నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు, తూర్పు నౌకాదళం ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. రోజుకు 5 గంటలపాటు పౌర విమానాల రాకపోకలను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ ప్రగతికి తీవ్ర ఇబ్బందికరంగా మారిన ఈ నిర్ణయంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. ఏటా 24 లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని దేశ, విదేశీ గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక గుర్తింపు తెచ్చుకున్న ఈ విమానాశ్రయంలో రాకపోకలను నిషేధిస్తే ప్రయాణికులపై ఆర్థిక భారం పడటమే కాకుండా.. సమయం వృథా అవుతందని, విశాఖ ప్రగతికి ఆటంకం అని నేవీ అధికరాలుతో చెప్పారు. శుక్రవారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాత్రి తిరుగు ప్రయాణ సమయంలో నౌకాదళ, విమానాశ్రయ అధికారులు, విశాఖ డెవలప్‌మెంట్‌ ఫోరం, అపాటా సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

cbn navy 14072018 2

చంద్రబాబుతో చర్చలు తరువాత, విశాఖ విమానాశ్రయంలో నిర్దేశిత సమయాల్లో పౌర విమానాల రాకపోకలపై నౌకాదళం విధించిన ఆంక్షలు రద్దయ్యాయి. ఇకపై తమ నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని నేవీ అధికారులు స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీలో ఆంక్షల్ని విరమించుకున్నట్లు నౌకాదళ అధికారులు ప్రకటించారు. నెలరోజులుగా దీనిపై దుమారమే రేగింది. దిల్లీ, కోల్‌కతా మీదుగా తిరిగే విమానాల్ని రద్దుచేస్తూ కొన్ని విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకట్రెండు మినహా విశాఖ నుంచి తిరిగే అన్ని విమానాల మీదా ఆంక్షల ప్రభావం పడింది. సమయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల విశాఖ అభివృద్ధి గాడి తప్పుతుందని విశాఖ డెవలప్‌మెంట్‌ ఫోరం, అపాటా, ఇతర సంస్థల సభ్యులు ఆందోళనకు దిగారు.

cbn navy 14072018 3

గత నెలలో విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎంపీ హరిబాబు నేతృత్వంలో విమానాశ్రయ సలహా సంఘం సమావేశమై నిషేధాజ్ఞలను ఎత్తివేయాలంటూ తీర్మానం చేసి నౌకాదళ అధికారులకు పంపింది. అవసరమైతే నౌకాదళానికి ప్రత్యేక రన్‌వే ఏర్పాటుచేసేలా 34 ఎకరాల స్థలాన్ని పోర్టు ట్రస్టు నుంచి ఇప్పిస్తామని తీర్మానించింది. దీంతో నౌకాదళ అధికారులు సానుకూల ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌కు విశాఖ డెవలప్‌మెంట్‌ ఫోరం, అపాటా సభ్యులు ఒ.నరేష్‌కుమార్‌, డీఎస్‌ వర్మ, కె.కుమార్‌రాజా అభినందనలు తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, విమానాశ్రయ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు.

వైసిపీ, బీజేపీ బంధం ఓపెన్ అయిపోతుంది... ఇక విజయసాయి రెడ్డి, ఏ మీడియా వాడు చూస్తాడా అని దొంగ చాటుగా వెళ్లి మోడీని కలవాల్సిన పని ఉండదు... జగన్ మోహన్ రెడ్డి, కేసుల గురించి భయపడాల్సిన పని లేదు... ఇక ముసుగులో గుద్దులాటలు లేవు... అంతా ఓపెనే... ఈ రోజు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే హైదరాబాద్ లో పర్యటించారు... ఈ సందర్భంలో ఆయన జగన్ పై చేసిన వ్యాఖ్యలు అదిరేలా ఉంటే, జగన్ సియంను చేస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు బెదిరేలా ఉన్నాయి... మొత్తానికి, అనుకున్న ప్లాన్ ప్రకారం, స్టెప్ బై స్టెప్, వైసిపీ - బీజేపీ త్వరలోనే కలిసిపోతున్నాయి... విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవ్వటం, జగన్ కేసులు ఒక్కోటి వీగిపోవటం, మనం చూడ బోతున్నాం... ఈ రోజు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారాయి.

