దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, కేంద్రంలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి పై కనీసం పోరాడటం లేదు. ఈ సమయంలో, తెలుగుదేశం పార్టీ, మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పై ఫోకస్ చేసింది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రాగానే, చంద్రబాబుని లోపల వేస్తాం, లోకేష్ ను లోపల వేస్తాం అంటూ కబ్రులు చెప్పరే కాని, ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేకపోయారు బీజేపీ నేతలు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, డైరెక్ట్ గా మోడీ పై మొట్టమొదటి అవినీతి ఆరోపణ చేసింది. అన్ని వివరాలు మీడియా ముందు ఈ రోజు పెట్టింది. ఈ విషయం నేషనల్ మీడియా కూడా చెప్పి, తన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని పార్టీలకు ఇవ్వనుంది. గత నెల రోజులుగా, మోడీ చేసిన అవినీతి గురించి, చెప్తాను అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఈ రోజు ఈ స్కాంకు సంబంధించి ఆధారాలు బయట పెట్టారు.

modi 18072018 2

ఎస్‌ఆర్‌ ఆయిల్‌ ఒప్పందంలో రష్యా కంపెనీతో కలిసి బీజేపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ బాంబ్ పేల్చారు. ఎస్ఆర్ ఆయిల్ కంపెనీ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం జరిగిందని, ఆయన సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. రష్యాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగినట్టు చూపెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేపదే విదేశాలు తిరగడం.. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం డబ్బుల కోసమేనని అన్నారు. ఎస్‌ఆర్‌ ఆయిల్‌ వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌... అక్కడి మంత్రిని అరెస్ట్ చేయించారని చెప్పారు.

modi 18072018 3

"ఎస్‌ఆర్‌ ఆయిల్ కంపెనీ విక్రయంలో భారీగా కుంభకోణం జరిగింది. 2016 బాలెన్స్ షీట్ లో రూ.3500 కోట్లు మాత్రమే ఉంది. 2016 డిసెంబర్ లో రూ.75 వేల కోట్లకుు సంస్థను ఎలా అమ్మారు. గ్రాస్ నెఫ్ట్ అనే కంపెనీని ఎస్‌ఆర్‌ కంపెనీని కొనుగోలు చేసింది. గ్రాస్ నెప్ట్ ఈక్విటీని కథార్ కంపెనీ కొనుగోలు చేసింది. అదే ఈక్విటీని ఖతార్ కంపెనీ నుంచి చైనీస్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈక్విటీ కొనుగోలు చేసిన చైనీస్ కంపెనీ ప్రతినిధులు అరెస్టయ్యారు. అదే సమయంలో మోదీ చైనాకు ఎందుకు వెళ్లారో చెప్పాలి. ఒప్పందం చేసుకున్న రష్యన్ మంత్రి ఇప్పుడు జైలులో ఉన్నారు. గోవా సమ్మిట్ లో రష్యా-భారత్ ఒప్పందం అని చెప్పారు.మోదీ-పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ కంపెనీ విక్రయ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి. గతంలోనే బీజేపీ కుంభకోణాలను బయటపెడతానని చెప్పా. నేడు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. పార్లమెంట్ లో మా ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారు" అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే వివిధ పక్షాలకు చెందిన సభ్యులు సభలో నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాల కోసం సభ్యులు పట్టుబట్టారు. అయితే స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తెదేపా ఎంపీలు పార్లమెంట్‌ బయట, లోపల ఆందోళన కొనసాగించారు. లోక్‌సభ ప్రారంభంకాగానే అవిశ్వాస తీర్మానంపై చర్చకు తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సభలో నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రశ్నోత్తరాల తరువాత అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు.

