ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో, 150 ఎకరాల్లో అత్యాధునిక గిడ్డంగులు నిర్మించి, 10 వేలమందికి ఉపాధి కలిపించే ఆలోచనలో ఉన్నామని సంజీవ్ వివరించారు. స్థానిక రైతులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ ద్వారా విక్రయించుకునేందుకు సహకరిస్తామని, తాము ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో వ్యాపారావకాశాల కల్పనలో రోల్‌మోడల్‌గా ఉన్నామని తెలిపారు. వాల్‌మార్ట్ 50 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉందని, ఏడాదికి 60 శాతం వృద్ది సాధిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే భారతదేశంలో 4 ప్రాంతాల్లో అతిపెద్ద నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, భారీ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ ఏర్పాటు చేసామని చెప్పారు.

walmart 13072018 2

స్మార్ట్ ఫోన్లు,వివిధ కంపెనీలు తయారు చేసే వస్త్రాలు వంటి అనేక ఉత్పత్తులను దేశవ్యాప్తంగా రీటైలర్లకు సరఫరా చేస్తున్నామని, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉత్పత్తులను సేకరించి, వాటిని సరఫరా చేసేందుకు మేము సమర్ధ రవాణా వ్యవస్థ కలిగి ఉన్నామని వివరించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, వాల్‌మార్ట్ తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి, తమ సెంటర్లు నెలకొల్పడానికి అనంతపురము అత్యంత అనుకూల ప్రాంతమని అన్నారు. వాల్‌మార్ట్‌కు ఎంతో కీలకమైన ఆహార శుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని అనంతపురము జిల్లాలో వాల్‌మార్ట్ తమ సెంటర్ ఏర్పాటు చేస్తే చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా వంటి ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మరింత వీలుగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.

walmart 13072018 3

దేశంలోని అన్ని ప్రాంతాలకూ రవాణా మార్గాలు కలిగి ఉండటం మా రాష్ట్ర విశేషమని, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభానికి పూర్తీ సహకారం అందిస్తామని చెప్పారు. "ఏపీ మీకు గ్లోబల్ సోర్సింగ్ సెంటర్‌గా ఉంటుంది. మేము వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యదిక వృద్ది నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈ ఉత్పత్తులను వాల్‌మార్ట్ బ్రాండ్ ద్వారా అందించవచ్చు. రాష్ట్రంలో మీకు స్నేహపూర్వక వాణిజ్య వాతావరణం ఉంటుంది. ఇక్కడ పూర్తి పారదర్శక ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత త్వరలో వాల్‌మార్ట్ తన కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాం" అని చంద్రబాబు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డితో చెప్పారు.

మన రాష్ట్రంలో విద్యార్ధులకు, అమెరికాలో చదువుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. అక్కడ మంచి యూనివర్సిటీలో ఎంఎస్ చెయ్యాలని, అక్కడ మంచి ఉద్యోగం చెయ్యాలని, ఇలా అనేక కలలు కంటూ ఉంటారు. కాని, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మధ్య తరగతి కుటుంబాలకు, ఎంతో భారం. ఇవన్నీ చూసిన చంద్రబాబు, కొన్ని కార్పొరేషన్ల ద్వారా, కొంత మంది విద్యార్ధులకు ఫీజ్ లు కట్టి, విదేశాల్లో చదివిస్తున్నారు. అయితే, ఇది కొంత మందికి మాత్రమే వీలు ఉంటుంది. దీన్ని కూడా అధిగమించి, తల్లి తండ్రుల పై భారం తగ్గించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న అడుగు వేసింది. అమెరికాలోని ఒహోయో రాష్ట్రంతో, కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారికి 75 శాతం ఫీజ్ రాయతీ ఇస్తారు.

university 13072018 2

అంటే, ఇప్పుడు అక్కడ ఫీజ్ 20 లక్షలు ఉంటే, 15 లక్షలు రాయతీ వస్తుంది. విధ్యార్ధులు 5 లక్షలు కడితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఒహోయో రాష్ట్రంలో ఉన్న 272 యూనివర్సిటీలలో, ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీజ్ రాయతీ, ఎంఎస్ కోర్స్ కు మాత్రమే ఉంది. మిగిలిన కోర్స్ లకు కూడా, త్వరలోనే, ఈ ఒప్పందంలో చేర్చనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో సెమిస్టర్ కు, ఒక్కో విద్యార్ధికి 4 లక్షల వరకు అదా అవుతుంది. ఈ ఫీజ్ రాయతీ పొందటానికి, ముందుగా ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖకు ధరఖాస్తు చేసుకోవాలి, తరువాత అక్కడ ఉన్న యూనివర్సిటీలు కూడా స్క్రీనింగ్ చేసి, విధ్యార్ధులను తమ యూనివర్సిటీలలో చేర్చుకుంటాయి.

