వీర్రాజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సారి పోలవరం పై, ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేసారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ కు చంద్రబాబుకు సంబంధమే లేదని తేల్చేసారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమి సంబంధం ఉంటుందో ఆలోచించుకోవాలని ప్రజల్ని కోరారు. కేవలం చంద్రబాబు, పోలవరం ప్రాజెక్ట్ ముందు నుంచి ఫోటోలు దిగి ఫోజ్ కొడుతున్నారని సోము వీర్రాజు అన్నారు. కేంద్రమే పూర్తి బాధ్యతతో పోలవరం ప్రాజెక్టును అనుకున్న ప్రకారం పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందని, అసలు చంద్రబాబుకి దీంట్లో వెంట్రుక వాసి అంత కూడా సంబంధం లేదని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు.

veerraju 15072018 2

అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. బీజేపీ మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టుపై పోరాడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు బీజేపీ తెలంగాణ నాయకులు పోలవరంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజమండ్రిలో సమావేశంలో పోలవరానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ ముంపు మండలాలు తెలంగాణలో ఉంచగా, బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం తొలి కేబినెట్‌లోనే ఆర్డినెన్స్ ద్వారా వాటి ఏపీలో కలిపామన్నారు. అప్పట్లోదీనిపై పెద్ద కసరత్తే జరిగిందని వీర్రాజు వివరించారు. పోలవరం -సోమవారం అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు కేంద్ర ప్రాజెక్టును కేంద్రానికి వదిలిపెట్టి హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.

veerraju 15072018 3

ముంపు మండలాలు, ఆంధ్రప్రదేశ్ లో కలపమని, అలా అయితేనే ప్రమాణస్వీకారం చేస్తా అని మోడీకి చెప్పమని, చంద్రబాబుకు నేనే చెప్పా అని సోము వీర్రాజు అన్నారు. లేకపోతే అసలు చంద్రబాబుకి ఆ విషయమే తెలియదు అని సోము వీర్రాజు అన్నారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలకు ప్రజలు పగలబడి నవ్వుతున్నారు. సోము వీర్రాజు ఈ ప్రెస్ మీట్ తో అతి పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నారని ప్రజలు అంటున్నారు. ఇన్నాళ్ళు, పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు దోచేస్తున్నాడు అని చెప్పిన సోము వీర్రాజు, ఇప్పుడేమో అసలు చంద్రబాబుకి సంబంధమే లేదు, కేవలం ఫోటోలు మాత్రమే దిగుతున్నాడు అని చెప్తుంటే, ఇది వరకు చేసిన అవినీతి ఆరోపణలు మాట ఏమిటి అని అడుగుతున్నారు. అలాగే, కేంద్రం నిర్వహిస్తున్న 16 జాతీయ ప్రాజెక్ట్ లతో, పోలవరం పోల్చుకుంటేనే, ఎవరి వల్ల పోలవరం ఈ స్థాయికి వచ్చిందో ప్రజలకు తెలుసని, సోము వీర్రాజు ప్రతి ప్రెస్ మీట్ తో, జబర్దస్త్ కు మించిన కామెడీ పండించటం తప్ప, ఏమి ఉపయోగం ఉండదని అంటున్నారు.

శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో ప్రజలను అయోమయానికి చిరంజీవి గురి చేశారని,అనంతరం కేం ద్రంలో మంత్రి పదవిని సైతం పొందారని గుర్తు చేశారు. విభజన సమస్యలపై కూడా పెదవి విప్పడం లేదన్నారు. ఇప్పుడేమో పొంతన లేని రాజకీయాలతో ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి రాజకీయం ఒక్కో విధంగా సాగుతోందని, రా ష్ట్ర ప్రజలను విస్మరించడం తనకు బాధ కలిగిస్తోందని తెలిపారు. వేరే రాష్ట్రాలలో అయితే రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలు ఒక్కటిగా మార తాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా వుండ టం శోచనీయమని అన్నారు. వైఎస్సార్‌సిపి కేసుల కోసం కేంద్రంతో రాజీ పడుతోం దని, లోపల విశ్వాసంగా వుంటూ , బయటకు మాత్రం అవిశ్వాసాన్ని ప్రకటిస్తోందంటూ దుయ్యబట్టారు.

