తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు వల్ల, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. అన్నీ వదులుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చినా, ఒక్కటీ నెరవేరటం లేదు. సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా, మన పోరాటంలో కలిసి రావటం లేదు. పోయిన సారి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెడితే, అన్నాడీయంకే ఎంపీలతో కలిసి, అవిశ్వాస తీర్మానం రాకుండా, బీజేపీకి లబ్ది చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎంత సహకరించమన్నా, సహకరించ లేదు. ఇక్కడేమో, హైదరాబాద్ సెట్టేలర్ల ఓట్లు కోసం, ప్రత్యేక హోదాకు సహకరిస్తాం అంటారు, పార్లమెంట్ కు వెళ్తే మోడీకి సహకరిస్తారు. ఇదీ కెసిఆర్ పార్టీ వరుస.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి, కేంద్రం పై ఏ విధమైన పోరాటం చెయ్యదు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కలిసి రండి అన్నా, మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అని, అక్కడ కూడా కలిసి రాలేదు.

kcr 16072018 2

అయితే, ఈ నెల 18 నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మళ్ళీ తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెడుతుంది. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తాము చేయబోతున్న పోరాటానికి, మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలుస్తున్నారు. కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలను కలసి మద్దతు కోరాలని ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. దాని ప్రకారం మొత్తం 18 ప్రధాన పార్టీల నాయకుల్ని తెదేపా ఎంపీలు కలవనున్నారు. మొత్తం తెదేపా ఎంపీల్ని ఆరు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందానికి కొన్ని పార్టీల్ని కేటాయించారు.

kcr 16072018 3

ఇందులో భాగంగా ఎంపీల బృందం ఆదివారం హైదరాబాద్‌లో తెరాస ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డిలను కలసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ బృందంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, శ్రీరాం మాల్యాద్రి ఉన్నారు. ఈ బృందానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు సారథ్యం వహించాల్సి ఉండగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో వై.ఎస్‌.చౌదరి సారథ్యంలో వెళ్లి తెరాస
నాయకుల్ని కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించబోయే వ్యూహం గురించి ఏపీ తెదేపా ఎంపీలు తెలిపారు. ఈ సమావేశాలే చివరివి కావచ్చని, ఇప్పుడే కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా దానిపై చర్చ రాలేదని, ఈసారి ఎలాగైనా దానిని ప్రవేశపెట్టి, చర్చకు అనుమతించేలా పోరాటం చేస్తామని చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణపైనా కేంద్రం వివక్ష చూపుతున్నందున ఇద్దరం కలిసి పోరాడుతామని ప్రతిపాదించారు. దీనిపై కేశవరావు మాట్లాడుతూ, తమ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి ఈసారైనా కెసిఆర్ సహకరిస్తారో లేదో చూడాలి.

ఒకటికాదు... రెండు కాదు... నాలుగు దశాబ్దాల కల ఆది.. కోట్ల విలువైన వాణిజ్య పంటలను పండించే నేల నిస్సారమవుతుంటే, కళ్ళెదుటే సిరులు కురిపించాల్సిన పచ్చని పైర్లు వాడి పోతుంటే రైతన్న కంటనీరు కార్చని రోజులేదు. అలాంటిది రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు చొరవ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆ గ్రామాల రైతుల కల నెరవేరింది. నీటి సమస్యకు చరమగీతం పాడినట్లయింది. 5 వేల ఎకరాలకు సాగునీరు, 12 గ్రామాల్లోని కుటుంబాలకు అవకాశం ఉన్నవరకు తాగునీటిని అందించే పథకం సిద్ధమైంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం రైతులకు అంకితమిచ్చేందుకు ముహర్తం ఖరారయింది. దీంతోపాటే దోనేపూడిలో గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

potarlanka 16072018 2

కృష్ణా నది పక్కనే ఉన్నా తీరలంక గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతూ వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న సముద్రపు నీరు క్రమంగా చొచ్చుకుంటూ వచ్చింది. పెనుమూడి నుంచి సముద్ర జలాలు చాపకింద నీరులా చొచ్చు కొచ్చి రైతులకు కన్నీరు మిగిల్చాయి. కృష్ణానదిలో నీరు వచ్చిన సమయంలో పంటలు కళకళలాడటం మినహా మిగిలిన సంవత్సరాల్లో పంటలు బాగున్నా, దిగుబడుల పై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతూ వచ్చింది. నాలుగు దశాబ్దాల క్రితం సీపీఎం నేత కొరటాల సత్యనారాయణ ఈ గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ఒక పథకం నిర్మించాలని ప్రభుత్వాలపై పోరాడుతూ వచ్చా రు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కొరటాల ఈ గ్రామాల సమస్యను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లటం, ఆయన సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు అంగీకరించటంతో సమస్య పరిష్కారమం ఆయిందనుకున్నారు.

