వందల కోట్లు ఇచ్చి తెచ్చిన వ్యుహకర్త... మోడీని ప్రధానిని చేసారు, నన్ను సియంను చేస్తారు అంటూ బహిరంగ సభలో, జగన్ పరిచయం చేసారు. అతనే ప్రశాంత్ కిషోర్.. అప్పటి నుంచి జగన్ ను జాకీలు వేసి లేపలేక ప్రశాంత్ కిషోర్ టీం తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ప్రతి సారి జగన్ సెల్ఫ్ గోల్స్ వేసుకోవటం, దానికి విరుగుడు వ్యూహం సిద్ధం చెయ్యటం. ప్రశాంత్ కిషోర్ టీంకు టైం అంతా దీనికే సరిపోతుంది. సోషల్ మీడియాలో ఫేక్ చేస్తున్నా, అది పెద్ద ఇంపాక్ట్ ఉండటం లేదు. ప్రతి వారం సర్వేలు చేస్తూ, సామాజిక సమీకరణాల పై ఎప్పటికప్పుడు, జగన్ కు సూచనలు ఇస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. కాని జగన్ మాత్రం, అవన్నీ పక్కన పడేసి, తన ఫ్లో లో తను ఉంటున్నాడు. నాకు అన్నీ తెలుసు, నా కోసం ఇంత మంది జనం వస్తున్నారు, నేనే ఈ రాష్ట్రానికి కాబోయే కింగ్ ని అనే మూడ్ లోనే , జగన్ ఉంటున్నారు అని సమాచారం.

pk 01082018 2

దీంతో ప్రశాంత్ కిషోర్ టీంకు కూడా విసుగు వచ్చేసిందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సహా, ఆ టీంలోని పెద్దలు, పార్లమెంట్ ఎన్నికల పై ఫోకస్ చేస్తున్నారని, ఇప్పుడు జగన్ తో ఉన్నది అంతా పిల్ల టీం మాత్రమే అని చెప్తున్నారు. దీంతో మొత్తం మారిపోయింది. వారు జగన్ ఏమి చెప్తే అది చేస్తున్నారు. సలహాలు ఇవ్వాల్సింది పోయి, జగన్ సలహాలు తీసుకుని పని చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టిన తర్వాత సమీకరణాల్లో వచ్చిన మార్పులు చూసి జగన్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవాలనుకున్నారు. జనసేనతో పొత్తుపెట్టుకుంటే వచ్చే ప్రయోజనం సంగతి ఏమో కానీ.. జరిగే నష్టమే ఎక్కువ అనుకుని ఆ పార్టీకి ప్రజల్లో పలుకుబడి తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పీకే పిల్ల టీం ప్లాన్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

pk 01082018 3

పవన్ ఎంట్రీ తర్వాత కాపు యువత ఎక్కువగా జనసేన వైపు మళ్లింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. టీడీపీ దెబ్బకొట్టాలంటే బీసీలను ఆకర్షించాలి. బీసీలు సంప్రదాయ బద్దంగా టీడీపీకి మద్దతుదారులు. వారు కాపు రిజర్వేషన్లలను వ్యతిరేకిస్తున్నారు. తాను కూడా కాపు రిజర్వేషన్లకు అనుకూలం కాదంటే కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత, బీసీల నుంచి అనుకూలత వచ్చి రెండు వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుందని జగన్ భావించినట్లు సమాచారం. కానీ నాలుగు రోజులైనా కాపు నేతలంతా తనపై విరుచుకుపడడమే కాక తనకు మద్దతుగా ఒక్క బీసీ నేత కూడా ముందకు రాకపోవడంతో జగన్, ప్రశాంత్ కిషోర్ పిల్ల బ్యాచ్ టీం, ప్లాన్ తలకిందులైదనే ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్ళీ ఈ ప్రశాంత్ కిషోర్ పిల్ల బ్యాచ్ టీం సూచనల మేరకు, మూడు రోజుల్లోనే, రెండు సార్లు జగన్ మాట మార్చారు..

