గ్రామ దర్శిని కార్యక్రమానికి సిఎం చంద్రబాబు సోమవారం నుంచి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. దాదాపు ఆరు నెలల పాటు కొనసాగే గ్రామదర్శిని కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 75 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నెలకు మూడు నుంచి నాలుగు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలకు వివరించడం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం, మొక్కలు నాటడం తదితర పనుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లేందుకు సిఎంతో పాటు టిడిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రయత్నిస్తున్నారు.

gramadarsini 16072018 2

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమానికి అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అధికారులు వారానికి రెండు రోజులు గ్రామదర్శినిలో పాల్గొనాలన్నారు. అధికారులు బుధ, గురు వారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి సోమ, శనివారాల్లో కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని ఆయన అన్నారు. అవసరమైతే గ్రామాల్లో బస చేసి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, పెండింగ్‌ సమస్యలపై వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, జనవరిలో జరిగే జన్మభూమి గ్రామసభల్లో విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకటించాలని ఆయన అన్నారు. ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం జరిపేలా ప్రణాళిల రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

gramadarsini 16072018 3

గ్రామ దర్శినిలో ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించాలని, అర్హులైన వారికి ఇంకా ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమ పథకాలను అందించేందుకు, వాటిపై అవగాహన కల్పించేందుకు గ్రామ దర్శిని దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతి సోమవారం, శనివారం కచ్చితంగా రెగ్యులర్‌గా విధులకు తమ కార్యాలయాలకు హాజరుకావాలన్నారు. బుధ, గురువారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాలలో పాల్గొనాలని, గ్రామ దర్శినిలో అధికారులు తమ శాఖలకు చెందిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తారని తెలిపారు. ఆరునెలల పాటు ఈ కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని ప్రణాళిక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాజధాని ప్రాంతంలో కీలకమైన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులు ద్వారకాతిరుమలరావు, నళినీ ప్రభాత్‌, అమిత్‌గార్గ్‌లతో ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. సిఎం వారితో పలు అంశాలపై చర్చించారు. గౌతమ్‌ సవాంగ్‌ విజిలెన్స్‌ డిజిగా వెళ్లిన తరువాత విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పదవీ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంది. రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైన ఈ పదవి కోసం పలువురు సీనియర్‌ ఐపిఎస్‌లు పోటీ పడుతున్నారు.

commissioner 16072018 2

సిఐడి చీఫ్‌ ద్వారకాతిరుమలరావు, ఆపరేషన్స్‌ ఎడిజి నళినీ ప్రభాత్‌తో పాటు గతంలో విజయవాడ కమిషనర్‌గా చేసిన సీనియర్‌ సిఐడి అధికారి అమిత్‌గార్గ్‌ కూడా రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు అధికారులతో సిఎం సమావేశమయ్యింది ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ పదవి భర్తీ కోసమే అని కొందరు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎస్‌లతో ముఖ్యమంత్రి భేటీ అనంతరం అతి త్వరలోనే విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎంపిక ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ద్వారకాతిరుమల రావు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

commissioner 16072018 3

విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్‌ గా, సీహెచ్‌ ద్వారకాతిరుమల రావు కొత్త సీపీగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరు ఉంది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు అనంతపురం, మెదక్‌, కడప ఎస్పీగా, అనంతపురం రేంజి డీఐజీగా అక్టోపస్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సీఐడీ అదనపు డీజీగా క్లిష్టమైన కేసులను కొలిక్కి తేవడంలో ఈయన సమర్థంగా పనిచేశారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును విజయవాడ పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తోపాటు కొత్త డీజీపీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

కుండపోత వర్షానికి పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు ఆగాయి. ఆదివారం నాటి భారీ వర్షంతో అధికారులు పనులకు విరా మం ఇచ్చారు. ప్రాజెక్టు ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. నిత్యం భారీ యంత్రాల రణగొణ ధ్వనులతో ఉండే వాతావరణం మూగబోయింది. ప్రతికూల వాతావరణంలోనూ ప్రాజెక్టు పనుల్ని నవయుగ కంపెనీ ఎన్నడూ ఆపింది లేదు. వర్షా కాలం కూడా, ఇలాగే పనులు కొనసాగించవచ్చు అని ఆశించారు. అయితే, ఇంత వరద ఇప్పుడే వస్తుంది అని ఊహించలేదు. సగటున ప్రతీ రోజు 9 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనుల్ని చేస్తూ రాసాగారు. మరో వైపున ఇక్కడ గోదావరి నీటి మట్టమూ పెరుగుతోంది. భద్రాచలంలో వరద గోదారి 30 అడుగులకు చేరుకుంది. వాతావరణ శాఖ సైతం ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. భారీ వానలు ఇలానే కొనసాగితే గోదారి తన ఉగ్ర రూపాన్ని చూపే వీలుంది. వరద ఎప్పుడు తగ్గితే అప్పుడు, వెంటనే పనులు మొదలు పెడతారు.

