అప్పుడెప్పుడో, శ్రీ రెడ్డి అనే అమ్మాయి, తనకు ఎదో జరిగిందని హడావిడి చేసి, కొన్ని రోజులుకి పవన్ ఎదో అన్నాడని, పవన్ కళ్యాణ్ ని ఎదో తిట్టింది. అయితే దీని పై నాలుగు రోజుల తరువాత, చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు ధర్మ పోరాట దీక్ష మొదలు పెట్టిన క్షణమే, పవన్ హడావిడి మొదలు పెట్టాడు. శ్రీరెడ్డిని అమరావతి నుంచి ఆదేశాలు ఇచ్చి, చంద్రబాబు తిట్టించాడు అని పవన్ అన్నాడు. అంతే కాదు, కులం కోణం కూడా కలిపి, చేసిన ట్వీట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎవరో శ్రీ రెడ్డి, పవన్ చేసిన వ్యాఖ్యల పై తిడితే, దానికి చంద్రబాబుని బాద్యుడిని చేసి, ఒక రాజకీయ డ్రామా నడిపాడు పవన్... ఇప్పుడు తాజాగా, నాలుగు నాలుగు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అని జగన్ విమర్శలు చేస్తే, దానికి కూడా చంద్రబాబుని కలిపి తిడుతున్నాడు పవన్.

pk 25072018 2

ఈ వ్యాఖ్యల పై ఈ రోజు స్పందించారు పవన్. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్‌ స్పందించారు. సమాజంలో మార్పు తీసుకొస్తానన్న భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ తనను టార్గెట్‌ చేశాయని, ఐదేళ్లు కష్టపడితే ముఖ్యమంత్రి లేదా మంత్రి సీట్లో కూర్చోవచ్చని, కాని దాని వల్ల సమాజంలో మార్పు రాదని ఆయన అన్నారు. తిడితే భయపడతామనే భావనలో కొందరు నాయకులు ఉన్నారన్నారు. చంద్రబాబు, జగన్‌ రాజ్యాంగాన్ని రాయలేదని, అంబేడ్కర్‌ రాశారని పవన్‌ అన్నారు.

pk 25072018 3

విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే తాను వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసిన వాడినన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరని, పారిపోతారని అన్నారు. అయితే, అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. నా దగ్గరికి వస్తే తోలు తీస్తా. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెదేపా, వైకాపా, భాజపా నన్ను తిడుతున్నాయి అంటూ, జగన్ చేసిన వ్యాఖ్యలకు, జగన్ ను డైరెక్ట్ గా అనలేక, చంద్రబాబుని కూడా కలిపి, ఎంతో వెకిలిగా స్పందించాడు పవన్. అసలు జగన్ అనే వాడి భాషకు, చంద్రబాబు లాంటి స్టేట్స్మెన్ ను కలిపి, విమర్శలు చెయ్యటం ఏంటో, ఈ డ్రామాలు ఏంటో... అంతా అమిత్ షా మాయ...

అవినీతిని అంతం చేయాలని కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ1, ఏ2 ముద్దాయిలైన వైసీపీ నాయకులు పాదయాత్రల పేరుతో రోడ్లపై తిరిగేవారా అని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నిలదీశారు. అవినీతి నిరోధక సవరణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘అవినీతి కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులే నేరుగా ప్రధాని కార్యాలయంలో తిరుగుతూ పైరవీలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 11 కేసుల్లో ప్రథమ నిందితుడిపై సీబీఐ రూ.45 వేల కోట్ల అవినీతి జరిగిందని కేసులు మోపితే.. ఆరేళ్లు గడిచినా ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ చూశాకే వైసీపీ, బీజేపీ కలిసిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి’ అని తెలిపారు.

bill 25072018 2

ఎన్నికల సమయంలో 100 రోజుల్లో నల్లధనం తిరిగి తీసుకొస్తామని బీజేపీ చెప్పిందని.. నాలుగేళ్లు గడచినా అది జరగలేదు సరికదా.. మన తెల్లధనం విదేశాలకు తరలిపోతోందని చెప్పారు. ‘అవినీతిని ఆపాలని చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే నీరవ్‌ మోదీ, లలిత్‌మోదీ లాంటివారు మన సొమ్ము కొల్లగొట్టకుండా ఉండేవారు. అవినీతి బిల్లు తీసుకొచ్చి నీతులు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం.. కర్ణాటకలో అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి (గాలి జనార్దనరెడ్డి)ని ఎన్నికల్లో పక్కన పెట్టుకోలేదా..? అవినీతి ఆరోపణలతో పదవి వదిలేసిన సీఎంనే మళ్లీ సీఎం చేసేందుకు ప్రయత్నించలేదా? బలం లేకుండానే 15 రోజుల సమయమిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలుకు అవకాశం కల్పించలేదా?

bill 25072018 3

ఒక్కో ఎమ్మెల్యేకు జీవితంలో సంపాదించిన దానికి రెట్టింపు సంపాదించుకునే అవకాశం ఇస్తామని బేరసారాల టేపులు బయటకు రాలేదా? ఇవన్నీ అవినీతి కాదా’ అని సభాముఖంగా ప్రశ్నించారు. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కర్ణాటకలో దాచిపెడితే, ఆశ్రయమిచ్చిన మంత్రి ఇంటిపై దాడి చేసి కోట్ల సొమ్మును బయటపెట్టారని.. అది సంతోషమే గాని.. చట్టాలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు విడుదల చేస్తూ మిగతా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదా అని నిలదీశారు. ఇలాగే కొనసాగితే బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని కిష్టప్ప హెచ్చరించారు.

