కత్తి మహేష్ అనే వ్యక్తి గురించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో, అందరికీ తెలిసిందే. సినీ క్రిటిక్ అని చెప్పుకుంటూ, ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ, సమాజంలో అశాంతి సృష్టిస్తూ ఉంటాడు. అయితే, ఇతను ఒక పావుగా, ఒక రాజకీయ పార్టీ ఆడిస్తున్న గేమ్ గా, వార్తలు వస్తూ ఉంటాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్మాదం పై పోరాటం చేసినా, కొంత వరకు ప్రజలు సమర్ధించారు, కాని రోజు రోజుకూ ఎక్కువ చెయ్యటంతో, ప్రజలు కూడా పట్టించుకోవటం మానేశారు. తాజాగా, సాక్షాత్తు శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీని పై హిందూ సమాజం భగ్గు మంది. అయితే, కత్తి మాత్రం, ఎప్పటి లాగే, తన వాదనను సమర్ధించుకుంటూ, పదే పదే అదే వ్యాఖ్యలు చెయ్యటంతో, హిందూ సమాజం భగ్గు మంది.

kathi 090720182

దీంతో, శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కత్తి మహేష్‌‌పై విరుచుకుపడ్డారు. కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీరాముని కత్తి మహేష్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

kathi 09072018 3

అయితే, కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపించటం పై, ఇదేదో కుట్రగా కూడా విశ్లేషకులు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే, ఇక్కడ హిందూ సమాజం కూడా, చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చి, కత్తి మహేష్ ను, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బహిష్కరించాలని ఉద్యమాలు చేస్తారు. చంద్రబాబు కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, దళితుల పై దాడిగా సృష్టించే ప్లాన్ వేసారని అంటున్నారు. ఒక వేల చంద్రబాబు , కత్తి పై బహిష్కరణ చెయ్యకపోతే, హిందూ ముసుగులో ఉన్న ఒక పార్టీ, హిందూ వ్యతిరేకి చంద్రబాబు అంటూ, వారు ఆందోళనలు చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, తెలంగాణా నుంచి, కత్తిని ఆంధ్రప్రదేశ్ పంపించటం వెనుక, ఇలాంటి కుట్రలు చాలా ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలని అంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంత వాసుల భూముల్లో బంగారం పండించడానికి , విశాఖపట్నానికి త్రాగు నీటి ఎద్దడిని ఎదుర్కోడానికి ముందడుగు. కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం ఆలస్యం చేసినా, చంద్రబాబు నాయుడు పై తప్పుడు అవినీతి ఆరోపణలు చేసినా ఎన్ని అవరోధాలు కల్పించినా ఈ గోదావరి మహోద్రుత ప్రవాహం కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల వాసుల ప్రయోజనాలు తీర్చడానికి ఉరకులు పరుగులు తీస్తోంది. ఉత్తరాంధ్ర భూములు బంగారమయ్యే రోజులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ.1638 కోట్లతో నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కల సాకారమైంది. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఏలేరు రైతులకు ఇచ్చిన మాట నెరవేరింది. ప్రయోగాత్మక పరిశీలనలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ఆదివారం మధ్యాహ్నం ఏలేరు జలాశయం చెంతకు చేరాయి. తొలి దశలో పురుషోత్తపట్నం పంపు హౌస్‌ నుంచి గురువారం 1,750 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువకు విడుదల చేశారు. జగ్గంపేట మండలంలోని రామవరంలో ఏర్పాటుచేసిన పంపుహౌస్‌కు వచ్చిన ఈ జలాలను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏలేరుకు మోటార్ల ద్వారా మళ్లించారు.

purushottapatanam 09072018 2

రామవరం నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న ఏలేరుకు గోదావరి జలాలను చేర్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలన చేపట్టారు. ఏలేశ్వరంలో ఏలేరు ఒకటో గ్యాప్‌ వద్ద నిర్మించిన డిశ్చార్జి ఛానల్‌కి పంపారు. ఈ నిర్మాణంలో రెండు భారీ పైపులను అమర్చి రామవరం పంపుహౌస్‌కి అనుసంధానించారు. ఒక పైపు ద్వారా ప్రస్తుతం 700 క్యూసెక్కుల నీరు ఏలేరు జలాశయంలోకి ప్రవేశిస్తోంది. రెండో పైపు ద్వారా మరో 700 క్యూసెక్కుల జలాలను విడుదల చేసేందుకు రామవరంలో ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు పర్యవేక్షణలో భాగంగా నిర్వహించిన ప్రయోగాత్మక పరిశీలన పూర్తి స్థాయిలో విజయవంతమైందని పోలవరం ఎడమ ప్రధాన కాలువ కార్యనిర్వాహక ఇంజినీర్‌ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారికంగా నీటి విడుదల కార్యక్రమం త్వరలో జరుగుతుందని ఈఈ తెలిపారు.

purushottapatanam 09072018 3

గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి జాతికి అంకితంచేశారు. గత ఏడాది అక్టోబర్ నాటికి తొలి దశ పనులు పూర్తిచేసి పుష్కర కాలువ ద్వారా ఏలేరు జలాశయంలోకి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గోదావరి వరదల సమయంలో 10 పంపుల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తోడి ఏలేరు జలాశయానికి సరఫరా చేస్తారు. ఏలేరు జలాశయంలో 24టీఎంస;ల ఎంసిల నీరు నిల్వచేస్తారు. ఏలేరు జలాశయం పరిధిలో 67,614 ఎకరాల ఆయకట్టుతో పాటు మరో 87వేల ఎకరాలకు ఖరీఫ్‌లో సాగునీరు అందించనున్నారు. రబీలో అపరాల సాగుకు నీరిందించేలా డిజైన్ చేశారు. గోదావరి వరదల సమయంలో ఏలేరు నిండిన తర్వాత అక్కడ నుంచి విశాఖ పారిశ్రామిక అవసరాలకు, నగర ప్రజలకు తాగునీటి అవసరాలకు గోదావరి నీటిని అందిస్తారు. గోదావరి జిల్లాల్లో అతి పెద్ద రిజర్వాయర్‌గా ఏలేరు రిజర్వాయర్ అవతరించనుంది. 24 టీఎంసీల నీటిని వరదల సమయంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నింపుకుంటే ఎపుడు అవసరం వస్తే అపుడు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రధానంగా పోలవరం పూర్తయ్యేలోగా విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం కూడా కలగనుంది.

