నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 3007210218 2

దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాల చేత, పోలవరం ఆపెయ్యాలి అంటూ సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ వేసారు. పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌ పై గత నెల రోజులుగా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది.

polavaram 3007210218 3

ఈ రోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకు ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం పై ఇతర రాష్ట్రాల సమస్యలను బుధవారంలోపు విడివిడిగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నివేదిక ఇవ్వని రాష్ట్రాలకు పోలవరంతో సమస్యలు లేనట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. కాగా తమ వాదనతో కర్నాటక, మహారాష్ట్ర ఏకీభవిస్తున్నాయన్న ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే గతంలో ఏఏ అంశాలపై వాదనలు వినిపించారో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఒరిస్సా, తెలంగాణా, ఏ రకమైన వాదనలతో సుప్రీం కోర్ట్ ముందుకు వస్తాయో చూడాలి.

70వేల మందికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎలా సాయం చేసారో చూసారా... దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని రికార్డు ఇది.... ఎప్పుడూ అభివృద్ధి, టెక్నాలజీ అనే మూడ్ లో ఉన్న చంద్రబాబు, కష్టం అని వచ్చిన పేదవారిని ఎలా ఆదుకున్నారో చూడండి.. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, సియం రిలీఫ్ ఫండ్ నుంచి, పెద్దగా నిధులు ఇచ్చే వారు కాదు... అప్పట్లో ఆయన వర్కింగ్ స్టైల్ వేరు.... కాని, ఇప్పటి చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు... కష్టం అని ఎవరు వచ్చినా, దాంట్లో నిజా నిజాలు తెలుసుకుని, ఎంత సహయమ కావాలి అంటే అంత చేస్తున్నారు... అంతే కాదు టీవీల్లో వచ్చే వార్తలు కూడా చూసి, వారికి సహాయం చేస్తున్నారు.... ఇటీవల మంత్రి నారా లోకేశ్‌కు ఎదురైన ఓ అనుభవం ఆయననే కాదు.. పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

lokesh 30072018 2

ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. గ్రామదర్శినిలో భాగంగా ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుమీద వెళుతుండగా సుమారు 70 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి వచ్చి గట్టిగా లోకేశ్‌ చేయిని పట్టుకున్నారు. వదిలించుకోవడానికి కూడా వీలులేని విధంగా చేతిని పట్టుకోవడంతో లోకేశ్‌ బిత్తరపోయారు. అనుకోని ఈ పరిణామానికి లోకేశ్‌ భద్రతాసిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా తేరుకున్న లోకేశ్‌ ఆ పెద్దాయన నుంచి తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూ 'మీకేం కావాలి పెద్దాయన' అని అడిగారు.

lokesh 30072018 3

ఆయన లోకేశ్ చేతిని వదలకుండానే 'బాబు.. నాకు ఆరోగ్యం బాగాలేదని మీ నాన్న దగ్గరకు వచ్చాం.. లివర్‌ను ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలని వైద్యులు చెప్పారు. అదే విషయాన్ని మీ నాన్నకు చెబితే ఆయన నాకు చెక్‌ ఇచ్చారు. ఆసుపత్రికి నేరుగా డబ్బులు వెళ్లాయి.. లివర్‌ మార్చారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చారు. 'నువ్వు కూడా అలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా... నేను బతికున్నంతకాలం మీ నాన్నకు రుణపడి ఉంటాను' అని చెప్పడంతో లోకేశ్‌కు కాసేపు నోటి వెంట మాట రాలేదు.. ప్రజా జీవితంలో ఇంతకంటే సంతృప్తి ఏం కావాలని లోకేశ్‌ తన అనుచరులతో వ్యాఖ్యానించారు. చేసిన సాయాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని ఈ సంఘటన గుర్తు చేసిందన్నారు. సాయం అందుకున్న వారి మోముల్లోని ఆనందానికి.. వారు చెప్పే కృతజ్ఞతలకు వెల కట్టగలమా? ఎన్ని కోట్లు ఇచ్చినా.. ఎంతటి అత్యున్నత పదవిని అధిరోహించినా ఆ ఆనందానికి సరిరాదు అంటూ లోకేష్ సహచరులతో చెప్పారు.

దేశం నలుమూలలకు ఎగుమతవుతున్న ఏపీ చేపల్లో ప్రమాదకర ‘ఫార్మాలిన్‌’ అవశేషాలున్నాయని ప్రచారం ఎందుకు జరిగింది? 1976 నుంచి ఏపీ చేపలు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. పకడ్బందీగా ప్యాకింగ్‌ చేసి పంపుతున్న చేపలపై ఫార్మాలిన్‌ పూత పూస్తున్నామన్న అపవాదు ఎలావచ్చింది? మన చేపల అమ్మకాన్ని ఆ ఐదు రాష్ట్రాలు ఎందుకు నిరాకరించాయి. ఇదీ ఏపీ ప్రభుత్వ అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో నెలకొన్న సందేహం. ఏపీ చేపల దిగుమతుల నిషేధం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది. 15 రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ఏపీ చేపలపై కేవలం ఈశాన్య రాష్ట్రాల నుంచే అభ్యంతరాలు రావడం వెనుక మర్మం ఏమిటనే కోణం లో పరిశీలిస్తే.. రాజకీయ కుట్రే కారణమని అధికార వర్గాలు అంటున్నాయి.

