విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సమాజ్‌వాదీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ కేంద్రాన్ని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన సభకు గుర్తు చేశారు. విభజనల వల్ల ఆయా రాష్ట్రాల్లో అనేక సమస్యలు నెలకొంటున్నాయని వివరించారు. పంజాబ్‌, హరియాణా విడిపోయినా ఇప్పటికీ నదీ జలాల విషయంలో కత్తులు దూసుకుంటున్నాయని చెప్పారు.

samajavadiparty 2407218 2

సట్లేజ్‌ నది నీళ్లు హరియాణాకు చేరడంలేదని తెలిపారు. కృష్ణా, గోదావరికి సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా కల్గిన ఉత్తరాఖండ్‌లో ఎలాంటి సౌకర్యాలూ లేవన్నారు. ఉత్తరాఖండ్‌లో వాహనాలు లోయలో పడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా ఒక్కటి కూడా ట్రామా సెంటర్‌ లేదన్నారు. ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కూడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరినట్టు ఆయన గుర్తు చేశారు.

samajavadiparty 2407218 3

దేశంలో కొన్ని రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని ప్రధానమంత్రి ఇచ్చిన హమీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇస్తామని ఇచ్చిన హమీని కూడ కేంద్రం నిలుపుకోలేదని టీడీపీ ఎంపీలు తనకు ఇచ్చిన బుక్‌లెట్లలో ఉందని రామ్ గోపాల్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

సుజనా చౌదరి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు... కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా రాజీనామా చేసారు... అయితే, గత కొన్ని రోజులుగా వైసిపీ, బీజేపీ, జనసేన కలిసి, సుజనా చౌదారి పార్టీ మారుతున్నాడు అని, చంద్రబాబు పై నమ్మకం లేక, బీజేపీ పార్టీలో చేరుతున్నారని, ప్రచారం మొదలు పెట్టారు... కొన్ని వార్తా చానల్స్ అయితే, స్పెషల్ ప్రోగ్రామ్ లు కూడా వేసాయి... గతంలో ఎన్నో సార్లు, సుజానా ఈ పుకార్లు ఖండించినా, ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు... మోడీకి భయపడిపోయి సుజనా పార్టీ మారుతున్నాడు అనే వారు, ఈ రోజు రాజ్యసభలో జరిగింది చూస్తే మరోసారి ఇలా మాట్లడరేమో...

sujana 24072018 2

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ అంశంపై చర్చకు అనుమతించారు. చర్చకు మొత్తం 2.30 గంటల సమయాన్ని కేటాయించినట్లు చెప్పారు. చర్చను మొదటగా తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించారు. కేంద్రం వైఖరి వల్ల, మోడీ వైఖరితో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమయిందని సుజనాచౌదరి ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుజనా చర్చను ప్రారంభించిన ఆయన మోదీపై నిప్పులు చెరిగారు.! రాజ్యసభలో మాజీ ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మూకదాడుల తరహాలోనే ఏపీపై కేంద్రం వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అలాగే విభజన చట్టాన్ని సవరించడంలో కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు, తిరుపతి సభలో మోదీ చెప్పలేదా? అని సుజనా నిలదీశారు. మంత్రి వర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ మంత్రివర్గ నిర్ణయాలను ఇప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదని వాపోయారు. రూ. 16వేల కోట్లతో రాష్ట్రం విడిపోయిందని, రెవెన్యూ లోటు రూ. 4వేల కోట్లు అని పీఎంవోనే చెప్పిందని గుర్తుచేశారు.

sujana 24072018 3

తామడుగుతున్నది కేవలం ఏపీకి రావాల్సింది మాత్రమే అడుగుతున్నామన్నారు. కానీ కేంద్రం మాత్రం ఏపీని అన్ని విధాలా అవమానించిందని వాపోయారు. ఏపీ విషయంలో కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని సుజనాచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని.. మోడీ వాటినే తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈ చర్చలో తెదేపా తరఫున గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్‌, రవీంద్రకుమార్‌, టీజీ వెంకటేశ్‌, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్‌ తరఫున కేవీపీ రామచందర్‌రావు, భాజపా తరఫున జీవీఎల్‌ నరసింహారావు, వైకాపా తరఫున విజయసాయిరెడ్డి చర్చలో పాలొననున్నారు. చర్చ సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నేతలను తెదేపా ఎంపీలు కోరారు.

