పార్లమెంటు బయటే కాదు లోపల కూడా టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగిస్తున్నారు. లోక్‌సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్న డిమాండ్లను ఈరోజు కూడా ఎంపీలు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు దగ్గర బంధుత్వం ఉందని కేంద్ర మంత్రి అనంతకుమార్ చెప్పారు. ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కేంద్ర మంత్రి అనంతకుమార్ వారిని కోరారు.

parliament 26072018 2

అయితే టీడీపీ ఎంపీలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని టీడీపీ ఎంపీలు కోరారు. దీంతో కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. ఏపీ సమస్యలు తనకు కూడ తెలుసునని చెప్పారు. లోక్‌సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అనంతకుమార్ కోరారు. కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు.

parliament 26072018 3

ఎంపీ శివప్రసాద్ తనదైన స్టైల్లో కొత్తవేషంలో నిరసన తెలిపారు. సర్ ఆర్దర్ కాటన్ వేషధారణలో ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి ఎలిగెత్తి చాటారు. వర్షంలో తడుస్తూనే ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ‘స్వదేశీయుడైన మోదీ ఆంధ్రరాష్ట్రంతో చెలిమి చేసి, గెలిసి ప్రధాని అయ్యాక ఇప్పుడు మాట తప్పుతున్నారని, ప్రధానిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి....వితండ వాదం మాని, సకాలంలో నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయండి...చరిత్రలో నిలిచిపోతారు’ అని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ‘పార్లమెంటులో ఎంతో మంది వచ్చారు పోయారు...మీరు కూడా పోతారని అయితే మనిషిగా వెళ్లండి’ అని సూచించారు. అలా కాకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్తే ప్రజలే చూసుకుంటారని ఎంపీ శివప్రసాద్ అన్నారు.

రాజకీయ నాయకులు వివిధ రూపాల్లో ప్రజల సొమ్ము నొక్కేయటం చూసాం కాని, గన్నవరంలో జరిగిన లాంటి సంఘటన మాత్రం బహుసా మొదటది కావచ్చు. ఏపీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదు అయింది. తనకు రావాల్సిన నష్టపరిహారం లక్ష రూపాయలు పద్మశ్రీ కాజేశారంటూ కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో మరియంబీ అనే మహిళ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉంగుటూరు మండలం, ఆత్కూరులో నిర్వహించిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో తొలుత తన గోడు వెళ్లబోసుకుంటూ బాధితురాలు కన్నీటి పర్యాంతమైంది. దీంతో ఎమ్మెల్యే వంశీ ఏం కావాలంటూ ప్రశ్నించారు.

sunkara 26072018 2

సాయం కావాలని ఆమె కోరగా.. ఎమ్మెల్యే అధికారులకు సాయం చేయాలని సూచించారు. అయితే తనకు కావాల్సింది డబ్బులు కాదంటూ అసలు విషయం చెప్పింది. తన కుమారుడు మృతి చెందిన తర్వాత డెయిరీఫాం యజమాని ఇచ్చిన నష్టపరిహారాన్ని సుంకర పద్మశ్రీ తనకు ఇవ్వడంలేదని బాధితురాలు ఆరోపించింది. రెండేళ్ల క్రితం మరియంబీ కొడుకు పఠాన్‌ సాయికుమార్‌ ఓ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తూ.., చెరువులో పడి మృతిచెందాడు. ఆ సమయంలో డెయిరీ ఫామ్‌ యజమాని దొప్పలపూడి ప్రవీణ్ నుంచి తనకు నష్టపరిహారం ఇప్పిస్తామంటూ కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం వహించారని చెబుతోంది మరియంబి.

sunkara 26072018 3

నష్టపరిహారం ఇచ్చిన మొత్తం తన వద్దే ఉంచుకుని రెండేళ్లయినా ఇవ్వట్లేదని ఆరోపిస్తూ గ్రామదర్శినిలో కన్నీళ్లు పెట్టుకుంది మరియంబి. డబ్బులు అడిగితే సుంకర పద్మశ్రీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరిస్తోందని ఆరోపించింది. మరియంబీ వాదన విన్న వంశీ పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పిర్యాదు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు సుంకర పద్మశ్రీ. తనకు లక్ష రూపాయలు ఇచ్చింది నిజమే అయితే... ఎవరు ఇచ్చారో వారే వచ్చి పట్టుకెళ్లాలంటూ ఫోన్‌లోనే సవాల్ విసిరారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపించారు.

