కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో పవన్-జగన్-బీజేపీ కలిసి పన్నిన వ్యూహం పై తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్‌ పై వ్యక్తిగత విమర్శలు, కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని, తాను చేసేది ఏమీ లేదంటూ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో చేసిన ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుగుదేశం భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రభావం కాపుల్లో ఎక్కువుగా ఉండటంతో ఆ ఓటు బ్యాంకు తన వైపుకు రాదని భావించిన జగన్ బీసీల ఓట్లకు గాలం వేశారనేది తాజా వ్యూహంగా కనిపిస్తుంది. అదే విధంగా, కాపు ఓట్లు అన్నీ పవన్ కు కాన్సాలిడేట్ అయ్యేలా, బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేసిందనే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు, ఉపసంహరించుకోవడం కానీ, లేదా వివరణ ఇవ్వడం కానీ చేయలేదు.

jagan pk 31072018 2

జగన్‌పై కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత పార్టీలోని కాపు నేతలే దీన్ని సమర్థించలేకపోతు్ననారు. ముద్రగడ పద్మనాభం కూడా తన ఆగ్రహాన్ని దాచుకోలేదు. తన విధానంలో మర్పు ఉండదని, బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు ఎలా చేయవచ్చో తనకు చెప్పాలంటూ ఆదివారం పార్టీ నేతల వద్ద జగన్ వెటకారం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాపు ఓట్లు పవన్ వైపు మొగ్గితే బీసీ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవచ్చని జగన్ రిజర్వేషన్లపై ప్రకటన చేసి ఉంటారని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై బీసీల్లో అసంతృప్తి కూడా ఉందని.. ఆ ఓటు బ్యాంకు తనవైపుకు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

jagan pk 31072018 3

జగన్ వ్యూహాన్ని గమనించిన టీడీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఈ సారి సార్వత్రిక కులాల పోలరైజేషన్ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా కాపు ఓటు బ్యాంకు జగన్‌కు దూరమవటం ఎపీ రాజకీయాల్లో కొత్త పరిణామంగా భావించవచ్చు. కొంతమంది సంప్రదాయంగా వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులుగా ఉన్న కాపులు జగన్‌తో కూడా నడుస్తున్నారు. కానీ జగన్ కామెంట్లతో వారు వైసీపీకి దూరమయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు కూడా జగన్ వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ... బీసీ ఓటు బ్యాంకు సంప్రదాయ బద్దంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని, ఆ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడం అనేది అసాధ్యమనేది వైసీపీలోని ఓ కాపు నేత విశ్లేషణ. అటు కాపుల ఓట్లు పడకపోగా, ఇటు బీసీలు కూడా ఆదరించని పక్షంలో రెండింటికీ చెడిన రేవడి అవుతుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

పార్లమెంట్‌ లోపల, బయట ఎంపీల ఆందోళనలు, ధర్నాలు, ఉద్యమాలతో ఇక పనికాదు. ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకునేదేం ఉండదు. సాంకేతిక సాకులతో విభజన హామీల అమలు సాధ్యం కాదని ఇప్పటికే తేల్చిచెప్పేసిన ఎన్‌డీఏ నుంచి ఇంతకంటే మెరుగైన ఫలితాన్ని ఆశించడం వ్యర్థం. ఇందుకు బదులుగా ప్రజాక్షేత్రంలోకే దూకాలి. రానున్న ఎన్నికల్ని రాష్ట్రంలోని పార్టీలు సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలి. ప్రధాని ఎవరన్నది రాష్ట్ర పార్టీలే నిర్ణయించే స్థాయికి చేరుకోవాలని పరిశీలకులు ఉద్బోధిస్తున్నారు. ఇది ఒక్కటే ఢిల్లీని ఎదుర్కుని, మనం సాధించుకునే అవకాశం. రేపు ఎవరు వచ్చినా, ఇలా సాగదీసే పనులే చేస్తారు. మన బలంతో ప్రభుత్వం ఏర్పాటు అయితేనే, మనం సాధించుకోగలం.

