రాజకీయాల్లో నాయకుడుకి హుందా అనేది ఎంతో ఉండాలి. మనం మాట్లాడే మాటలను బట్టే, మన కార్యకర్తలు మనలను ఫాలో అవుతారు. అది మంచి అయినా, చెడు అయినా అంతే.. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అదే విషయం పవన్ ఫాన్స్ ప్రచారం చెయ్యటం చూసాం. మాటి మాటికి, లోకేష్ ని, చంద్రబాబు అనుభవాన్ని వ్యంగంగా, వెకిలిగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, తరువాత పవన్ ఫాన్స్ అదే రకంగా, సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ చూస్తున్నాం. అయితే, పవన్ ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా, ఏ నాడు లోకేష్ కాని, చంద్రబాబు కాని వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యలేదు. లోకేష్ కూడా, ట్విట్టర్ లో సంభోదించే సమయంలో, పవన్ కళ్యాణ్ గారు అనే సంభోదించేవారు. అయితే, పవన్ మాత్రం, జగన్ స్నేహం కోసం తహతహ లాడుతున్నారు.
అయితే, ఈ రోజు జగన్ మాత్రం తను ప్రతిపక్ష నాయకుడు అనే విషయం మర్చిపోయి, ఉందాతనం వదిలేసి, మాట్లడారు. పవన్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసారు. పవన్ కు ఎమన్నా విలువలు ఉన్నాయా, నలుగురు నలుగురు పెళ్ళాలు ఉన్నారు. కార్లు మార్చినంత ఈజీగా పవన్ కల్యాణ్ పెళ్లాలను మార్చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ ఇప్పటికే నలుగురు పెళ్లాలను మార్చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి నైతికత.. నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్, సామర్లకోటలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"మన ఖర్మ కొద్దీ పవన్ లాంటోళ్లు మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది" అని జగన్ వాపోయారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్ అని, వ్యక్తిగత జీవితం ముడిపెట్టి, జగన్ తీవ్ర విమర్శలు చేసారు. పవన్ నిత్య పెళ్ళికొడుకు అని, మరొకడని అయితే, బొక్కలో వేసేవారని పవన్ పై వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా మాట్లాడాల్సిన చోట, వ్యక్తిగత జీవితాలు తెచ్చి, కొత్త తరహా రాజకీయం మొదలు పెట్టాడు జగన్. ఇది ఇంకా ఇంకా ఎంత దిగజారి పోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా, ఇప్పటికైనా గాలి కబ్రులు మాట్లాడటం ఆపేసి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాకుండా, హుందా రాజకీయం చెయ్యాలి. ఇక జగన్ గురించి, మనం చెప్పేది ఏముంటుంది. వాళ్ళ రాజకీయమే దిగజారుడు రాజకీయం...