబోయే కాలంలో ప్రకాశం బ్యారేజీ దిగువన మరో ఆనకట్ట రానున్నదని, దీంతో మన అమరావతి సెల్పీ పాయింట్ నుంచి మూడు కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉండటంతో పాటు వాకింగ్ పాయింట్, జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది అని అన్నారు. అమరా వతి నగరం ప్రపంచ ఐదు నగరాల్లో ఒకటిగా పేరుగాంచనుందన్నారు. 165కిలో మీటర్ల అవుట్రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కృష్ణానది ప్రకృతి అందాలతో మరింత శోభను సంతరించుకోనుందన్నారు. నూతన సంస్కృతికి శ్రీకారం చుడతామని, ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దతామన్నారు.

ముందుగా చెప్పాలి అంటే, డీడీ న్యూస్ అనేది ప్రభుత్వ సంస్థ... ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది. కాని నిన్న అనూహ్యంగా, డీడీ న్యూస్ ఛానల్, ఏకంగా బీజేపీ కార్యాలయంలో, అమిత్ షా జాతీయ జెండా ఎగరవేస్తుంటే, అది కవర్ చేసింది. మరి, ఇలా చెయ్యవచ్చా అంటే ? సమాధానం లేదు.. ఇది ఇలా ఉంటె బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలోని 6ఏ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగరేశారు. కానీ ఆయనకు ఈ కార్యక్రమం పెద్ద ఇబ్బందినే తెచ్చి పెట్టింది.

amit 16082018 2

అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు తాడుని లాగారు. జెండా కాస్తా కిందకు జారి నేలకు తగిలింది. వెంటనే తన పొరపాటు గుర్తించిన షా ఎగరేయాల్సిన తాడుని లాగి జెండా ఎగరేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ప్రత్యక్ష ప్రసారం చేసిన డీడీ న్యూస్ యాంకర్, ఒక్కసారిగా ఈ పరిణామంతో షాక్ అయ్యారు. జెండా కింద పడిన సమయంలో “Tch, tch, tch…disaster” అంటూ మైక్ కి దూరంగా వ్యాఖ్యానించిన మాటలు వినిపించాయి. దీంతో, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో ఆ వీడియోని పెట్టి అమిత్ షాని విపరీతంగా ట్రోలింగ్ చేసారు.

amit 16082018 3

ఈ పరిణామాలు అన్నీ నచ్చిన అమిత్ షా, చాలా కోపంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా, నిన్న ఈ వీడియో ట్వీట్ రూపంలో పెట్టిన డీడీ న్యూస్, తన అధికార ఖాతా నుంచి, ఈ ట్వీట్ డెలీట్ చేసింది. రెండు ట్వీట్లు, దీని పై వేస్తే, రెండూ డిలీట్ చేసారు. ఇదంతా అమిత్ షా నే చేపించారని, బెదిరించి తీపించారని, కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను, బీజేపీ శాసించటం దారుణం అంటున్నారు. ఇవి ఆ డిలీట్ చేసిన ట్వీట్ URL's https://twitter.com/DDNewsLive/status/1029591249815318528 https://twitter.com/DDNewsLive/status/1029594032375296000

Advertisements

Latest Articles

Most Read