ncm 18072018 2

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 50 మందికి పైగా సభ్యులు మద్దతు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని విపక్ష నేతలంతా పట్టుబట్టారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమెదించారు. అయితే ఇప్పటికిప్పుడు అవిశ్వాసంపై చర్చకు వీలు పడదని, అవిశ్వాసం ఎప్పుడు చర్చ చేపట్టాలనే విషయాన్ని 10 రోజుల్లోపు ప్రకటిస్తానని స్పీకర్ చెప్పారు. అయితే స్పీకర్ నిర్ణయంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యతరం తెలిపారు. మల్లికార్జున ఖర్గే అభ్యంతరంపై స్పీకర్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే అవిశ్వాసం నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

ncm 18072018 3

అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్నాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పై చర్చకు తేదీ ఖరారుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒక బలమైన రాజకీయ పార్టీ పై, బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒత్తిడి తెచ్చింది. పోయిన సారి ఆంధ్రోడి దెబ్బకు పార్లమెంట్ వాయిదా వేసుకుని వెళ్ళిపోయినా మోడీ, ఈ సారి లొంగకు తప్పలేదు. తెలుగుదేశం ఒత్తిడికి తలోగ్గారు. ఇక రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి, కేంద్రం ఎంత ఇచ్చింది, ఏమి అన్యాయం చేసింది, పార్లమెంట్ వేదికగా చర్చ జరగనుంది. బీజేపీ లక్షల లక్షల కోట్లు ఇచ్చేసాం అని చెప్తుంది అబద్ధమో, తెలుగుదేశం చేస్తున్న ధర్మ పోరాటం అబద్ధమో, తేలిపోనుంది.

5 కోట్ల మంది మీ వైపు చూస్తున్నారు... వారి తరుపున పోరాడాల్సింది మీరే... మీ పోరాటాన్ని తక్కువ చేసే కుట్రలు జరుగుతాయి.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి... మిమ్మల్ని సస్పెండ్ చేస్తారనే సమాచారం కూడా ఉంది... ఏ పరిణామాకైనా సిద్ధంగా ఉండండి... మీ పై కుట్రలు చేసి, మీ పోరాటాన్ని నీరు గారుస్తారు, ప్రతి క్షణం అలెర్ట్ గా ఉండండి... ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టండి అంటూ, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని తేల్చిచెప్పారు. తాను దిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని చెప్పారు.

cbn 18072018 2

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేయాలని, విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయాలని అన్నారు. ప్రధాని హామీలు ఎందుకు అమలు చేయరని సభా సాక్షిగా నిలదీయాలని ఆదేశించారు. పోరాటం తమకు కొత్తేమీ కాదని, అన్యాయాన్ని చక్కదిద్దుతామని ఆనాడు బీజేపీ చెప్పిందని, ఇప్పుడు బీజేపీ నేతలే అన్యాయం చేస్తున్నారన్నారు. ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా అని అన్నారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టాలన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చిందన్నారు. ఎంపీలు సమన్వయంతో పనిచేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలన్నారు. కావాల్సిన సమాచారం ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉందని, ఎంపీలు దానిని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.

cbn 18072018 3

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఎంపీలు తోటనర్సింహం, కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. అయితే ఈ తీర్మానంపై ఈరోజు పార్లమెంటులో చర్చ జరుగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు 150 మంది సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని పార్టీల నేతలతో ఇప్పటికే టీడీపీ ఎంపీలు బృందాలుగా ఏర్పడి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ మద్దతు కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు తమ మద్దతు ఉంటుందని లాలూ హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి కాంగ్రెసు నేత శైలజానాథ్ అమరావతి వచ్చారు. శైలజానాథ్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వారి మధ్య భేటీ కొంచెం సేపు జరిగింది. దాదాపు పది నిమిషాల పాటు సీఎంతో శైలజానాథ్ చర్చలు జరిపారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై సీఎంతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చానని శైలజానాథ్‌ చెప్పారు.

sailjanadh 18072018 2

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ఇటీవల మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబును కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేనని అరుణ్ కుమార్ చెబుతున్నప్పటికీ గతంలో కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు కాంగ్రెసు నేత శైలజానాథ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటులో తెలుగుదేశం మోడీ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధపడిన నేపథ్యంలో చంద్రబాబుతో శైలజానాథ్ భేటీ పాధాన్యత సంతరించుకుంది.

sailjanadh 18072018 3

గతంలో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి శైలజానాథ్ ప్రయత్నించినట్లు చెబుతారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు. రెండు రోజుల క్రితం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో, జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఓ పెద్ద మనిషి కుటుంబానికి కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్తునిస్తే... ఆయన తనయుడు కాంగ్రెస్‌ను ఖాళీ చేసి సొంత పార్టీ పెట్టుకున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం అఫిడవిట్‌ వేస్తే... బీజేపీని జగన్‌, పవన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని ఆయన మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read