విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో, రాజధానిలో తొలి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు, దాదాపు కొలిక్కి వచ్చాయి. మరో వారో పది రోజుల్లో, ఇక్కడ నుంచి సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం కానుంది. గతేడాది సైబర్‌ నేరాలు పెరిగిన నేపధ్యంలో వీలైనంత త్వరగా స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్‌ కమిషనరేట్‌ వర్గాలు చెబుతున్నాయి.ఈ సైబర్‌ విభాగం ప్రత్యేకంగా ఓ డిసిపి పర్యవేక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మెళకువలు నేర్చుకున్న 30 మంది సిబ్బందిని కేటాయించనున్నారు. ఇటీవల కాలంలో కమిషనరేట్‌ పరిధిలో కంప్యూటర్‌ నాలెడ్జిపై అవగాహన ఉన్న యువకులకు ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు.

cyber 09072018 2

గతంలో పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ నేరాల కేసులు సామమాత్రంగా నమోదయ్యేవి. విజయవాడ రాజధాని నేపధ్యంలో సైబర్‌ నేరాల సంఖ్య పెరిగింది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్‌తోపాటు బ్యాంకింగ్‌ నేరాలు, ఇంటర్‌ వాయిస్‌ కాల్‌ డైవర్షన్‌ లాంటి కేసులు నమోదయ్యాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంచుకుని ఖాతాదారులను ఆకర్షించి వారి దృష్టిని మరల్చడం ద్వారా ప్రస్తుత వ్యవస్థలో ఆన్‌లైన్‌ సైబర్‌ నేరాలు, బ్యాంక్‌ల పేరుతో ఆర్థికపరమైన మోసాలు పెరిగాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఒటిపి పేరుతో మోసాలు జరుగుతున్నాయి. మరో పక్క సోషల్ మీడియా వాడకం ఎక్కవు కావటంతో, ఇక్కడ కూడా వేధింపులు, మోసాలు ఎక్కువ అయ్యాయి. ఈనేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం నిర్మించారు.

cyber 09072018 3

సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభమైతే.. కేసులను ఇక్కడే నమోదు చేసి, విచారణ జరిపే అవకాశం కలుగుతుంది. ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని గుర్తించి ఇందులోకి తీసుకున్నారు. నేర పరిశోధనలో సాంకేతిక సాయం కోసం ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. అవసరమైన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకున్నారు. సిబ్బందిని అన్ని విధాలా సుశిక్షుతులుగా మార్చేందుకు నగర పోలీసులు ఇప్పటికే ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్స్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సైబర్‌ పరిజ్ఞానం, పరిశోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కంప్యూటర్ లు, మొబైల్‌ ఫోన్లు, మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని తొలగించినా, అధునాతన పరికరాల సాయంతో పోలీసులు రాబడతారు.

సింగపూరులో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సు రెండవ రోజు సమావేశంలో ప్లీనరీ సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుప్రసంగించారు. భారతీయ చరిత్రలో అమరావతికి గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైన పనని, సంస్కృతిని పరిరక్షిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని అన్నారు. నూతన సాంకేతికత ఉపయోగిస్తూ రాజధాని నిర్మాణం చేపదుతున్నామని, ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని నిలపాలన్నదే మా ధ్యేయం అని చెప్పారు. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సాంకేతికత, మౌలిక సదుపాయల కల్పన అత్యంత అవసరం అని చెప్పారు.

singapore 09072018 2

వనరుల నిర్వహణలో వైజ్ఞానిక, సమాచార సాంకేతికత మనకు ఎంతగానో దోహదపడుతుందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత తదితర సమాచారాన్నికచ్చితంగా తెలుసుకోవచ్చని అన్నారు. వనరులను సమర్ధంగా వినియోగించి ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి ఈ సమాచారం దోహదపడుతుందని అన్నారు. సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా మా రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగామని చెప్పారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పునర్ వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ తదితర చర్యలతో మెరుగైన ఫలితాలను సాధించామని చెప్పారు.

singapore 09072018 3

తాగునీటికే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు కూడా తగినంత నీటిని ఇవ్వగలుగుతున్నామని, మా నగరాలు, పట్టణ ప్రాంతాలు, గ్రామాలలో ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహణను సమర్థమైన పద్ధతులలో చేపడుతున్నామని అన్నారు. పునరుత్పాదక ఇంథనం పై ప్రధానంగా దృష్టి పెట్టామని, హరిత రాజధాని అమరావతిలో అన్ని ఆధునిక సాంకేతిక పద్దతులను వినియోగించుకుంటున్నామని అన్నారు. రాజధానిలో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తూ నిర్మాణం చేపడుతున్నామని, అత్యవసర గమ్యాలను చేరుకోవడానికి 5 నిమిషాలు, సామాజిక అవసరాలకు 10 నిమిషాలు, కార్యక్షేత్రానికి చేరుకోవడానికి 15 నిమిషాలు అనే కాన్సెప్టును అమలు చేస్తామని అన్నారు. 5 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో ZBNF(జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్) వైపు వెళుతున్నారని, సమర్థ నాయకత్వం ద్వారానే ఇది ప్రభావవంతంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇవే పద్దతులను అనుసరిస్తూ సవ్య దిశలో పయనించడం ద్వారా ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాలను తీర్చిదిద్దుకోవచ్చునని ఇక్కడున్న నగర పాలకులకు సూచిస్తున్నాని చంద్రబాబు అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అంతరంగాన్ని పార్టీ నేతల ముందుంచారు. పార్టీ కోసం చేస్తున్న కసరత్తును కొంత వరకూ పవన్ బహిర్గతం చేశారు. ఉత్తరాంధ్రలో సుమారు 50 రోజుల పోరాట యాత్ర చేశారు (అందులో 20 రోజులకి పైగా సెలవలు), యాత్ర ముగింపు దశలో విశాఖలోని పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 46 నుంచి 58 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మెరుగైన పరిస్థితులు ఉన్నాయనీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాలు మనవే అని, ఈ సమావేశంలో పవన్ అన్నారు. వీటిని వంద సీట్లు వరకూ తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు పవన్ పేర్కొన్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? వైసీపీతో కలిసి పోటీ చేస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపధ్యంలో పవన్ తన బలాన్ని ప్రకటించడం గమనార్హం. జగన్ తో పొత్తు ఎలాగూ ఉంటుంది కాబట్టి, ఎక్కువ సీట్లు సాధించుకోవటం కోసం, పవన్ ఇలా తన బలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు.

