తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ ను కలుస్తున్నట్లు మోత్కుపల్లి మీడియాకు స్వయంగా చెప్పారు. అయితే, చివరి నిమిషంలో మోత్కుపల్లితో భేటీ పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. జనసేన బలోపేతం కోసం కాకుండా, తన అవసరాల కోసమే పార్టీలోకి రావాలని మోత్కుపల్లి భావిస్తున్నట్లు పవన్ దృష్టికి వచ్చిందట. ఈ తరుణంలో మోత్కుపల్లితో భేటీని జనసేన అధినేత ఆఖరి నిముషంలో రద్దుచేసుకున్నారట. దీర్ఘకాలం జనసేన కోసం పనిచేసే వాళ్ళనే పార్టీలో చేర్చుకోవాలనేది పవన్ ఆలోచనట.

pk 11082018 2

గత కొన్నాళ్ళుగా మోత్కుపల్లి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌తో చేతులు కలపాలని మోత్కుపల్లి భావించారు. సీనియర్ నేత, దళితుడు కావటంతో జనసేనలో చేరితే తనకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని మోత్కుపల్లి భావించినట్లు సమాచారం. ఇందుకోసం మోత్కుపల్లి గత వారం పవన్‌కల్యాణ్‌ని కలవబోతున్నానంటూ మీడియాకు స్వయంగా చెప్పారు కూడా. బహిష్కరణకు గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మోత్కుపల్లి లక్ష్యం చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కూడా అదే తీవ్రతతో విమర్శలు గుప్పించారు.

pk 11082018 3

ఆ రకంగా చూస్తే, మోత్కుపల్లి వస్తే తెలంగాణలో జనసేనకు ఊపు వచ్చి ఉండేది. అయితే, పవన్ కల్యాణ్ ఆలోచన మరో రకంగా ఉందని చెబుతున్నారు. ఆయన కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవర్‌స్టార్‌ని ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తోంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ వ్యూహం మేరకే అనుకూల అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ భావిస్తున్నట్లు వినికిడి. తెలంగాణలో కాపుసామాజిక వర్గం ఓట్లు, సెటిలర్లు, యువత ఓట్లు కోసం టీఆర్ఎస్ పవన్‌తో జతకట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల విశ్లేషణ. అందువల్లనే మోత్కుపల్లితో భేటీని ఆయన రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ దొంగ సాక్షి, దొంగ రాతలు గురించి చెప్పీ చెప్పీ విసుగు వస్తుంది... కాని, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది కాబట్టి, వీరి దొంగ రాతలను ప్రజలకు తెలిసేలా చేసి, ఇలాంటి వారిని ఎండగట్టటం కోసం తప్పటంలేదు... రోజుకి ఒక తప్పుడు కధనం రాయటం, దానికి ఒక క్రియేటివ్ స్టొరీ అల్లటం, బురద జల్లి వెళ్ళిపోవటం... సాక్షి పెట్టిన దగ్గర నుంచి ఇదే సీన్... ఎన్ని సార్లు దొరికినా, ఎన్ని సార్లు మీవి తప్పుడు రాతలు అని చెప్పినా, సాక్షి మాత్రం అన్నీ వదిలేసి, అవే తప్పుడు కధనాలు రాస్తుంది... తాజాగా గన్నవరం ఎమ్మల్యే పై, సాక్షి పేపర్ లో ఒక కధనం వచ్చింది. వల్లభనేని వంశీ,కబ్జా చేసారు అంటూ వార్తా రాసింది. దీని పై వంశీ ఘాటుగా స్పందిందిస్తూ, పత్రికా ప్రకటన ఇచ్చారు.