modi 3107218 2

గత ఆరుమాసాలుగా తెలుగుదేశం పార్టీ ఒకే లక్ష్యంతో రాజకీయాలు చేస్తుంది. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఉద్యమాలకు దిగింది. కేంద్రం కూడా ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొందరు మంత్రులతో త్వరలోనే హామీల్ని అమలు చేస్తామంటూ ప్రకటనలు ఇప్పిస్తోంది. మరోవైపు మరికొందర్ని బరిలో దింపి అలాంటి అవకాశాలు లేనేలేవంటూ తేల్చేస్తోంది. గత నాలుగేళ్ళుగా ఊరించిన ప్రత్యేకహోదాకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ సాక్షాత్తు ప్రధానే అత్యున్నత చట్టసభలో చెప్పేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని, కావాలనే నిర్మాణ బాధ్యతను రాష్ట్రం తలకెత్తుకుంది.. కేంద్ర చట్టాల మేరకు డబ్బులిస్తాం.. అయితే అందుకు అనుగుణంగా నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకివ్వడం లేదంటూ ఆరోపణలకు దిగింది. దీంతో పోలవరం జాప్యానికి కారణాన్ని రాష్ట్రంపైకి నెట్టేసింది.

modi 3107218 3

ఇంతవరకు రైల్వేజోన్‌ అడ్రస్ లేదు. కాకినాడ పెట్రో కారిడార్‌ నిర్మాణానికి కూడా సాంకేతిక అవరోధాల్ని సాకుగా చూపించింది. దుగరాజపట్నం రేవులో పోర్టు నిర్మాణానికి పరిస్థిితులు అనువుగా లేవంటూ సాకు చెప్పింది. అలాగే కడప ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం ఆమోదయోగ్యం కాదని నివేదికలు పేర్కొన్నాయని తేల్చేసింది. దీంతో విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలయ్యే అవకాశాల్లేవని తేలిపోయింది. అయినా ఇంకా ఎంపీలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. విభజన హామీల్ని అమలు చేయమంటూ రోజూ వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఇక ఎన్‌డీఏ ప్రభుత్వానికి కూడా కాలపరిమితి ముగుస్తోంది. ఈ పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేసు కోకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోకెళ్ళి హామీల అమల్లో మరింత సమర్ధవంతంగా ఎండగట్టాల్సిన అవసరముందని పరిశీలకులు సూచిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేయడంలో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండూ దొందుగానే మారాయి. ఇక జాతీయ పార్టీల పట్ల ఆంధ్రప్రదేశ్‌లో విశ్వాసం కొరవడింది. దీన్ని ఆలంబనగా చేసుకుని జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ చక్రం తిప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అప్పుడు తప్ప రాష్ట్రానికి పెండింగ్‌ ప్రాజెక్టులు మోక్షం సాధించలేవు. విభజన హామీలు అమల్లోకి రావని పరిశీలకులు తేల్చేస్తున్నారు.

'అధికారంలో ఎవరున్నారు? హామీ ఇచ్చిన వారిని వదిలేసి నన్ను అడగటం ఏమిటి?' అంటూ వైసిపి అధినేత జగన్‌ కాపు రిజర్వేషన్లపై తనను నిలదీసిన మహిళలను వెటకారంగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాగింది. పిఠాపురం మండలంలోని విరవలో ఆ గ్రామానికి చెందిన కాపు మహిళలు తమ కులానికి రిజర్వేషన్లు ఎందుకివ్వరు అంటూ ప్రశ్నించారు. దీనిపై జగన్‌ వెటకారంగా స్పందిస్తూ... 'అధికారంలో ఎవరున్నారు?. హామీ ఇచ్చిన వారిని వదిలేసి నన్ను అడగటం ఏమిటి?' అంటూ సమాధానం దాటవేశారు.

jagan 31072018 2

స్పష్టంగా సమాధానం ఇవ్వకపోవడంతో మహిళలు నిరాశకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో యాత్రను కొనసాగించారు. కిర్లంపూడి మండలం వీరవరం నుంచి సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన ఆయన పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి మీదుగా పిఠాపురం మండలం పాటి మీద, మల్లం రోడ్డు, విరవ వరకూ నిర్వహించారు. అనంతరం విరవ పిహెచ్‌సి సమీపంలో రాత్రి బస చేశారు. సినీనటుడు విజయచంద్ర పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

jagan 31072018 3

శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతే కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను మాట ఇవ్వలేనన్నారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ గుర్తు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను ఆయన అవమానించారని, కాపులకేనా.. మొత్తం రిజర్వేషన్లకు జగన్‌ వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు.

