సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. విలన్స్, హీరోని ఏమీ చెయ్యలేక అతని అర్ధికమూలాల్ని దెబ్బతీయటం, హీరో దొరకలేదు అని ఊరును తగలబెట్టటం లాంటి పనులు చేయటం, సరిగ్గా అలాంటి విలన్స్ చేసే పనే ఇప్పుడు బిజెపి చేస్తుంది, చంద్రబాబు మీద కోపంతో, చంద్రబాబును ఏమీ చెయ్యలేక, ఆంద్రప్రదేశ్ ఆర్ధిక మూలాల్ని దెబ్బతియ్యాలని చూస్తుంది. ఆంద్రప్రదేశ్ కి అతిముఖ్య ఆదాయవనరు చేపల, రొయ్యల ఎగుమతి, విదేశీ ఎగుమతులే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం, ఆ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ రాష్ట్రానికి ఆదాయ వనరులే. అందుకే బిజెపి దారుణానికి తెగబడింది.

modishah 26072018 2

రాష్ట్రంలో పండే చేపల్లో ఫార్మాలిన్ ఉంటుంది అనే సాకు చూపించి, బిజెపి పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కొనుగోళ్ళు ఆపేశాయి. బిజెపి పాలిత రాష్ట్రాలకు తప్ప ఈ ఫార్మాలిన్ మరే రాష్ట్రానికి కనపడలేదు. బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఎప్పటిలాగే కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాదు మన రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్న సౌత్ ఆసియన్ కంట్రీస్, కొత్తగా కొంటున్న కొరియా , యూరోపియన్ కంట్రీస్, జపాన్.... వీటిలో ఏ దేశానికి కూడా ఈ ఫార్మాలిన్ కనపడలేదు. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాలకే కనపడింది.

modishah 26072018 3

ఇది కేవలం చంద్రబాబు మీద కోపంతో, తమ పార్టీని ఎదిరించాడని , అందుకే ఆంద్రప్రదేశ్ ని ఆర్ధికంగా దెబ్బతీయాలని చూస్తున్న కమలనాధుల నాటకం, రాజకీయ విభేదాలున్నా, సైద్దాంతిక వైరుధ్యాలున్నా ఎప్పుడు , ఏ పార్టీ ఇలా ప్రవర్తించింది లేదు. ఇంత దారుణంగా, బహిరంగంగా, నిర్లజ్జగా అధికార దుర్వినియోగం చేస్తున్న పార్టీ బిజెపినే. ఆక్వా రంగంలో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టార్గెట్ గా బీజేపీ చేస్తున్న అన్యాయం ఇది. ఒక పక్క నిధులు ఇవ్వక, హక్కులు కూడా ఇవ్వక, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతూ, మన సొంతగా కష్టపడి పైకి వస్తుంటే, మన కష్టం పై కూడా బీజేపీ కక్ష సాధిస్తుంది. ఇలా కూడా కక్ష సాధిస్తారా అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఒక పార్టీకి అధినేత. పైగా రాష్ట్ర ప్రతిపక్ష నేత. ఇంతటి హోదాలో ఉన్న వ్యక్తి చౌకబారు వ్యాఖ్యలు చేసి జనంలో పదేపదే చులకనవుతుండటం వైసీపీని కలవరపాటుకు గురి చేసే అంశం. పార్టీ అధినేత చేసే వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించడానికి ఆ పార్టీ నేతలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. తాజాగా పవన్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్ గతంలో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు సీఎం సీటులో కూర్చున్నారన్న అక్కసో లేక తాను కూర్చోలేకపోయానన్న ఆవేదనో తెలియదు గానీ చంద్రబాబును ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పులతో కొట్టాలని జగన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మరోసారి మరింత తీవ్రంగా.. చంద్రబాబును ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. చంద్రబాబును కాల్చి చంపాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

pk jagan 26072018 2

తాజాగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ ‘కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్‌కల్యాణ్‌ పెళ్లాల్ని మార్చేస్తాడు. ఇప్పటికే నలుగుర్ని మార్చాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడ..?’ అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి అనేక వ్యక్తిగత ఆరోపణలు ఇది వరకు చేసారు. చంద్రబాబుని అవహేళన చెయ్యటం, లోకేష్ గురించి వ్యక్తిగతంగా హేళన చెయ్యటం, ట్వీట్లు వేసి రాధాకృష్ణా, రవి ప్రకాష్ భార్యల ఫోటోలు పెట్టి వెకిలిగా ట్వీట్ చెయ్యటం, ఇలా ఎన్నో పనులు పవన్ కూడా చేసారు.

pk jagan 26072018 3

ఇద్దరూ ఇద్దరే అని, ఎవరి మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అభిప్రాయ పడుతుంది. జగన్-పవన్ వివాదంలో తలదూర్చవద్దని టీడీపీ అధిష్ఠానం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని, మధ్యలో తలదూర్చి ఇరుక్కోవద్దని అధిష్ఠానం సూచించింది. ఎవరూ తక్కువ కాదని, ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటంలో, ఒకరికి మించిన వారు, ఒకరని, పవన్ కూడా నిన్న జగన వ్యాఖ్యల పై స్పందిస్తూ, చంద్రబాబుని కూడా లాగి విమర్శలు చెయ్యటాన్ని ప్రస్తావిస్తూ, టిడిపి అధిష్టానం స్పందించింది. పవన్, జగన్ ల వ్యక్తిగత దూషణల ఫై, విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంటనే వెనక్కి తగ్గారు. సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరినప్పుడు చాలామంది నేతలు నిరాకరించారు.

పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు తమకెంతో స్ఫూర్తినిస్తున్నాయని, అన్నక్యాంటీన్ల నిర్వహణకోసం తాము 3,32,500 విరాళంగా ఇస్తున్నట్లు రాజధాని ప్రాంత రైతులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కష్టాలలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారని, ఈ దశలో తాము అండగా నిలవాలని నిశ్చయించామని వారన్నారు. అందుకే అన్నక్యాంటీన్ల నిర్వహణకు విరాళమిచ్చామని వివరించారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో మందడం, ఉండవల్లి, కృష్ణాయపాలెం, తాళ్లాయపాలెం రైతులున్నారు.

amaravati cbn 25072018 2

రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తనపై ఎంతో విశ్వాసంతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ఫలాలు అందుకునే మొదటి లబ్దిదారులు రైతులేనని, అమరావతి అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేసి లబ్ది చేకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లి లోని ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో వచ్చి తనను కలసిన రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రశాంత సరోవరంలో రాళ్లు వేసినట్లు కొందరు రాజధాని రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఇది సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. చేతనైతే తమతో కలసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.50,000 కోట్లతో ఇప్పటికే పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

amaravati cbn 25072018 3

‘మా ప్రాంతంలో రాజధాని నిర్మాణం మాకెంతో గర్వకారణం. భూ యజమానులమైన తాము స్వచ్ఛందంగా తమ భూములను స్వచ్ఛందంగానే సమీకరణ విధానంలో ఇచ్చాం. ఇందులో ఎవరి బలవంతం లేదు. కొన్ని శక్తులు పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి రెచ్చగొడుతున్నాయి’ అని రాజధాని ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ‘భూములు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, తమను ఎవరూ ఒత్తిడి చేయలేదని వారు చెప్పారు. ‘మేం ఇక్కడే పుట్టాం. ఇక్కడే పెరిగాం. మా ప్రాంతంలో రాజధాని నిర్మించడం మాకెంతో గర్వకారణం. ఈ ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం. మీమీద విశ్వాసంతోనే రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చాం. మరో పదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మా ఆకాంక్ష’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజధాని ప్రాంత రైతులు అన్నారు.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, ప్రజల దీనెనలతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తే ఒక్క మందు షాపు కూడా లేకుండా చేస్తానని హామీ యిస్తున్నానని అన్నారు. ‘2018 లోనో లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి. మన ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో జరిగే ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చే సరికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని జగన్ అన్నారు.

jagan 25072018 2

మరో పక్క చంద్రబాబు పై విమర్శలు చేస్తూ... "చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలో కనిపించేవి.... మోసం, అవినీతి, అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలు చెప్పే వారు, మోసం చేసే వ్యక్తులు పూర్తిగా పోవాలి. చెడిపోయిన రాజకీయాల్లోకి నిజాయితీ రావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానా పని తాను చేస్తానని చెబితే.. అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలి. చంద్రబాబు నాయుడును పొరపాటున క్షమిస్తే.. ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు.. నేను వచ్చిన తరువాత అవినీతి ప్రక్షాళన చేస్తా.. నా హయంలో, అవినీతి అనే మాట లేకుండా చేస్తా, అవినీతి పై పోరాటం చేస్తా" అంటూ ప్రసంగం చేసారు. మరో పక్క, హోంమంత్రి చినరాజప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు.

jagan 25072018 3

జిల్లాలో శాంతి భద్రతలు కరువయ్యాయని విమర్శించారు. దీనికి పెద్దాపురం పరిసరాల్లో ఆరు హత్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆనూరుమెట్ట గ్రావెల్‌ మాఫియా వెనుక చినరాజప్ప, ఆయన తనయుడి ప్రమేయం ఉందని జగన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పై చినరాజప్ప స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలను హోంమంత్రి చినరాజప్ప తిప్పికొట్టారు. అసహనంతోనే జగన్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో పెద్దాపురం నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగితే ఆరు హత్యలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగడం లేదని చెప్పారు. జగన్ పాదయాత్రలో జనమే లేరని చినరాజప్ప ఎద్దేవా చేశారు.

Advertisements

Latest Articles

Most Read