cbn 1507208 2

కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటుందని చెప్పడం, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకుల్ని మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి స్పందన కోరగా... ‘‘కాంగ్రెస్‌ను తిట్టిన జగన్‌ చివర్లో లాలూచీపడి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు భాజపా దగ్గరకు వెళ్లిపోయారు. కేసుల మాఫీకే రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి మద్దతిచ్చారు. కిరణ్‌ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఆదరించలేదు. నాలుగేళ్లు వేచి ఉండి, కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. అది ఒక ఛాయిస్‌. పవన్‌ కళ్యాణ్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత కాంగ్రెస్‌లో కలిపేసి, కేంద్ర మంత్రయ్యారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలీదు. కాంగ్రెస్‌లోనే ఉన్నారనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో పవన్‌ ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయనా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టేమీ చెప్పలేదు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయనేమీ మాట్లడలేదు. ఇటీవల ఒక కమిటీ వేసి కేంద్రం రూ.70 వేల కోట్లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడకుండా, నన్ను తిడుతున్నారు. కాంగ్రెస్‌ వాళ్లూ నన్ను తిడుతున్నారు. వాళ్లే సరిగ్గా చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

cbn 1507208 3

వైఎస్సార్‌సిీపీ ఎంపీలు అసలు రాజీనామాలు చేయడమెందుకు అని ముఖ్యమంత్రి అన్నారు. అదంతా ఒక నటన మాత్రమే నన్నారు. తప్పించుకోవడానికే త్యాగం చేశామని చెబుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సిపీ, జనసేన, బీజేపీలు కలిసి టీడీపీని లక్ష్యంగా ఎంచుకున్నాయన్నారు. ఏ పార్టీ కూడా సమస్యలపై మాట్లాడటం లేదని, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకుని దాడి చేస్తే ప్రజలు నమ్మరన్నారు. విభజనానంతర సమస్యల విషయంలో సెంటిమెంట్‌తో ఆటలాడుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. న్యాయబద్దంగా తాము, ఎం.పి.లు డిమాండ్లను గుర్తు చేస్తే తమాషా చేస్తారా అని మండిపడ్డారు. ఇది బిజెపి మార్కు రాజకీయానికి పరాకాష్ట అన్నారు. ఈ గడ్డమీద పుట్టినవాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం విడ్డూరంగా వుందని వ్యాఖ్యానించారు. అవినీతిపరులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తారా అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అయితే, చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి పై వ్యాఖ్యలు చేసారు. కొన్ని రోజుల క్రిందట, చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరతారనే సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా బీజేపీ, పవన్ ను తెర మీదకు తీసుకురావటం, పవన్ ఆక్టివ్ అవ్వటంతో, చిరంజీవి తన తమ్ముడు పార్టీలో చేరతారనే అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి పై, ఈ రోజు చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. మాజీ సియం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం పై, విలేఖరులు అడగగా, చంద్రబాబు స్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టారు.. ప్రజలు ఆదరించలేదు.. మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.. కానీ చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో స్పష్టత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... వీరంతా కష్ట కాలంలో పోరాడాల్సింది, ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.

cbn chiru 1407218 2

కేంద్రంతో సమస్యలున్నా... పోలవరం ప్రాజెక్ట్ ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనపై బీజేపీ, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లతో పవన్‌కల్యాణ్ కూడా కలిశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పుట్టినవారు కూడా పోలవరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుల విషయంలో లాలూచీపడి.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆశ పడుతోందని తెలిపారు. పార్లమెంట్‌లో పోరాటం నుంచి తప్పించుకునేందుకే వైసీపీ డ్రామాలాడుతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. పోరాడే సమయంలో వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు రాని రాజీనామాలు ఎందుకు? అని నిలదీశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ఎందుకు? అని అడిగారు.