potarlanka 16072018 3

1998లో రూ. 2.64 కోట్లు పోతార్లంక సాగునీటి పధకం కోసం మంజూరుచేశారు. అయితే ఇసుక నేలల్లో ఓపెన్ కాల్వలు కావటంతో పథకం అసలు లక్ష్యం నెరవేరలేదు. కాల్వల చివరి భూముల వరకు నీరు అందటం కష్టమయింది. వదిలిన నీరు కాల్వల్లోనే ఇంకిపోతుండటంతో ఈ పథకం విఫలమైంది. దీని స్థానంలో రూ. 5 కోట్లతో లైనింగ్ పనులు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా, ఆచరణలో చేసిందిలేదు. దీంతో గత ఎన్నికల సమయంలో చంద్రబాబు లంక గ్రామాల పర్యటన సందర్భంలో అక్కడి రైతు ఆయన కాళ్ల పై పడి పోతార్లంక సాగునీటి పథకాన్ని పునర్నిర్మించాలని వేడుకున్నారు. దీని పై అప్పట్లోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. తర్వాత మంత్రి ఆనందబాబు ఈ పథకం పూర్తిచేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పలుమార్లు ముఖ్యమంత్రిని కలసి వివరించటంతో 49.68 కోట్ల నిధులను మంజూరు చేశారు. రెండేళ్ల నుంచి ఈ పనులు సాగుతూనే వచ్చాయి.

potarlanka 16072018 4

పోతార్లంక సాగునీటి పథకం ప్రధానంగా లంకగ్రా మాల రైతులకు సాగునీటిని అందించేందుకు రూపొందించిందే. కొల్లూరు మండలం పోతార్లంక మొదలుకుని భట్టిప్రోలు మండలం ఓలేరు వరకు దీని కాల్వలు వెళతాయి. అయితే కొత్త పథకంలో దోనేపూడి దగ్గర కృష్ణా పశ్చిమ బ్యాంక్ కెనాల్ నుంచి నీటిని మోటార్ల సాయంతో పంప్ చేసి పొలాలకు అందిస్తారు. గతంలో ఏర్పాటు చేసినట్టు కాల్వల విధానం కాకుండా భూమిలోపలే తూములు అమర్చారు. ఐదు నుంచి పదెకరాలకు ఒకచోట డెలివరీ పైపులు అమర్చారు. దీంతో నీరు భూమిలోకి ఇంకిపోయే సమస్య లేకుండా, చుక్కనీరు కూడా వృధా పోకుండా చేలల్లోని పంటలకు అందుతుంది. దీనికోసం రెండు పైప్ లైన్లను అమర్చారు. ఎడమ పైప్ లైన్ 1250 మీటర్ల పొడవున, కుడి పైప్ లైన్ 5000 మీటర్ల పొడవున నిర్మించారు. కొల్లూరు, భట్టిప్రోలు, చల్లపల్లి మండలాల్లోని పోతార్లంక, తోకలవానిపాలెం, తిప్పలకట్ట, కిష్కిందపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం, పెసర్లంక, పెదలంక, వెల్లటూరు, పెదపులివర్రు, ఓలేరు, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామాలకు సాగునీటిని సాదిస్తుంది. ఈ గ్రామాల్లో 5 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది.

ఏపీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ తన వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రం సాయంతో నడుస్తున్న పథకాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ తమ పథకాలుగా ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ అవి కేంద్ర పథకాలని ప్రకటించి ప్రచారం చేసేందుకు తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ఆయా శాఖల మంత్రులను రాష్ట్రంలో పర్యటించేలా చేసి తద్వారా పధకాలపై బీజేపీ ముద్ర ఉంటుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తాజా వ్యూహానికి తెలుగుదేశం కూడా కౌంటర్ సిద్దం చేసింది. పోలవరానికి వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేస్తున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి సోమవారం సమీక్షిస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందనే ప్రచారాన్ని తెలుగుదేశం ప్రజల్లోకి తీసుకువెళ్లిందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు వల్లే ప్రాజెక్టు నిర్మాణం పరుగులు తీస్తోందని ప్రజలు కూడా నమ్ముతున్నారు.

