మన రాష్ట్రానికి గత 15 రోజుల నుంచి అన్నీ మంచివ వార్తలే వినిపిస్తున్నాయి. మన రాష్ట్రానికి తగిలిన దిష్టు పోయేలా, మన మీద ఏడ్చే ఏడుపు గాళ్ళు ఎక్కువ అవ్వటంతో, మన రాష్ట్రానికి దిష్టు అంతా పోయి అన్నీ మంచిగా సాగి పోతున్నాయి. నవ నిర్మాణ దీక్షలో, అర్హులు అందరికీ పెన్షన్లు, ఇళ్ళు, రేషన్ కార్డ్ లు ఇచ్చిన ప్రభుత్వం వారిని సంతోష పెట్టింది. మరో పక్క పోలవరంలో, రికార్డు టైం లో డయాఫ్రం వాల్ పూర్తి కవటం, నవయుగ కంపెనీ రికార్డు టైం లో కాంక్రీట్ పనులు చెయ్యటం కూడా, మనకు అతి పెద్ద శుభవార్త. ఇక రాష్ట్రానికి అనేక అవార్డ్ లు వచ్చాయి. పంచాయితీ రాజ్, ఐటి, జల వనరులు శాఖలకు దాదాపుగా 60 అవార్డ్ లు, వచ్చాయి. విజయవాడ, తిరుపతి, వైజాగ్ కు స్వచ్చ ర్యాంకులు వచ్చాయి. ఈ రోజు అయితే, ప్రపంచలోనే మూడవ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయితే ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ, 585 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇలా అన్నీ మంచి వార్తలు వస్తున్నాయి. అయితే మేము ఏమి తక్కువ అని ఏపి పోలీసు కూడా సత్తా చాటారు.

police 26062018 2

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని కేంద్రం ప్రశంసించింది. ఓ సర్టిఫికెట్ కూడా పంపింది. దేశంలో ఉన్న పోలీసుల్లో అత్యంత సమర్థంగా వ్యవహరిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రెండో ర్యాంక్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ పోలీసులకు ఓ ప్రశంసాపత్రం కూడా అందింది. పాస్‌పోర్టులు అప్లయ్ చేసుకున్నవాళ్లకి పోలీస్ వెరీఫికేషన్ పర్ ఫెక్ట్ గా పూర్తి చేసినందుకు.. ఏపీ పోలీసులకు అభినందులు వెల్లువెత్తాయి. తెలంగాణా రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, మన రాష్ట్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక హర్యానా రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.

police 26062018 3

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌కి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పాస్‌పోర్టులను 8 రోజుల్లో క్లియర్‌ చేస్తూ పోలీస్‌శాఖ రికార్డ్‌ సృష్టించింది. ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలు 2017-18 ఏడాదిలో సగటున 8 రోజుల్లో పాస్‌పోర్టులను క్లియర్‌ చేశాయి. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ ఏపీ ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌కి అవార్డును ప్రకటించింది. జూన్ 26 పాస్ పోర్ట్ సేవా దివస్ సందర్భంగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, మన రాష్ట్ర పోలీసులని అభినందిస్తూ ప్రశంసా పత్రం పంపించారు. మొత్తానికి, ఏ రంగంలో చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి ప్రశంసలు వస్తున్నాయి. మరో పక్క రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ప్రపంచంలో ఎక్కడా లేనివి అన్నీ, మన రాష్ట్రంలోనే ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.

అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అయితే, ఈ సారి మాత్రం, కుటుంబరావు చేతిలో కాకుండా, సొంత పార్టీ ప్రభుత్వం చేతే ఫూల్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జీవీఎల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్ల విషయంలో టిడిపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని జి.వి.ఎల్ నరసింహరావు ఆరోపించారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని...పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, రెండు వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటూ జివిఎల్ విమర్శించారు.

gvl 26062018 2

అలా జీవీఎల్ ఆరోపణలు చేసాడో లేదో, ఇలా కేంద్రం ఇళ్ళ నిర్మాణాల పై ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ తో, జీవీఎల్ ఫీజులు మరో సారి ఎగిరిపోయాయి.. ప్రతి సారి కుటుంబరావు చేతిలో ఫూల్ అయ్యే జీవీఎల్, ఈ సారి కేంద్రం చేతిలోనే ఫూల్ అయ్యారు. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇళ్ళ నిర్మాణాల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందని కితాబు ఇచ్చింది. అలాగే మధ్యప్రదేశ్‌,తెలంగాణా పై కూడా ప్రశంసలు కురిపించింది కేంద్రం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద జరుగుతున్న పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ తీరును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమీక్షించింది.

gvl 26062018 3

కొత్తగా ఆరు రాష్ట్రాలకు 3.18 లక్షల ఇళ్లను మంజూరుచేసింది. దీంతో ఇప్పటివరకూ మంజూరుచేసిన ఇళ్ల సంఖ్య 51 లక్షలకు చేరినట్లు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. పథకం ప్రారంభించిన మూడేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు మంజూరుచేయడం గొప్ప విషయమని పేర్కొంది. ఇదివరకు తొమ్మిదేళ్లలో 12.4 లక్షల ఇళ్లు మంజూరుచేయగా, ఈ మూడేళ్లలోనే 51 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 28 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడు, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు దేశంలో అత్యుత్తమ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతికతను ఉపయోగించి వివిధ రాష్ట్రాలు ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది.

హై కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇలా అన్ని కోర్టుల్లో కేంద్రానికి ఇబ్బంది ఎదురు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని పలు నిబంధనలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చట్ట నిబంధనలను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని పేర్కొంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

court 26062018 2

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు పన్ను మినహాయింపుతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాల్సి ఉన్నా కేంద్రం ఆ మేరకు వ్యవహరించడంలేదన్నారు.

court 26062018 3

పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకోవడం చట్ట నిబంధనకు విరుద్దమన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటు వ్యవహారంలోను నిబంధనలు అమలుకాలేదన్నారు. ఇదే తరహాలో చట్టంలోని పలు నిబంధనలు అమలుకావడం లేదన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన తెలుసుకుంటామని పేర్కొంది. నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇంకా డయాఫ్రాం వాల్ గురించి, మర్చిపోక ముందే, పోలవరం ప్రాజెక్ట్ లో మరో గుడ్ న్యూస్... ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులను గడువు కన్నా వారం రోజులు ముందుగానే పూర్తిచేసి, మరో మైలురాయిని అధిగమించాయి. ఈ పనులను ఆస్ర్టేలియా కంపెనీ కెల్లర్‌ చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో జెట్‌ గ్రౌటింగ్‌ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, సోమవారం నాటికే ఆ లక్ష్యాన్ని ఆ కంపెనీ చేరుకొంది. దీనికోసం వందమంది ఇంజనీర్లు రాత్రింబవళ్లు కష్టించి పనిచేశారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఎటువంటి తేమ (సీపేజ్‌) రాకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను నిర్మిస్తారు.

polavaram 26062018 2

ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ, గోదావరి నడిబొడ్డున సుమారు 2,050 మీటర్ల నిడివి ఉన్న ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలని తలపెట్టారు. ప్రాజెక్టు సీఈ వి.శ్రీధర్‌ మాట్లాడుతూ, డయాఫ్రమ్‌వాల్‌ నుంచి 400 మీటర్ల దూరంలో ఎగువకాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టామని వివరించారు. వరదలు తగ్గిన వెంటనే అక్టోబరు లేదా నవంబరులో దానిపై కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇసుక తిన్నెలపై నుంచి 20 మీటర్ల లోతున ఇసుకను గట్టిపర్చడమే జెట్‌గ్రౌటింగ్‌ అని వెల్లడించారు. కేంద్రం నుంచి డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మే 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ పనులను ప్రారంభించారు. దీనికోసం రూ.105 కోట్ల నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూన్‌ చివరినాటికి ఈ పనులను పూర్తిచేయాలని ‘కెల్లర్‌’కు సీఎం నిర్దేశించారు.

polavaram 26062018 3

నిపుణత, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, సిబ్బంది సంకల్ప బలం, నేరుగా సీఎం జరిపిన సమీక్షలు చకచకా పనులు పూర్తి కావడానికి దోహదపడ్డాయి. సోమవారం సాయంత్రం జెట్‌ గ్రౌటింగ్‌ చివరి విడత పనులు కాగానే ప్రాజెక్టు ప్రాంతంలో వేడుక వాతావరణం కనిపించింది. ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులు పరస్పరం అభినందించుకొన్నారు. అనుకున్న గడువుకు వారం ముందుగానే లక్ష్యాలను ఛేదించడం సంతోషంగా ఉన్నదని సీఈ శ్రీధర్‌ అన్నారు.. ఇది కాఫర్‌ డ్యామ్‌ ప్రాముఖ్యత... ఒక ప్రధాన ప్రాజెక్టు నిర్మాణానికి దిగేటప్పుడు, దానికి ఎగువ, దిగువన నిర్మించేదే కాఫర్‌ డ్యామ్‌. ఎగువ నుంచి ఎటువంటి నీటి చెమ్మ ప్రధాన ప్రాజెక్టుకు సోకకుండా సాధ్యమైనంత మేర నూరు శాతం ఈ తేమను కట్టడి చేయడమే కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం.

Advertisements

Latest Articles

Most Read