అసాధ్యం సుసాధ్యమవుతుంది.. ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 56 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటుతుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

cbn 24072018 2

దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది. ఈ అద్భుతం చూడటానికి, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఫ్రీగా బస్సులు పెడుతూ ఉండటంతో, రైతులు వచ్చి చూస్తున్నారు. దీంతో పోలవరం సందర్శనకు వచ్చే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈవారం 5,709 మంది వివిధ జిల్లాల నుంచి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును చూసిన వారి సంఖ్య 50 వేలు దాటింది. మూడు నెలల్లో రైతులు, విద్యార్ధులతో సహా 50,878 మంది ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి.

cbn 24072018 3

మరో పక్క నిన్న సోమవారం కావటంతో చంద్రబాబు, పోలవరం పై రివ్యూ చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దాలని, కాలనీలు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా నిర్వాసితుల జీవనస్థితిగతులు, వ్యక్తిగత సమాచారంపై అధ్యయనం జరపాలని సూచించారు. మొత్తం 74 కాలనీలకు అవసరమైతే ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, పునరావాసం-పరిహారం కింద మరింత సాయానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. లక్ష కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం, మౌలిక వసతులు కల్పిండం కూడా తమదే బాధ్యతని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు మొత్తం 56.69% పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే తవ్వకం పనులు 76.30%, కాంక్రీట్ పనులు 30.70% చేపట్టినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 62.27% నిర్మాణం పూర్తయ్యిందని, అలాగే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.55%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 93% చేపట్టినట్టు వెల్లడించారు.

భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సందడి చేశారు. మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అథ్లెటిక్ స్టేడియం భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ తొలి కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుంబ్లే మాట్లాడుతూ, సీకే నాయుడు ఎంతో మంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సీకే నాయుడి సొంత ఊరిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తొలి క్రికెట్ కెప్టెన్ గా భారత క్రికెట్ కు ఆయన మార్గనిర్దేశం చేశారని అన్నారు. 1932–34 మధ్య కాలంలో ఇండియన్‌ క్రికెట్‌ టీంకు కెప్టెన్‌గా ఏపీ (బందరు)కి చెందిన సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

kumble 24072018 2

ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహంతో, ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆటలు ఆడేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఔత్సాహికులకు మంచి ట్రైనింగ్ కూడా కల్పిస్తున్నారని, వారిని భవిష్యత్ ఒలింపియన్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కుంబ్లేను మంత్రి కొల్లు రవీంద్ర సన్మానించారు. ఈరోజు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యటించిన కుంబ్లే 13 ఎకరాల్లో రూ.15 కోట్ల నిధులతో నిర్మించనున్న అథ్లెటిక్‌ స్టేడియానికి ఆయన శంకుస్థాపన చేశారు.

kumble 24072018 3

ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహంతో, ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారని కుంబ్లే అనటంతో, చాలా మంది నోళ్ళు ముతబడ్డాయి. సిందు, కిదాంబి శ్రీకాంత్ పతకాలు గెలిచినప్పుడు, వీరంతా గోపిచంద్ శిష్యులని, ఆ రోజు గోపిచంద్ అకాడమికి నేను సహకరించటం వలనే అక్కడ నుంచి, ఇంత మంచి ఆటగాళ్ళు రావటం సంతోషంగా ఉందని, చంద్రబాబు అంటే, ఎగతాళి చేసిన వారందరికీ, మరో సారి కుంబ్లే మాటలతో, చంద్రబాబు ముందు చూపు ఏంటో తెలిసి వస్తుంది అని ఆశిద్దాం...

Advertisements

Latest Articles

Most Read