రెండు రోజుల నుంచి రక్తి కట్టించిన జగన్ - పవన్ డ్రామా ముగిసింది. జగన్‌మోహన్‌ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడం పై సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్ చేసారు. జగన్ తనను ఈ విధంగా విమర్శించడం ఎందరినో బాధించిందని అన్నారు. దయచేసి ఈ వివాదాన్ని అందరూ ఇక్కడితో ఆపేయాలని కోరుకుంటున్నా, అంటూ ఈ మేరకు ట్విటర్‌లో ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారు. అయితే పవన్ స్వభావం తెలిసిన ఎవరూ, పవన్ ఇలా స్పందిస్తాడు అని ఊహించలేదు. చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణా, రవిప్రకాష్ పై వ్యక్తిగత ఆరోపణలు ఎలా చేసాడో, అలాగే చేస్తాడు అని అందరూ ఊహించారు. కాని, జగన్, పవన్ కి ఎంతో స్పెషల్ అందుకే, జగన్ ను ఏమి అనలేదు.

pk 26072018 2

ఇది ఇలా ఉండగా, దీని పై చాలా స్టొరీ జరిగింది. ఈ సంధి వెనుక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు దగ్గరుండి చూస్తున్న, బీజేపీ అగ్ర నేత హస్తం ఉంది. ఈ నేత రాత్రికి రాత్రి రంగలోకి దిగి, జగన్, పవన్ ఇద్దరికీ "తమదైన శైలి" లో జ్ఞానోదయం చెయ్యటంతో, ఇరువురూ లైన్ లోకి వచ్చారు. అందుకే నిన్నే జగన్ ఈ విషయం ఆపేస్తే, ఈ రోజు పవన్ ట్విట్టర్ ద్వారా, ఈ విషయం వదిలెయ్యండి అంటూ, స్టొరీ రక్తి కట్టించారు. జగన్, పవన్ ఇద్దరికీ ఇగో బాగా ఎక్కువ, కాని ఇప్పుడు ఈ ఇగోల కంటే, వీరికి చంద్రబాబుని దింపటం ముఖ్యం. అందుకే ఆ టార్గెట్ కోసం, ఇద్దరూ వాళ్ళ ఇగో పక్కన పెట్టి మరీ, కంప్రోమైజ్ అయ్యారు.

pk 26072018 3

పవన్, జగన్ ఇద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అనే వాతావరణం మొన్నటి దాకా ఉంది. ఇద్దరూ కలిస్తేనే చంద్రబాబుని ఎదుర్కొగలమని, బీజేపీ వీళ్ళద్దిరినీ కలిపే ప్రయత్నం చేస్తూ వస్తుంది. విడి విడిగా పోటీ చేస్తే, చంద్రబాబు ప్రచారం చెయ్యకపోయినా గెలిచిపోతారు. అందుకే, జగన్ - పవన్ కలిసి పని చెయ్యాలనేది బీజేపీ వ్యూహం. అయితే, అనూహ్యంగా జగన్ తన ఇగో బయట పెట్టారు. దీనికి అనేక కారణాలు ఉన్నా, పవన్ తో పొత్తు విషయంలో ఇది ఒక అవరోధం అని బీజేపీ భావించి, వెంటనే పవన్ కళ్యాణ్ చేత అదే విధమైన రియాక్షన్ రాకుండా జాగ్రత్త పడింది. రాత్రికి రాత్రి, అటు పవన్, ఇటు జగన్ లతో సంప్రదింపులు జరిపి, మీ ఇగోలో కంటే, చంద్రబాబుని దింపటమే ముఖ్యం అనే విషయం అర్ధం అయ్యేలా చెప్పి, తమదైన శైలిలో జ్ఞానోదయం చేశాడు ఆ బీజేపీ అగ్ర నేత. అందుకే ఈ రోజు పవన్, వివాదం ముగిసిపోయింది అంటూ ట్వీట్ వేసాడు, నిన్నటి నుంచి జగన్ క్యాంప్ సైలెంట్ అయిపొయింది.