2013 ఫిబ్రవరి 24న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రిగా తాను చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత గౌరవ ప్రధాని గౌరవిస్తారని ఆశిస్తున్నానని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాజ్యసభలో స్వల్పకాల వ్యవధి చర్చలో పాల్గొంటూ... విభజన తర్వాత హైదరాబాద్‌ ఆదాయాలు తెలంగాణకే చెందుతాయి కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ, ఇతర బీజేపీ నేతలతో కలసి చర్చించి తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఎవరు అధికారంలో ఉన్నా గౌరవించాలని, ఆ వాగ్దానాలు పార్లమెంట్‌ తరఫున చేసినవని మన్మోహన్‌సింగ్‌... మోదీకి గుర్తు చేశారు.

manmohan 25072018 2

‘‘హైదరాబాద్‌లో వసూలయ్యే ఆదాయమంతా తెలంగాణకు వెళ్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఆనాడు నేను ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చాను. నాటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీతోపాటు, ఇతర భాజపా సీనియర్‌ నేతలతో చర్చించిన తర్వాతే ఆ ప్రకటన చేశాను. ప్రభుత్వం అన్నది నిరంతర ప్రవాహం. సభలో ఇచ్చిన హామీలను గౌరవించి అమలు చేయాలి. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు ప్రధాని సహచరులుగా ఉన్న వ్యక్తులతో చర్చించిన తర్వాతే నేను ఆనాడు హామీలు ఇచ్చినందున... ప్రధాని వాటన్నింటినీ అమలు చేయాలి.’’ అని మన్మోహన్ అన్నారు.

manmohan 25072018 3

చర్చకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిచ్చారు. ‘‘విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేశాం. ఇప్పటికే 90 శాతం హామీలు నెరవేర్చాం. మిగిలినవి నెరవేరుస్తున్నాం. ప్రత్యేక హోదా ద్వారా లభించే నిధులకన్నా అధికంగానే ఇస్తున్నాం. ప్రధాన మంత్రి అంటే ప్రధాన మంత్రే. ఏ పార్టీ ప్రభుత్వానికి చెందిన వారైనా సరే... ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏపీకి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కూడా అన్నారు. అదే సమయంలో... మన్మోహన్‌ ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’పై మాత్రం పాతపాటే పాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘

మేధావి మౌనం స‌మాజానికి ప్ర‌మాద‌క‌రం అంటారు. నాకు అన్నీ తెలుసు, కాని చైర్మన్‌గా ఉన్నందుకే ఏపి సమస్యల పై మౌనంగా ఉన్నాను అంటున్నారు వెంకయ్య నాయుడు గారు. అంటే దీని అర్ధం ఏంటి సార్ ? మీకు ఆ పదవి ముఖ్యమా, లేక మీ పార్టీ ముఖ్యమా ? రాష్ట్రం ఏమి అయిపోయినా పరవాలేదా ? మీరు నోరు తెరిచి, అప్పుడేమి జరిగింది, ఇప్పుడేమి జరిగుతుంది అని నిలదీస్తే, 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో, చిర స్థాయిగా నిలిచిపోతారు. నిన్న వెంకయ్య మాట్లాడుతూ, ‘‘అప్పుడేం జరిగిందో, సభలో ఎవరేం మాట్లాడారో అందరికీ తెలుసు. ఏది నిజం, ఏది నిజం కాదన్నది నాకూ తెలుసు. కానీ... అధ్యక్ష స్థానంలో ఉన్నందునే దాని గురించి మాట్లాడలేకపోతున్నాను’’ అని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై తనకూ సంబంధముందని చెప్పారు.

parliametn 25072018 2

మరో పక్క వెంకయ్య చెప్పిన మరో మాట కూడా ఆలోచించాల్సిన విషయం. "చట్టసభల్లో ఏమీ జరగవు ఏమి జరగాలన్న అది కేంద్రంతో యొక్క ఆలోచనకు అనుగుణంగానే జరుగుతాయి" అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ వెంకయ్య నాయుడు గారు ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పటంలో అర్థం ఏమై ఉంటది? మోడీ షాల కింద ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీద చట్టసభల మీద పార్లమెం టు మీద ఇటువంటి భావన కలిగి ఉంది అన్ని యావత్ దేశానికి తెలియజేశారు. ఇది ఒక ప్రమాదం సంకేతం. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వెంకయ్య ఒకానొక దశలో భావోద్వేగంతో స్పందించారు. తమకు మరింత సమయం కేటాయించాలని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్‌లోకి వచ్చి గట్టిగా డిమాండ్‌ చేశారు. టీడీపీ, టీఆర్‌ఎ్‌సకు ఎక్కువ సమయం ఇచ్చి... తమకు ఇవ్వలేదని... వెంకయ్య పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని విజయ సాయిరెడ్డి గట్టిగా అన్నారు.

parliametn 25072018 3

అయితే... సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇచ్చామని, అలా కేటాయించిన దానికంటే ఎక్కువగానే మాట్లాడించానని వెంకయ్య చెప్పారు. సభ నుంచి వాకౌట్‌ చేస్తామంటూ విజయసాయి రెడ్డి ఇంకా ఏవో వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంకయ్య తీవ్రంగా స్పందించారు. ‘ఇలా బ్లాక్‌మెయిల్‌ చేస్తామంటే కుదరదు’ అని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో రాజ్యసభలో అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పలుపార్టీల నేతలు విమర్శలు వ్యక్తం కావడంతో... ఆయన వెంకయ్యను కలిసి క్షమాపణ చెప్పినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి.

Advertisements

Latest Articles

Most Read