vamsi 11082018 2

"ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం హాస్యాస్పదంగా ఉంది. గత పది సంవత్సరాలుగా కోట్లాది రూపాయల సొంత నిధులను వెచ్చించి వేలాదిమంది నిరుపేదలకు సేవాకార్యక్రమాలు చేస్తున్న నాపై ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఆరు సెంట్ల భూమిని ఆక్రమించుకున్నానంటూ కథను అల్లడం సాక్షి యాజమాన్యం దివాళాకోరుతనానికి నిదర్శనం. ఉంగుటూరు నా స్వగ్రామం, మరియు దత్తత తీసుకున్న గ్రామం. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి దారి లేకపోవడం, నిర్మాణ సామాగ్రిని చేరవేయడానికి గుత్తేదారు ఇబ్బందులు పడుతుండడంతో నా సొంతనిధులతో రహదారిని నిర్మించారు."

vamsi 11082018 3

"ప్రాంగణంలో ఉన్న కంకర, ఇసుక పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినవి. అబద్దపు రాతలతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్న సాక్షి దినపత్రిక యాజమాన్యంపై పరువునష్టం దావా వేయనున్నాను. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని అనేక విచారణలను ఎదుర్కొంటూ జైలుకెళ్ళిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపరు ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ అందరికీ అవినీతి బురద పూయడానికి ప్రయత్నిస్తున్నారు. తనతోపాటు భారతిని కూడా ఈ.డీ కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టుకు తీసుకెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా అబద్దపు కథనాలు ప్రచురిస్తున్నందుకు సాక్షి పత్రిక యాజమాన్యంపై త్వరలోనే న్యాయపరమైన చర్యలు తీసుకుని వారిని బోనులో నిలబెడతాం."

పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతా అనేది వ్యక్తిగతం కాదని, బ్యాంక్ ఖాతా కాదని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన పూర్తిగా ఆర్థిక శాఖ నియంత్రణలో నిర్వహించే వెసులుబాటు కలిగిన ఖాతా మాత్ర‌మే అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర వివరణ ఇచ్చారు. వెల‌గ‌పూడి సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. పీడీ ఖాతాలను ఆయా సంస్థల పేరుతో మాత్రమే నిర్వహిస్తారని, వ్యక్తిగతంగా నిర్వహించరన్నారు. సంస్థతో పాటు ప్రభుత్వం కలసి నిర్వహించే సంయుక్త ఖాతా అని తెలిపారు.

gvl 11082018 2

ఇది లోపభూయిష్టమైన ఆర్థిక నిర్వహణ కాదని, సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణగా పేర్కొన్నారు. ఈ ఖాతాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం అదనంగా వడ్డీ చెల్లించవలసి అవసరం ఉండదని, వడ్డీ భారం తగ్గుతుందని తెలిపారు. ఏదైనా ఒక పనికి కేటాయించిన సొమ్ముని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తే 3 శాతం వడ్డీ మాత్రమే ఇస్తారని చెప్పారు. ఏదైన ఇతర చెల్లింపులకు అవసరమైతే అదే బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే 8 శాతం వడ్డీ చెల్లించవలసి ఉంటుందన్నారు. పీడీ ఖాతా నుంచి సర్ధుబాటు చేసుకుంటే వడ్డీ చెల్లించవలసిన అవసరమే లేదని వివరించారు. ఇవి అధికారులు, సర్పంచ్ లు నిర్వహించే వ్యక్తిగత ఖాతాలుగా కొంతమంది అపోహపడుతున్నారని, అందువల్ల వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంస్థకు సొంత ఆడిట్ విధానం ఉంటుందని, ఆ ప్రకారం ఆడిటింగ్ జరుగుతుందని చెప్పారు.

gvl 11082018 3

ఈ ఖాతా నుంచి కోటి రూపాయలు దాటిన ప్రతి చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయిలో నియంత్రణ విధానం లేదని, సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) ని ప్రవేశపెట్టిన తరువాత ఆ విధానం అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. పీడీ ఖాతాల నిర్వహణ, వడ్డీ ఖర్చులను తగ్గించుకునే విధానాన్ని కాగ్ వారికి వివరించామని, వారికి అర్ధమైందని చెప్పారు. పంచాయతీ స్థాయి నుంచి ఆర్థిక శాఖ వరకు ఒక్కో బిల్లు చెల్లించే విధానాన్ని బిల్లులతో సహా చూపిస్తూ పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దేశంలో ఇంత సమగ్ర సమాచారం అందించే రాష్ట్రం ఏపీ ఒక్కటేనని తెలిపారు.