cbn 30072018

రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులు తెలియని వారుండరు. ఏపీని చిన్నబుచ్చేందుకు తెర వెనుక శక్తుల పన్నాగమే.. మన చేపల నిషేధానికి కారణంగా భావిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మణిపూర్‌, అసోం, త్రిపుర ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు లేవనెత్తాయో ఇట్టే అర్థమవుతోందని ఆ రాష్ట్రాల్లో పర్యటించిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల్లో పాలక పార్టీలు ఒక్కటే కావడం, వైద్య మంత్రులు ఒకే పార్టీకి చెందిన వారు కావడమేనన్న అభిప్రాయం ఏపీ అధికార వర్గా ల్లో వ్యక్తమౌతోంది. కారణాన్ని ఆరా తీస్తే.. స్థానికుడైన ఆ రాష్ట్ర ఉన్నతాధికారి అక్కడి మంత్రికి స్వయానా సోదరుడు. ఆ అధికారి ఇటీవల కేంద్రంలో ఓ మంత్రిని కలిసిన తర్వాతే.. మన చేపలపై నిషేధం విధించారని సమాచారం. ఆ తర్వాతే దాని పక్క రాష్ట్రాలూ వంతపాడాయి.

cbn 30072018

ఏపీ చేపలపై ప్రమాదకర రసాయన పూతలు ఏమీ పూయట్లేదని భరోసా ఇస్తూ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో మూడు రాష్ట్రాలు మెత్తబడ్డాయి. అయినా నాగాలాండ్‌ మాత్రం భీష్మించింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులోనూ యాంటీబయోటిక్స్‌ వినియోగంపై నిషేధం అమలు చేస్తున్నది. అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఫార్మాలిన్‌ పేరిట దుష్ప్రచారంతో ఈశాన్య రాష్ర్టాల్లో మన చేపలపై నిషేధం విధించారన్న సందేహం మన అధికారుల్లో ఏర్పడింది. మొత్తం ఈశా న్య రాష్ట్రాలకు రోజూ మన చేపలు 52 ట్రక్కుల్లో వెళ్తాయి. అలాగే పశ్చిమబెంగాల్‌కు 150, ఒడిసాకు 30, బిహార్‌కు 50 యూపీకి 30, ఢిల్లీ+పంజాబ్‌లకు 20, ముంబైకి ప్రత్యేకంగా 6 ట్రక్కులు వెళ్తున్నాయి.

మొన్నటి దాక కాపులకు రిజర్వేషన్‌ ఎప్పుడు చేస్తున్నారు, వారు అన్యాయం అయిపోతున్నారు అంటూ, హడావిడి చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు కాపులకు రిజర్వేషన్‌ పై నిర్ణయం తీసుకుని, కేంద్రానికి పంపించారో, అప్పటి నుంచి జగన్ ఈ విషయం పై నోరు తెరవటం లేదు. అయితే శనివారం మాత్రం తన పాదయాత్రలో, ఈ విషయం పై కాపు యువత నిలదీయగా, కాపులకు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనికి, అది ఇవ్వటం కుదరదు, నేను అధికారంలోకి వస్తే, ఎక్కువ నిధులు మాత్రం ఇస్తాను అని చెప్పారు. దీని వెనుక ప్రధాన కారణం, ఇప్పుడు కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలో ఉంది. ఈ విషయం పై ఏమి మాట్లాడినా, కేంద్రాన్ని ప్రశ్నించాలి. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము మనోడి దగ్గర లేదు కాబట్టి, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడు.

jagan 30072018 2

అయితే, తెలుగుదేశం మాత్రం, విభజన హామీలే కాదు, కాపు రిజర్వేషన్ ల అంశం పై కూడా పార్లమెంట్ లో కేంద్రంతో పోరాడుతుంది. ఈ రోజు లోక్‌సభ జీరో అవర్‌లో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని తక్షణమే షెడ్యూల్ 9లో చేర్చాలని ఆయన పట్టుపట్టారు. ఎంపీ అవంతి శ్రీనివాస్‌ చేసిన డిమాండ్‌కు పలు పార్టీల ఎంపీలు మద్దతు పలికారు.

jagan 30072018 3

జగన్ అంటున్నట్టు, కాపులకు రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధిలోనిది నేను ఏమి చెయ్యలేను అంటే, ప్రత్యేక హోదా కూడా కేంద్రం పరిధిలోనిదేగా ? దాని కోసం ఎలా కేంద్రం పై ఉద్యమాలు చేస్తున్నామో, దీని పై కూడా అలాగే చెయ్యాలి. కేంద్ర పరిధిలోనిది అని చెప్పి, ప్రతి విషయం ఇలా తప్పించుకుంటే ఎలా ? సరే, రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిదని అందరికీ తెలుసు.. అసలు ఆ అంశానికి మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పకుండా తప్పించుకోవడం ఏమిటి..? ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది.. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది.. దాన్ని కేంద్రప్రభుత్వం షెడ్యూల్ నైన్ లో పెడితే పనైపోతుంది.. ఆ విషయంపై జగన్ ఎలాంటి వైఖరీ చెప్పలేదు.. కేంద్రాన్ని డిమాండ్ చేయనూ లేదు.. అలాగే చేస్తాను అనీ చెప్పలేదు.. ఇవన్నీ పక్కన పెడదాం, జగన్ మోహన్ రెడ్డి 2014 మేనిఫెస్టోలో, కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని ఎందుకు చెప్పాడు ? ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాడు ?

Advertisements

Latest Articles

Most Read