వినియోగదారులకు వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలుగా విజయవాడలోనే పూర్తిస్థాయి ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఇ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రారంభించింది. ఈ సెంటర్‌ వివరాలను సంస్థ ఫుల్‌ఫిల్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా గురువారం విలేకరులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదని ఆయన తెలిపారు. దేశంలో ఇలాంటివి 50కిపైగా ఉన్నాయని, విజయవాడలో ఈ నెల 16 నుంచి సేవలు మొదలవుతాయని చెప్పారు. వాస్తవానికి ఈ సెంటర్‌ను తొలుత విశాఖలో నెలకొల్పాలని భావించినా.. విజయవాడ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు అధికంగా ఉండటంతో బెజవాడవైపే మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు.

amazon 13072018 2

ఈ ప్రాంతానికి చెందిన వారు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగానే వేగంగా వస్తువుల డెలివరీ ఉంటుందని సక్సేనా వివరించారు. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ విజయవాడ శివార్లలోని నిడమానారులో వచ్చింది. 20 వేల స్క్వేర్ ఫీట్ లో, 15 వేల క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ స్పేస్ తో, ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ను అమెజాన్ ప్రారంభించింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, నిడమానూరుని ఎంచుకున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ సెంటర్ , సోలార్ పవర్ సిస్టం ద్వారా పవర్ జెనరేట్ చేసుకుంటామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

amazon 13072018 3

విజయవాడలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుందన్నారు. ప్యాకేజింగ్‌, రవాణా, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ది చెందుతాయన్నారు. ఈ సెంటర్‌ ద్వారా అమెజాన్‌ తన స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 3.2 మిలియన్‌ క్యూబిట్‌ ఫీటుకు పెంచుకుంది. దీంతో వినియోగదారులకు త్వరితగతిన సరుకులను అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ సృష్టించనుందని అమెజాన్‌ ఇండియా తెలిపింది.

దశాబ్దాలుగా కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసి, రాజకీయంగా పావుగా మారి, చివరకు ఆ వెంకన్ననే రోడ్డుకు లాగిన, శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. రిటైర్మెంట్ నిబంధనలు తీసుకొచ్చి తనను విధుల్లోంచి అకారణంగా తొలగించారంటూ, కేంద్ర పరిధిలోకి కేంద్ర న్యాయశాఖకు కొన్ని రోజుల క్రిందట రమణ దీక్షితులు ఫిర్యాదు చేసారు.. దాని పై కేంద్ర న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ దాన్ని తిరస్కరించింది. ఈ అంశం తమ పరిధిలోకి రావని, సమస్య ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. దీంతో కేంద్రం జోక్యం వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన మాజీ ప్రధాన అర్చకుల భంగపాటు తప్పలేదు.

ramana 13072018

శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం జరగడం లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని అర్చకులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు, తమను విధుల్లోంచి అకారణంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మే 23న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు మాజీ అర్చకులు ఫిర్యాదు చేశారు. కేంద్రన్యాయశాఖ కార్యదర్శి డీసీ పతక్... లేఖను రమణదీక్షితులుకు తిప్పి పంపారు. టీటీడీ పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రమణదీక్షితులుకు కేంద్ర న్యాయశాఖ సూచించింది.

ramana 13072018

కోర్ట్ కు వెళ్ళకుండా, కేంద్ర న్యాయ శాఖ దగ్గరకు వెళ్ళటం కూడా ప్లాన్ లో భాగంగా జరిగిందే. కేంద్రంలో పెద్దల సలహా మేరకు, ఈ విధంగా దీక్షితులు చేసారు. అయితే, కేంద్ర న్యాయ శాఖ పరిశీలించి, అనవసరమైన తల నొప్పులు కొని తెచ్చుకోవటమే అని, మనం ఏదన్నా నిర్ణయం తీసుకుంటే, తరువాత రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కు వెళ్తే, మనకే ఇబ్బంది అని, కేంద్ర పెద్దలకు చెప్పినట్టు సమాచారం. దీంతో, దీక్షితులు విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇప్పుడు, దీక్షితులకు, మిగిలన ఒకే ఒక మార్గం కోర్ట్. అయితే, ఇది వరకే ఒకసారి కోర్ట్, టిటిడి అర్చకుల రిటైర్మెంట్ పై, తీర్పు ఇచ్చింది. అదే ఇప్పుడు దీక్షితులకు కూడా వర్తిస్తుంది. దాని ప్రకారం, స్వామి వారికి సేవ చెయ్యాలి అనుకుంటే చెయ్యవచ్చు కాని, జీతాలు, లేక ఇతర బెనిఫిట్స్ ఏమి రావు అని కోర్ట్ చెప్పింది. మరి, ఇప్పుడు దీక్షితులు తరువాత అడుగు ఏమి వేస్తారో చూడాలి...

దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకొనే ప్లాన్ లో భాగంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈ రోజు తెలంగాణాలో పర్యటిస్తున్నారు. అసోం, హరియాణా, త్రిపుర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆంధ్రాలో అడుగుపెట్టి రాజకీయ సభ పెట్టే పరిస్థుతులు లేకపోవటంతో, తెలంగాణా నుంచే ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టనున్నారు. ఎలా ఎక్కువ స్థానాలు రావాలి, పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఎలా రావాలి అనే, ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. ఒకరోజు పర్యటనలో ఆయన బూత్‌స్థాయిలో పార్టీ పరిస్థితిని, సభ్యత్వ నమోదు, మోర్చా కమిటీల ఏర్పాటును సమీక్షించనున్నారు. మైక్రో పోల్ మ్యానేజ్మెంట్ పై, దిశానిర్దేశం చెయ్యనున్నారు అమిత్ షా.

amit 13072018 2

ఇది ఇలా ఉండగా, బీజేపీ ఇటీవలే మొదలుపెట్టిన సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా , అమిత్ షా ఈ రోజు ఈనాడు అధిపతి రామోజీ రావు, పారిశ్రామికవేత్త శ్రీనిరాజు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా, ఈనాడు, టీవీ9ను తమకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడతో అమిత్ షా, ఈ భేటీలు ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా ఆంధ్రాలో, తమ కొత్త స్నేహితులైన పవన్, జగన్ ల పై, మీడియాలో పాజిటివ్ స్టొరీలు వచ్చేలా చెయ్యాలనే ప్రయత్నం చెయ్యనున్నారు. అయితే, ఇలాగే ఇది వరకు జగన్ మోహన్ రెడ్డి వెళ్లి, రామోజీని కలిసినప్పుడు, ఇక ఈనాడులో అన్నీ జగన్ వార్తలే వస్తాయని అందరూ అనుకున్నారు. కాని, తరువాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలకు కావాల్సిన విభజన హామీలు నెరవేర్చకుండా, ఇలా మీడియాను నమ్ముకుంటే ఏమి వస్తుందో అమిత్ షా కే తెలియాలి.

amit 13072018 3

మరో పక్క, అమిత్ షా, జగన్, పవన్ ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే జగన్, ఈ రోజు శుక్రవారం కావటంతో నాంపల్లి కోర్ట్ కు వెళ్ళటానికి హైదరబాద్ వచ్చారు. కోర్ట్ విచారణ పూర్తయిన తరువాత, జగన్, అమిత్ షా ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క, పవన్ నిన్న కంటి ఆపరేషన్ చేసుకున్నారు. పవన్ ను పరామర్శ పేరుతో, అమిత్ షా కలిసే అవకాశం ఉందని, ప్రచారం జరుగుతుంది. మొత్తానికి, తెలంగాణాతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, చంద్రబాబుని దించటానికి, ఈ రోజు తెలంగాణా వేదికగా, ప్లాన్ చెయ్యబోతున్నారు అమిత్ షా.. ఈయనప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...

ప్రకాశం జిల్లాకు, ఎట్టకేలకు ఒక గుడ్ న్యూస్.. ఇన్నాళ్ళు అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నాయి, ప్రకాశం జిల్లాను పట్టించుకోవటం లేదు అనే ప్రకాశం జిల్లా వాసులు కూడా, మాకు ఒక పెద్ద కంపెనీ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇది ప్రకాశం జిల్లాకే కాదు, రాష్ట్రం మొత్తానికి గుర్తింపు ఇచ్చే అతి పెద్ద కంపెనీ ప్రకాశం జిల్లాలో రాబోతుంది. ప్రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమ రాబోతోంది. దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడితో, ఏటా సుమారు 25 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. ఇండోనేషియాకు చెందిన ‘ఏపీపీ సినార్‌మస్‌’ సంస్థ దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ కంపెనీ ఏర్పాటైన తరువాత ఆసియాలోనే అతిపెద్ద కాగిత పరిశ్రమ కానుంది.

paper 13072018 12

సినార్‌మస్‌ పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా పెద్దగంజాం ప్రాంతాలను పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులు పెద్దగంజాం సరైన ప్రాంతంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సముద్ర రవాణా ద్వారానే ముడిసరుకు దిగుమతి, ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటారు. అందుకే ఈ సంస్థ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పరిశీలించింది. రెండున్నరవేల ఎకరాల భూమి, తీరంలో జెట్టీ, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు, ఏడాదికి ఒక టీఎంసీ నీరు, 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంటు పరిశ్రమకు అవసరం. ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వం ముందుకొచ్చి, మరిన్ని రాయతీలు ఇవ్వటంతో, ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గింది.

paper 13072018 3

కాగితపు పరిశ్రమ ఏర్పాటు తర్వాత... ప్రతి నిమిషానికి ఒక వాహనం కాగితం లోడ్‌తో కంపెనీ నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగంజాంలోని ప్రతిపాదిత స్థలం నుంచి ఈ వాహనాలన్నీ రైల్వే లైన్‌ను దాటుకుని రావాలి. ఈ ఇబ్బందిని తొలగించేందుకు రూ.40 కోట్లతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించేలా ఇప్పటికే రైల్వే అధికారులతో చర్చలు జరిపారు. ఇండోనేషియా నుంచి సరుకు దిగుమతి, ఎగుమతి కోసం సముద్రంలో జెట్టి నిర్మాణం తప్పనిసరి. రూ.1300 కోట్లతో దానిని నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుబాబుల్ రైతులకు కూడా వరం కానుంది. ఇంత పెద్ద పరిశ్రమ మన రాష్ట్రంలో వస్తూ ఉండటంతో, మన రాష్ట్రంలో సుబాబుల్ రైతులకు మంచి డిమాండ్ వస్తుంది.

Advertisements

Latest Articles

Most Read