gvl 11082018 4

పీడీ ఖాతాలు మన ఒక్క రాష్ట్రంలోనే నిర్వహించడంలేదని, దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఖాతాల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఎక్కువ, ఒక్కో రాష్ట్రంలో తక్కువ ఉండవచ్చునన్నారు. మన రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉన్నందున, 13 వేల పీడీ ఖాతాలు ఉంటాయని, మళ్లీ అదనంగా ఖాతాలు తెరువవలసి వస్తే ఇంకా పెరుగుతాయని వివరించారు. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల సొంత నిధులు, ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక గ్రాంట్ల నిధులు కలిసిపోకుండా ఒక్కో గ్రామ పంచాయతీకి మూడు ఖాతాలు కేటాయిస్తారన్నారు. 1వ ఖాతాలో సొంత నిధులు, 2వ ఖాతాలో ఆర్థిక సంఘం నిధులు, 3వ ఖాతాలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 72,652 ఖాతాలు నిర్వహించేవారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి 43,374 ఖాతాలు, తెలంగాణకు 29,236 ఖాతాలు వచ్చాయని చెప్పారు.

gvl 11082018 5

రాష్ట్ర విభజన తరువాత 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులను వేరు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 13,199 పీడీ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13వ ఆర్థిక సంఘానికి తెరిచిన ఖాతాల్లోనే రెండు నిధులను కలిపి వేస్తోందన్నారు. ఏజీ నివేదిక ప్రకారం 2018 మార్చి 31 నాటికి ఏపీకి చెందిన 57,455 పీడీ ఖాతాల్లో రూ. 29,909 కోట్ల నిధులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం 12,822 ఖాతాలను తొలగించినట్లు చెప్పారు. ఆ ఖాతాల కాలపరిమితి పూర్తి కావడం, ఆ ఖాతాలలో నిధులు లేనందున వాటిని తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహణలో ఉన్న పీడీ ఖాతాల సంఖ్య 44,633కు తగ్గినట్లు చెప్పారు. వాటిలో పంచాయతీల ఖాతాలు 25,836, యుఎల్బీ(అర్బన్ లోకల్ బాడీస్) ఖాతాలు 348, సివిల్ కోర్టుల డిపాజిట్ ఖతాలు 610, విద్యా సంస్థలవి 800, చీఫ్ ప్లానింగ్ అధికారి డిపాజిట్ ఖాతాలు 800 ఉన్నట్లు వివరించారు.

gvl 11082018 6

వాటితోపాటు కార్పోరేషన్, సొసైటీలు, ఫంక్షనల్ డిపాజిట్ ఖాతాలు, ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ సీఈఓలు, డీఆర్డీఏ ఖాతాలు వంటివి ఉన్నట్లు తెలిపారు. పీడీ ఖాతాలలో నిధుల పారదర్శకత కోసం ఏపీలో 2014లోనే పీడీ అకౌంట్ పోర్టల్ ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇది వర్చువల్ బ్యాంకింగ్ విధానంగా పనిచేయడమే కాకుండా అన్ని పీడీ ఖాతాల లాదేవీలను పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా ఉంచుతుందన్నారు. గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో పీడీ ఖాతాలు తక్కువ ఉన్నట్లు ఏజీ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 153 పీడీ ఖాతాలు ఉన్నట్లు కాగ్ పేర్కొందని, ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే ఆ తరువాత 4272 ఖాతాలు తెరిచినట్లు వారు చెప్పినట్లు వివరించారు.

gvl 11082018 7

అనేక రాష్ట్రాలు ఏపీ విధానాలనే అనుసరిస్తున్నట్లు తెలిపారు. ట్రెజరీలలో కాకుండా బ్యాంకులలో జమచేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయన్నారు. అన్ని పథకాలకు వేరువేరు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని ఒత్తిడి చేస్తోందని, కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే బ్యాంకు ఖాతాలకు బదులుగా ట్రెజరీలలో నిధులు ఉంచుతున్నట్లు తెలిపారు. మిగిలిన లావాదేవీల తరహాలోనే ట్రెజరీలలో పీడీ ఖాతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఖాతాల నిర్వహణ వల్ల నిధుల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని రవిచంద్ర వివరించారు.