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ దగ్గర తెలుగుదేశం పార్టీ ఎంపీలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి మంచి పనిచేశారని ఆమె కొనియాడారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి ఆమె ప్రశంసలు తెలిపారు. ఎంపీ కేశినేని నానిని మమత ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడారు. తాను అద్వానీని కలిసి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశానని ఆమె చెప్పారు. తరువాత సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, దేవేగౌడను, అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా ఆమె కలిసారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉంటున్న ఆమె రాజకీయ నేతలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

mamata 0108208 3

అలాగే, సీఎం చంద్రబాబుకు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆహ్వానం పంపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో ఢిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 2019 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని విపక్షాలు సమష్టిగా ఎదుర్కోవాలని మమతా అన్నారు. ప్రతిపాదిత కూటమి తమ ప్రధాన మంత్రి అభ్యర్థి పేరును ముందుగా వెల్లడించకూడదన్నారు. విపక్షాల ఐక్యతను తెలిపేందుకు జనవరి 19న కోల్‌కతాలో చేపట్టే భారీ ర్యాలీలో పాల్గొనాలని విపక్ష నేతలను కలుస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడనికి విపక్షాల సమష్టి నాయకత్వం అవసరమని, అందుకే నేను విపక్ష నేతలను కలిసి వారిని ర్యాలీకి ఆహ్వానిస్తానని చెప్పారు.

mamata 0108208 2

బీజేపీ చేస్తోన్న రాజకీయాలను తాము ఏమాత్రం సహించేది లేదన్నారు. దేశం మార్పును కోరుకుంటోందన్నారు. అది 2019లో జరిగితీరుతుందన్నారు. బీజేపీ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్‌లో విభజన రాజకీయాలను చేయగలదని, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వారి ఆటలు సాగవన్నారు. బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో విపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వారి ఆటలు సాగవన్నారు. ఏపీలో చంద్రబాబు, కర్ణాటకలో చంద్రబాబు ఉన్నందు వల్ల వారి ఆటలు సాగవన్నారు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికే చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సినిమా స్క్రిప్ట్ లు చెప్పి మరీ గాల్లో పిడి గుద్దులు గుద్డుతూ, చంద్రబాబు అలా, చంద్రబాబు ఇలా అంటూ మాట్లాడుతున్నారు. ఒక రోజు తుపాకీ అంటాడు, ఒక రోజు తూటా అంటాడు, ఒక రోజు ఆత్మహత్య అంటాడు, మొత్తానికి, ఎదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తన మీటింగ్ జరుగుతూ ఆవుల మంద అటు వైపు వస్తున్నా, చంద్రబాబు పంపించాడు అంటాడు. తాను బస చేసిన చోటుకి, ఎవరో తాగి వచ్చి అల్లరి చేస్తే, చంద్రబాబు నన్ను చంపటానికి మనుషులని పంపించాడు అంటాడు. ఇలా జరగనవి కూడా జరిగినట్టు ఊహించుకుంటూ, ఒక ప్రపంచంలో ఉంటున్నాడు పవన్. పవన్ కి తోడుగా కొంత మంది కుల పిచ్చ గాళ్ళ సంగతి అయితే చెప్పే పనే లేదు.

chiranjeevi 01082018 2

హైదరబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మటమే ఈ బ్యాచ్ పని. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తున్నా, కులం రంగు అంటగట్టి, సంతోష పడే వాళ్ళు అన్నారు. చంద్రబాబు అంటే వీరికి లెక్కే లేదు. కెసిఆర్ అంటే మాత్రం, ఈ బ్యాచ్ మొత్తానికి భయం. అందుకే నాలుగు రోజుల నుంచి, హరితహారం అంటూ క్రోటన్ మొక్కలు నాటుతున్న సినిమా బ్యాచ్ ని చూస్తున్నాం. అదే ఏపిలో వనం-మనం అంటే ఒక్కడు మాట్లాడడు. పాపం చివరికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా, నిన్న ఈ క్రోటన్ మొక్కలు పాతి, హరిత హారం అని ఫోజ్ కొట్టి, కెసిఆర్ ని ప్రసన్నం చేసుకునే పని చేసారు. అయితే, ఒక్క రోజు గ్యాప్ లోనే కెసిఆర్ ప్రభుత్వం చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చింది.

