మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ అని, హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేసే పని చేసాడు పవన్... అదే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వచ్చి, ఆంధ్రాలో ఊరు ఊరు తిరుగుతూ, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1 అంటున్నాడు A1... అయితే ఎప్పుడో 2015లో వచ్చిన ర్యాంకు పట్టుకుని, ఇప్పటికీ యాగీ చేస్తున్న జగన్, పవన్ కు, ఇప్పుడు అదే ఎన్-సి-ఏ-ఈ-ఆర్ ఈ సంవత్సరపు సర్వే ఇచ్చింది. ఎన్-సి-ఏ-ఈ-ఆర్ సర్వే వివిధ రాష్ట్రాల, వాస్తవ పరిస్థితికి ఇండికేటర్. 60ఏళ్లుగా ఇండిపెండెంట్‌గా పనిచేస్తున్న ప్రతిష్టాత్మకం సంస్థ. పెట్టుబడులు దగ్గర నుంచి అవినీతి దాకా, ఆయా రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ సూపర్ అని రిపోర్ట్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ‘ఎన్‌సిఎఇఆర్ స్టేట్ ఇన్వె్‌స్టమెంట్ పొటెన్షియల్ ఇండెక్స్-2017’ పేరుతో ఎన్‌సిఎఇఆర్ సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని 52.9 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు, రాజస్థాన్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం మీద సర్వేలో పాల్గొన్న పారిశ్రామికవేత్తల్లో 43.5 శాతం మంది తమ రాష్ట్రాల్లో అవినీతి సమస్య పెద్దగా లేదన్నారు. 30.8 శాతం మంది ఒక మాదిరిగా ఉందంటే.. 25.7 శాతం మంది మాత్రం భరించలేనంత స్థాయిలో ఉందన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు గుజరాత్‌లో అవినీతి అతి తక్కువగా ఉందని చెప్పారు. వ్యాపారాల నిర్వహణకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, చత్తీ్‌సగఢ్, ఒడిశాల్లోనూ అవినీతి తక్కువేనని పేర్కొన్నారు.
రెండు నెలల క్రితం వచ్చిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ కూడా, అవినీతి పై ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. 13 రాష్ట్రాల్లో మాత్రమే చేసిన సర్వే ఇది.. ‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపారు.