తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం జ్వరంతో పాటు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని గోపాలపురం నివాసంలో ఆయనకు కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృదం చికిత్సలు చేస్తోంది. కాగా, తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా ఆయను చూసేందుకు అభిమానులు ఎవరూ రావొద్దని ఆయన కుమారుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కోరారు. అయితే, కరుణ కుటుంబం మాత్రం కొంత ఆందోళనగానే ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

karunanindi 27072018 2

.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీటర్లో పేర్కొన్నారు. ఇదే విషయమై కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్, కుమార్తె కనిమొళితో కూడా ప్రధాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన ఆరోగ్యం పై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఉపముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం గురువారం కరుణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇప్పటికే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, డీఎంకే నేత దయానిధి మారన్, కమల్ హాసన్ సహా పలువురు నేతలు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

karunanindi 27072018 3

ఇది ఇలా ఉండగా, డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ గోపాలపురంలోని తన నివాసానికి రావాలని స్టాలిన్‌ కబురు పెట్టడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన వారితో సమావేశమయ్యారు. మరోవైపు కరుణానిధి అనారోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఒక పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, అతని మేనల్లుడు హరీష్, మిగతా తెరాస నాయకులు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం అని, వాళ్లకి ఇస్తే మాకు ఇవ్వాలి అంటూ, చేస్తున్న హడావిడి చూస్తున్నాం. ఇదంతా అక్కడి ప్రజలను మరోసారి ఆంధ్రా మీద విషం చిమ్మించి రాజకీయం చెయ్యటం కోసం. అయితే తెలంగాణా సమాజం మాత్రం, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై సానుభూతితో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఫైర్‌ సర్వీస్‌ కార్యాలయం వద్ద వరంగల్‌కు చెందిన యువకుడు ఉమేశ్‌రెడ్డి సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు.

tealangana 27072018 2

సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఆ యువకుడిని వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఆ యువకుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. క్రేన్ సహాయంలో పైకి ఎక్కి అతనితో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత తెలుగు తెలిసిన తెలుగు జర్నలిస్టులను పైకి తీసుకెళ్లికెళ్లి అతనితో మాట్లాడించారు. అయితే, హోదాపై ప్రకటన చేస్తేనే దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరింపులకు గురిచేశాడు ఉమేష్. పోలీసులు, జర్నలిస్టులు ఆ యువకుడితో గంటకుపైగా చర్చలు జరిపి అతడ్ని క్షేమంగా టవర్ పైనుంచి కిందికి దించారు.

tealangana 27072018 3

కాగా, గత వారం రోజుల నుంచి అతడు ఏపీ భవన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ అనే నినాదాలు చేశాడు ఉమేష్. ఆంధ్రప్రదేశ్ కు మోడీ అన్యాయం చేసారని, అక్కడి ప్రజలు అడుగుతున్నట్టు, ప్రత్యెక హోదా ఇచ్చి తీరాలని, నిరసన తెలిపాడు. ఒక పక్క కెసిఆర్ లాంటి నేతలు, తమ రాజకీయ మనుగడ కోసం, ప్రాంతీయ వాదాన్ని రేపుతుంటే, తెలంగాణా సమాజం మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలబడుతుంది. ఇది నిజంగా సుభాపరిణామం. మోడీ లాంటి బలమైన నేతను, రెండు తెలుగు రాష్ట్రాలు, కలిసి ఎదుర్కోవాల్సిన టైంలో, కెసిఆర్ వెళ్లి మోడీ పంచన చేరాడు. ఇక జగన్, పవన్ సంగతి సరే సరి.

చంద్రబాబు అనే వాడిని ఎలా అయినా దించాలి.. ఇప్పుడు అందరి ముందు ఉన్న టార్గెట్ అదే... ఢిల్లీ పెద్దలు ఆదేశాలు మేరకు, ఇక్కడ కొంత మంది చేస్తున్న వెకిలి వేషాలు చూస్తూనే ఉన్నాం.. ఈ వెకిలి వేషాలకు తోడుగా, ఢిల్లీ స్థాయిలో అధికార బలంతో, వ్యవస్థలని తమ ఆధీనంలోకి తీసుకుని, తద్వారా చంద్రబాబుకు ఇబ్బంది కలిగిస్తుంది కేంద్రం. తాజాగా మరో ప్లాన్ తో ముందుకొచ్చింది.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితి చూసి అక్కడ ఎమ్మల్యే బొండా ఉమా అవాక్కయ్యారు. తన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ లిస్టు చూసి అవాక్కయ్యారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 2014లో రెండు లక్షల 65వేలకుపైగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పటికి లక్షా 70వేలకు పడిపోయింది. అంటే 95వేల ఓటర్లను అధికారులు తొలగించారు.

