చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. తొలి విడతగా కృష్ణా జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది.

agrigold 17072018 3


కృష్ణా జిల్లాలోని అగ్రిగోల్డ్‌ ఆస్తులకు మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వేలం నిర్వహించారు. హై కోర్ట్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏడు లాట్లుగా విభజించి వేలం టెండర్లను ఆహ్వానించారు. ప్రతి లాట్‌కు న్యాయస్థానం రిజర్వ్‌ ధర నిర్ణయించింది. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం ప్రక్రియలో మూడో లాట్‌ కోసం ఇరువురు వేలంలో పాల్గొన్నారు. మిగిలిన లాట్‌లకు ఎవరూ రాలేదు. మూడో లాట్‌కు సంబంధించి విజయవాడ మొగల్రాజపురంలోని 630 చదరపు గజాల స్థలంలోని ఐదు అంతస్తుల భవనానికి న్యాయస్థానం రూ.11 కోట్లు రిజర్వ్‌ ధరగా నిర్ణయించగా.. టి.చంద్రశేఖరరావు అనే వ్యక్తి రూ.11,11,11,111లకు పాడారు.

agrigold 17072018 3

ఈ ధరను న్యాయస్థానానికి నివేదించి తదుపరి ఆదేశాల మేరకు ఆస్తిని పాటదారునికి అప్పగిస్తామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. వేలం సాగని మిగిలిన లాట్లకు సంబంధించి న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ తిరిగి సమావేశమై తదుపరి వేలం తేదీలను నిర్ణయిస్తుందని కలెక్టర్‌ చెప్పారు. వేలం ప్రక్రియలో త్రిసభ్య కమిటీ సభ్యులైన కలెక్టర్‌ లక్ష్మీకాంతం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్‌ రాజీవ్‌, జిల్లా రిజిస్ట్రార్‌ బి.శివరాంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బీఆర్‌ అంబేడ్కర్‌, సీబీసీఐడీ ఎస్పీ ఎస్‌.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్‌ ఆస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. రెండు వారాల్లోగా స్పష్టమైన పురోగతి, ఫలితం ఉండాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియకు కృష్ణాజిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం ఆహ్వానం మేరకు, అమరావతి వచ్చి చంద్రబాబుని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో, ఉండవల్లి పలు ఆసక్తికర విషయం చంద్రబాబుకి చెప్పారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలనే ప్రధాన ఆయుధంగా మలచుకొని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు.

undavalli 17072018 2

‘‘తలుపులు మూసి, రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందంటూ 2018 ఫిబ్రవరి ఏడున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం చేయాల్సిన వ్యక్తే మనకు అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్నారు. ఆ అన్యాయాన్ని వారితోనే చెప్పించేందుకు ఈ పార్లమెంటు సమావేశాలే మంచి అవకాశం. అందుకే ఈ అంశంపై ప్రశ్నలు వేయడంతో పాటు జీరో అవర్‌ లో చర్చకు, స్వల్పకాలిక చర్చకు అవకాశమివ్వాలంటూ పట్టుబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పాను’’ అని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు.

undavalli 17072018 3

ఇదే విషయం ఉండవల్లి బయటకు వచ్చి మీడియా తో చెప్పారు ‘‘లోక్‌సభ నియమాలన్నింటినీ ఉల్లంఘించి..ఏపీ పునర్విభజన బిల్లు ఆమోదం పొందినట్లు 2014 ఫిబ్రవరి 18న ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై లోక్‌సభలో చర్చ లేవనెత్తాలని నేను మొదటి నుంచీ చెబుతున్నా. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాయగా.. ఏమేం ఆధారాలు, పత్రాలున్నాయో తీసుకొచ్చి వివరించమని ఆయన కోరారు. ఆ మేరకు ముఖ్యమంత్రిని కలిశా. నేను రాసిన పుస్తకం, ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలు, న్యాయస్థానంలో వేసిన ప్రమాణపత్రం ప్రతులు అందించా. ప్రధాని మోదీ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో ఎలా వ్యవహరిస్తే బాగుంటుదనే దానిపై కొన్ని సూచనలు, సలహాలిచ్చా. ఇక ఆలస్యం చేయొద్దని చెప్పా. మా భేటీ ప్రభావం రాబోయే సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలో కనిపిస్తుందనుకుంటా. మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యమూ లేదు. నేను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను...భవిష్యత్తులో కూడా ఎందులోనూ చేరను.’’ అని వ్యాఖ్యానించారు.