కృష్ణా నది ఎగువ ప్రాంతాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్గాలకు ప్రకాశం బ్యారేజీకు భారీగా నీటి ప్రవాహం పెరిగి నీటి సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరిందని కృష్ణా డెల్టా సిస్టమ్ ఛీప్ ఇంజనీర్ ఆర్.సతీష్‌కుమార్ తెలిపారు. న‌గ‌రంలోని స్థానిక నీటిపారుదల సర్కిల్ (ఎస్ఈ) కార్యాలయంలో శ‌నివారం ఉద‌యం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఈ సతీష్‌కుమార్ మాట్లాడుతూ కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని మునేరులో శుక్రవారం సాయంత్రం రెండువేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా శనివారం ఉదయానికి 14,500 క్యూసెక్కులకు చేరిందన్నారు.

prakasam 11082018 2

ఈ ప్రవాహం సాయంత్రానికి 20,000 క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 11.02 అడుగులకు నీటి సామర్థ్యం పెరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజ్ గరిష్ట నీటిమట్టం 12 అడుగులకు చేరితే బ్యారేజ్ గేట్లు ఎత్తి ఆ నీటిని కిందికి వదులుతామన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్‌కి పట్టిసీమ 24 పంపుల ద్వారా నీటిని తీసుకొచ్చామని స్థానికంగా నీటి ప్రవాహం పెరగడంతో ఇప్పుడు 10 పంపుల ద్వారానే నీటిని తెచ్చి 14 పంపులను ఆపేస్తామన్నారు. సాయంత్రానికి ఇక్కడ వరద పరిస్థితిని బ‌ట్టి పట్టిసీమ పంపుల ద్వారా తెచ్చే నీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

prakasam 11082018 3

ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాలోని కాల్వలక 10,000 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నామని ఇందులో పశ్చిమ ప్రధాన కాల్వకు రెండు వేల క్యూసెక్కులు, కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామన్నారు. ఇలా వచ్చే నీటి ప్రవాహాన్ని దిగువన సముద్రంలోకి వదలకుండా ఉండటానికి ఎగువ ప్రాంతాలలో నీటిని నిల్వ చేసేందుకు వైకుంఠపురం వద్ద బ్యారేజీని నిర్మించి అందులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నీటిపారుదల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ కేవీఎల్ ఎన్‌డి చౌదరి మాట్లాడుతూ చిట్ట చివరి భూములకు కూడా నీటిపారుదల సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

prakasam 11082018 4

ప్రకాశం బ్యారేజ్ లో ప్రవాహం పెరిగినందున పెడన పరిసర ప్రాంతాలలో ఉన్న రామరాజు పాలెం కాల్వకు నీటిని విడుదల చేసి రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. కృష్ణా డెల్టా లో ఇప్పటి వరకు 6,97,359 ఎకరాల్లో నాట్లు పూర్తి అయ్యాయన్నారు. రాష్ట్ర ఎఫెక్ట్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకి 10,600 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నామన్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మునేరు నది నుంచి వచ్చే నీటి ప్రవాహం పెరిగినందున ప్రకాశం బ్యారేజ్‌లో నీటి మట్టం పెరుగుతుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా కృష్ణా నది కి పట్టిసీమ ద్వారా 170 టీఎంసీలు తీసుకురావటంతో పాటు కోట్ల రూపాయల పంట దిగుబడిని సాధించగలిగామన్నారు.

Advertisements

Latest Articles

Most Read