సతీష్ రెడ్డి గుర్తున్నాడా. పులివెందులలో, వైఎస్ ఫ్యామిలీకి తరతారాలుగా, ప్రత్యర్ధి ఈయనే. ప్రస్తుతం ఈయనా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఈయనకు ఎటువంటి క్రిమినల్ చరిత్ర లేదు. ప్రతి సారి వైఎస్ ఫ్యామిలీ చేతిలో ఓడిపోతూ వచ్చినా, వైఎస్ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసినా, దశాబ్దాలుగా వారితో పోరాడుతూ, ప్రజల తరుపున ఉన్నారు. పులివెందులలో పరిస్థితి చూసిన సతీష్ రెడ్డి, మూడేళ్ళ క్రితం, గండికోట రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను పైడిపాళెం ప్రాజెక్టుకు తీసుకొచ్చి పులివెందుల ప్రాంత రైతులకు నీరు అందిస్తానని, అప్పటి వరకు గడ్డం తియ్యను అని ఛాలెంజ్ చేసారు. దాదాపుగా 18 నెలలుగా దీక్ష చేస్తూనే ఉన్నారు. పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే దాదాపు మూడేళ్ళ పాటు గడ్డం తీసుకోలేదు.

ramesh 09072018 2

ఎందుకంటే, అది మన సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అంటారు. అప్పటి నుంచి, ఈ ప్రాజెక్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వంతో మాట్లాడటం, ఇరిగేషన్ అధికారులతో నిత్య సంప్రదింపులు, నిర్వాసితులను బుజ్జగించటం లాంటి ఎన్నో పనులు చేస్తూ, ప్రాజెక్ట్ పనుల వేగాన్ని పెంచి, మొత్తానికి పోయిన ఏడు పులివెందులలో నీళ్ళు పారించారు. ఇది సంకల్పం. ప్రజలకు మంచి చెయ్యాలనే సంకల్పం ఉంటే, ఏదైనా సాధించ వచ్చు అనే దానికి, ఇది ఒక ఉదాహరణ. అయితే, ఇప్పుడు సతీష్ రెడ్డి స్పూర్తితో, రాజ్యసభ సభ్యుడు సియం రమేష్ కూడా, ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించి, కడప ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు, గడ్డం తియ్యను అని చెప్పారు.

ramesh 09072018 3

11 రోజులు కడప స్టీల్ ప్లాంట్ కోసం, సియం రమేష్ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రమేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు. ప్రతి క్షణం, ఇది నా కర్తవ్యం గుర్తు చేస్తూ ఉంటుందని, కడప స్టీల్ ప్లాంట్ కోసం, అన్ని ప్రయత్నాలు చేసి సాధిస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు గెలవాలి. సియం రమేష్ ఆశయంతో పాటు, కడప ప్రజల ఆశయం కూడా నెరవేరాలని కోరుకుందాం.

కొండవీడు కోటకు ఎంత చారిత్రక నేపధ్యం ఉందో అందరికీ తెలిసిందే. మన ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం ఈ కొండవీడు కోట. 1700 అడుగుల ఈ కొండ శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2007లో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాని ఎవరూ పట్టించుకోలేదు, అవి కాగితాలకే మిగిలిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 2015లో ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. ఇప్పుడు పనులు దాదాపుగా అయిపోయాయి.

ghatroad 09072018 2

యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు కొండ మీదకు 5.1 కి.మీ దూరం ఉండే ఘాట్‌రోడ్డు నిర్మిస్తున్నారు. 30 కోట్ల వ్యయంతో రెండున్నర ఏళ్ల క్రితం, 2015 చివరిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంట పక్కకు పడిపోకుండా, కొండ కింద భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. ఇక్కడకు వచ్చే పర్యటకులు వారి వాహనాలు పార్కింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఘాట్‌రోడ్డు మధ్యలో కాంక్రీటు ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. ఇప్పటికే 50 ఎం.ఎం. మందంలో ఒక లేయర్‌ తో తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. 30 ఎం.ఎం మందంలో మరో లేయర్‌ తారు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ghatroad 09072018 3

ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఘాట్‌రోడ్డు నిర్మాణం, కొండ పైన ఉన్న బురుజు వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి కొండల మధ్యన ఉన్న దేవాలయాలు, చెరువులు, బురుజులు ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి కొంత దూరం నడక దారిన కొండ దిగి కిందకు రావాలి. ప్రస్తుతం ఘాట్‌రోడ్డును మైదాన ప్రాంతం వరకు కొనసాగించడం వలన పర్యాటకులు వాహనాలతో దేవాలయాల వద్దకు చేరుకునే సౌకర్యం లభిస్తుంది. అప్పుడే కొండవీడుకు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొండ మీద చారిత్రక కట్టడాల పరిరక్షణకు, నూతన కట్టడాల చేపట్టడానికి వాహనాలు చేరుకొనే అవకాశం ఉంటుంది. ఘాట్‌రోడ్డు రెండో దశ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

Advertisements

Latest Articles

Most Read