ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల మూడో వారంలో సొంతగూటిలో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చినా, కిరణ్ చేరిక ఇంకా లేట్ అవుతునట్టు తెలుస్తుంది. పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ,రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆయన త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని, ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని ఎఐసిసి వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కిరణ్‌కి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, ఈ తరహా వార్తలు న్యూస్‌ ఛానళ్లలో చూస్తున్నాని అంటున్నా, ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

kiran 10072018 2

తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా వున్న పలువురు నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి తనతో పాటు తిరిగి పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ జవసత్వాలు కూడదీసుకునేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన తర్వాత పార్టీని విడిచిపెట్టిన నాయకులందరినీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధిష్థానం రంగంలోకి దిగింది.నర్సీపట్నం మాజీ ఎంఎల్‌ఎ బోళెం ముత్యాలపాప, జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, తదితర మాజీ నాయకులకు కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి కాంగ్రె్‌సలో తిరిగి చేరుతున్నట్టు చెప్పడమే కాకుండా వారిని కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే అలోచించుకుని నిర్ణయం తీసుకుంటామని కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పినట్టు మాజీ ఎంఎల్‌ఏ ముత్యాలపాప తెలిపారు.

kiran 10072018 3

మరో పక్క జగన్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా, కిరణ్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తో పోసగాలేక, అటు చంద్రబాబు దగ్గరకు వెళ్లలేక ఉన్న వారిని, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, నెల్లూరులో సీనియర్ అయిన ఆనం రాంనారయణ రెడ్డిని కూడా, కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించారు. ఇప్పటికే ఆనం, జగన్ తో వెళ్దామని డిసైడ్ అయినా, ఎమ్మల్యే టికెట్ విషయంలో, తేడా వచ్చి ప్రస్తుతానికి ఆగిపోయారు. ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా జగన్ జైలుకు వెళ్ళాల్సిందే అని, అలాంటి పార్టీలో ఉండటం కంటే, కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే మేలని అంటున్నారు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం పై పోరాడకుండా, కేంద్రం పై పోరాడుతున్న, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల రోజులు ఉత్తరాంధ్రలో ఉంటూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ గురించి కాని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకపోవటం గురించి కాని, ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్. పైగా, ఎదురు వీటి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. మోడీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరిచే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందులో భగంగానే, ఉత్తరాంధ్రలో అసలు అభివృద్ధి జరగటం లేదు అని చెప్తూ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలనే ప్రచారం మొదలు పెట్టి, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే కుట్రలో ప్రధాన పావుగా మారాడు.

pawan 10072018 2

పదే పదే పవన్, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో, మొన్నటి వరకు పవన్ విషయంలో చూసి చూడనట్టుగా ఉన్న తెలుగుదేశం, ఇక నుంచి ధీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు 25 ప్రశ్నలను సంధించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల్ని పవన్ కళ్యాణ్ కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది తానే అనే భ్రమలో ఆయనున్నారని ఆక్షేపించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని గంటా నిలదీశారు.

pawan 10072018 3

రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్... మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని గంటా విమర్శించారు. భాజపా మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు ఉందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాలు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని.. వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. ఆధారాల్లేకుండా అవాకులు, చవాకులు పేలడం సరికాదని అన్నారు. కళ్లుండి చూడలేని కబోదిలా పవన్‌ మాట్లాడుతున్నారని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌తో పవన్‌ కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని గంటా అన్నారు. బీజేపీ, వైసీపీ స్క్రిప్ట్‌నే పవన్‌ చదువుతున్నారని మంత్రి విమర్శించారు.

ఈనెల 11న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్‌గడ్కరీకి సర్వం పక్కా ఆధారాలతో వివరించి, నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి, పోలవరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగు తున్న పనులన్నింటిని మంత్రి పరిశీలించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రాజెక్టు పనులపై పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు జలవనరుల శాఖాధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.అంతేకాకుండా నితిన్‌ గడ్కరీ కి ఇప్పటివరకు పనుల పురోగతిపై ఒక నివేదికను సమర్పించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఈ నివేదికలో ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతి, ఏఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టిందీ, ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నాయో వాటి గురించే కాకుండా ఇంకా కేంద్రం నుంచి వచ్చిన, రావాల్సిన నిధులతో కూడిన వివరాలతో నివేదికను గడ్కరీకి అందజేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సమస్తం రడీ అయ్యారు.

