బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియా దిగ్గజం రామోజీ రావును కలిశారు. శుక్రవారం తెలంగాణకు పర్యటనకు వచ్చిన అమిత్ షా.. బీజేపీ నాయకులతో సమావేశం అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీ రావును ఆయన నివాసంలో కలిశారు. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ఆయన రామోజీతో భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కారు గత నాలుగేళ్లుగా సాధించిన విజయాల గురించి వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాలు, సాధించిన విజయాలతో రూపొందించిన బుక్‌లెట్లను రామోజీకి అందజేశారు. ఆయనతో కాసేపు పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం మాత్రం చంద్రబాబే అనే సమాచారం వస్తుంది.

amtishah 15072018 2

చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ - అమిత్ షా గ్రాఫ్ పడిపోవటం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మోడీని ఎండగట్టటం, తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చించకుండా మోడీ పారిపోవటం, దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను చంద్రబాబు ఏకం చెయ్యటం, కర్ణాటకలో బీజేపీ ఓటమికి చంద్రబాబు పిలుపు ఇవ్వటం, తారువాత అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వేదిక పంచుకోవటం, ఇవన్నీ బీజేపీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. చంద్రబాబు లాంటి నమ్మకమైన మిత్రపక్షం దూరం జరిగిందని, ఎన్డీఏ బలహీనపడుతుంది అనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. దానికి తోడు, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారింది.

amtishah 15072018 3

మమతా బనర్జీ, మాయావతి లాంటి నేతలు తృతీయ ప్రత్యామ్నయం అని ఎప్పటి నుంచో అంటున్నా, చంద్రబాబు వస్తున్నారు అనేసరికి చాలా ప్రాంతీయ పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే, బీజేపీ దీనికి కౌంటర్ మొదలు పెట్టింది. రామోజీతో జరిగిన సమావేశంలో, ఇదే విషయం ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పుడన్న పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ కి రారు అని అర్ధమువుతుంది, అయితే ఆయన్ను తృతీయ కూటమి వైపు వెళ్ళకుండా, మా పై విమర్శలు తగ్గించమనండి, ఉన్న పరిధుల్లో రాష్ట్రానికి చెయ్యాల్సినవి చేస్తాం అని చెప్పినట్టు సమాచారం. తద్వారా, కాంగ్రెస్ బలపడటం కాని, తృతీయ కూటమి ఏర్పడటం కాని జరగదని బీజేపీ లెక్క. మొన్న గడ్కరీ కూడా ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారని ప్రచారం జరుగుతుంది. దేశ శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ రాకుండా, చూడాల్సిన బాధ్యత మీ పై కూడా ఉంది అని గడ్కరీ చంద్రబాబుతో చెప్పినట్టు సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో రామోజీ నడవిక చూస్తుంటే, బీజేపీకి చాలా దగ్గరైనట్టు తెలుస్తుంది. ఇది వరకు లాగా, చంద్రబాబుకు, రామోజీకి సంబంధాలు లేవనే ప్రచారం కూడా ఉంది. మరి రామోజీ, చంద్రబాబుకు చెప్తారా ? చెప్పినా చంద్రబాబు వింటారా ?

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంలోపే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలుగుదేశం పార్టీ. జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు మాన్‌సూన్‌ సెషన్స్‌ జరగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సాగనున్న సమావేశాల్లో ఏపీకి చెందిన పార్టీల నేతలు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సైతం టీడీపీ సమాయత్తం అవుతోంది. అందులోభాగంగా ప్రత్యేక హోదాపై దేశంలోని బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖలు రాశారు. ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు. విభజన హామీలు వివరించారు. గత సమావేశాల్లో అవిశ్వాసం పెట్టినా చర్చకు రానీయలేదని బాబు పేర్కొన్నారు. 8 పేజీలతో లేఖలో విభజన హామీలు, ఇప్పటివరకు చేసిన పనులు, చేయాల్సిన పనులను చంద్రబాబు పొందుపర్చారు.

