మన విద్యా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దాలని, అంతర్జాతీయ స్థాయి విద్య ప్రమాణాలు, బోధన, పరిశో ధనల తోకూడిన విద్యాసంస్థల ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమి నన్స్ (ఐఓఈ) కార్యక్రమం ఆది లోనే వివాదాస్పదమైంది. దేశంలో అత్యుత్తమ నాణ్యతాప్ర మాణాలున్న విద్యాసంస్థలను కాదని, ఇంకా ఆవిర్భవించని జియో విశ్వవిద్యాలయానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. అంతర్జాతీయంగా అత్యుత్తమ శ్రేణి విద్యా సంస్థల టాప్ 200 జాబితాలో భారతదేశం నుంచి ఒక్క విశ్వవిద్యాల యానికీ చోటు దక్కకపోవడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మానవ వనరుల శాఖ నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ జాబితాను ప్రభుత్వం రెండురోజుల క్రితం ప్రకటించింది.
వాటిలో ప్రభుత్వరంగానికి చెందిన ముంబై, ఢిల్లి ఐఐటీలు, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ప్రైవేటు రంగానికి చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థలు బిట్స్ పిలానీ, మణిపాల్ యూనివర్శిటీలు ఉన్నాయి. వీటితోపాటు రిలయన్స్ సంస్థకు చెందిన జియో వర్శిటీ పేరును ఆ జాబితాలో చేర్చడం ఇప్పుడు వివాదంగా మారింది. రిలయన్స్ సంస్థలు, వాటి అధిపతు లైన అంబానీలపై మోదీ ప్రభుత్వం అపారకరుణ చూపుతోందన డానికి ఇది నిదర్శనమని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. దేశంలో 800 విశ్వవిద్యాలయాలు, పేరెన్నికన్న విద్యాసంస్థలు ఉండగా, అసలు మొదలే కాని జియో వర్శిటీకి, మోడీ ప్రభుత్వం సలాం కొడుతుంది.
దీని వెనుక భారీ కుట్ర ఉంది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినె న్స్ జాబితాలో చేరుస్తామని, అలా ప్రకటించిన విద్యాసంస్థలకు ప్రత్యేకంగా నిధులు, హక్కులు ఇస్తామని పేర్కొంది. ఎమినెన్స్ హోదా ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలకు, స్వయంప్రతిపత్తి కూడా ఇస్తామని, మరెన్నో హక్కులూ కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. ఫీజుల నిర్ణయం, ఫ్యాకల్టీల నియామకం, కొత్త కోర్సుల నిర్వహణపై ప్రభుత్వ జోక్యం ఉండదు. యితే జియో విశ్వవిద్యాలయం ఎంపికపైనే ఇ ప్పుడు వివాదం రాజుకుంది. ఎందుకంటే, అసలు ఆ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. జియో యూనివర్శిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. ఈ విద్యాసంస్థను ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ ఫౌండేషన్‌కు ఆర్థికబలగం ఉన్నప్పటికీ విద్యా సంస్థల నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేదు. అయితే అలాంటి సంస్థలను పోషిస్తున్న యాజమాన్యాల ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటామని, విద్యాసంస్థల నిర్వహణలో అనుభవం ఉంటే మంచిదేకాని, కచ్చితంగా ఉండాలనే లేదని ఓ నిబంధన పెట్టారు. ఇది విమర్శలకు కారణమైంది.