chiranjeevi 01082018 3

చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి చిత్రానికి తాజాగా తెలంగాణా రెవెన్యూ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌లో రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పుడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అక్కడ సెట్ ఏర్పాటు చేసి భూమిని కైవసం చేసుకోవాలని చిత్ర బృందం భావిస్తోందని, భూ కబ్జాల్లో ఇదో టైపు కబ్జా అని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. నోటీసు లు ఇచ్చినా పట్టించుకోకపోవటంతో, వచ్చి ఈ సెట్ కుల్చేసారు. ఇంత జరిగినా, ఒక్కడు అంటే ఒక్కడు నోరు ఎత్తలేదు. కెసిఆర్ అంటే అంత భయం మరి. అయితే, ఇదే పని పొరపాటున ఆంధ్రప్రదేశ్ లో జరిగి ఉంటే ? ఈ పాటికి కులం అంటగట్టే వాళ్ళు. చంద్రబాబు కాపు వ్యతిరేకి అనే వాళ్ళు. పవన్ కళ్యాణ్ వచ్చి, హడావిడి చేసే వాడు. మెగా కోటరీ మొత్తం, చంద్రబాబు పై దుమ్మిత్తి పోసేది.

అవిశ్వాసం సందర్భంగా, కేశినేని నాని ఇచ్చిన లాస్ట్ పంచ్ గుర్తుందా ? రెండు గంటలు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మోడీకి, లాస్ట్ పంచ్ అదరగొట్టారు నాని. ‘‘ప్రధానమంత్రి ఎంతో అద్భుత ప్రసంగం చేశారు. మీరు(ప్రధాని) గొప్ప నటులు, డ్రామా ఆర్టిస్ట్‌. దాన్ని అంగీకరిస్తున్నా. మీ ఒకటిన్నర గంటల ప్రసంగం వింటున్నప్పుడు బ్లాక్‌బస్టర్‌ సినిమా చూస్తూ కూర్చున్నట్టు అనిపించింది’’ అని బెజవాడ నాటు భాషలో ప్రధానికి జర్క్ ఇచ్చారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యలకు మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే, మోడీ పెద్ద యాక్టర్ అని అందరికీ తెలుసు. కాని, మోడీ మొఖం మీదే ఆ మాట చెప్పటంతో, అందరూ మా మనుసులో మాటే చెప్పారు అంటూ , అభినందించారు.

nani 010872018 2

అయితే, ఇంకా ఈ రీసౌండ్ ఢిల్లీ పెద్దలకు పోయినట్టు లేదు. కేశినేని నానిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారు. మీ స్పీచ్ పట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేసారని, చెప్పారు. అయితే, నాని మాత్రం, ఇవన్నీ నాకు చెప్పద్దు అని, మా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహంతో మాట్లాడుకుంటే మంచిందని అన్నారు. అనంత్‌కుమార్ మాత్రం, ఇవన్నీ కాదు, నేను మీతోనే మాట్లాడతాను అంటూ చెప్పారు. ప్రధానిని ఎవరైనా నిండు సభలో అలా సంభోదిస్టారా ? ప్రధానికి గౌరవం ఇవ్వాలని అనంత్‌కుమార్‌ హితవు చెప్పారు. ప్రధాని ఉండగానే, అలా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పారు.

nani 010872018 3

దీంతో నాని అదే స్థాయిలో ధీటుగా బదులు ఇచ్చారు. మోదీ కూడా ప్రధాని స్థాయికి తగ్గట్టుగా వ్యవహరిస్తే, మేము సబ్జెక్టు మాత్రమే మాట్లాడే వాళ్ళం అని, మేము అడిగిన 18 విభజన హామీల గురించి చెప్పకుండా, రాజకీయాలు ప్రధాని మాట్లాడవచ్చా ? చంద్రబాబు పరిణతి లేని నాయకుడు, జగన్ లాంటి దొంగ ట్రాప్ లో పడ్డాడు అంటూ, ప్రధాని అలా మాట్లాడితే ఎలా అని నాని అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు, ప్రధాని ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి మాట్లాడతారా అని ఎదురు చూస్తే, ప్రధాని రాజకీయ ప్రసంగం చేసారని, అందుకే మేము అలా మాట్లడాల్సి వచ్చిందని, అయినా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన తనకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వకుండా ఎందుకు మైక్‌ కట్‌ చేశారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు లోక్‌సభలో ఏ అవకాశం వచ్చినా వదులుకోబోమని స్పష్టం చేశారు. తాము సభలో సెటైర్లు వేయకుండా ఉండాలంటే ఏపీకి న్యాయం చేయమనండి అని అనంత్‌కుమార్‌కు స్పష్టం చేసి ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చారు.

Advertisements

Latest Articles

Most Read