వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకరికిఒకరు, తోడూ నీడగా సాగుతున్నారు. ఇద్దరినీ నడిపిస్తున్న బీజేపీ, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం, అంతా సెట్ చేసింది. వీరందరి టార్గెట్ ఒక్కటే చంద్రబాబుని దించటం. దీని కోసం, పవన్, జగన్ లను, ప్లాన్ ప్రకారం వాడుతుంది బీజేపీ. ఇందుకోసం, ఉత్తరాంధ్రను ఇప్పటికే ఎంచుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ ను వాడుతుంది. ఉత్తరాంధ్రలో విభాజన వాదం నింపటం, గోదావరి జిల్లాల్లో కులాల కుంపట్లు రాజెయ్యటం వీరి పని. దీని కోసం, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉత్తరంద్రలో, దాదాపు 20 రోజుల పాటు (సెలవలు కలపకుండా) అక్కడ ప్రజలను రెచ్చగొట్టారు. రెండు విడతలుగా చేసిన ఉత్తరాంధ్ర పర్యటనలో, అక్కడ ప్రజల్ని విభజన వాదం వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు.

jagan 13072018 2

అయితే, ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన అయిపోవటంతో, పవన్ కళ్యాణ్ ఈ నెల 16 నుంచి గోదావరి జిల్లా యాత్ర చేస్తారంటూ, జనసేన పార్టీ వర్గాలు ప్రెస్ కి కూడా చెప్పాయి. అయితే, ఏమైందో ఏమో కానీ, కంటి మీద కురుపు తీయించుకునే ఆపరేషన్ చేయించుకున్నారు పవన్. దీంతో, వారం పది రోజుల దాకా, పవన్ రెస్ట్ లో ఉండే అవకాశం ఉంది. మళ్ళీ యాత్ర ఎప్పుడు నుంచి మొదలవుతుంది అనే దాని పై, త్వరలోనే చెప్తాం అంటుంది జనసేన పార్టీ. అయితే, దీని వెనుక, జగన్, పవన్ కోఆపరేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, 16 వ తారీఖు లోపే, జగన్ విశాఖ జిల్లాలో అడుగు పెట్టాల్సింది.

jagan 13072018 3

కాని, వర్షాలు పడుతూ ఉండటంతో, గత వారం రోజులుగా పాదయాత్ర సాగటం లేదు. దీంతో జగన్ చాలా తక్కువ దూరం నడుస్తున్నారు. ఈ పరిణామంతో, షడ్యుల్ అంతా మారిపోయింది. ఇక పవన్ విషయానికి వస్తే 16 నుంచి తూర్పు గోదావరి పర్యటన అని చెప్పారు. గోదావరి జిల్లాల పర్యటన తరువాత కంటి ఆపరేషన్ అన్నారు. కాని, పవన్ ఉన్నట్టు ఉండి ఆపరేషన్ చేసుకున్నారు. దీనికి కారణం, జగన్ పాదయాత్ర కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండటం, మరో వారం రోజులకి కాని విశాఖలో జగన్ అడుగుపెట్టరు. జగన్ విశాఖకు వెళ్ళే దాక, పవన్ గోదావరి జిల్లా పర్యటన చెయ్యరు. ఎందుకంటే ఇద్దరి లక్ష్యం చంద్రబాబు. ఒకేసారి ఒకే జిల్లలో, ఒకే రకమైన విమర్శలు చేస్తే, ప్రాధాన్యత తగ్గుతుందనే వెనుకడుగు వేసినట్టు తెలుస్తుంది. జగన్ తూర్పు గోదావరి పర్యటన అయ్యే వరకు, పవన్ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లరు.

