అప్పుడెప్పుడో, శ్రీ రెడ్డి అనే అమ్మాయి, తనకు ఎదో జరిగిందని హడావిడి చేసి, కొన్ని రోజులుకి పవన్ ఎదో అన్నాడని, పవన్ కళ్యాణ్ ని ఎదో తిట్టింది. అయితే దీని పై నాలుగు రోజుల తరువాత, చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు ధర్మ పోరాట దీక్ష మొదలు పెట్టిన క్షణమే, పవన్ హడావిడి మొదలు పెట్టాడు. శ్రీరెడ్డిని అమరావతి నుంచి ఆదేశాలు ఇచ్చి, చంద్రబాబు తిట్టించాడు అని పవన్ అన్నాడు. అంతే కాదు, కులం కోణం కూడా కలిపి, చేసిన ట్వీట్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఎవరో శ్రీ రెడ్డి, పవన్ చేసిన వ్యాఖ్యల పై తిడితే, దానికి చంద్రబాబుని బాద్యుడిని చేసి, ఒక రాజకీయ డ్రామా నడిపాడు పవన్... ఇప్పుడు తాజాగా, నాలుగు నాలుగు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అని జగన్ విమర్శలు చేస్తే, దానికి కూడా చంద్రబాబుని కలిపి తిడుతున్నాడు పవన్.
ఈ వ్యాఖ్యల పై ఈ రోజు స్పందించారు పవన్. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ స్పందించారు. సమాజంలో మార్పు తీసుకొస్తానన్న భయంతోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ తనను టార్గెట్ చేశాయని, ఐదేళ్లు కష్టపడితే ముఖ్యమంత్రి లేదా మంత్రి సీట్లో కూర్చోవచ్చని, కాని దాని వల్ల సమాజంలో మార్పు రాదని ఆయన అన్నారు. తిడితే భయపడతామనే భావనలో కొందరు నాయకులు ఉన్నారన్నారు. చంద్రబాబు, జగన్ రాజ్యాంగాన్ని రాయలేదని, అంబేడ్కర్ రాశారని పవన్ అన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకే తాను వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసిన వాడినన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే తట్టుకోలేరని, పారిపోతారని అన్నారు. అయితే, అలాంటి మాటలతో ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. నా దగ్గరికి వస్తే తోలు తీస్తా. సమాజంలో మార్పు తీసుకొస్తాననే భయంతోనే తెదేపా, వైకాపా, భాజపా నన్ను తిడుతున్నాయి అంటూ, జగన్ చేసిన వ్యాఖ్యలకు, జగన్ ను డైరెక్ట్ గా అనలేక, చంద్రబాబుని కూడా కలిపి, ఎంతో వెకిలిగా స్పందించాడు పవన్. అసలు జగన్ అనే వాడి భాషకు, చంద్రబాబు లాంటి స్టేట్స్మెన్ ను కలిపి, విమర్శలు చెయ్యటం ఏంటో, ఈ డ్రామాలు ఏంటో... అంతా అమిత్ షా మాయ...