నిన్న మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి.. "నేను గట్టిగా తలుచుకుని, కష్టపడితే 5 సంవత్సరాల్లో సియం అయిపోతా" అని అన్నారు.. ఈ సినిమా వాళ్ళు అందరూ ఇలా తమకి తాము గొప్పగా అతీత శక్తులులాగా ఊహించుకుంటారు అనుకుంటా అని అనుకుంటున్న టైంలో, ఈ మాటలు నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్ లోని మథుర బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నేను తలచుకుంటే నిమిషంలో సీఎంను కాగలను. అయితే, ఆ పదవిపై నాకు వ్యామోహం లేదు’ అని అన్నారు. సీఎం అయితే చాలా ఆసక్తులను కోల్పోవాల్సి వస్తుందని, స్వేచ్ఛ హరించుకుపోతోందని, అందుకే, ఆ పదవిని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ ‘డ్రీమ్ గార్ల్’ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రాగలిగానని చెప్పారు.

hema 26072018 2

తాను ఎంపీ కావడానికి ముందే బీజేపీ తరపున చేయాల్సిన మంచి పనులన్నీ చేసేశానని అన్నారు. గత నాలుగేళ్లుగా తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పిన హేమమాలిని, ప్రధాని మోదీపై, ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి పీఠాల కోసం తలపండిన రాజకీయాల నాయకులు ఆపసోపాలు పడుతుంటారు. ఓ పక్క జనం ఓట్ల కోసం, మరో పక్క అధిష్టానం కరుణ కోసం దేబిరిస్తూ ఉంటారు. తెరవెనుక కూడా నానా కథలూ నడిపిస్తుంటారు. సీఎం కావడం అంతకష్టమైన పని మరి. అయితే, ఇలాంటి సినిమా వాళ్ళు మాత్రం, టైం చెప్పి మరీ, మేము తలుచుకుంటే సియం అయిపోతాం అంటున్నారు.

కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్‌కల్యాణ్‌ భార్యలను మార్చేస్తాడంటూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌కల్యాణ్‌కి అభిమానులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. తమ నాయకుడిపై వ్యక్తిగతంగా జగన్‌ చేసిన విమర్శలను సహించేదిలేదంటూ ఇప్పుడు ఎక్కడికక్కడ కౌంటర్‌ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్‌ వ్యక్తిగత జీవితంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనం ఏమనుకుంటున్నారు? ఈ పర్యవసానం ప్రభావం వల్ల వైసీపీ, జనసేనల మధ్య భవిష్యత్తులో ఇదే వైరం కొనసాగుతుందా? పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎక్కువగా ఉన్న జిల్లాలోనే జగన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా అజెండా ఉందా? అనేదానిపైనా ఇంటెలిజెన్స్‌ దృష్టి సారించింది.

pk jagans 26072018 2

ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌ మొండిగా పవన్‌పై కామెంట్స్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు, సామాన్య జనంలో చర్చ నడుస్తోంది. ‘విమర్శలు చేసే నాయకుడు సచ్ఛీలుడై ఉంటే వ్యక్తిగత విమర్శలు చేసినా వాటికి ప్రాధాన్యం వస్తుంది. జగన్‌ గతంలో సీఎం చంద్ర బాబును కాల్చి చంపాలన్నారు. ఉరి తీయాలన్నాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగతంలోకి వెళ్లాడు. ప్రత్యేక హోదా అంశంపై చేస్తున్న ఉద్యమం ఇలాంటి వాటివల్ల పక్కదారిపట్టే ప్రమాదం ఉందని జగన్‌ గ్రహించాలి..’ అని ఓ నేత వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులలోనూ జగన్‌ చేసిన కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క, జగన్, పవన్ కలిసి డ్రామా ఆడుతున్నారనే అభిప్రాయాలు కూడా కొంత మంది చెప్పారు.

pk jagans 26072018 3

ఇక సోషల్ మీడియాలో అయితే, రెండు వైపులా యుద్ధమే జరిగింది. జగన్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జగన్‌ అక్రమ ఆస్తులు, ఆయన కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత ఆరోపణలూ జోరుగానే చేస్తున్నారు. జగన్‌ వ్యాఖ్యలకు జనసేన, పవన్‌ అభిమానులు విమర్శలు చేస్తుంటే... మరికొందరు పవన్‌ని ఇన్నాళ్లకు డైరెక్టుగా విమర్శించిన జగన్‌ ధైర్యవంతుడంటూ పేర్కొనడమూ చర్చనీయాంశమైంది. పవన్ ప్రకటనతో ఈ వివాదం ముగిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఊరుకునేదిలేదంటూ పవన్ ఫాన్స్ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నింటిపైనా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీసి నివేదిక పంపినట్టు సమాచారం. ముఖ్యంగా, ఈ గొడవ పెద్దది అయితే, ఎలా అనే విషయం పైనే ఇంటెలిజెన్స్‌ ఈ గొడవ పై నిఘా పెట్టింది. అయితే అనూహ్యంగా, ఇరు వైపులా, రెండో రోజుకే ఈ వివాదం ముగించేసారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వారే నిజమైన హీరోలని, డ్రామాలు ఆడేవారు ఎప్పుడూ జీరోగానే మిగులుతారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటంపై ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని, అన్యా యాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం వచ్చిందని అన్నారు. భాజపా ఎంపీలు సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రజల దృష్టిలో వారు మోసగాళ్ళయ్యారని అనారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం లభించినా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తాలని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిన్న రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన తీరు అద్భుతంగా ఉందని ఎంపీలను ప్రశంసించారు.