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ప్రతిష్టాత్మక టాటా అనుబంధ పరిశ్రమ ఏర్పాటవుతోంది. రూ.480 కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ స్థాపిస్తున్న ఈ యూనిట్లో రెడీమేడ్ ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అల్ట్రా మెగా ప్రాజెక్టు కింద చేపడుతున్న ఈ పరిశ్రమ ప్యాకేజ్ ఫుడ్స్ రంగంలో ఆర్టీఈ టెక్నాలజీని వినియోగించబోతున్న తొలి యూనిట్గా దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకోనుంది. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీసిటీ ఎస్-ఈ-జడ్ లో టాటా అనుబంధ సంస్థ మెస్సర్స్ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ రెడీ టూ ఈట్ ప్యాకేజ్ ఫుడ్స్ తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకొచ్చింది. రూ.480 కోట్ల పెట్టుబడితో అన్ని విభాగాలతో కూడిన సమగ్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని ప్రకటించింది.

tata 13072018 2

రెడీమేడ్ ఆహార పదార్థాల తయారీకి సంబంధించి ఆర్టీఈ ఆధారిత టెక్నాలజీని దేశంలోనే తొలిసారిగా ఇక్కడే వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేసింది. అద్వితీయ టెక్నాలజీగా పరిగణిస్తున్న మ్యాట్స్ (మైక్రోవేవ్ అసి స్టెడ్ థర్మల్ స్టెరిలైజేషన్) ఆధారంగా తయారయ్యే ఇక్కడి ఆహార పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయని వివరించింది. ప్లాంటులో భాగంగా ఆర్టీఈ యూనిట్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్, కోల్డ్ చెయిన్ యూనిట్, బిజినెస్ ఎక్స్లెన్స్ సెంటర్, టెస్టింగ్ లేబొరేటరీ తదితర ఐదు వేర్వేరు యూనిట్లు నెలకొల్పుతామని తెలియజే సింది. తొలి ఏడాది 280 మందికి ప్రత్యక్షంగా, 520 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్మార్ట్ ఫుడ్స్ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చింది.

tata 13072018 3

తర్వాత పదేళ్లలో 430 మందికి ప్రత్యక్షంగానూ, 820 మందికి పరోక్షంగా ఉపాధి అందించే అవకాశముందని పేర్కొంది. పూర్తిస్థాయి పరిశ్రమకు అనువైన స్థలం కేటాయించాలని, అలాగే వివిధ రకాల రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. పరిశీలించిన స్టేట్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సానుకూలంగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ మేరకు శ్రీసిటీలో 24 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2015-20కి అనుగుణంగా రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చినా దేశీయంగా తొలి పారిశ్రామిక సంస్థగా ప్రజల నోళ్లలో నిరంతరం నానుతుండే టాటా పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లేవీ రాలేదు. ఇప్పుడా కొరత తీరుస్తూ టాటా అనుబంధ సంస్థ స్మార్ట్ ఫుడ్స్ లిమిటెడ్ తన అల్ట్రా మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతోంది.

ఆయన ఒక జిల్లాకు సబ్‌కలెక్టర్‌. చాలా మంది ఐఏఎస్ ల లాగా, తన అధికారం చూపించలేదు. ఐఏఎస్ అంటే ప్రజా సేవ చెయ్యటమే అని నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, గురువారం మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ పరిధిలోని బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అదే సమయంలో అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని నూకలేటివాడ గ్రామం నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌ కోసం ఫోన్‌ వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అక్కడి నుంచి తీసుకురావల్సి ఉంది. దీంతో సబ్‌కలెక్టర్‌ స్వయంగా అంబులెన్సును నడుపుకుంటూ ఆ గ్రామానికి వెళ్లారు. రోగిని వాహనంలో ఎక్కించి తనవెంట వచ్చిన అంబులెన్స్‌ పైలెట్‌ ద్వారా ఆసుపత్రికి పంపించారు.

ambulance 13072018 2

ఎక్కడన్నా చిన్న తప్పు జరిగితే, ఎత్తి చూపే న్యూస్ చానల్స్ , సోషల్ మీడియా ట్రోల్స్ వాళ్ళకి, ఇలాంటివి కనిపించవు. కనిపించినా, ఇలాంటి మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే, ఇక్కడ కూడా రాజకీయ కోణం. అంతే కాని, ఒక యువ ఐఎస్ఎస్ ఆఫీసర్ చేసిన పనిని అభినందిస్తున్నాం అనే స్పృహ ఉండదు. ఒక, సబ్‌కలెక్టర్‌, స్వయంగా ఫీడర్‌ అంబులెన్స్‌ నడుపుకుంటూ మన్యంలోని మారుమూల గ్రామంలోని రోగి ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి దగ్గరుండి రోగిని ఆ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి పంపించారంటే, కచ్చితంగా అభినందించాలి. ఇలాంటి వారు ఎంతో మంది అధికారులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి.