నేను తిట్టాలి అంటే వాడు బలహీనుడు అయ్యి ఉండాలి.. నేను ఎంత హీనంగా తిట్టినా, నన్ను ఏమి అనని సంస్కారం ఉన్న వాళ్ళు అయ్యి ఉండాలి... వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు ఫోటోలు మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టి అల్లరి చెయ్యండి.. మిగతా వాళ్ళు ఎవరు తిట్టినా, తుడుచుకుని పోండి.. ఇది ఈ రోజు పవన్ పెట్టిన కాంప్రోమైజ్ ట్వీట్ ఉద్దేశం.. కులబలం, ఆర్ధికబలం, మందబలం లేని దళితుడు కాబట్టి కత్తి మహేశ్ మీద దండయాత్ర చేశారు. చెప్పులు, గుడ్లు కొట్టారు. అండదండల్లేని చిన్న హీరోయిన్ శ్రీరెడ్డి మీదకి మొత్తం మెగా ఫ్యామిలీ మా అసోషియేషన్ ఆఫీసుకి వెళ్ళి వీరంగం వేసింది. ఇప్పుడు మాత్రం జగన్ రెడ్డి అంత బాహాటంగా పవన్ పై అన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే కనీసం ఒక వైసీపీ ఆఫీసు ముందు ధర్నా చెయ్యలేకపోయారు.

pk 26072018 2

మళ్ళీ మేము లేస్తే మనుషులం కాము అని బోసడింగులు. వైసీపీవాళ్ళు తంతారని భయమా ? లేక ఎలాగూ మీలో సగం మంది జనసేన ముసుగులో ఉన్న జగన్ రెడ్డి కోవర్టులు కాబట్టా ? పవన్ కల్యాణ్ దేబుడు.. ఏమన్నా అంటే పొడిసేత్తాం...సంపేత్తాం అని వీరంగం వేసే బుడగలన్నీ పేలిపోయి, గమ్మున మూలకి చీపుళ్ళలాగా కూచున్నయి. పవన్ ఒక బుడగ అని తేలిపోయింది. మాకు బలం తూర్పు గోదావరి జిల్లా అని చెప్పుకునే జనసేన, అదే చోట జగన్ మిమ్మల్ని అన్ని మాటలు అంటే, కనీసం జగన్ ఉంటున్న చోటుకు వెళ్లి నిరసన చెప్పలేకపోయారు. అంటే మీ ప్రతాపం చూపించేది, శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారి మీదేనా ? చంద్రబాబు, లోకేష్ లాంటి వారిని ఏమన్నా అన్నా, వారు సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి, వారిని ఎన్నైనా అనొచ్చు అనా ?

pk 26072018 3

జగన్ చెప్పిన మాటలకు, కనీస ప్రజాస్వామ్య విధంగా కూడా నిరసన తెలిపలేదు అంటే అర్ధం ఏంటి ? ఈ రోజు వివాదం అయిపొయింది అని చెప్పటంలో అర్ధం ఏంటి ? ఇద్దరూ కలిసి ఈ నాటకం ఆడి ఉండాలి... లేకపోతే పవన్ కళ్యాణ్ కు, జగన్ లాంటి వారిని టచ్ చేసే దమ్ము లేక అయ్యి ఉండాలి. మరో పక్క పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి, ఇంట్లో ఆడవాళ్ళను లాగటం గురించి కూడా ట్వీట్ చేసారు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు భార్య, కోడలు కష్టపడి 22 ఏళ్ళ నుంచి నడుపుకుంటున్న హెరిటేజ్ పై విమర్శలు చేసి, వారిని బజారుకు లాగినప్పుడు ? రాధాకృష్ణా, రవిప్రకాష భార్యల ఫోటోలు, ట్వీట్ చేసినప్పుడు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగ కూడదు అని తెలియాదా ? కులబలం, ఆర్ధికబలం, మందబలం లేని వాళ్ళు, సంస్కారంతో ఉన్న వాళ్ళే పవన్ టార్గెట్.. అందుకే జగన్ జోలికి వెళ్ళే సాహసహం కూడా చెయ్యలేక పోయాడు. మళ్ళీ, నేను లెగిస్తే మనిషిని కాదు అని బిల్డ్ అప్ ఒకటి.. సరైన రాజకీయం చెయ్యండి పవన్ గారూ...

Advertisements

Latest Articles

Most Read