cbn chiru 1407218 3

వచ్చే నెలలో అమరావతికి ఓ రూపం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్‌ టీమ్‌ అని దేశంలో నిరూపితమైందని చెప్పారు. కోర్టుల్లో, ట్రిబ్యునల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ప్రపంచ బ్యాంకుకు సైతం తప్పుడు ఫిర్యాదులు చేశారని వాపోయారు. గ్రామదర్శిని పేరుతో జనవరి వరకు ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమంలో 75చోట్ల తాను పాల్గొంటానని సీఎం వెల్లడించారు. అన్న క్యాంటీన్‌ అద్భుతంగా విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఈనెల 16వ తేదీకి 1500రోజులు పూర్తవుతుందని వెల్లడించారు. విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఆందోళన కలిగించిందన్నారు. సంతృప్తితో కూడిన అభివృద్ధి కోసం మా ప్రయత్నం చేశామని తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తే.. కేంద్రం రెవెన్యూ లోటులో కోత పెట్టిందని ఆరోపించారు.

బీజేపీ - వైసీపీ బంధం గురించి, రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ రోజు, కేంద్ర మంత్రి, జగన్ ను సియంను చేస్తాం అని కూడా చెప్పారు. అయితే, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఆశ్చర్యాన్ని కలిగించింది. జమిలి ఎన్నికలకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ విధానానికి అనుకూలంగా వైసీపీ వ్యవహరించింది. అయితే తాము బీజేపీకి సపోర్ట్‌గా జమిలికి మద్దతు తెలియచేయలేదని దేశ ప్రయోజనాల కోసమే మద్తతు తెలిపామని విజయసాయి రెడ్డి చెప్పారు. మరో పక్క, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో బీజేపీకి కానీ, బీజేపీ మిత్ర పక్షాల అభ్యర్థికి కానీ మద్దతు ఇవ్వబోమని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామంతో విలేకరులు ఒకింత ఆశ్చర్య పోయారు. ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పై, అమిత్ షా, కెసిఆర్, జగన్ లతో మాట్లాడి, వారి మద్దతు తీసుకున్నారు.

visr 14072018

అయితే విజయసాయి మాత్రం, మేము బీజేపీకి మద్దతు ఇవ్వం అంటూ చెప్పారు. విజయసాయి అంత ధైర్యంగా ఎలా చెప్పారు ? అమిత్ షా ఊరుకుంటారా ? అనే ప్రశ్నలు తలెత్తాయి. అమిత్ షా తలుచుకుంటే, వారం రోజుల్లో, జగన్, విజయసాయి రెడ్డి, ఇద్దరూ జైల్లో ఉంటారు. అందుకే, జగన్, బీజేపీకి లొంగిపోయాడు. విజయసాయి రెడ్డి అయితే, డైలీ ప్రధాని కార్యాలయంలోనే జీవనం. అలాంటి, విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తాము బీజేపీకి కానీ, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థికి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతు ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అది అంతిమంగా ఎన్నికల్లో నష్టాన్ని చేకూరుస్తుందని వైసీపీ భావిస్తోందనే, విజయసాయి రెడ్డి ఇలా చెప్పారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

visr 14072018

ఇలా పైకి ఎదో చెప్పినా, ఆ టైంకు బీజేపీకే మద్దతు ఇస్తామని వైసీపీ సీనియర్లు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పై వ్యతిరేకత ఉండనే విషయం మాకూ తెలుసు, వారితో వెళ్తే మేము మునుగుతాం అని తెలుసు, కాని జగన్ కేసుల విషయంలో వారు చెప్పినట్టు వినక తప్పదు అని ఒక వైసిపీ నేత అన్నారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దాకా, బీజేపీ జోలికి జగన్ వెళ్ళడని, అంతకు ముందు ఎదురు తిరిగితే, జరిగేది ఏంటో జగన్ కు తెలుసని అంటున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసి చాలా రోజులైంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక్క ఖండన ప్రకటన రాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది. అయితే, బీజేపీతో అంటకాగుతున్నామన్న ముద్రపడిపోయిందని వైసీపీ భయపడుతోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీకి దూరం జరిగామని చెప్పుకోవాలనే వ్యూహం అమలు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ విషయం అమిత్ షా కు తెలిస్తే మాత్రం, సినిమా వేరలా ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read