bonda 27072018 2

దీంతో అసలు ఏమి జరిగిందో అర్ధం కాక, వెంటనే ఎన్నికల సంఘం అధికారులను వివరణ కోరగా, వారి వాదన మరో రకంగా ఉంది. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. అయితే కొందరు ఆధార్‌ లేకపోవడంతో ఓటు కోల్పోయారు.. అలాగే ఆధార్‌లో పేరు ఉన్నా. ఓటరు కార్డులో ఉన్న పేరుతో సరిపోకపోవడం అంటే స్పెల్లింగ్‌ పొరపాట్లు వంటి కారణంగా మరికొందరు ఓట్లు కోల్పోయారు. అయితే ఆధార్‌కు-ఓటరు కార్డుకు సంబంధం లేదని సుప్రీం చెప్పినా... ఆ ఆదేశాలకు అనుగుణంగా తొలగించిన వారి పేర్లను తిరిగి చేర్చలేదు. దీంతో వెంటనే బొండా ఉమా ఈ విషయం పై చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు.

bonda 27072018 3

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 70వేల ఓట్లు, పెనమలూరు నియోజకవర్గంలో 40 వేల ఓట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు.. ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో ఓట్లు తొలగిస్తే ఇక 175 నియోజకవర్గాలను లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని పార్టీలు లెక్కలేస్తున్నాయి.. ఇది వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం కూడా చూపుతుందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఓటు ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈసేవా, ఆన్‌లైన్‌, ఓటరు నమోదు కేంద్రాల వద్ద చెక్‌ చేసుకోవాలి ఉంటుందని, లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఓట్లు మాయం కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 50వేలు నుంచి లక్ష వరకు ఓట్లు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది.

నగర దర్శిని కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం కొవ్వూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కొవ్వూరును గోవూరుగా మార్పు చేయాలని కోరారు. దీనిపై సీఎం కొవ్వూరును గోవూరుగా మార్చేందుకు పరిశీలిస్తామని సభలోనే నిర్ణయాన్ని ప్రకటించారు. గతంలో రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్పు చేసినట్లే నేటి కొవ్వూరును గోవూరుగా మార్పు చేస్తామని ప్రకటించడంతో సభలో ఉన్న స్థానికులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే జవహర్‌ మాట్లాడుతూ చరిత్ర గలిగిన గోవూరులో ఒకప్పుడు గౌతమ మహాముని తపస్సు చేస్తున్న సమయంలో గోహత్య పాపం చుట్టుకోవడంతో శాప విమోచనానికి గోదావరిని గోవూరు తీసుకురావడంతో నేడు నేడు ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందన్నారు.

kovvuru 27072018 2

గోవూరు కాలక్రమేణా కొవ్వూరుగా మారిందని తిరిగి గోవూరుగా నామకరణం చేయాలని ప్రజలు కోరుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్ళగా ముఖ్యమంత్రి సభా సమక్షంలోనే దీనిపై స్పందించారు. బ్రిటీష్‌ వారు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో గోవూరును కౌ(ఆవు)ఊరుగా పిలిచేశారు. గౌతమ మహర్షి తపోభూమి కాలక్రమంలో కొవ్వూరుగా స్థిరపడింది. గోవూరు సమీపంలో గౌతమి మహర్షి భూమిని అరకతో దున్నినచోటు ఉంది. ఈ ప్రాంతం నేడు ఆరికరేవులుగా మారింది. గౌతముడు మాయాగోవుపై దర్భ విధించడంతో గోవుకు దెబ్బతగిలి వేదన చెందిన ప్రాంతాన్ని పశువు వేదన అని ఉండేది. ప్రస్తుతం పసివేదలగా మారింది. వేదన చెందుతూ రాతి దెబ్బతగిలి గోవులు మరణించి చోటును చావుగొల్లుగా పిలిచేవారు. అది కాస్త నేడు చాగల్లుగా మారింది. అహల్య నివాశముండే ప్రాంతాన్ని చౌగమిగా పిలిచేవారు.అది కాలక్రమంలో తోగమ్మిగా మారింది.

kovvuru 27072018 3

పశివేదల జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సర్పంచి బేతిన కాశీఅన్నపూర్ణ అధ్యక్షత వహించగా జవహర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని రూ. 1,226 కోట్లతో అభివృద్ధిపర్చామన్నారు. నియోజకవర్గంలో 90 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందుతున్నారన్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సాంఘిక సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Advertisements

Latest Articles

Most Read