gadkari10072018 2

కేంద్రమంత్రికి సర్వం తెలిసేలా నివేదిక ఉండాలని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖాధికారులను ఆదేశించడంతో ఆ మేరకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంటుంది . ఇటీవల గడ్కరీ నేరుగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఫోన్‌ కాల్‌ చేసి, తాను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న సంగతిని తెలిపిన సంగతి తెలిసిందే. 11వ తేదీన గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు.ఈ సందర్బంగా ఆయన పోలవరం ప్రాజెక్టును మొత్తం కలియ తిరిగి,ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు.అక్కడే అధికారులతో ముఖ్య మంత్రితో కలిసి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.

gadkari10072018 3

మరో పక్క గడ్కారీ కూడా, అన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నారు. చంద్రబాబు అన్నీ అప్డేటెడ్ లో ఉంటారని, నాకు అన్ని వివరాలు చెప్పండి అంటూ, గడ్కరీ సోమవారం ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఎన్ని నిధులను విడుదల చేసింది.. ఇంకా ఎంత ఇవ్వాలి.. పనుల పురోగతి ఎంత వరకు వచ్చింది..పునరావాస ప్యాకేజీ పరిస్థితి ఏంటి... అనే అంశాలపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖపై, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తనకు రాసిన లేఖపైనా మంత్రి చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి ఇచ్చిన నివేదికలోని సిఫారసులపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు పోలవరం పై చెప్తున్న అబద్ధాలు రేపటితో, బట్టబయలు కానున్నాయి. గడ్కరీ అన్ని విషయాలు చెప్తారు కాబట్టి, వీళ్ళు చెప్పినవి అన్నీ అబద్ధాలే అని రేపటితో తేలిపోనుంది.

నరేంద్ర మోడీ అంటే చాలు, వైసీపీ వణికిపోతుంది. ఆయన ఏమి చెప్పినా, వినాల్సిన పరిస్థితి పాపం. అంతలా బుక్ అయ్యారు. రాష్ట్ర సమస్యలే గాలికి వదిలేసి, మోడీకి సరెండర్ అయిన వైసిపీ, మోడీకి జీ హుజూర్ అంటుంది. మోడీకి, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, తద్వారా తమకు ఢిల్లీలో లాభం అని జమిలీ ఎన్నికలకు ప్లాన్ వేసారు. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా, లా కమిషన్, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. రెండు రోజుల పాటు లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో.. బీజేపీకి సన్నిహితంగా ఉండే నాలుగు పార్టీలు మాత్రమే.. జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి. తొమ్మిది పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.

jagan 10072018 2

కేవలం సమాజ్‌ వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, అకాలీదళ్‌, అన్నాడీఎంకేలు మాత్రమే మోదీ నిర్ణయానికి ఒకే అన్నారు. ఇందులో, అన్నాడీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు బీజేపీకి ఇప్పటికే లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే, వీరికంటే ముందే మోడీకి లొంగిపోయిన జగన్ పార్టీ, ఈ రోజు మోడీకి సై అంటుంది. మోడీ నిర్ణయమే, మా పార్టీ నిర్ణయం అని, మంగళవారం మధ్యాహ్నం ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. లా కమిషన్‌ను కలిసి చెప్పారు. మా సంపూర్ణ మద్దతు ప్రధాని మోడీకి ఉంటుంది అని, వారు లా కమిషన్‌కు తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి లేఖను లా కమిషన్‌కు అందజేశారు.

jagan 10072018 3

లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదన కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే, కేవలం మోడీకి అనుకూలంగా ఉన్న నాలుగు, అయిదు పార్టీలు మాత్రమే మద్దతు తెలిపాయి. మరి కొన్ని పార్టీలు మద్దతు ఇస్తే, వీరు చేసే వాదనకు బలం ఉంటుందని భావించి, అమిత్ షా, అనుకూలంగా లెటర్ ఇవ్వమని కోరటంతో, హుటా హుటిన, విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లి, మోడీకి మద్దతుగా లెటర్ ఇచ్చి వచ్చారు. మరో పక్క, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, మేము జమిలీ ఎన్నికలకు ఒప్పుకోమని, ముందు రాష్ట్రంలో ఉన్న సమస్యలు తేల్చకుండా, ఇలాంటి ఎన్నికల స్టంట్ లకు లొంగేది లేదని, ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే, జగన్ పార్టీ మాత్రం, మోడీ ఏది చెప్పినా, మాకు సమ్మతమే అని చెప్తుంది.

Advertisements

Latest Articles

Most Read