cbnletter 15072018 2

ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ.. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును ఆదివారం మధ్యాహ్నం కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన వాగ్ధానాలు పూర్తిగా నెరవేర్చలేదని, ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిందని, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఎంపీలు వివరించారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే నేతలను కూడా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలవనున్నారు. మరోవైపు శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరేను టీడీపీ ఎంపీలు కలవాలని అనుకున్నారు. అనివార్యకారణాల రీత్యా వీరి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం ఉద్దవ్‌ థాకరే ముంబైలో లేరు. అందువల్ల వీరి పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోమవారం లేదా మంగళవారం ఆయన్ను టీడీపీ ఎంపీలు కలిసే అవకాశం ఉంది.

cbnletter 15072018 3

విభజన హామీలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్నఅన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో.. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి టీడీపీ అధినేత సమాయత్తం అవుతున్నారు. ఢిల్లీలోనూ ఉద్యమ వేడిని రగిలించేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. హక్కుల సాధనకోసం దీక్షలు చేస్తూనే.. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్లమెంటరీ పార్టీ కూడా నిర్ణయించింది.

ఒక ఎమ్మల్యే హోదాలో ఉండి కూడా, నోటి వెంట బూతులు తప్ప, మంచి మాటలు మాట్లాడని జగన్ పార్టీ ప్రియ శిష్యురాలు రోజా పై మహిళలు తిరగబడ్డారు. మగ వారు కూడా భరించలేని బూతులు మాట్లాడే రోజా, ఈ సారి పెనమలూరు ఎమ్మల్యే బోడె ప్రసాద్ ను టార్గెట్ చేసింది. అప్పట్లో విజయవాడలో వచ్చిన కాల్ మనీ కేసు పై, అప్పట్లోనే చంద్రబాబును ఉద్దేశిస్తూ కామ సియం అంటూ, పిచ్చి పిచ్చి వాగుడు వాగి, ఆ వాగుడు భరించలేక, అసెంబ్లీలో ఉన్న ఎమ్మల్యేలు అందరి విజ్ఞప్తి మేరకు, సంవత్సరం పాటు, అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైంది రోజా. అసెంబ్లీ వేదికగానే, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రినే కామ సియం అంటూ సంభోదించిన ఇలాంటి మహిళకు, మిగతా వారు అంటే ఒక లెక్కా ? అందుకే పెనమలూరు ఎమ్మల్యే పై తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.

roja 15072018 2

వారం రోజుల క్రితం రోజా కంకిపాడు వచ్చింది. అక్కడ ఈ సారి టికెట్ ఆసిస్తున్న పార్ధసారధి, తన మొఖం చూపిస్తే ఎవరూ ఓట్లు వెయ్యరని, రోజాని తీసుకువచ్చి ఒక మీటింగ్ పెట్టించారు. ఇంకేముంది, చాలా రోజుల తరువాత మైక్ దొరకటంతో రోజా రెచ్చిపోయింది. పార్ధసారధి ఎంతో గొప్ప వాడు అని, బోడె ప్రసాద్ 'సెక్స్ కుంభకోణంలో' ఉన్నాడు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు బోడె ప్రసాద్ కు సెక్స్ కుంభకోణం ఏంటో అర్ధం కాలేదు. రోజా నోరు తెరిస్తే నన్ను రేప్ చేసే దమ్ము ఉందా లాంటి మాటలు తప్పితే, వేరే మాటలు రావు. ఈ మాటలకు మగ వారు కూడా భయపడి రోజా నోటికి దూరంగా ఉంటారు. అయితే, రోజా పదే పదే తనను 'సెక్స్ కుంభకోణంలో' ఉన్నాడు అని చెప్తూ ఉండటంతో, బోడె ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.

