ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ పదే పదే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని అనేక సందర్భాల్లో రాహుల్ హామీలు గుప్పించారు. సోమవారం శేరిలింగంపల్లి సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సేనని చెప్పారు. హైదరాబాద్‌లోని సెటిలర్లు తమ వెంటే ఉంటారని టీపీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదానే కాదని... ఏపీ హక్కులన్నింటినీ కాలరాశారని మండిపడ్డారు.

rahul 13082018 2

2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. చెప్పానంటే చేస్తానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చామని, నిలబెట్టుకున్నామని రాహుల్ వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకుని తెలంగాణా ఇచ్చామని, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటిలో నిర్ణయం తీసుకున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రత్యేక హోదాతో పాటు, అన్ని విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రతిఖాతాలో 15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ అబద్దాలు చెప్పారని, తాను అబద్దాలు చెప్పనన్నారు.

rahul 13082018 3

ఆంధ్రా మూలాలు ఉన్నవారిని ఆకట్టుకునే దిశగా శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ప్రసంగించాలంటూ ఉత్తమ్ ప్రత్యేకంగా కోరారు. భౌగోళికంగా విడిపోయినా ఆంధ్రా, తెలంగాణ ప్రజలం అన్నదమ్ముళ్లమని, అన్నదమ్ములుగా విడిపోయాం.. మనమంతా ఒకటేనని రఘువీరా స్పష్టం చేశారు. తెలుగువారంతా ఒకటేనని, మోదీకి బుద్ధిచెబుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తామని రాహుల్‌ భరోసా ఇచ్చారని కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, తెలుగు రాష్ట్రాలు బలంగా నమ్ముతున్నాయన్నారు. హోదా ఇస్తామన్న మోదీ ఏపీని మోసం చేశారన్నారు. ఏపీకి భరోసా ఇచ్చిన విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని రఘువీరా చెప్పారు.

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇదే జోరు కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని నగర నిర్మాణ పనులు అనతికాలంలోనే గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని, రాబోయే ఎనిమిది నెలల్లో పునాది స్థాయి దాటాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సచివాలయం, హెచ్‌వోడీ టవర్లను 2019 మే నాటికి 20 అంతస్తుల మేర కోర్‌ వాల్‌, 9 అంతస్థుల మేర డెస్క్‌ స్లాబ్‌ నిర్మాణాలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకోవాలన్నారు.

seed 13082018 2

రాజధాని నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని, నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని ఏపీసీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో సీఎం స్పష్టం చేశారు. అమరావతి నగరం ప్రజల చేత, ప్రజల భాగ స్వామ్యంతో, ప్రజల కోసం నిర్మిస్తున్న రాజధాని నగరం అని పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతి రూపంగా ఆయన కొనియాడారు. నయాపైసా ఆశిం చకుండా రైతులు రూ. 50 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచ శ్రేణి రాజధాని కావాలన్న ప్రజల కోరిక సాధ్యమైనంత త్వరగా వాస్తవరూపం దాల్చాలంటే మనం నిరంతరాయంగా కష్టపడి పనిచేయాలన్నారు.

seed 13082018 3

అంతకు మించి ప్రత్యామ్నాయం లేదన్నారు. సచివాలయం, హెచ్‌వోడీల టవర్ల నిర్మాణ పనులను ప్రారంభించిన నాటి నుండి 29 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని నగర ప్రాంతంలోని ప్రధానమైన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణం 86 శాతం మేర పూర్తయిందని చెప్పారు. ఎన్‌9 రోడ్డు 70 శాతం, ఇతర రోడ్లు 50 నుండి 60 శాతం మేర పూర్తయినట్లు అధికారులు వివరించారు. హౌసింగ్‌ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని ఏడీసీఎల్‌ ఛైర్మన్‌ లక్ష్మీపార్థసారథి ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కీలక అంశాలను స్వాతంత్య్ర వేడుకల్లో ఏపీసీఆర్‌డీఏ శకటంలో ప్రదర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచిం చారు. యవాత్‌ ప్రపంచం అమరావతివైపు చూస్తోందని, పెట్టుబడిదారులకు స్వర్గధామంలా మానుందని సీఎం పునరుద్ఘాటించారు.

seed 13082018 4

ఇటీవల జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త ర్యుకోహిరా అమరావతిని సందర్శించారన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పారన్నారు. ఒక్క పట్టణ టౌన్‌షిప్‌ల రంగంలోనే 10 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టొచ్చని చెప్పారన్నారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నారైలు విమానాశ్రయాలకు కూడా వచ్చి అమరావతిలో పెట్టు బడులకు ఉన్న అవకాశాలపై ఆరా తీసినట్లు చంద్రబాబు తెలిపారు. దీన్ని బట్టిచూస్తే అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.

ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళుతూనే మరోపక్క ఎన్నిక లకు ఎవరిని బరిలోకి దింగాలనే అంశాలపైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించినా ఇంకా దీని పై కచ్చితమైన క్లారిటీ ఇంత వరకూ ఇవ్వలేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ సీటుకు ఎవరిని బరిలోకి దింపాలనే అంశం పై ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. కాకినాడ నుండి పవన్ సోదరుడు నాగబాబును పోటీలోకి దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. త్వరలోనే నాగబాబు జనసేన ద్వారా రాజకీయ రంగంలోకి అడుగిడుతారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

nagababu 13082018 2

ప్రజా రాజ్యం తరపున సాధ్యంకానిది ఇప్పుడు జనసేనతోనైనా సాధించాలనే పట్టుదలతో నాగబాబు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే నాగబాబు అన్న మెగాస్టార్ చిరంజీవికి, ఇటు పవన్ కు అండగా ఉంటూ వస్తున్నారు. ప్రజారాజ్యం తరపున ఆయన గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చిరంజీవికి అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన కాకినాడలో పోటీచేస్తారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. అయితే ఆప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ పోటీ చేయడంతో నాగబాబు పోటీ నుండి విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి ఈసారి ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని నాగబాబు భావిస్తున్నారు.

nagababu 13082018 2

తాను ఎంపీగా పోటీ చేస్తానని, తనకు కాకినాడ సీటు ఇవ్వాలని నాగబాబు చాలా కాలం క్రితమే పవన్ ను కోరినట్లు సమాచారం. కాగా ఇందుకు పవన్ కూడా అంగీకరించినట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాకినాడ నుండి పోటీ చేస్తే తన గెలుపు సులువు అవుతుందని నాగబాబు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు త్వరలో వివిధ సంఘాల నాయకులు, చిరంజీవి ఫ్యామిలీ అభిమానులతో సమావేశం కాబోతున్నారనే వార్తలు కూడా ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు చిరంజీవి ఫ్యామిలీ అండ ఉంటుందని గతంలోనే మెగా హీరోలందరూ స్పష్టం చేశారు. పార్టీ ఒంటరిగా లేక ఇతర పార్టీలతో ఒక అంగీకారానికి వచ్చినా మెగా అభిమానులు పవన్ కల్యాణ్ కు బాసటగా నిలుస్తున్నారు.

nagababu 13082018 3

జనసేన పార్టీ పోటీచేస్తే ఎక్కువ సీట్లు సాధించే జిల్లాల్లో తూర్పు, పశ్చిమగోదావరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా మరిన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. అందులోనూ మెగా కటుంబానికి చెందిన వారైతే గెలుపు మరింత సులువు అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా పవన్ కల్యాణ్ ప్రభావం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉండనుందని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ప్రజారాజ్యం కూడా ఇదే జిల్లాల్లో బలమైన ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు జనసేన ప్రభావం కూడా ఇక్కడే ఉంటుందన్న నేవథ్యంలో పవన్ కల్యాణ్ ప్రధానంగా ఈ జిల్లాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు, అనంతపురం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం అధిక స్థానాలను కైవసం చేసుకునేలా జనసేన వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ఏర్పాటుచేసే విషయంలో వివిధ విదేశీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకునే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గుజరాత్‌ కంటే కేవలం రెండు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. విశాఖపట్టణంలో నిర్వహంచిన భాగస్వామ్య సదస్సుల్లో మెజారిటీ ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతంలో ఐటీ రంగ వికాసం కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ వంటి నగరాలను నవ్యాంధ్రలో ఐదు చోట్ల ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్‌ పాలసీని ప్రకటించింది.

ap 13082018 2

దీనికి అనుగు ణంగా ఐటీ పరిశ్రమల నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో ప్రవాసాంధ్ర ఐటీ సంస్థల అధినేతలు కూడా అమరావతిలోనే తమ ప్రాజెక్టులను ప్రారంభించి ఇప్పటికే 36 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అమరావతి, విశాఖపట్టణం నగరాలు ఇప్పటికే ప్రపంచస్థాయి ఐటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. అనేక సంస్థలకు భూముల కేటాయింపుతోపాటు వివిధ అనుమతులకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టిన నేపద్యంలో అమరావతి ఐటీ హబ్‌గా అతి త్వరలోనే ఏర్పడ బోతుందనే సంకేతాలు వెలువడ్డాయి.

ap 13082018 3

యాంటోలిన్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, కాండ్యూంట్‌, హెచ్‌సీఎల్‌ వంటి మొత్తం 75 సంస్థలు గత రెండేళ్లలో తమ కంపెనీలను అమరావతిలో ప్రారంభించాయి. విశాఖపట్టణంలో కల్పించిన విధంగానే అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం నుండి మరింత చొరవ లభిస్తే అమెరికాలో ఉన్న మరికొంత మంది తెలుగువారు తమ ఐటీ సంస్థలను శరవేగంగా పెట్టుబడులతో వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు గుణాత్మకమైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి సిద్ధపడి ఇక్కడ తమ కంపెనీలను ప్రారంభించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ తెలిపారు.

వీటిలో భాగంగా ఇన్‌వేకాస్‌ సంస్థ ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు ఆ సంస్థకు అనుగుణంగా ఉన్న ఇంటెల్‌, ఏఎండీ, కేడిన్స్‌, మెనార్‌ గ్రాఫిక్స్‌ వంటి సంస్థలు కూడా పరిశోధనలు చేపట్టి నవ్యాంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా దొహద పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఐటీ చట్టం ద్వారా ప్రవాసాంధ్రులు నడుపుతున్న ఐటీ కంపెనీల బ్రాంచిలను ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో తమ సంస్థ ముందడుగు వేసిందని ఇన్‌ వేకాస్‌ సంస్థ వ్యవస్థాపకుడు దశరథ్‌ గూడే తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read