రాజధాని పరిధిలో మరో పది ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. మంత్రి లోకేష్‌ చేతులమీదుగా బుధవారం ప్రారంభం కానున్నాయి. వీటితో కలిపి విజయవాడ, గుంటూరు నగరాలు సహా రాజధాని ప్రాంతంలో మొత్తం వంద వరకూ ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. ఈ కంపెనీల ద్వారా 936 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇప్పటికే 285 మందిని ఈ కంపెనీలు తీసుకున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఈ కంపెనీలను ప్రారంభిస్తారు. మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో ఆరు కంపెనీలు, విజయవాడలో రెండు కంపెనీలు, గన్నవరంలోని మేథా టవర్స్‌లో రెండు కంపెనీలు ప్రారంభం కానున్నాయి. ఈ 10 కంపెనీలను ఏపీఎన్‌ఆర్‌టీ భవన్‌ నుంచి లోకేశ్‌ ప్రారంభిస్తారు. నేరుగా ఐటీ విభాగం, అదే సమయంలో ఏపీఎన్‌ఆర్‌టీ, మరోవైపు ఎపిటా ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలు రాష్ర్టానికి వచ్చేలా ప్రయత్నిస్తోంది.

it 31072018 2

ఈ కంపెనీల్లో అక్రుక్స్‌ ఐటీ డాటా సర్వీసెస్‌ 300 మందికి, నార్మ్‌ సాఫ్ట్‌వేర్‌ 150 మందికి, యలమంచిలి సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ద్వారా 200 మందికి, కేడ్‌ప్లయ్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 90 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇవి కాక విభర్‌టెక్‌ సొల్యూషన్స్‌, సీఎ్‌సఎస్‌ టెక్‌ సొల్యూషన్స్‌, హెడ్‌రమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మెంటిస్‌ ఐటీ సొల్యూషన్స్‌, ఫ్రీమాంట్‌ ఐటీ సొల్యూషన్స్‌, ప్రొకొమ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ కంపెనీలు రానున్నాయి. ఐటీ సొల్యూషన్స్‌, బీపీవో, మొబైల్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ తదితర రంగాల్లో ఈ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తాయని ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో రవికుమార్‌ వేమూరి తెలిపారు.

it 31072018 3

గన్నవరం మేథాటవర్స్‌లో 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా.. 90 శాతం నిండిపోయింది. 11వేల చదరపు అడుగుల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉంది. మేథాటవర్స్‌లో 12 కంపెనీలు నడుస్తుండగా.. 2వేల మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాజధాని పరిధిలో ఐటీ కంపెనీల రాక జోరందుకోవడంతో.. మేథా టవర్స్‌కు పక్కనే ఆరు అంతస్తుల్లో మరో టవర్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే మూడు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఐటీ టవర్‌లో ఆరున్నర లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి రానుంది. మరో రెండు మూడు నెలల్లో ఈ టవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను జోరుగా చేపడుతున్నారు. ఇవికాకుండా.. విజయవాడలోని ఆటోనగర్‌ ఇండ్వల్‌ టవర్‌, కె.బిజినెస్‌ సెంటర్‌, మహానాడులోని ఎం.కె.ప్రీమియం, గుంటూరు విద్యానగర్‌లోని ఐటీ టవర్‌లో ఐదు కంపెనీలు, మంగళగిరిలోని ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్క్‌, ఐటీ పార్కుల్లో మరికొన్ని కంపెనీలు ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read