pawan 09072018 2

'2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమిని చవిచూసింది. ఆ పార్టీని నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రజారాజ్యం తరపున గెలిచిన వారు చిరంజీవిని వదిలేసి, వారి దారి వారు చూసుకున్నారు. చిరంజీవికి అండగా వారు నీలబడి ఉంటే, 2014 ఎన్నికల్లో అన్నయ్య ముఖ్యమంత్రి అయి ఉండేవారే'నని పవన్ కళ్యాణ్ పార్టీ నేతల వద్ద అన్నారు. నేడో, రేపో తన కుటుంబ సభ్యులందరితో సమావేశం కానున్నట్టు పార్టీ నేతలకు పవన్ చెప్పారు. కుటుంబ సభ్యులంతా ఒకే మాట పై ఉన్నామన్న సంకేతాలు అందరికీ తెలియాలన్న భావనతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

pawan 09072018 3

సీట్ల విషయంలో ముందుగా చేపట్టిన సర్వే ప్రకారం మాత్రమే ఇస్తానని, సీట్లు రాని వారు తిరుగుబాటు బావుటా ఎగరేయ్యద్దని ఆయన ముందుగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక ఉత్త రాంధ్ర జిల్లాల్లో పవన్ నిర్వహించిన సభలకు ఆయన అభిమానులే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య జనాన్ని ఆకర్షించలేకపోయామన్న భావన పార్టీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా పవన్ సభకు మహిళలు రాకపోవడం పై చర్చ జరిగింది. త్వరలోనే నియోజకవర్గాల వారీగా మహిళా సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా 30 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారికి దగ్గరగా పార్టీని తీసుకువెళ్లాలని పవన్, ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

గుజరాత్ లో చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ లో గూండాగిరి చేస్తుంది బీజేపీ. కావలి లో నిరసన తెలిపిన ఉమామహేశ్వర రావు పై దాడి చేసి, 50 మంది కలిసి ఒక్కడిని ఎలా కొట్టారో చూసాం. ఈ రోజు మరోసారి, రెచ్చిపోయింది బీజేపీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ కార్యకర్తలు పశువుల కాంట్ ఘోరంగా ప్రవర్తించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ఆర్ఎంపీ డాక్టర్‌ను బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, కన్నా లక్ష్మీనారాయణ జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారు. దీనిని పురస్కరించుకుని, బీజేపీ నేతలు భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు.

ongole 09072018 2

ఈ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ర్యాలీ చేరుకునే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఒక్క మాట కూడా బీజేపీ నేతలను అనలేదు. అయితే శాంతియుతంగానే నిరసన తెలుపుతున్న శ్రీనివాస్‌పై బీజేపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనపై బీజేపీ నేతల దాడిని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్రీనివాస్‌‌తో పాటు, బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేవలం ఒక ప్లకార్డు పట్టుకుంటేనే, బీజేపీ నేతలు తట్టుకోలేక పోయారు.

ongole 09072018 3

ఈ చర్యల పై, ప్రజలు భగ్గు మంటున్నారు. మొన్న ఉమామహేశ్వర రావు అనే వ్యక్తి కన్నా పై చెప్పు విసిరితే, అది తప్పు అని చెప్పిన వారు కూడా, ఈ రోజు జరిగిన దాడి పై, బీజేపీ పై మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో, ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, అయినా, ఇక్కడ ఆయన శాంతియుతంగా, మా హాక్కు మాకు ఇవ్వండి అని అడిగితే, ఇలా పశువులులాగా, గుజరాత్ చేసినట్టు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా, ఇలాంటి చర్యలు సీరియస్ గా తీసుకోవాలని, అందరికీ హక్కులు ఉంటాయని, ఆ హక్కులు కాపాడాలని, ఇలాంటి రౌడీ మూకను, అరెస్ట్ చేసి లోపల వెయ్యాలని, ప్రజలు కోరుతున్నారు. బీజేపీ నేతలు, రాష్ట్రానికి రావాల్సింది ఇవ్వక పోగా, అడిగితే ప్రజలను కొడుతున్నారు. ఇదంతా ఢిల్లీ అధికారం చూసుకుని వచ్చిన పొగరు. ఇలాంటి పనులు చేస్తే, దాన్ని ప్రజలు తొందరలోనే దించుతారు.

Advertisements

Latest Articles

Most Read