ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్‌’ రాష్ట్రానికి రానుంది. రూ.585 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 30 దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రాకతో రాష్ట్రంలోనూ 6,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సంస్థ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, సమాచార, సాంకేతిక(ఐటీ) మంత్రి లోకేశ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోనున్నారు. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ బెంగుళూరు, తిరుపతిలో ఇప్పటికే పలుసార్లు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న సానుకూలతలను వివరించారు.

fle 26062018 2

అవసరమైన సమాచారాన్ని అధికారులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కంపెనీ రాకతో ప్రపంచంలో మరిన్ని అగ్రగామి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ కంపెనీని తమ దగ్గర పెట్టాలంటూ పోటీకి వచ్చాయి. అయితే పలు దఫాలుగా లోకేశ్‌, ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి ఈ కంపెనీ వచ్చేలా ఒప్పించగలిగారు. తిరుపతి సమీపంలో ఈ కంపెనీ తన యూనిట్‌ నెలకొల్పనుంది.

fle 26062018 3

ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగస్థులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాష్ట్రానికి వస్తే...దానితో పాటు ఆ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేందుకు అవకాశాలున్నాయి. అయా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ చేసిన ముమ్మర ప్రయత్నాల వల్ల ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఒక్క కంపెనీలోనే 14వేల మంది మహిళలకు ఉపాధి లభించింది. ఈ కంపెనీతో పాటు సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌ లాంటి కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా, విభజన నాటికి ఒక్క సెల్‌ఫోన్‌ కూడా తయారుకాని పరిస్థితి నుంచి...ఇప్పుడు దేశంలో తయారయ్యే ప్రతి 10సెల్‌ఫోన్లలో రెండు రాష్ట్రం నుంచే తయారయ్యే స్థాయికి రాష్ట్రం చేరుకొంది.

గుంటూరులో ప్రప్రథమంగా ఐటీ(ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ) కంపెనీ ప్రారంభం కాబోతోంది. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమయ్యాయి. డెస్కుటాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రాసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహించబోతున్నట్లు ఆయా సంస్థలు జిల్లా యంత్రాంగానికి నివేదించాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.

guntur 26062018 2

ఈ నెల 29వ తేదీన ఉదయం దీనిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని కలెక్టర్‌ కోన శశిధర్‌కు ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం అందింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. రెండు రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

guntur 26062018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు, అంతకంటే గంట ముందే లోకేష్‌ రానున్నారని సమాచారం రావడంతో ఆదివారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్‌పీ విజయారావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు ఇతర అధికారులు ఇన్వేకాస్‌ టవర్‌ని సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యానగర్‌ ఒకటో లైనులో ఆక్రమణలు తొలగించి కొత్తగా బీటీ లేయర్‌తో రోడ్డుని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తికావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2050 మీటర్లు పొడవున వున్న అప్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ నిర్మాణం పూర్తి చేశామని, డౌన్ స్ట్రీమ్ జెట్ గ్రౌంటింగ్ పనులు 77% అయ్యాయని అధికారులు వివరించగా, జూలై 9 నాటికి ఆ పనులు కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం పనుల పురోగతిపై 65వ సారి ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయగా, ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.73% పూర్తయిందని అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 61.62% నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌ తవ్వకం పనులు 75.60% పూర్తికాగా, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 27.20% పూర్తయినట్టు తెలిపారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.22%, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70% చేపట్టినట్టు వెల్లడించారు.

polavaram 26062018 2

గత వారం స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.49 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు చేపట్టగా, 42 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం 1,115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 843.29 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌, స్పిల్ చానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 10.01 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. రేడియల్ ఫ్యాబ్రికేషన్ 18 వేల మెట్రిక్ టన్నులకు 11,020 మెట్రిక్ టన్నుల వరకు పనులు పూర్తయ్యాయి.

polavaram 26062018 3

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ‘పునరావాసం-పరిహారం’ కింద ఉద్దేశించిన రూ. 3,115.11 కోట్లకు గాను ఇప్పటివరకు రూ. 219.25 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి ఆర్ఆర్ పనులు పూర్తవ్వాలని తూర్పగోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ ప్యాకేజీ త్వరితగతిన అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారులు, నిపుణులతో కూడిన 5 ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. తూర్పుగోదావరిలో 7 ఆర్ఆర్ కాలనీలు, పశ్చిమగోదావరిలో 19 ఆర్ఆర్ కాలనీలు పూర్తయ్యాయని చెప్పారు.

54 ప్రాజెక్టులలో మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెదపాలెం, చినసేన, పులకుర్తి, ఓక్ టన్నెల్, గోరకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొండవీటి వాగు ప్రాజెక్టు జూలై 15 నాటికి పూర్తికానుందని, జూలై 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు.

irrigation 26062018 2

గుండ్లకమ్మ రిజర్వాయర్ పనులు తుదిదశకు చేరాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, నెల్లూరు-సంగం బ్యారేజీలు ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబరులో ముల్లపల్లికి నీటి సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. మల్లిమడుగు, బాలాజీ, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్లు నిర్మాణం కోసం అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2, రెండో దశ పనులు పూర్తిచేసి 5 టీఎంసీల నీటిని జులై 15కి నిల్వ చేయాలని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ప్రాధాన్య ప్రాజెక్టులలో మిగిలిన అన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

irrigation 26062018 3

జలవనరుల శాఖకు 19 స్కోచ్ అవార్డులు రావడంపై అధికారులకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ కింద ప్లాటినమ్ అవార్డు. మరో పక్క, పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, అలాగే నూతన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేయడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు.

Advertisements

Latest Articles

Most Read