cbn punch 2607218 2

బీజేపీ మినహా అన్ని పార్టీలు రాష్ట్రానికి మద్ధతుగా నిలిచాయని, వారి సహకారంతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు. రాజ్య సభలో జరిగిన చర్చ ద్వారా దేశాన్ని మెప్పించగలగడంతోపాటు వివిధ పార్టీలను ఒప్పించగలిగామని అన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన పార్టీలకు లేఖల ద్వారా ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు చెప్పారు. పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటం ఇక పై కూడా కొనసాగుతుందని ఇప్పుడు మిగిలిన పార్టీలు ఏ విధంగా సహకరిస్తున్నాయో భవిష్యత్‌లో కూడా అదే విధంగా ఉండేలా కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని, ఇవి కళారూపాల్లో ఉండాలని నిర్ధేశించారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఆయా మంత్రిత్వ శాఖల వద్ద ఆందోళనలు చేయాలన్నారు. అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ సహించదనే విషయం ప్రజల్లోకి వెళ్ళిందని, దీన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

cbn punch 2607218 3

లోక్‌సభలో ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, రాజ్యసభలో వై.ఎస్‌.చౌదరి, సీఎం రమేష్‌ ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్‌ నిరాశ, నిర్వేదంతో వ్యక్తిగత విమర్శలు, నిందలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త సభ్యులు తమ మెయిడెన్‌ స్పీచ్‌లో కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించి కేంద్రం వైఖరిని ఎండగట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణం, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్‌ అంశాలపై పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్‌ నేతల ప్రసంగాలు వారి పై ప్రజల్లో ఉన్న ధ్వేషాన్ని తగ్గించాయని, బీజేపీ నేతల ప్రసంగాలు వారి అహాన్ని ప్రస్పుటించాయన్నారు. 90 శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడారని అదే విధంగా 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడం కుదరదని చెప్పినట్లు వారు అసత్య ప్రచారాలకు పాల్పడ్డారన్నారు. వీటిపై ఫ్రివిలేజ్‌ మోషన్స్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించి, మిగిలిన పార్టీల మద్దతును సమీకరించాలని ఎంపీలకు అధినేత చంద్రబాబు సూచించారు.

తన రాజకీయ పబ్బం కోసం, ఏ మాట అయినా మాట్లాడే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు. సోనియా దేవత అన్న నోటితో, అవసరం తీరిన తరువాత దెయ్యం అన్నాడు... నెల క్రితం ఎవడా "మోడీ గాడు" అన్న నోటితో, ఇప్పుడు మోడీకి జై కొడుతున్నాడు. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న కెసిఆర్, ఇప్పుడు ప్లేట్ మార్చారు. దీనికి కారణం కాంగ్రెస్ వర్కింగ్ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాకి మద్దతు తెలపటం. కాంగ్రెస్ తన ప్రధాన ప్రత్యర్ధి కాబట్టి, రాజకీయ పబ్బం కోసం, ఇప్పుడు ఆంధ్రా పై విషం చిమ్ముతున్నాడు. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేస్తోందనే వాదనను తెరపైకి తీసుకు వచ్చారు.

kcr 26072018 3

హరీష్ రావు ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణ పరిశ్రమలన్నీ తరలిపోయేలా కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి.. ప్రత్యేకహోదా అంశమే ప్రధాన ఎజెండా కానుంది. అనూహ్యంగా తెలంగాణలోనూ అదే జరగబోతోంది. ఈ ఇబ్బందిని అధిగమించాల్సిన భారం కాంగ్రెస్ పైనే పడింది. తెలంగాణ ప్రజల్లో ఈ హోదా సెంటిమెంట్ ఎంత మేర ఉంటుందన్నది.. టీఆర్ఎస్ నేతల కార్యాచరణ బట్టే ఉండవచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. మాకు ఏది ఇస్తే అదే కావాలని, మరోసారి ఆంధ్రా ప్రజల పై, విషం చిమ్మే పని పెట్టుకున్నాడు కెసిఆర్.

kcr 26072018 2

మొన్నటి దాక చెల్లలు కవిత మా ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చింది, చెల్లలు కవితకు ధన్యవాదాలు అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మాత్రం ఒక్క మాట కెసిఆర్ ని అనే సాహసం చెయ్యడు. కెసిఆర్ కు ఆరు మార్కులు ఇచ్చి, చంద్రబాబుకి 2 మార్కులు ఇచ్చింది, ఇలా మాటలు మార్చే కెసిఆర్ గురించేమో. మరో పక్క మోడీ కూడా, కెసిఆర్ ఎంతో పరిణితి చెందిన నాయకుడు, చంద్రబాబు అన్నిటికీ పేచీ పెడతాడు అని, ప్రధాని అనే హోదాను పక్కన పెట్టి మరీ, స్పీచ్ ఇచ్చింది, ఇలాంటి కెసిఆర్ మాటలు మార్చే రాజకీయం చూసేనేమో. తెలంగాణా విషయంలో ఎన్నో విభజన హామీలు ఉన్నా, మోడీని ఒక్క మాట కూడా అనకుండా నాటకాలు ఆడుతున్న కెసిఆర్, ఇప్పుడు ఎన్నికల వేళ, మళ్ళీ ఆంధ్రా వాళ్ళ మీద విషం చిమ్మి, రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడుతున్నాడు.

Advertisements

Latest Articles

Most Read