మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్ లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ మాత్రం జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చాలా మైనస్ అని విశ్లేషకులు అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటివరకు చంద్రబాబుకి ధీటైన ప్రత్యర్ధి లేక, చంద్రబాబుని వ్యతిరేకించే వారు జగన్ వైపు చూస్తున్నారు. పవన్ వచ్చినా, అతని సామర్ధ్యం ఏంటో రోజు రోజుకి ప్రజలకు తెలిసిపోతుంది, సీరియస్ నెస్ లేని రాజకీయ నాయకుడుకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఎంతో కొంత ఇమేజ్ ఉంటుంది.
కిరణ్ ఎదో బలమైన నాయకుడు అని కాదు కాని, కిరణ్ కాంగ్రెస్ లోకి వెళ్తే, కాంగ్రెస్ పాత నాయకులు మళ్ళీ ఆక్టివ్ అయ్యే అవకాసం ఉంది. జగన్ వెంట వెళ్ళిన కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాసం లేకపోలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని భయపడుతున్న జగన్, ఇప్పుడు కిరణ్ ఎంట్రీతో మరింత ఖంగారు పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ జగన్ ను ఎటాక్ చెయ్యటం,దానివల్ల వైసీపీకి కోత పడటం ఖాయం. ఎంత తక్కువ చూసుకున్నా, జగన్ కు పడే, కనీసం 3-4% ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాసం ఉంది. కిరణ్ రాకతో జరిగేది అదే. ఇదే విషయం, వైసీపీ పార్టీ నేతలను కూడా ఖంగారు పెడుతుంది. కాని, వైసిపీ అధ్యక్షుడు జగన్ మాత్రం, లైట్ అంటున్నారు అంట..
నిన్న సిబిఐ కోర్ట్ లో హాజరుకావటానికి, గురువారం ఉదయమే హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్. గురువారం మధ్యానం కొంత మంది పార్టీ నేతలతో సమావేశం అయిన సమయంలో, కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ, తద్వారా వైసిపీకి అయ్యే డ్యామేజ్ గురించి, ఒక సీనియర్ నేత ప్రస్తావించగా, జగన్ చాలా లైట్ తీసుకున్నారు అంట. "ఇప్పటికే మన ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయం అయ్యింది. 140 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది. మన కేబినెట్ కసరత్తు కూడా అయిపొయింది, ఇప్పటికే ఫుల్లుయిపోయింది. ఇలాంటి టైంలో, ఈ కిరణ్ లాంటి వాళ్ళు మనల్ని ఏమి చేస్తారు. చంద్రబాబే నాకు ధీటైన ప్రత్యర్ధి కాదు అనుకుంటుంటే, ఈ కిరణ్ వల్ల మనకు ఏమి అవుతుంది" అని జగన్ అనటంతో, అక్కడ ఉన్న వారు అవాక్కయ్యారు. జగన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడేంటి, అనుకుంటూ, ఆ సమావేశం నుంచి బయటకు వచ్చారంట. మొత్తానికి ప్రశాంత్ కిషోర్, మనోడిని ములగ చెట్టు ఎక్కించి కూర్చోబెట్టాడు. ఎన్నికలు అయినా కాని, రియాలిటీలోకి వస్తాడో లేదో...