university 13072018 3

ఈ వివరాలు అన్నీ గంటా శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. త్వరలోనే, అమెరికాలోని మరిన్ని రాష్ట్రాలతో కూడా ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. అలాగే చైనా, కెనడా, యుకే తో కూడా, ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటామని, ఆ చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. అందరూ మంచి చదువు, చదువుకోవాలనే ముఖ్యమంత్రి సంకల్పం కోసం, విద్యా శాఖ కృషి చేస్తుందని చెప్పారు. అలాగే, అమరావతి, వైజాగ్, తిరుపతిలో, ప్రముఖ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా కృషి జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ ని అప్గ్రేడ్ చెయ్యటం మొదలు పెట్టామని, అన్ని స్కూల్స్ లో, అన్ని రకాల ఆధునిక వసతలు కలిపిస్తున్నామని చెప్పారు.

విభజన అనివార్యం అయిన సమయంలో కూడా, చివరి బంతి ఉంది, సిక్సర్ కొడతాం అంటూ, సమైక్యవాదం వినిపించిన, కిరణ్ కుమార్ రెడ్డి, తిరిగి సొంత గూటికి చేరారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధి, కిరణ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కిరణ్‌ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. అయితే, ఇప్పుడు లంఛనంగా మాత్రమే రాహుల్ ను కలిసారని, ఆంధ్రప్రదేశ్‌లో భారీ సభ ఏర్పాటుచేసి అక్కడ రాహుల్‌ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరతరానికి, పార్టీ వర్గాలు అంటున్నాయి.

krian 13072018 1

అయితే ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, పాత కాంగ్రెస్ నేతలందరినీ, కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన మెయిన్ టార్గెట్ జగన్ మోహన్ రెడ్డే అని చెప్పకనే చెప్పారు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. జగన్ పై, సోనియా గాంధీ మొదటి నుంచి కోపంగానే ఉన్నారు. జైలు నుంచి బెయిల్ తీసుకునే దాకా, మా చుట్టూతా తిరిగి, మేము ఇబ్బందుల్లో ఉన్న టైంలో మోడీ పంచన చేరాడనే కోపం వారికి ఉంది. జగన్ ను దెబ్బతియ్యటానికి ఓర్పుగా ఎదురు చూస్తూ వచ్చారు. వారికి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో అవకాశం వచ్చింది. కాంగ్రెస్ గెలుపు అనేది కుదిరే పని కాదనే విషయం వారికీ తెలుసు. జగన్ ను ఇబ్బంది పెట్టటమే వాళ్ళ టార్గెట్. ఇదే విషయం ఈ రోజు కిరణ్ చెప్పకనే చెప్పారు..

krian 13072018 1

కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గురించి చెప్పారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. తెలంగాణా ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్, తెలంగాణా ఇచ్చిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పామని, అది ఇచ్చి తీరుతామని అన్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిని అని, మా అందరికీ అప్పట్లో వైఎస్ చెప్పింది, రాహుల్ గాంధీని ప్రాధాన మంత్రిని చెయ్యటమే అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, అసలు కధ ఇక్కడే ఉంది. త్వరలోనే కాంగ్రెస్‌ వీడిన 30-40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు, జగన్ పార్టీతో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్ రాకతో, ఓట్లు చీలిపోతాయని టెన్షన్ లో పడిన జగన్, ఇప్పుడు కిరణ్ చెప్తున్న మాటలతో, మరింతగా డైలమాలో పడినట్టే. మొత్తానికి, జగన్, పవన్, కాంగ్రెస్, ఇలా అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం, పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా, రాష్ట్రంలో మళ్ళీ పుంజుకునే అవకాశం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం, జగన్ కు ఇబ్బంది చేకూరుస్తాయనేది వాస్తవం... కిరణ్ ఎంట్రీ, జగన్ కు ఎలాంటి ఇబ్బంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఇటీవలే అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు ఈ పెరిగిన జీతం వచ్చే నెలలో అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించారు. ఇప్పటివరకూ అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తూ వచ్చారు. తాజాగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన సభలో అధికారికంగా ప్రకటించారు.

angawadi 13072018 2

ఈ బీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే.. రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు చంద్రన్నబీమా ద్వారా ఆ కుటుంబానికి అందజేస్తారు. జిల్లాలో ఆశావర్కర్లు 3,082 మంది పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిపి సుమారు 12వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ చంద్రన్నబీమా వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే వేతనాలు పెంచిన సీఎం తాజాగా చంద్రన్నబీమా వర్తింపజేయడం తో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి పరిటాల సునీతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

angawadi 13072018 3

7500లుగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు ఇటీవలే చంద్రబాబు పెంచారు. అలాగే ఆశా వర్కర్లకి నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పుడు వీరికి పెరిగిన జీతాలకు తోడు, ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో, చంద్రన్న భీమా కూడా తోడయ్యింది.

Advertisements

Latest Articles

Most Read