jagan 14072018 2

ఓ వైపు ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అంటూనే.. మరోవైపు వైసీపీ రాకపై సానుకూలంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారని, కొనసాగి ఉంటే హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని అన్నారు. చంద్రబాబు అనవసరంగా మాతో సున్నం పెట్టుకున్నారని అన్నారు. వైసీపీతో లోపాయికారీ ఒప్పందంతోనే కేంద్రం ఏపీని పట్టించుకోవట్లేదన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలకు రాందాస్‌ అథవాలే కామెంట్లు బలం చేకూర్చేలా కనబడుతున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

jagan 14072018 3

జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు మేము కృషి చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. నేను ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత తీసుకుని, జగన్ ను సియం చేస్తామని అన్నారు. హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదంతా అందరూ ఊహించిన పరిణామమే... కాకపోతే, ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతరానని అనుకోలేదు... మరో పక్క, పవన్ ఉండనే ఉన్నాడు... ఈ నేపధ్యంలో, ఆపరేషన్ గరుడ, అనుకున్న ప్రకారమే నడుస్తుంది... ఇప్పటికే కర్ణాటకలో, గాలి పై ఉన్న కేసులన్నీ ఎలా వీగిపోయాయో చర్చించుకుంటూ ఉన్న సమయంలో, ఇప్పుడు జగన్ కూడా ఎన్డీఏలో చేరి, తన కేసులు కూడా మాఫీ చేసుకుంటాడు అని, అవసరం అయితే ఎన్నికలు అయిన తరువాత తన పార్టీ, బీజేపీలో విలీనం చేస్తాడు అని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుతామని భరోసా ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు సహకరించడం లేదు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు 6,688 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి అనకాపల్లి వరకూ జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కొన్ని రోడ్లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం చేయూతనివ్వాలన్నారు.

gadkari 14072018 2

పూర్తిగా అభివృద్ధికి 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఏపీ ప్రజలకు సెంటిమెంటైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్టు వంటి 18 అంశాలపై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోపోవడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. కొన్ని కారణాల వలన వేరయ్యాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఇవ్వకపోతే, రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని మీరు చూస్తున్నారని గడ్కరీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరో ఎనిమిది సంవత్సరాలు పడుతుందని చంద్రబాబు అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

gadkari 14072018 3

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలు సంబంధిత శాఖకు తెలియచేయడానికి రాష్ట్ర అధికారులు సోమవారం ఢిల్లీ వెళుతున్నారని చంద్రబాబు చెప్పారు. తనను రమ్మన్నా తాను కూడా ఢిల్లీ వస్తానని సీఎం చెప్పారు. పోలవరం భూసేకరణ సమయంలో గిరిజనులకు అన్యాయం చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రబాబు చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇచ్చే నిధులు నేరుగా రైతులకు ఇచ్చినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం వలన ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రం తనకు పూర్తిగా సహకరిస్తే, కావేరీ జల సమస్య లేకుండా వారికి కావల్సిన నీటిని ఏపీ నుంచి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళులంతా ఏకోన్ముఖంగా పోరాడతారు. ఏపీకి కేంద్రం నుంచి రావల్సినవన్నీ వచ్చేలా చూడాలని కేంద్ర పోర్టుల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. గడ్కరీకి కేంద్ర ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంది. ఆయన పరపతిని ఉపయోగించి, ఏపీకి న్యాయం చేసేలా మోదీకి నచ్చచెప్పాలని, దీనివలన వచ్చే క్రెడిట్ ఎవ్వరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మహాసంప్రోక్షణ క్రతువు ఉన్నందున 9 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు 17 ఉదయం 6 గంటల వరకు వెంకన్న దర్శనానికి భక్తులను అనుమతించకూడదని ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో 12ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది.

tirumala 14072018 2

మహాసంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహాకు అనుగుణంగా ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటం, భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇందుకు ముందుగానే భక్తులకు దర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది.

tirumala 14072018 3

ఒకవేళ పరిమితంగా అనుమతించినా రోజుకు 20వేల మందికి మాత్రమే దర్శనం అవకాశం కలుగుతుందని మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుందని అంటోంది. 10, 11 తేదీల్లో భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తే రెండు రోజుల పాటు కొండపై రద్దీ ఉంటుందన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందుగానే భక్తుల రాకను నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇంతకు ముందు 2006లో మహా సంప్రోక్షణ నిర్వహించారు. అప్పట్లో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని తెలిపారు. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Advertisements

Latest Articles

Most Read