roja 15072018 3

నేను సెక్స్ 'కుంభకోణంలో' ఉన్నానని నీకు ఎలా తెలుసు, నువ్వు ఎమన్నా కంపెనీ నడిపావా ? నేను ఎక్కడన్నా తగిలనా అంటూ తీవ్రంగా స్పందించారు. నేను నాలుగేళ్ల నుంచి, రోజా ఇలా అంటున్నా రాజకీయ విమర్శలు అని ఊరుకున్నా అని, ఇప్పుడు నా ప్రజల ముందుకు వచ్చి, మళ్ళీ ఇలాంటి మాటలే రోజా మాట్లాడుతుంటే, చూస్తూ ఊరుకోను అంటూ, బోడె ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. అయితే, బోడె ప్రసాద్ వ్యాఖ్యల పై, రోజా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో రోజా పై అక్కడ మహిళలు విరుచుకుపడ్డారు. 'సెక్స్ కుంభకోణం' చేసాడు అంటూ బోడె పై వ్యాఖ్యలు చేసింది కాక, మళ్ళీ ఎదురు కేసు పెట్టిన రోజా పై, కంకిపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో, రోజాను పంపించి, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తున్నారని, రోజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని.. సినిమాలో చేసిన విధంగా రాజకీయాల్లో ప్రవర్తిస్తే సహించేది లేదని, ఇలాంటి రోజాను లోపల వెయ్యాలని కోరుతూ కంకిపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

హోమ్ గార్డులకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామ రెవిన్యూ సహాయకులు, ఆశా కార్యకర్తలకు, ఇలా అన్ని వర్గాలకు గుడ్ న్యూస్ వినిపిస్తున్న చంద్రబాబు, ఇప్పుడు 54 వేల మంది ఆర్టీసీ కార్మికులకు మంచి కబురు చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఇంటరిమ్ రిలీఫ్ (ఐ.ఆర్)ను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రకటించారు. రాష్ట్రంలో గల 54 వేల మంది ఆర్.టి.సి ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఐ.ఆర్ ప్రకటించడం వల ప్రభుత్వంపై ఏడాదికి రూ.249 కోట్లు ఆర్ధిక భారం పడనుందని మంత్రి చెప్పారు. దేశంలో అత్యుత్తమ సంస్ధగా ఏపి ఎస్.ఆర్.టి.సి మనుగడ సాగిస్తుందోని మంత్రి ప్రకటించారు. యాజమాన్యం, కార్మికులు కలసి పనిచేసినపుడే సంస్ధ బాగుంటుందని, ప్రజలకు మంచి సేవలు అందుతాయని మంత్రి అన్నారు.

rtc 15072018 2

రాష్ట్ర విభజన అనంతరం ఏపిఎస్.ఆర్.టి.సి ఇబ్బందుల్లో పడిందని, అనేక సమస్యలు ఎదుర్కొందని ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఆర్.టి.సి ఉద్యోగులు సంఘటితంగా పనిచేయడం జరిగిందని ఆయన అన్నారు. సంస్ధ బలోపితానికి అందరూ సమష్టిగా కృషి చేసారని ఆయన అభిందించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం ద్వారా సంస్ధ మరింత బలోపితం అవుతుందనే విశ్వాసంతో ఉన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం కష్ట కాలంలో ఉన్నప్పటికి గత పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సి) లో రాష్ట్ర ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించామని చెప్పారు. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుండి మరో పి.ఆర్.సి అమలు చేయాల్సి ఉందని దీనికై కమీషన్ ను నియమించామని చెప్పారు.

rtc 15072018 3

పి.ఆర్.సి కమీషన్ నివేదిక సమర్పించేటప్పటికి కొంత సమయం పడుతుందని, నివేదిక అందే వరకు ఆర్.టి.సి ఉద్యోగులకు 19 శాతం ఐ.ఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని మంత్రి చెప్పారు. ఇది శుభ పరిణామమని అన్నారు. ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలనేది సీఎం ఆశయమన్నారు. అందుకే ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడే బాగా పని చేసి రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తుందని నమ్మే వ్యక్తి సీఎం అన్నారు. ఆర్ధిక పరిస్ధితులు అనుకూలంగా లేనప్పటికి హోమ్ గార్డులకు, అంగన్వాడీ సిబ్బందికి, గ్రామ రెవిన్యూ సహాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులకు వేతనాలు పెంపుదల చేసారని మంత్రి వివరించారు. ఆర్.టి.సి ఉద్యోగులకు ప్రకటించిన ఐ.ఆర్ ఉత్తర్వులు తక్షణం విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read