polavaram 16072018 2

ముందస్తు జాగ్రత్తగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి వరద నీటిని గోదాట్లోకి వదులుతున్నారు. బేసిన్‌ను ఖాళీ చేసేందుకు చూస్తున్నారు. ఆదివారం 3 లక్షల, 23 వేల 739 క్యూసెక్కుల్ని సముద్రంలోకి వదిలారు. 3 లక్షల, 28 వేల, 813 క్యూసెక్కులు బ్యారేజీకి వరద ఇన్‌ ఫ్లోగా ఉంది. పశ్చిమలో ఉదయం నుండీ భారీగా వర్షం పడింది. మరో వైపున సముద్రపు రాకాలి అలలూ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీర్‌ ప్రాంత వాసులైతే అరచేత ప్రాణాల్ని పెట్టుకుంటున్నారు. ఏజెన్సీలోనూ కొండ కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. జల్లేరు, బైనేరు వాగులు రహదారులపై నుండి ప్రవహిస్తున్నాయి. పోలవరంలోని కొత్తూరు చెరువూ నిండు కుండలా ఉంది. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు చెరువు గేట్లను ఎత్తారు.

polavaram 16072018 3

ఏజెన్సీ, మెట్టలోని తమ్మిలేరు, ఎర్రకాల్వ, కొవ్వాడ, పోగొండ, జల్లేరు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం బలపడటం తో వానలు జోరందుకున్నాయి. డెల్టాలో ఖరీఫ్‌ సాగు కష్టాలు వర్ణనా తీతంగా ఉంది. ఆక్వా రైతుల పుట్టునూ ముంచాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గోదారితో ఆ ప్రాంతం కనువిందు చేస్తోంది. పాపిడొండలవద్ద నిండు కుండలా మారింది. గోదారి ప్రవాహం ఇక్క డ ఉధృతంగా ఉంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోనూ వరద గోదా రిని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. జోరు వానలు, ఈదురు గాలుల మందస్తు హెచ్చరికల నేపథ్యాన ఆగిన పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లి ఎప్పుడు ఆరంభమౌతాయన్నది తెలియకుంది.

మంగళగిరి ఎయిమ్స్‌ లో జరుగుతున్న నిర్మాణ పనులని, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎయిమ్స్‌, మోడీ ఇచ్చిన ఓ విశిష్టమైన బహుమతిగా మిగులుతుందని చెప్పారు. భవనాల పరిశీలనకు ముందు మంత్రి.. ఎయిమ్స్‌, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఎయిమ్స్‌ పెద్ద ప్రాజెక్ట్‌ అని.. అందుకోసం రూ.1600 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నామని చెప్పారు. ఎయిమ్స్‌ మొదటి దశ పూర్తి కావడానికి వచ్చే మార్చి వరకు గడువున్నా.. ప్రధాని సూచనలతో జనవరికే సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇది మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న గిఫ్ట్ అంటూ, మంత్రి చెప్పుకొచ్చారు.

aims 16072018 2

అయితే, ఇదే సమావేశంలో, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నక్కా ఆనందబాబు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య హాజరయ్యారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మా ణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది, ఎంత విలువైన భూములు, పనులు చేసింది వరుసగా చెప్పి, కేంద్ర మంత్రి అవాక్కయేలా చేసారు. రూ.వెయ్యి కోట్ల విలువైన 183 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎయిమ్స్ కోసమై ఇచ్చిందన్నారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నట్టు చెప్పారు. రూ.15 కోట్ల వ్యయంతో తాగునీటి పధకం, రూ.36 కోట్ల వ్యయంతో 132కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ.40 కోట్ల వ్యయంతో అటవీశాఖ అనుమతులు, రూ.పది కోట్ల వ్యయంతో హైవే నుంచి రహదారి నిర్మాణం వంటి ఎన్నో పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

aims 16072018 3

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎయిమ్స్ విషయంలో చిత్తశుద్దితో వ్యవహరించబట్టే పనులు ఇంత వేగంతో జరుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు అన్నీ మేమే చేస్తున్నాం అంటే కుదరదు అన్నారు. విభజన హామీల్లో ఇచ్చిన హక్కు అనే విషయం మర్చిపోకూడదు అని అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కేంద్ర మంత్రుల్ని పంపిస్తుంది. కేంద్రం సాయంతో నడుస్తున్న పథకాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ తమ పథకాలుగా ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ అవి కేంద్ర పథకాలని ప్రకటించి ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా పధకాలపై బీజేపీ ముద్ర ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే వరుస పెట్టి, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు. దీనికి, తెలుగుదేశం కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read