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ ముగిసింది. విభజన హామీల అమలు, పార్లమెంటులో పోరాటం పై కొద్ది రోజుల క్రితం ఉండవల్లి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం ఆహ్వానం మేరకు ఉండవల్లి ఈ రోజు అమరావతికి వచ్చారు. గత కొంతకాలం ఏపీ విభజన హామీల పై అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. అనేక సందర్భాల్లో హోదా విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులు, ఖర్చులకి సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీలో ఉండవల్లి కీలకపాత్ర వహించారు.

undavalli 16072018 2

చంద్రబాబుతో భేటీ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లడారు ‘‘నేనే ఏ పార్టీలో లేను. ఏ పార్టీలో చేరను. రాజీనామాలకు నేను వ్యతిరేకం. అయినా గతంలో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా విభజన బిల్లును ఆమోదించారు. నేను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను సీఎంకు అందజేశా. అన్ని విషయాలు ఆయనతో చర్చించాను. ఏ విధంగా పోరాటం చేస్తే మంచిదో చెప్పను. నా దగ్గర ఉన్నవి అన్నీ ఆయనకు ఇచ్చాను. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదు. రాష్ట్రం కోసం, ఎవరు పోరాడినా, నేను సహకరిస్తాను’’ అని చెప్పారు.

undavalli 16072018 3

పార్లమెంటు తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7, 2018న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబుకు ఉండవల్లి గుర్తుచేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలనే పార్లమెంటులో ప్రస్తావించాలని సీఎంను కోరానని, తన దగ్గర ఉన్న ఆధారాలను సీఎం చంద్రబాబుకు అందజేశానని పేర్కొన్నారు. ఏపీ విభజన బిల్లును ఆమోదించినప్పటి నుంచి రాజ్యాంగ విరుద్ధమని పోరాడుతున్నామని తెలిపారు. దేశ చరిత్రలో లోక్‌సభ నిబంధనలన్నీ ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారని ఉండవల్లి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పై అవిశ్వాసం తీర్మానం పెట్టాడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు చంద్రబాబు లేఖ రాసి, మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నేపధ్యంలో ఉండవల్లి కూడా వచ్చి చంద్రబాబుతో చర్చించారు.

 

తిరుమల మహాసంప్రోక్షణ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహాసంప్రోక్షణ విషయంలో గతంలో పాటించిన నిబంధనలే అమలు చేయాలని సీఎం చంద్రబాబు టీటీడీకి ఆదేశించారు. మహాసంప్రోక్షణ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించాలని చంద్రబాబు సూచించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని తెలిపారు. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జరుగుతున్న వివాదంపై స్పందించిన చంద్రబాబు భక్తులకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలు ఉండొద్దని టీటీడీకి సూచించారు. రోజుల తరబడి భక్తులు ఎదురుచూసేలా చేయొద్దన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారమే పూజాకైంకర్యాలు జరగాలన్నారు.

tirumala 17072018 2

మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ పై టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20వేల మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది.

tirumala 17072018 3

అయితే, ఇలాంటి అవకాశం కోసం కాచుకుని కూర్చున్న జగన్ బ్యాచ్, బీజేపీ బ్యాచ్, రెండు రోజుల నుంచి రచ్చ రచ్చ చేస్తున్నాయి. తిరుమలలో తవ్వకాలు జరుపుతున్నారు అని, స్వామి వారి నగలు తరలిస్తున్నారని, ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రచారం మొదలు పెట్టారు. ఆ సమయంలో స్వామి వారికి పూజలు చేస్తారు అని చెప్పినా వినకుండా, బ్రహ్మం గారు చెప్పారు, గుడి మూసేస్తారు అని, ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తున్నారు అంటూ, హడావిడి చేసారు. దీంతో సామాన్య భక్తులకు కూడా అనుమానాలు మొదలయ్యాయి. తిరుమల ప్రతి ఒక్కరికి అవినాభావ సంబంధం ఉండటంతో, ఇలాంటి వాటికి కనెక్ట్ అయిపోతారు. అందుకే చంద్రబాబు వెంటనే ఈ విషయం పై స్పందించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అని, తిరుమల పవిత్రతని నాశనం చేసే పన్నాగాలు చేస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదు అని, గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలను అనుసరించాలని, ఎంత మందికి దర్శనం వీలు అయితే అంత మందికి దర్శనం చేపించాలని సూచించారు..

Advertisements

Latest Articles

Most Read