ambulance 13072018 3

ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య కేంద్రాలకు వచ్చేలోగా ప్రసవాలు సంభవించడం, మాతా శిశు మరణాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చంద్రన్న సంచార చికిత్స, 108 వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొండ ప్రాంతాల్లో, కొన్ని ఇరుకుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో చేసేదిలేక వైద్యసేవల కోసం డోలీ కట్టుకుని స్థానికులే ఆరోగ్య కేంద్రాలకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఫీడర్‌ అంబులెన్సుల్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతగా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు గాను ద్విచక్ర వాహనాలతో అనుసంధానమై ఉండే 122 ఫీడర్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు.

ఎంత మంది అమరావతిని వెనక్కు లాగటానికి ప్రయత్నిస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, అమరావతిని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు... ఢిల్లీ వాళ్ళు, సొంత మనుషులు అమరావతి పై ఏడుస్తూ, కుట్రలు చేస్తున్నా, అవే దీవెనలు అనుకుని, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు... వీరు అమరావతి పై విషం చిమ్ముతూ బ్రాండ్ ఇమేజ్ చెడగోడుతుంటే, చంద్రబాబు అమరావతి బ్రాండ్ ఇమేజ్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు... అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, ఫార్ములా1 పవర్‌బోట్‌ రేసింగ్‌, కృష్ణా నదిలో జరగనున్న విషయం తెలిసిందే. పోటీల నిర్వహణ సంస్థ యూఐఎం రాష్ట్ర పర్యాటక శాఖతో ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకోనుంది.

boating 13072018

షెడ్యూల్‌ ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పోటీలు నవంబరు 22-24వరకు జరగాల్సి ఉంది. తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పు చేశారని, నవంబరు 10నుంచే ఇక్కడ పోటీలు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఒక బోటుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి థీమ్‌తో నమూనాను సిద్ధం చేశారు. థీమ్‌లో భాగంగా లేత పసుపురంగు బ్యాక్‌గ్రౌండ్‌ పైన ఎరుపు రంగులో ‘అమరావతి’ పేరు, దాని కింద ఏపీ టూరిజం అని రాసి ఉంటుంది. 2018 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్‌1 వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్‌, లండన్‌, ఫ్రాన్స్‌, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత దేశంలోని, అమరావతి కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలైన ఈ చాంపియన్‌షిప్‌ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది.

boating 13072018

ఈ ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు గత ఏడాది నుంచి, ఎంతో శ్రమించారు... ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. .. బ్యారేజీ నుంచి నది 23కి.మీ. మేర ఉండడం, 11 లంకలు(ఐలాండ్‌లు), అక్కడక్కడా నది వంపులు, నీటిలో అలలు లేకుండా నిర్మలంగా ఉండడం వంటి సాంకేతిక కారణాలను పరిశీలించి ఈ ప్రాంతాన్ని రేసింగ్‌కు అనువైనదిగా గుర్తించారు.... ‘ఎఫ్‌1హెచ్‌2వో’ ప్రతినిధి బృందంతో, ఈ రేస్‌లు అమరావతిలో నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రపంచ స్థాయిలో మా కొత్త నగరానికి గుర్తింపు వస్తుందని చంద్రబాబు కోరారు. సాంకేతికంగా కూడా అనువుగా ఉండడంతో ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ కేలెండర్‌లో అమరావతిని వేదికగా ఎంపిక చేశారు... ఇక నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయ పర్యాటకులు, క్రీడాభిమానులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు ఇలా అనేకమంది రాకతో నవంబరులో విజయవాడలో సందడి నెలకొననుంది.

Advertisements

Latest Articles

Most Read