bjp 15072018 2

అందుకే, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పది నెలల తర్వాత పోలవరం వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని సమీక్షించారు. గడ్కరీ వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు కూడా హడావుడి సృష్టించారు. గడ్కరీ కూడా, ఈ ప్రాజెక్ట్ మోడీ వల్లే అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరో పక్క, ఈనెల 13వ తేదీన మంగళగిరికి సమీపంలో నిర్మిస్తున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రి నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపీ నడ్డా కూడా వచ్చారు. ఎయిమ్స్ నిర్మాణ పురోగతి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం, విభజన చట్టంలో కేంద్రం ఎయిమ్స్ నిర్మిస్తామని ఇచ్చిన హామీని ప్రజలకు గుర్తు చేసారు. ఈ నెలలోనే, కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చి, రాష్ట్రంలో ఏర్పాటైన, వివిధ కేంద్ర విద్యా సంస్థలు పరిశీలించి, ఇదంతా మోడీ చలవే అని చెప్పనున్నారు.

bjp 15072018 3

ఈ విధంగా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి తీసుకువస్తుండటంతో తెలుగుదేశం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అత్యంత విలువైన సుమారు వంద ఎకరాల స్థలం ఇచ్చిన విషయం నీరు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అలాగే, పోలవరం గురించి, ఇప్పటికే కేంద్రం అడుగడుగునా ఎలా కొర్రీలు పెడుతుంది ప్రజలకు చెప్తున్నారు. మరో పక్క కేంద్ర విద్యా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖరీదైన భూములు ఇచ్చింది, ప్రహరీలు కట్టింది, మౌలిక సదుపాయలు ఇచ్చింది చెప్పి, కేంద్రం వీటికి ఇప్పటికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఇవి పుర్తవ్వాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ప్రజలకు వివరిస్తారు. అలాగే, కేంద్రం మనకు వేసే బిక్ష ఏమి ఉండదు అని, రాష్ట్రాలు ఇచ్చిన డబ్బులే, కేంద్రం తిరిగి రాష్ట్రాలుకు ఇస్తుందనే విషయం బీజేపీ మర్చిపోతుందని, ఈ విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రం నుంచి రూపాయి వెళ్తుంటే, తరిగి 37 పైసలు మాత్రమే వస్తుందని, మిగతా 63 పైసలు కేంద్రం వాడుకుంటుందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వబోమని, ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన మిగతా హామీలను నెరవేర్చకుండా ఎవరు వచ్చి ఏం చేసినా ఉపయోగం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.

సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలన్నింటినీ పరిశీలించి... విశ్రాంత ఐపీఎస్‌ అధికారి బీవీ రమణకుమార్‌, విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌ అధికారి మాతంగి రవికుమార్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది కట్టా జనార్దన్‌రావులను ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉండవల్లిలోని నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన వారి వివరాలను గవర్నర్‌కు పంపించనున్నారు. ఆయన ఆమోదముద్ర వేస్తే ఆ ముగ్గురు పేర్లు అధికారికంగా ఖరారవుతాయి. ప్రధాన కమిషనర్‌ ఎంపికకు సంబంధించి మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ పోస్టుకు ఏకే జైన్‌ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

jagan 15072018 2

కమిషనర్ల ఎంపిక కోసం గురువారం సమావేశం జరగనున్నట్లు ప్రతిపక్ష నేత జగన్‌ కార్యాలయ సిబ్బందికి సమాచారమందించగా... తాము పాదయాత్రలో ఉన్నామని వారు సమాధానమిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమై పైన పేర్కొన్న వారి పేర్లను ఎంపిక చేశారు. అయితే మూడుసార్లు ఆహ్వానించినా ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత జగన్ గైర్హాజరయ్యారు. సమాచార కమిషనర్ల ఎంపిక త్రిసభ్య కమిటీ చేయ్యనుంది. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని రెండు సార్లు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది.

jagan 15072018 3

అయితే ఈ విషయంలో, ఇప్పటికే కోర్ట్ నోటీసు పంపించింది. సమాచార కమిషనర్లను ఎందుకు నియమించలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ఎన్ని సార్లు పిలిచినా రాకపోవటం, కోర్ట్ నోటీసులు పంపించటంతో, ప్రభుత్వం ఈ సారి నిర్ణయం తీసుకుంది.

Advertisements

Latest Articles

Most Read